కన్నీటి చుక్క
కళ్ళలో గుచ్చుకుంది ఆ నిమిషం.కాటుకతో కప్పిపుచ్చే ప్రయత్నంలో, కుదరదంటూ వేలి కొస ఆసరాతో గడపదాటింది.
అర సెకనులోనే నమ్ముకున్న ఆసరా నీడనివ్వలేదన్న నిజం తెలిసి కృంగిపోయింది.
తొందరపాటు అడుగు తెచ్చిపెట్టిన ఆగాధాన్ని అనుభవిస్తూ కుమిలిపోయింది.
తిరిగిపోలేక, ఉన్నచోట నిలవలేక ఎటూ తోచని అయోమయంలో కూరుకుపోయింది.
ఆ క్షణాన్ని ఛేదిస్తూ.. తెగించి తన దారి కోసం కదలబోయి, చెరిగిపోయింది.
కనుమరుగైపోయింది, ఓ కన్నీటి చుక్క!
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి