1.వస్తా వట్టిది... పోతా వట్టిది! ఆశ ఎందుకంటా? చేసిన ధర్మము చెడని పదార్థము... చేరును నీవెంట..2.నువ్వు తినే ప్రతి ఒక మెతుకు ఈ సంఘం పండించింది గర్వించే ఈ నీ బ్రతుకు సమాజమే మలిచింది ఋణం తీర్చు తరుణం వస్తే తప్పించుకు పోతున్నావా తెప్ప తగలపెట్టేస్తావా ఏరు దాటగానే...

12, నవంబర్ 2011, శనివారం

అయ్యప్ప స్వామి-దీక్ష - ప్రశ్నలు - సమాధానాలు - అనుమానాలు - ఆచరించవలసిన పద్దతులు - ఇంకా ఎన్నో విషయాల ఒక సమగ్ర నివేదిక


 
 
 
 
 
 
 
 

భూతనాథ సదానంద సర్వ భూత దయాపర! రక్ష రక్ష మహా బాహొ శాస్తే తుభ్యం నమో నమః
స్వామియే శరణం అయ్యప్పా అనే శరణ ఘోషలు ఆంధ్ర ప్రాంతమంతా మిన్నుమిట్టుతున్నాయి. ఎక్కడ చూసినా నల్లని వస్త్రాలు ధరించిన స్వాములు నిష్టానియమాలతో ఆధ్యాత్మిక వాతావరణాన్ని పల్లవింపజేస్తున్నారు. భక్తితో తెల్లవారుఝాముననే లేచి చన్నీటిస్నానాలతో వారు భగవద్ భావనలో మునిగితేలుతూ మన సాంప్రదాయాన్ని అందులోని విశిష్టతనూ సజీవంగ నిలుపుతూవున్నారు. ఆర్తులకండదండగా నిలచిన ఆదత్తమూర్తి అయ్యప్పగా వెలసి గాడి తప్పుతున్న మానవాళికి సద్బోధచేసి మనుషుల లక్ష్యమెమిటో గుర్తుచేస్తున్నాడు. కలిమాయా ప్రభావానికి లోనై తమ ధర్మలను మరచిన మనుషులను ఆమాయా ప్రభావాన్నుంచి రక్షించడానికే ఆ శబరిగిరివాసుడు అఖండబ్రహ్మచర్యా దీక్షానిబద్ధుడై మార్గదర్శనం చేస్తున్నాడు.సమస్త మానవాళి సన్మార్గం వైపు మల్లేవరకు ఆదివ్య మకరజ్యోతి అలా దారి చూపిస్తూనే వుంటుంది. అదే ఆ అవతార లక్ష్యంకూడా. తమసోమా జ్యోతిర్గమయ. స్వామియే శరణం అయ్యప్పా.



అయ్యప్ప స్వామి దీక్షను గూర్చిన ప్రశ్నోత్తరములు

1 అయ్యప్ప మాల ప్రాముక్యాత ఏమిటి?
2 ధీక్షలొ అయ్యప్ప భక్తులు నల్లని దుస్తులనే ఎంధుకు ధరించవలెను?
3 అయ్యప్ప దీక్షలొ స్నానం యొక్క ప్రాముక్యత ఏమిటి?
4 మాలాధారణ చేస్తున్న స్వాములకు స్త్రీలు కుడా వంట చేయవచ్చునా?
5 అయ్యప్ప దీక్ష అంటే ఎమిటి?
6 ధీక్షా కాలంలో పాటీంచవలసిన ఆహర నియమలు ఏమిటి?
7 అయ్యప్ప దీక్షలో ఎట్టి అలంకరణ చేసుకొనవలెను?
8 దీక్షలో రెండుపూటలా శీతలా శిరస్నానం తప్పక చేయాలా?
9 దీక్షలో ఉన్న స్వాములు అన్నదానం తప్పకుండా చేయవలేనా?
10 భూతల శయనం అంటే ఎమిటి?
11 108 సంఖ్యా బలమేమిటి?
12 దేక్షలో ఏట్టి శుచి శుభ్రత పాటించలి?
13 దీక్షలో ఉన్నప్పుడు-ఉదయం టిఫిన్-మధ్యానం భోజనం-సాయంత్రం టిఫిన్?
14 దీక్షాకాలములో పాదరక్షలు ధరించరాదా?
15 మాల ధరించకూడని సందర్బాలు ఏవి?
16 మాలధరించిన మండల కాలములో ఉపవాస దీక్ష ఉండవచ్చునా?
17 మౌనదీక్ష చేయవచ్చునా? ఆ దీక్షకు యుండవలసిన నియమము లేమిటి?
18 ఇరుముడిని కన్నిస్వాములు వారంతకువారే ఎందుకు దింపుకోగూడదు. సీనియర్ అయ్యప్పలే దింపడానికి గల కారణం ఏమిటి
19 ఇరుముడి టెంకాయనందు నెయ్యి ఎవరెవరు పోయవచ్చును?
20 ఇరుముడితో శబరిగిరిచేరి ఏమి చేయాలి? అందులో ఉంచిన వస్తువులతో అచ్చట ఏ విధముగ వినియోగించి. ఆరాధనలు చేయవలెను
21 సన్నిధానం ముందర కట్టబడియుండు గంటలను ఇంటికి తెచ్చి పూజిస్తే మగపిల్లలు పుడుతారా?

అయ్యప్ప స్వామి దీక్ష

అరిషడ్వర్గాల అంతానికే అయ్యప్ప స్వామి దీక్ష
మానవ జన్మకి పరమార్ధం మోక్షాన్ని పొందడమే - అందువలన ఆధ్యాత్మిక సాధనలో అనుక్షణం అడ్డుతగిలితే కామ, క్రోధ, మోహ, లోభ, మద, మాత్యర్యాలనే అరిషడ్వర్గాన్ని అధిగమించడం కోసమే అయ్యప్ప దీక్షను వహించాల్సి వుంది.
మాల ధరించుట

భక్తులు కార్తీక మాసం నుండి దాధాపు మార్గశిర పుష్య మాసాల వరకు దృఢమైన నియమాలను ఆచరిస్తూ ఉంటారు. ఐహికమైన సౌఖ్యాలను పరిత్యజించడం, మద్య మాంస ధూపమపానాది వ్యసనాలకు దూరంగా ఉండడం, స్వామి చింతనలో స్వామి భక్తులతో సమయం గడపడం, సాత్విక జీవనం అవలంబించడం ఈ దీక్షలో ముఖ్య లక్షణాలు. వీరి దినచర్య తెల్లవారు ఝామున లేచి చన్నీటి స్నానం చేయడంతో మొదలవుతుంది. నల్లని వస్త్రాలు, తులసి మాల, నుదుట విభుదిపై గంధం బొట్టు ధరిస్తారు. దినంలో అధిక భాగం పూజ భజనాది కార్యక్రమాలలో గడుపుతారు. కటిక నేల మీద పడుకొంటారు. అందరినీ "స్వామి" అని సంబోధిస్తారు. దుర్భాషణాలకు దూరంగా ఉంటారు. ఇలా ఒక మండలం పాటు నియమాలతో గడుపుతారు. ఇలా అయ్యప్ప స్వామి దీక్షకు ఒక స్పష్టమైన, కొంత క్లిష్టమైన విధానం రూపు దిద్దుకొంది.
స్వామియందు నిశ్చలమైన భక్తిభావములు కలిగి, శబరిమలకు 3, 4 సార్లు వెళ్ళొచ్చి, బ్రహ్మచర్య వ్రతమును పాటించేవారిని గురుస్వామిగా ఎన్నుకొని, వారిచేత మాలను ధరించాలి.

దీక్ష తీసుకోవాలనుకొనే భక్తుడు గురుస్వామి వద్ద నుండి ఉపదేశంతో మాలను ధరిస్తాడు. మాలాధారణ అనంతరం తన మనస్సునూ, శరీరాన్ని భగవంతునికి అంకితం చేయాలి. అందరినీ భగవంతుని రూపాలుగా భావించాలి. అయ్యప్ప శరణు ఘోషను విడువ కూడదు. నిత్యం భజన కార్యక్రమంలో పాల్గొనాలి.
నిత్య పూజా క్రమంలో గాని, దేవాలయానికి వెళ్ళి గాని అయ్యప్పను దర్శించుకోవడం ద్వారా గాని అయ్యప్పను పూజించడం సాధారణంగా ఇతర దేవుళ్ళ పూజలాగానే ఉంటుంది. అయితే దీక్ష తీసుకొని అయ్యప్ప దర్శనం కోసం వెళ్ళడానికి కఠినమైన నియమాలను అనుసరిస్తూ ప్రతిదినమూ చేసే భజన పూజాది కార్యక్రమాలలో కొంత వైశిష్ట్యం కనిపిస్తుంది.
దీక్షావిధి
  1. దీక్ష తీసుకోదలచినవారు ముందుగా గురుస్వాముల ద్వారా ముద్రమాల ధారణ చేయించుకోవాలి.
  2. ఇందుకు సామాగ్రి: నల్లరంగు లుంగీలు లేదా ప్యాంట్లు, నల్లరంగు చొక్కాలు, నల్లరంగు తువ్వాళ్లు, ఇంకా అవసరమైన బనీనులు, డ్రాయర్లు వంటివి కూడా రెండురెండు చొప్పున తీసుకోవాలి. నల్లని దుప్పటి ఒకటి తీసుకోవాలి. దీక్షాకాలం 41రోజులు ఈ వస్త్రాలనే వినియోగించాలి.
  3. తులసిమాల, రుద్రాక్షమాల, గంధంమాల, తామరగింజలమాల, స్ఫటికముల మాల. వీటిలో మీకు నచ్చిన రెండు మాలలు మరియు అయ్యప్పస్వామి ముద్ర (డాలరు) తీసుకోవాలి.
  4. పై సామాగ్రితో బాటు ఒక కొబ్బరికాయ, 6 అరటిపండ్లు, 100గ్రాముల నువు్వలనూనె, అగరువత్తులు, ఒక గంధపు పొడి డబ్బా, వీభూతి పొడి, కొద్దిగా కుంకుమ, కొన్ని పువు్వలు, కొద్దిగా జీడిపప్పు, కిస్‌మిస్‌, పంచదార, కర్పూరం.
  5. పైన చెప్పిన సామాన్లు తీసుకొని గురుస్వాముల వద్దకు వెళ్ళి "దీక్షామాల'' వేయవలసినదిగా ప్రార్ధించగా వారు తెల్లవారుజామున మీరు శిరస్నానం చేసిన తర్వాత, మీరు తెచ్చిన సామాగ్రితో అయ్యప్పస్వామికి పూజచేసి, ముద్రమాలను మీ మెడలో వేసి దీక్షను ప్రారంభిస్తారు.
దీక్షలో పాటించవలసిన నియమాలు
  1. ప్రతిరోజూ ఉదయ, మధ్యాహ్న, సాయంత్ర సంధ్యలలో తప్పనిసరిగా చన్నీటితో శిరస్నానం చేయాలి.
  2. అప్పటివరకూ కట్టి విడిచిన బట్టలను తామే తడిపి ఆరేసి రెండవ జత పొడి దుస్తులను ధరించాలి.
  3. విభూతి దానిపై గంధము, కుంకుమ-దీక్షా తిలకంగా దిద్దుకోవాలి.
  4. దేవాలయంలోగానీ, పూజగదిలోగానీ దీపం వెలిగించి శరణు ఘోషలు చేయవలెను.
  5. ఆ తర్వాత విఘ్నేశ్వరుడికి, కుమారస్వామికి, అయ్యప్పస్వామికి హారతులిచ్చి సాష్టాంగ నమస్కారాలు చెయ్యాలి. శక్తిమేరకు సాత్వికమైన అల్పాహారం తీసుకోవాలి. అంతటితో ఉదయం కార్యక్రమం పూర్తవుతుంది.
  6. మధ్యాహ్నం చన్నీటి స్నానం చేసి, స్వామికి శరణుఘోషలు చెప్పి, సాత్విక ఆహారాన్ని భుజించాలి.
  7. సాయంసంధ్యలో కూడా చన్నీటి స్నానమాచరించి, పూజా కార్యక్రమాలు పూర్తి చేసుకుని, భజనలు చేసి అల్పాహారమునే స్వీకరించాలి.
  8. వెల్లుల్లి, నీరుల్లి, మద్యపానం, తాంబూలం, ధూమపానాలకు దూరంగా ఉండాలి.
  9. దీక్షలో ఉన్నంతకాలం కటిక నేల మీదనే పడుకోవాలి.
  10. బహిష్ఠులైన స్త్రీలను చూడడం, వారితో మాట్లాడడం చేయకూడదు. స్త్రీలతో లైంగిక సంబంధాలు కూడదు.
  11. పాదరక్షలు ధరించకూడదు. అసభ్యకర సంభాషణ, కోపం అసలు పనికిరావు.
  12. ప్రతిరోజు మూడు పూటలూ శరణు ఘోష చేయవలెను.
పూజాద్రవ్యములుస్వామి రూపముతో కూడిన తులసిపూసల మాల, తామరపూల దండ, దీపస్తంభాలు, సాంబ్రాణీ కడ్డీలు, కలశపాత్ర, అక్షింతలు, విడిపూలు, ఒక మూల పూలదండ, ఆవుపాలు, పన్నీరు, మంచినూనె, రెండు టెంకాయలు, రెండు కిలోల బియ్యం, పంచపాత్ర, ఉద్ధరిణి, నలుపు లేక కాషాయ వస్త్రాలు.
పూజా విధానము
శ్రీ అయ్యప్ప పటమునకు ముందు ఒక దీపస్తంభం, పటమునకెదురుగా మరొక దీపస్తంభం, అరటి ఆకుపై బియ్యం పోసి దానిమీద ఒక దీపస్తంభం ఉంచవలెను. నాలుగు వైపుల 4 తమలపాకులు రెండేసి వక్కలు, ఒక టెంకాయను వుంచవలెను. మాలను ధరించువారు స్నానం చేసి, నీలవస్త్రమును ధరించి, తమ తల్లిదండ్రులకు నమస్కరించి, జగద్గురువుకు మొక్కి, అయ్యప్పను మనసార స్మరించి, ఆచారప్రకారం విబూదిని ధరించి గురువుకు నమస్కరించి మాలను ధరింప సిద్ధముగా ఉండవలెను.

ఇంటివద్ద పూజలు
తమ ఇళ్ల వద్ద పూజలు జరిపించదలుచుకున్న స్వాములు అయ్యప్ప పటములను ఉంచి పూజించవచ్చు. అష్టోత్తర పూజలు, భజనలు, లింగాష్టకం, ఉయ్యాలపాట మొదలగువాటిని 18 ప్రమిదలతో కర్పూర హారతి వెలిగించి ఇవ్వాలి. ఇంటికొచ్చిన స్వాములకు పాద నమస్కారములు చేసి వారికి సగౌరవంగా ఫలహారములు ఏర్పాటు చేయవలెను. ఈ విధంగా పూజలు నిర్వర్తించుకుని - స్వామి దర్శనమునకై ఇరుముడితో సన్నిధికి యాత్ర చేయవలెను.

ఇరుముడి సామాన్లు
  1. రెండు అరలతో కూడిన ఒక పెద్దసంచి
  2. రెండు చిన్న సంచులు, ఒక దుప్పటి
  3. 8 కొబ్బరికాయలు, ఒక కిలో బియ్యం, 6 అరటిపండ్లు, కర్పూరం, అగరువత్తులు, ప్యాకెట్‌చందనం, ఒక తేనె సీసా, ఒక జాకెట్‌గుడ్డ.
  4. పసుపు, కుంకుమ, కిస్‌మిస్‌, జీడిపప్పు, పటిక, పంచదార, అటుకులు, పేలాలు, మిరియాలు, అప్పడం, రోజ్‌వాటర్‌, తమలపాకులు, వక్కలు మొదలగునవి.
శబరిమాల యాత్రా మార్గములు కొట్టాయం వరకూ రైలులో వెళ్లిన తర్వాత అక్కడ నుంచి 86 కి.మీ దూరంలో వున్న ఎరుమేలి, పంబలకు బస్సులోగానీ, కారులోగానీ వెళ్లవలెను. `పంపా' నదిలో స్నానం చేసిన పిదప శబరిమలైలోని స్వామి సన్నిధికి కాలినడకన వెళ్లవలెను.
దీక్షా విరమణ
నియమ నిష్ఠలతో శబరిమల యాత్ర పూర్తయ్యాక మాల విసర్జన చేయవలెను.


శబరిమలై యాత్ర/About Sabarimala Yatra
శబరిమల లేదా శబరిమలై, కేరళ రాష్ట్రంలోగల ఒక ప్రసిద్ధి గాంచిన పుణ్యక్షేత్రం. ఇక్కడ కొలువైన దేవుడు అయ్యప్ప, హిందువులు ఈయనను హరిహరసుతుడిగా భావించి పూజిస్తారు. ఈ ప్రదేశం పశ్చిమ కనుమల్లో నెలకొని ఉంది. కేరళ లోని పత్తినంతిట్ట జిల్లాలో సహ్యాద్రి పర్వత శ్రేణుల ప్రాంతం క్రిందకు వస్తుంది. గుడి సముద్ర మట్టం నుంచి సుమారు 3000 అడుగుల ఎత్తులో దట్టమైన అడవులు మరియు 18 కొండల మద్య కేంద్రీకృతమై ఉంటుంది. ఇక్కడికి యాత్రలు నవంబర్ నెలలో ప్రారంభమై జనవరి నెలలో ముగుస్తాయి. ఇక్కడికి దక్షిణాది రాష్ట్రాల భక్తులే కాక ఇతర రాష్ట్రాల నుంచీ, విదేశాల నుంచి కూడా అయ్యప్ప భక్తులు పెద్ద సంఖ్యలో తరలి వస్తారు. మండల పూజ (నవంబర్ 17), మకరవిళక్కు (జనవరి 14) ఈ యాత్రలో ప్రధాన ఘట్టాలు. జనవరి 14 వ రోజును ఆలయంలో మకర జ్యోతి దర్శన మిస్తుంది. మిగతా అన్ని రోజుల్లోనూ గుడిని మూసే ఉంచుతారు. కానీ ప్రతీ మళయాళ నెలలో ఐదు రోజుల పాటు తెరచియుంచుతారు.

దీక్ష స్వీకరించి నియమాలతో మండలం గడిపిన భక్తులు శబరిమలై యాత్ర చేస్తారు. ఈ దీక్ష స్వామి సన్నిధాన సందర్శనంతో ముగుస్తుంది.

ఈ యాత్రను చేయదలచిన వారు అత్యంత శ్రద్ధా భక్తులతో కొన్ని కఠోర నియమాలను పాటించాల్సి ఉంటుంది. మండల పూజకు హాజరయ్యే వారు తప్పని సరిగా 41 రోజుల పాటు దీక్ష చేపట్టాలి. సాధారణంగా ఈయాత్రలు స్వాములు ఒక గురుస్వామి (ఎక్కువ సార్లు దీక్ష చేపట్టిన స్వామి) నాయకత్వంలో ఒక బృందంగా బయలు దేరి వెళతారు. ప్రతి ఒక్కరూ తమ తలపై ఇరుముడి కెట్టు (గుడ్డతో చుట్టిన పూజా సామాగ్రి) ఉంచుకుని యాత్ర చేయాల్సి ఉంటుంది.

ఎరుమేలి

శబరిమలై యాత్ర "ఎరుమేలి"తో మొదలవుతుంది. ఎరుమేలిలో "వావరు స్వామి"ని భక్తులు దర్శించుకొంటారు. (అయ్యప్ప పులిపాలకోసం అడవికి వెళ్ళినపుడు అతనిని అడ్డగించిన ఒక దొంగ అనంతరం స్వామి సన్నిహిత భక్తునిగా మారాడు. అతడే వావరు స్వామి. "నన్ను దర్శించుకోవాలని వచ్చిన భక్తులు ముందుగా నిన్ను దర్శించుకొంటారు" అని అయ్యప్ప వావరుకు వరమిచ్చాడట. ఈ వావరు స్వామి ఒక ముస్లిం కులస్తుడు. ఈ వావరు ఇక్కడ కొలువున్నది కూడా ఒక మసీదులోనే) దర్శనానంతరం భక్తులు వావరుస్వామి చుట్టూ రకరకాల వేషధారణతో "పేటై తులాల" అనే నాట్యం చేస్తారు. (మహిషితో యుద్ధం చేసేటపుడు అయ్యప్ప చేసిన తాండవం పేరు "పేటై తులాల"). ఈ ఎరుమేలి వద్ద ఉన్న "ధర్మశాస్త" ఆలయంలో అయ్యప్ప స్వామి ధనుర్బాణధారియై ఉంటాడు. ఇక్కడ వినాయకుడు కూడా కొలువై ఉంటాడు. ఈయనను "కన్నెమూల గణపతి" అని అంటారు. ఇక్కడ భక్తులు కొబ్బరికాయ కొడతారు.

పాదయాత్ర
ఇక్కడినుండి భక్తుల పాదయాత్ర మొదలవుతుంది. పాదయాత్రకు రెండు మార్గాలున్నాయి. "పెద్ద పాదం" అనేది కొండలమధ్య దట్టమైన అరణ్యంలో ఉన్న కాలిబాట. ఇది ఎనభై కిలోమీటర్ల దారి. దారిలో పెరుర్‌తోడు, కాలైకట్టి అనే స్థలాలున్నాయి. (మహిషితో అయ్యప్పస్వామి యుద్ధం చేస్తుండగా కాలైకట్టివద్దనుండి శివకేశవులు యుద్ధాన్ని చూశారట). ఇక్కడికి కొద్ది దూరంలోనే అళదా నది (మహిషి కార్చిన కన్నీరు నదీరూపమైందట) ఉంది. ఈ నదిలో స్నానం చేసి భక్తులు నదినుండి ఒక రాయిని తీసుకు వెళతారు. ఆ రాతిని "కళిద ముకుంద" (మహిషి కళేబరాన్ని పూడ్చిన చోటు) వద్ద పడవేస్తారు. తరువాత యాత్ర ముందుకు సాగి పెరియానపట్టమ్, చెరియానపట్టమ్ అనే స్థలాలగుండా పంబ నది చేరుకొంటుంది. అక్కడే "పంబ" అనే గ్రామం కూడా ఉంది. ఇక్కడినుండి స్వామి సన్నిధానానికి ఏడు కిలోమీటర్ల దూరం.

చిన్నపాదం మార్గంలో బస్సులు కూడా తిరుగుతాయి. బస్సులపై పంబానది వరకు చేరుకోవచ్చు. చివరి ఏడు కిలోమీటర్లు మాత్రం కాళినడకన వెళ్ళాలి.

సన్నిధానం

భక్తులు పంబానదిలో స్నానం చేసి "ఇరుముడి"ని తలపై పెట్టుకొని అయ్యప్ప శరణు ఘోషతో "నీలిమలై" అనే కొండ మార్గం ద్వారా ప్రయాణిస్తారు. కన్నెస్వాములు (తొలిసారి దీక్ష తీసుకొన్నవారు) తమతో తెచ్చిన ఒక బాణాన్ని దారిలో "శరమ్ గుత్తి" అనే చోట ఉంచుతారు. ఇక్కడినుండి అయ్యప్ప సన్నిధానంకు ఒక కిలోమీటర్ దూరం ఉంటుంది.

సన్నిధానం వద్ద ఉన్న 18 మెట్లను "పదునెట్టాంబడి" అంటారు. 40 రోజులు దీక్ష తీసుకొని ఇరుముడి ధరించినవారు మాత్రమే ఈ మెట్లు ఎక్కేందుకు అర్హత కలిగి ఉంటారని కధనం. ఒక్కో మెట్టుకు ఒక్కో అధిష్టాన దేవత ఉంటుంది. సన్నిధానానికి, 18 మెట్లకు నమస్కరిస్తూ స్తోత్రాలు పఠిస్తూ మెట్లను ఎక్కుతారు. ఈ ఆళయంలో స్వామి కొలువైన సందర్భంగా 18 వాయిద్యాలను మ్రోగించారట.

సన్నిధానంలో "పానవట్టం"పైన అయ్యప్ప కూర్చుని ఉన్న భంగిమలో దర్శనమిస్తాడు. స్వామియే శరణం అయ్యప్ప స్వామి కూర్చున్న తీరు శివలింగాన్ని తలపిస్తుందని. ఒంపు తిరిగిన ఎడమచేయి మోహిని అవతారాన్ని తెలియజేస్తుందని చెబుతారు.


శబరిమలై వనయాత్రలో ఎదురయ్యే క్షేత్రములు

శబరి గీరిశుని దర్శించుటకు వనయాత్ర చేస్తారు భక్తులు. సాక్షాత్‌ స్వామి అయ్యప్ప నడిచి వెళ్ళిన పూంగావనం, అదె పెరియపాడి - ఎరుమేలి మార్గం. కొట్టాయం నుండి తిరువల్లా మార్గాన 78 కి.మీ. కొట్టాయం నుండి రప్పళ్ళి మార్గము 54 కి.మీ. దూరంలోనూ, కొట్టాయం నుండి మణిమాల మార్గాన 52 కి.మీ. దూరంలోను చెంగనూరు నుండి చెంగచాశ్చేరి మణిమాల మార్గాన 66 కి.మీ దూరంలో చెంగన్నూరు నుండి పత్తనంతిట్ట మార్గాన 63 కి.మీ దూరంలోనూ, తిరువనంతపురం నుండి పునలూరు, కొన్ని మార్గాన 176 కి.మీ. దూరాన కలదు. ఇక్కడ నుండి భక్తాదులు కాలినడక నడుస్తారు.

ఈ మార్గంలో ఎదురయ్యే క్షేత్రాలు:
  1. కోట్టెయిప్పడి : ఇక్కడే వావరుస్వామి వెలిసినది
  2. కాళైకట్ట ప్రాచీన శివాలయం వుంది.
  3. ఆళుదానది: స్వామి మహిషిని వధించిన స్థలం
  4. ఆళుదామేడు 5 కి.మీ ఎత్తయిన గుండ్రాళ్ళతో కూడిన కొండ
  5. కల్‌ ఇడుంకుండ్రు వధించిన మహిషిని పైకి విసిరేయగ కింద పడిన స్థలం
  6. ఇంచిప్పారకోట్ల శిధిలమయిన కోట కలదు. ఇక్కడే స్వామి ఉదయనుడు అనే బందిపోటుని హతమార్చారు.
  7. కరిమలైతోడు: నిటారైన కరిమల శిఖరం ప్రారంభం
  8. కరిమలై ఉచ్చి ప్రాచీనమైన దివ్య బావి కలదు
  9. వరియాన వట్టం ఇచ్చట ఏనుగులు దప్పిక తీర్చుకుంటాయి
  10. శిరియానవట్టం: ఇచ్చట భక్తులు వంటలు చేసుకుని విశ్రమిస్తారు.
  11. పావన పంబానది: అనేక ఔషధమూలికల సారముతో ప్రవహించు పంబానదిని దక్షిణ గంగాయని కూడా అంటారు. ఆ శ్రీరామచంద్రుల వారే ఇక్కడ స్నానమాచరించారని పురాణాలు చెబుతున్నాయి. ఇక్కడ నుండి భక్తాదులు కాలినడక నడుస్తారు.
  12. నీలిమల.. ఈ నీలిమల ఎక్కడం చాలా కఠినం. రామాయణంలో దీన్ని మాతంగవనం అంటారు.
  13. అప్పాచ్చిమేడు ఇక్కడ నుంచి శబరిపీఠం చేరుకుంటారు. దుర్దేవతల కోసం బియ్యపు ఉండలను విసురుతారు.
  14. శబరిపీఠం ఇందులోనే పందళ్‌ రాజవంశీయులు విద్యాభ్యాసం నేర్చుకొన్నారు.
  15. శరంగుత్తి యాత్రలో దీక్షాదండముగా భద్రపరిచి తెచ్చిన శరములను ఇక్కడే వున్న ఠాణి వృక్షములో గుచ్చుతారు.
  16. పదినెట్టాంపడి ఇదే ముక్తికి సోపానం. దీనిని అధిరోహించిన వేళ ఎత్తిన ఇరుముడి వుండవలెను.
  17. సన్నిధానం
అయ్యప్పను గురించిన ప్రధాన గాధలు/About Ayyappa Swamy
అయ్యప్ప హిందూ దేవతలలో ఒకడు. ఈయనను హరిహరసుతుడని, మణికంఠుడని కూడా పిలుస్తారు. అయ్యప్ప పూజా సాంప్రదాయం అధికంగా దక్షిణ భారతదేశంలో ఉంది. మహిషి అనే రాక్షసిని చంపి అయ్యప్ప శబరిమలై లో వెలిశాడు. కేరళలోని శబరిమలై హిందువుల ప్రధాన యాత్రా స్థలాలలో ఒకటి. శబరిమలైలో అయ్యప్పను బ్రహ్మచారిగా పూజిస్తారు. బరిమలైలోని ప్రధాన దేవాలయమే కాకుండా అనేక దేవాలయాలున్నాయి. కేరళలోనే "కుళతుపుళ"లో ఇతనిని బాలుని రూపంలో అర్చిస్తారు. "అచ్చన్ కోవిల్"లో పుష్కల, పూర్ణ అనే దేవేరులసమేతుడైన అయ్యప్పను పూజిస్తారు. శబరిమలైలోని అయ్యప్ప సన్నిధికి యేటా ఐదుకోట్లమంది భక్తులు దర్శనార్ధులై వెళుతుంటారు.
మహిషి కధనం
మహిశాసురుని సంహరించినందుకు దేవతలపై పగ సాధించాలని అతని సోదరి అయిన మహిషి అనే రాక్షసి బ్రహ్మ గురించి ఘోర తపస్సు చేసింది. బ్రహ్మ ప్రత్యక్షమయిన తరువాత మహిషి బ్రహ్మను ఈ విదంగా కోరింది. శివుడికి మరియు కేశవుడికి పుట్టిన సంతానం తప్ప నన్నెవరూ జయించకూడదు. అదీ కూడ ఆ హరిహర తనయుడు పన్నెండేళ్ళపాటు భూలోకంలోని ఒక రాజు వద్ద సేవా ధర్మం నిర్వర్తించాలి, అలా కానిపక్షంలో అతడు కూడా నా ముందు ఓడిపోవాలి అని వరం కోరింది మహిషి. 'తధాస్తు' అని మహిషికి వరాన్ని ప్రసాదించాడు బ్రహ్మ.
 
అయ్యప్ప జననం
క్షీరసాగరమధనం అనంతరం దేవతలకు, రాక్షసుల కు అమృతం పంచేందుకు విష్ణువు మోహినిగా అవతారం దరించి కార్యం నిర్వహిస్తాడు. తరువాత అదేరూపంలో విహరిస్తున్న మోహినిని చూసి శివుడు ఆమె పట్ల ఆకర్షింపబడతాడు. వారి కలయికతో శివకేశవుల తేజస్సుతో ధనుర్మాసము, 30వ రోజు శనివారం, పంచమి తిధి, ఉత్తరా నక్షత్రం వృశ్చికా లగ్నమందు శాస్త(అయ్యప్ప) జన్మించాడు. ఇతడు శైవులకు, వైష్ణవులకు ఆరాధ్య దైవం. తండ్రియైన జగత్పతి ఆజ్ఞ ప్రకారము పంపా సరోవర తీరప్రాంతంలో మెడలో మణిమాలతో శిశురూపంలో అవతరించాడు ధర్మశాస్త.

అదే సమయంలో దైవ ప్రేరణవలన వేట నిమిత్తం అటుగా వస్తాడు పందళ వీరపాండ్య చక్రవర్తి, గొప్ప శివభక్తుడు అయిన రాజశేఖరుడు. ఒంటరిగా వున్న, అమిత తేజోసంపన్నుడైన బాలుణ్ణి చూసి ఆశ్చర్యపోతాడు. అతని తల్లితండ్రులెవరైనా వున్నారేమో అని అడవంతా గాలిస్తాడు. ఎక్కడా ఆచూకీ దొరక్క పోవడంతో సంతానం లేక అల్లాడిపోతున్న తనను కరుణించి ఈశ్వరుడే ఆ శిశువును ప్రసాదించాడని తలంచిన రాజశేఖరుడు ఆనందంతో ఆ బిడ్డను అంతఃపురమునకు తీసుకువెళ్తాడు. ఆ శిశువును చూసి అతని రాణి కూడ ఎంతగానో ఆనందిస్తుంది. ఆయ్యప్ప అంతఃపురంలో అడుగుపెట్టిన వేళా విశేషము వలన ఏడాది తిరిగే సరికి రాజశేఖరుని భార్య మగబిడ్డను ప్రసవిస్తుంది. ఆ బాలుడు చిన్నప్పుడే ఎన్నో మహిమలతో అందర్నీ ఆశ్చక్యచకితులను చేస్తాడు. పులిని వాహనంగా చేసుకుని తిరుగుతూ, ఘోరమైన ఆపదలలో చిక్కుకున్న వారిని అతిధైర్యంతో, సాహసోపేతమైన యుద్ధాలతో రక్షిస్తూ పాండ్యచక్రవర్తికి అమితమైన ఆనందాన్ని కలిగిస్తాడు. అతి ప్రమాదకరమైన విషజంతువులన్నీ అతనికి లొంగిపోయి, అణిగిమణిగి వుంటాయి.

మణికంఠుని సాత్విక గుణాలవల్ల కొందరు 'అయ్యా' అని మరికొందరు 'అప్పా' అని మరికొందరు రెండు పేర్లూ కలిపి 'అయ్యప్ప' అని పిలిచేవారు. 'అయ్యా' అంటే తండ్రి, 'అప్ప' అంటే అన్న అని అర్థాలు వుండటం చేత ఒక పెద్ద అన్నగా, తండ్రిగా ఆ రాజ్యం మొత్తానికే 'అయ్యప్ప స్వామి'గా భావింపబడ్డాడు. తగిన వయసురాగానే మహారాజు కొడుకులిద్దర్నీ గురుకులానికి పంపిస్తాడు. రాజ గురువు అయ్యప్పను అవతారపురుషునిగా గుర్తిస్తాడు. అయినా అయ్యప్ప కోరిక మేరకు కాదనలేక అరణ్య ప్రయాణానికి కావలసిన సామాగ్రిని సిద్ధం చేయిస్తాడు. గురుకులం లో విద్యనభ్యసించి వెనుకకు వచ్చిన అయ్యప్పకు రాజ్యపట్టాభిషేకం జరపాలని అనుకుంటాడు తండ్రి. తల్లికి అది ఇష్టం లేఖ తలనొప్పి అని నాటకమాడి వైద్యులతో వ్యాది తగ్గుటకు పులిపాలు కావాలని చెప్పిస్తుంది. నేవెళ్ళీ తీసుకు వస్తానని చెప్పి బయలుదేరుతాడు అయ్యప్ప.

మహిషి వధ
అడవిలో నారదుడు మహిషిని కలిసి అయ్యప్పను గురించి నిన్ను చంపేందుకు ఒక రాజకుమారుడు వస్తున్నాడు అని హెచ్చరిస్తాడు. మహిషి గేదె రూపంలో అయ్యప్పను చంపడానికి వెళుతుంది. వీరి యిద్దరి మధ్య జరిగే యుద్ధాన్ని వీక్షించేందుకు సమస్త దేవతలు అదృశ్యరూపంలో వస్తారు. ఈ సమయంలో అయ్యప్ప ఒక కొండపైకి ఎక్కి తాండవం చూస్తూ మహిషిని ఎదిరించాడు. అయ్యప్ప మహిషిల మద్య జరిగే భీకరయుద్ధంలో చివరిగా మహిషిని నేలపై విసిరికొడతాడు ఆ దెబ్బకి గేదె రూపంలో ఉన్న మహిషి మరణిస్తుంది. దేవతలంతా ఆయనను స్తుతిస్తూ ఆయన ముందుకు వస్తారు. అప్పుడు శ్రీ అయ్యప్ప ఇంద్రునితో దేవేంద్రా! నేను చిరుతపులి పాలు తెచ్చే నెపంపై యిలా వచ్చాను. కాబట్టి మీరందరూ చిరుతలై నాకు తోడ్పడండి అని అడుగుతాడు. ఆయన కోరికపై అందరు చిరుతపులులుగా మారిపోయారు. ఇంద్రుడు స్వయంగా అయ్యప్పకు వాహనమైన చిరుతగా మారిపోయాడు. చిరుతల దండుతో అయ్యప్ప తన రాజ్యం చేరుతాడు.
శబరిమలైలో నివాసం
రాజు అయ్యప్పను పట్టాభిషిక్తుడిని చేయాలనుకొంటాడు. కాని రాజ్యాధికారం మీద, భోగభాగ్యాల మీద ఏ మాత్రం మమకారం లేదనీ, వీరపాండ్యచక్రవర్తికీ, ఆయన పట్టమహిషికీ పుట్టిన పట్టికే పట్టాభిషేకం చేయడం ధర్మం అని చెప్పి చక్రవర్తిని ఒప్పిస్తాడు. తాను ఎక్కడ నుండి వచ్చాడో అక్కడికే వెళ్లి తపస్సు చేసుకుంటాననీ, తనను శరణుకోరి వచ్చే భక్తులను సదా కాపాడుతూ వుంటాననీ పాండ్యరాజుకి వాగ్దానం చేస్తాడు. అయ్యప్ప స్వామి ధర్మప్రవర్తన, ధర్మనిష్ఠ లోకానికి ఆశ్చర్యాన్ని కలిగించింది. తన భక్తులు ఏయే ధర్మాలని పాటించాలో, ఏ నియమనిష్ఠలతో వుండాలో కొన్ని మార్గదర్శక సూత్రాలను ప్రతిపాదించారు. అప్పటి నుండి ఆయన 'ధర్మశాస్త'గా ప్రజల అభిమానాన్ని చూరగొన్నాడు.
అందుకే ఆయనకి 'ధర్మశాస్త' అనే పేరు కూడా వుంది. తనకు వాహనంగా వున్న వ్యాఘ్రం (పులి) ఎక్కడ వున్నప్పటికీ తన యజమానిని గుర్తించడానికి వీలుగా మణికంఠ హారాన్ని నిత్యం ధరిస్తూ వుంటాడనీ, అందుచేత 'మణికంఠ' అని కూడా భక్తులు పిలుస్తారనీ కొందరి అభిప్రాయం! ఈ విధంగా, యుగాలు మారుతున్నా, మనుషులు మారుతున్నా, అభిరుచులు మారుతున్నా, 'అయ్యప్పస్వామి' తమ తండ్రి కాని తండ్రి పెంపుడు తండ్రి అయిన పాండ్యరాజుకిచ్చిన వాగ్దానాన్ని ఈ నాటికీ, సదా నిలబెట్టుకుంటూనే వున్నాడు.

బాల్యంలోనే మహాజ్ఞానసంపన్నుడై సకలదేవతల అంశలనీ తనలో ఇముడ్చుకున్నాడు. నవగ్రహాల ప్రభావం మానవలోకంలో దుష్ప్రభావం చూపించకుండా, శని, రాహు, కేతు మొదలైన గ్రహాల వల్ల ఆపదలు రాకుండా సదా కాపాడే మహిమాన్వితమైన దైవం అయ్యప్ప స్వామి!! తన భక్తులను శనిప్రభావం కలిగించనని 'శని' గ్రహం అయ్యప్పకు వాగ్దానం చేస్తాడు, అందుకు అయ్యప్ప మానవులకు శనికి ప్రీతిపాత్రమైన నల్లని దుస్తులను తన దీక్షాకాలంలో ధరించాలని నియమం పెట్టాడు. దీక్షా సమయంలో ఒకసారి నల్లని దుస్తులను ధరించినవారికి జీవితాంతం శని ప్రభావం వుండదని 'అయ్యప్ప' తన భక్తులకు తెలియజేశాడు. అది రుజువవుతోంది.

అందుకే అయ్యప్పస్వామి దీక్షాపరులు అధికసంఖ్యలో శబరిమలై తరలి వెడుతున్నారు. జీవితసమస్యలు పరిష్కారం కావడానికీ, కోరికలు సిద్ధించడానికీ, 'అయ్యప్ప దీక్ష'ను మించినది లేదు!!
ఒక సంవత్సరకాలంలో కనీసం 'మండలదీక్ష' (41 రోజులు) నిష్ఠగా పాటిస్తూ దురలవాట్లకీ, వ్యసనాలకీ దూరంగా వుంటూ సంసారబంధాల నుండి బయిటికి వచ్చి నిత్యనామస్మరణతో తనను ఆరాధించే వారికి జీవితాంతం సుఖసంతోషాలు కలిగిస్తూ ఆపదలు తొలగిస్తూ ఆదుకుంటానని చెప్పి భక్తుల పాలిటి కల్పవృక్షమై అభయాన్ని ప్రసాదిస్తున్నాడు. స్వామి దీక్షాపరులకు అనేక దివ్యమైన అనుభూతులు, అనుభవాలు కలుగుతున్నాయి.

శా: అయ్యప్పగన్ గడు భక్తితో కొలచినన్ ఆహ్లాదమానందమై
అయ్యా దీక్షను బట్టి కోర్కెలు, సమస్యల్ దీరు, సిద్ధించు, సా
హాయ్యం చెంతయు పొంది తీరు, జను లత్యంతానుమోదంబుతో
నెయ్యంబున్ సహకారమున్ గఱపుచున్, నిష్ఠాత్ములై యొప్పెడిన్!!
శరణాగత రక్షకుడైన శ్రీ అయ్యప్ప స్వామివారి దివ్యాతి దివ్యమైన చరిత్ర సంపూర్ణం.

అయ్యప్ప మహిమలు
పాపపంకిలాన్ని ప్రక్షాళనం చేసుకోవడానికి శబరిమలైలో వెలసిన స్వామి అయ్యప్ప మహిమలు అద్వితియమైనవని. ఆయన మహిమలు వర్ణణాతీతము. ప్రతి మకరసంక్రాంతినాడు 'జ్యోతి స్వరూపుడై' భక్తులకు దర్శనమిచ్చే ఆయన కరుణ అపారమైనది. అయ్యప్పను నమ్మిన భక్తులకు ఆయన మహిమలను గూర్చి వేరె చెపాలిసిన పని లేదు. ప్రతీ భక్తుడు ఆయన మహిమలను చూడగొన్నవారే.
అలాంటి స్వామి మహిమలను గూర్చి మనం అందరికి తెలియజెప్పిన రోజె మన జీవితం చరితార్ద్దం అవుతుంది. ఇంకా ఎంతో మందిని అయ్యప్ప భకులుగా చేయడానికి, ఆ జ్యోతి స్వరూపుని కరుణకు ప్రాప్తులను చేస్తుంది.

ఆంధ్రా శబరిమల (ద్వారపూడి)
తూర్పుగోదావరి జిల్లా మండపేట మండలంలోని ఈ గ్రామానికి ఒకప్పుడు హోల్‌సేల్‌ వస్త్రవ్యాపార కేంద్రంగా పేరు. కానీ ఇప్పుడా వూరి గురించి అడిగితే గొప్ప ఆధ్యాత్మిక కేంద్రమని చెబుతారు. తిరుమల తిరుపతికి వెళ్లలేని భక్తులు చిన్నతిరుపతిలో వెుక్కు తీర్చుకున్నట్టే... శబరిమలలో కొలువై ఉన్న మణికంఠుని ఆలయానికి ద్వారపూడి అయ్యప్పగుడిని ప్రత్యామ్నాయంగా భావిస్తున్నారు భక్తులు.
అవును! ఆ వూరు ఆంధ్రా శబరిమల. కార్తీక మాసం వచ్చిందంటే చాలు, అయ్యప్ప శరణు ఘోషతో వూరూవాడా మార్మోగుతాయి. లక్షలాది మంది మాలధారణ చేసి కఠోర నియమాలు పాటిస్తూ స్వామి కరుణాకటాక్షాల కోసం శబరిమలకు బయలుదేరుతారు. గతంలో వేలల్లో ఉన్న భక్తుల సంఖ్య ప్రస్తుతం అరకోటిపైగా ఉంటోంది. అయితే అందరూ అందాకా(శబరిమల) వెళ్లడం లేదు.
రాజమండ్రికి సుమారు 25 కి.మీ. దూరంలో ఉన్న ద్వారపూడికీ వెళ్లేవారున్నారు. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాల నుంచే కాక ఒరిస్సా ప్రాంతం నుంచి కూడా పెద్దఎత్తున వచ్చే అయ్యప్ప దీక్షాధారులు ఇక్కడ ఇరుముడులు సమర్పించుకుంటున్నారు. మకరజ్యోతినాడయితే దాదాపు 30వేల మందికి పైగా భక్తులు ఇక్కడికి వచ్చి స్వామి దర్శనం చేసుకుంటారు.  పంచలోహ విగ్రహంతో చేసిన ఇక్కడి అయ్యప్ప విగ్రహాన్ని 1989లో కంచికామకోటి పీఠాధిపతి జయేంద్రసరస్వతి ప్రతిష్ఠించారు.
ఇక స్వామి సన్నిధికి దారితీసే పద్దెనిమిది మెట్లనూ తమిళనాడులోని తురుమూరు నుంచి తెప్పించిన ఏకశిలపై చెక్కి, బంగారంతో తాపడం చేయడం విశేషం. శబరిమల తరహా ప్రసాదం ద్వారపూడి ఆలయానికున్న మరో ప్రత్యేకత.

తమిళుడి సంకల్పం... 1969లో తన 23వ ఏట వస్త్రవ్యాపారం కోసం తమిళనాడు నుంచి ఓ యువకుడు ద్వారపూడి వచ్చి అక్కడే స్థిరపడ్డారు. ఆయన పేరు ఎస్‌.ఎల్‌.కనకరాజు. 1976లో మొదటిసారిగా అయ్యప్ప మాల ధరించి, శబరిమల వెళ్లారు. అయ్యప్పస్వామికి మొక్కుకున్న ఫలితంగా 1980లో తనకు కొడుకు పుట్టాడన్న ఆనందంతో ద్వారపూడిలో అయ్యప్ప ఆలయ నిర్మాణానికి సంకల్పించారాయన. భక్తులూ దాతల విరాళాలతో 1983లో శంకుస్థాపన జరిగింది.  ఇక్కడి 'పదినెట్టాంబడి'కీ ఒక ప్రత్యేకత ఉంది. తమిళనాడులోని తురుమూరు నుంచి తెప్పించిన ఏకశిలపై చెక్కిన 18 మెట్లనూ బంగారంతో తాపడం చేశారు. ఇరుముడితో వచ్చిన భక్తులను మాత్రమే వీటిని ఎక్కేందుకు అనుమతిస్తారు. ఇక, ఆలయప్రాంగణంలోనే ఉన్న హరిహరుల విగ్రహం భక్తులను మంత్రముగ్ధులను చేస్తుంది. 

ఎన్ని ఆలయాలో... అయ్యప్ప స్వామి ఆలయ ప్రాంగణంలోని 6 ఎకరాల విస్తీర్ణంలో కనకదుర్గాదేవి, పంచముఖ ఆంజనేయస్వామి, షిర్డీసాయిబాబా, గోవిందరాజస్వామి దేవతలకు ఆలయాలను నిర్మించారు. ఇంకా ఇక్కడి భూగర్భ ద్వాదశ జ్యోతిర్లింగ దేవాలయం, నవగ్రహ శనీశ్వర స్వామి ఆలయం, అష్టాదశ శ్రీ ఉమా విశ్వలింగేశ్వరస్వామి దేవాలయం, పాపవిమోచన దేవాలయాలకు నిత్యం వందల మంది భక్తులు వస్తుంటారు. అంతేకాక ఆలయ తూర్పుభాగాన కొత్తగా రూ.10 కోట్లతో దశావతారాలతో కూడిన వేంకటేశ్వరస్వామి ఆలయం నిర్మిస్తున్నారు.  అయ్యప్ప దేవాలయానికి తూర్పుదిశలో నాలుగు అంతస్తుల్లో పాలరాయితో అందంగా తీర్చిదిద్దిన ఉమావిశ్వేశ్వరస్వామి ఆలయానిది మరో విశిష్టత. గంగోత్రి, యమునోత్రి, కేదారనాథ్‌, బదరీనాథ్‌, బ్రహ్మకపాలం, అమరనాథ్‌, ఓంకార్‌, కాశీ, రుషికేశ్‌, హరిద్వార్‌, గౌరీకుండం, ఖాట్మండు (నేపాల్‌) తదితర పుణ్యక్షేత్రాల నుంచి సేకరించిన 18 శివలింగాలను 4 అంతస్తుల్లో ప్రతిష్ఠించారు. పై అంతస్తులోని చతుర్ముఖ శివలింగానికి అభిషేకం చేస్తే ఒకేసారి 18 శివలింగాలపై అభిషేక ద్రవ్యం పడటం కన్నులపండువగా ఉంటుంది. ఈ ఆలయానికి ముందు భాగంలో ఏర్పాటు చేసిన భారీ నటరాజు విగ్రహం భక్తులను విశేషంగా ఆకట్టుకుంటుంది. అలాగే దేవాలయానికి ఒక పక్కన ఏర్పాటు చేసిన అతిపెద్ద నంది విగ్రహం కూడా సందర్శకులను ఆశ్చర్యానికి గురిచేస్తుంది. 

వెండి శివలింగం అయ్యప్ప దేవాలయ ప్రాంగణంలోనే ఈశాన్యదిశలో 200 అడుగుల పొడవు, 12 అడుగుల లోతున భూగర్భ ద్వాదశ జ్యోతిర్లింగ దేవాలయం ఉంది. దేశంలో ఎక్కడాలేని విధంగా అక్కడ వెండి శివలింగాన్ని ప్రతిష్ఠించారు. భూగర్భ దేవాలయానికి వెళ్లే మార్గంలో కంచి తరహాలో వెండి బల్లి, బంగారుబల్లి ప్రతిమలను ఏర్పాటుచేశారు. ఇక్కడ ప్రవేశానికి కఠిన నిబంధనలు ఉంటాయి. పురుషులు చొక్కా తీసేసి పంచెకట్టుతోనే ఈ ఆలయంలోకి ప్రవేశించాలి. పిల్లలకు కూడా ఈ నిబంధనే వర్తిస్తుంది. స్త్రీలు కూడా సంప్రదాయ దుస్తులతోనే గుళ్లో అడుగుపెట్టాలి. దీనికి పక్కనే పాపవిమోచన ఆలయం ఉంది. అందులో దేవి, కరుమారియమ్మ, నాగదేవతల విగ్రహాలు ప్రతిష్ఠించారు. ప్రతి శుక్ర, మంగళవారాలు నాగదోష, గ్రహబాధల నివారణకు పూజలు జరిపిస్తుంటారు భక్తులు.
(News source: www.clickandhra.com)

శరణుఘోష ప్రియుడు
అయ్యప్ప
'ఓంస్వామియే శరణమయ్యప్ప, హరిహరసుతనే శరణమయ్యప్ప, ఆపద్బాంధవునే శరణమయ్యప్ప!' అంటూ అయ్యప్ప భక్తులు భగవంతుని శరణుకోరే విధానాన్నే శరణు ఘోష అని వ్యవహరిస్తారు. అడవులలో కొండలలో నడచి వెళ్ళే స్వాములకు (భక్తులకు) శరణు ఘోష రక్ష. యాత్రచేసే బృందం అందరూ ఒక్కసారి స్వామివారి శరణు ఘోష చెప్పి అడవిని దద్దరిల్లజేస్తారు. ఒక రకంగా అడవిలో రాళ్ళు, ముళ్ళు కాళ్ళకు గుచ్చుకున్నా బాధ తెలియకుండా అయ్యప్పస్వామిపైనే మనసు లగ్నం చేసి నడవడం ఒక ఎత్తయితే బిగ్గరగా చేసే శరణుఘోషకి భయపడి అడవిలో తిరిగే క్రూరమృగాలు దూరంగా పారిపోతాయి. నెత్తిపైన ఇరుముడి వుండడం వలన దిక్కులు చూడడానికి, ఇష్టం వచ్చినట్లు నడవడానికి కుదరదు. ఒక వైపు ఇరుముడిని కాపాడుకుంటూ నేలవైపు చూస్తూ భక్తి శ్రద్దలతో స్వామివారి శరణు ఘోష చెబుతూ ప్రయాణించడమే యాత్రలో విశేషం. వ్యర్థ ప్రసంగాలకు యాత్రలో సమయం చిక్కదు. శబరిమల యాత్రలో విశిష్టత అదే!

అయ్యప్ప కులం, మతం, అంతస్తు, హోదా అనీ మరచి అయ్యప్పస్వామి వారి ముందు అంతా సమానమేనని తెలియజేసే యాత్ర, సర్వమానవ సౌభ్రాతృత్వానికి అర్థం తొలిసారిగా శబరిమల యాత్రలోనే తెలుస్తుంది. ముక్కు ముఖం తెలియకపోయినా, అడవిలో సాటి అయ్యప్ప భక్తునికి చేతిని అందించి సాయం చేస్తారు. నడవలేని స్వాములకు చేయూత అందించి నడిపిస్తారు. ఒక్కొక్కసారి ఇద్దరు స్వాములు కలిసి నడవలేని స్వామి రెండుచేతులను వారి భుజాల పై వేసుకొని అతన్ని మోస్తూ నడిపిస్తారు. అడవిలో క్రూరమృగాలు తిరుగుతున్నా శబరిమల యాత్ర చేసే అయ్యప్ప భక్తులకు హాని చేయకుండా వుండడానికి (ఎరుమేలి నుండి వనయాత్ర 70 కిలోమీటర్లు) యాత్ర ప్రారంభంలో మంత్రించి నీళ్ళు జల్లుతారని చెబుతారు. అదికాక అడవిలో అక్కడక్కడ 'వడివడివాడు ' పేర మందు గుండు సామాగ్రితో అడవి దద్దరిల్లేలా ఔట్లు పేలుస్తారు. యాత్ర చేసే స్వాములు ఒక రూపాయి ఇస్తే వారి పేరు మైకులో చెప్పి ఔట్లు పేల్చే పద్దతి అక్కడ వుంది. కేరళలో చాలా దేవాలయాలలో ఇప్పటికీ అడవులలో లేకపోయినా ఔట్లు పేల్చే సాంప్రదాయం వుంది.

శబరిమల యాత్ర చేయించడానికి, అయ్యప్ప దీక్ష సక్రమంగా కొనసాగించడానికి గురుస్వామి నావకు చుక్కానివంటివాడు. మిలట్రీ కమేండరు సైనికులకు శిక్షణ ఇచ్చి యుద్దానికి తయారు చేసినట్లు గురుస్వామి బృందంలో వెంట వచ్చే స్వాములకు భక్తి శిక్షణ ఇచ్చి క్రమశిక్షణతో యాత్రను జరిపిస్తారు. గురుస్వామి బృందంలో ఉన్న స్వాములను ప్రోత్సహించి అడవి మధ్యలో వారి పేర ఔట్లు పేల్చేటట్లు చేస్తారు. యాత్రలో ఇది ఒక తీయని అనుభవం. మంచి గురుస్వామి దొరికితే దీక్ష, యాత్ర నల్లేరు మీద బండి ప్రయాణంలా సాగుతుంది. గురుస్వామి నిస్వార్థపరుడై, ఆధ్యాత్మిక భావం కలిగి అయ్యప్ప దీక్ష, శబరిమలయాత్ర చాలాసార్లు చేసి అక్కడ జరిగే పూజలు, పద్దతులు తెలుసుకొని తన వెంట వచ్చే స్వాములకు పూజలు, భజనలు శ్రద్దగా చేయించి, మెడలో మాల విసర్జన చేసే వరకు బృందంలో వెంటవచ్చే అందరు స్వాములకు బాధ్యత వహించి యాత్ర నుండి సురక్షితంగా ఇంటికి చేర్చాలి. అలా సేవాభావం, అంకితభావంతో చేసే వాడే నిజమైన గురుస్వామి. అటువంటి గురుస్వామి వెంట వెళ్తేనే శబరిమల యాత్రాలక్ష్యం నెరవేరుతుంది. సద్గురునాథనే శరణుమయ్యప్ప!

స్వామి శరణు ఘోషప్రియుడు కాబట్టే యాత్రలోనే కాకుండా నిత్యం చేసే పూజలు, భజనలలో కూడా శరణుఘోషకే ఎక్కువ ప్రధాన్యత ఇచ్చి, స్వాములందరి చేత శరణాలు చెప్పించి గురుస్వామి పూజలు జరిపిస్తారు. మండల కాలం (నలభై ఒక్క రోజుల) పూజ, భజన సమయంలో శరణు ఘోష చెప్పడం వలన దీక్షలో యాత్రలో నిద్రపోతున్నా నోటి నేంట స్వామివారి శరణాలే పలుకుతాయి. ' అహం బ్రహ్మస్మి, తత్వమసి ' సిద్ధాంతంతో అయ్యప్ప దీక్ష ముడిపడి ఉంది. తనలో అయ్యప్పని దర్శించుకొని ఇతరులలో కూడా అయ్యప్పను దర్శించాలి. ఆ భావనతోనే దీక్షలో ఎవరైనా స్వామి కనిపించగానే శరణం అని చెప్పి నమస్కరించడం, ఒక్కొక్కసారి పాదాభివందనం చేయడం అయ్యప్ప దీక్షలో శరణాగతికి నిదర్శనం. మానవ సేవే మాధవ సేవగా చెప్పేది కూడా అయ్యప్ప దీక్ష అవడం వలన విరివిగా దాన ధర్మాలు చేస్తూ, అన్నదానం జరిపిస్తారు. సాటి మనిషికి సాయం చేసే అహంకారాన్ని వదుకుకొంటారు. బ్రహ్మచర్య వ్రతం, చన్నీటి స్నానం, నేలపై పడక, మితాహారం, సాత్వికాహారం, ఒంటిపూట భోజనం, దీపారాధన, పూ భజనలు రోజూ చేయడం వలన మంచి క్రమశిక్షణ అలవడి ఆధ్యాత్మికంగా ఎదగడానికి బాగా తోడ్పడుతుంది.

స్వామి ఆరాధనే ధ్యేయంగా భక్తి యాత్ర
అయ్యప్ప
భక్త ప్రహ్లాద,కన్నప్పల కథలు మనం చదివాం.కానీ ఇప్పుడు భక్త అయ్యప్పలను స్వయంగా చూస్తున్నాం.కానీ అదే రకమైన అకుంఠిత దీక్ష,దృఢత్వం గలవారు లేకపోలేదు.నియమ,నిబంధనలను గాలికి వదిలేసి,పేరుకు మాత్రమే భక్తులయ్యేవారు లెక్కలోకి రారు.నిజమైన ఆరాధనలో నిండా మునిగిపోయే స్వాముల గురించే ఇప్పుడు ప్రస్తావించేది.ఒక నిజమైన ఆధ్యాత్మిక దృష్టిపరులకు అది అసాధ్యమేమీ కాదు.స్వామి ఆరాధనే ధ్యేయంగా గలవారికి నలబై ఒక్క రోజులు ఒక్క లెక్కకాదు.నిష్కల్మష,సహసోపేత భక్తి భావనే అంతటి ఉన్నత స్థానానికి ఎవరినైనా తీసుకెళుతుంది. అటువంటి అసలైన అయ్యప్పలకు దైనందిన జీవనంలోని సుఖాలు,సౌఖర్యాలు గుర్తుకురావు.ఏడాది పొడువున చైన్ స్మోకింగ్, మద్యపానం,ఇతరత్రా దురలవాట్లతో కాలం గడిపేవారు సైతం ఆ సమయంలో వాటికి దూరం కావడం చూస్తే ఎంతటి కార్యమైనా మనిషికి సాధ్యమే అనిపిస్తుంది. కాకపోతే ప్రతి ఒక్కరికి ఉండవలసింది,ఆ మేరకు దృడమైన సంకల్పం మాత్రమే అన్నది స్పష్టమవుతుంది. అయ్యప్ప దీక్ష తీసుకోవాలన్న తలంపే చాలామందికి రాదు. వచ్చిన వారిలో దానిని ఆచరణలోకి తెచ్చేవారు మరీ తక్కువ. ఆచరించే ప్రతి ఒక్కరిలో ధృడ చిత్తం ఉంటేనే అది సాధ్యం.అలా అని దీక్ష తీసుకుంటున్న అయ్యప్పల సంఖ్య తక్కువేమీ లేదు.ఏడాది కేడాది కొత్తగా దీక్ష స్వీకరిస్తున్న కన్నెస్వాముల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. సంవత్సరంలో జోరుగా సాగే డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి-మూడు నెలల్లో అయ్యప్ప వ్రతదీక్ష స్వీకరించి,కేరళలోని శబరిమలకు వెళ్ళి వస్తున్న వారి సంఖ్య ఒక అంచనా ప్రకారం సుమారు యాబై లక్షలు.

ఎందుకు భయం?
అయ్యప్ప స్వామి దీక్ష తీసుకోవడానికి చాలామంది ముందుకు రారు.ఎందువల్ల? ఈ ప్రశ్నకు చాలామందికి తెలిసిన జవాబు "అది అత్యంత కఠినతరమని". ఇదొక్కటి మాత్రమే కాదు,వారు "శబరిమల యాత్ర" తప్పనిసరిగా చేయాలి.నలబై ఒక్క రోజులకు బదులు ఏదో కొద్ది రోజులు మాల వేసుకొని,శబరిమల వరకు వెళ్ళకుండా, మరెక్కడో ఒక అయ్యప్పస్వామి ఊరువెళ్ళి దీక్షను ముగించే వారి గురించి కూడా వింటున్నాం. నిబంధన ప్రకారమైతే దీక్ష ఎంత కఠినమో శబరిమల యాత్ర కూడా అంతే సాహసోపేతం. చాలామందిని భయపెడుతున్న అంశాలలో ఇదీ ప్రధానమైంది. దైవం వల్ల పరిపూర్ణ విశ్వాసం,ప్రేమతో ముందుకు వస్తే అలాంటి భయాలేవీ ఉండవు.

యాత్ర అంత కష్టమా?
నిజానికి "శబరిమల"యాత్ర అంత కష్టమా?ఎందరు దీక్ష కష్టాలు లేకుండా సివిల్ డ్రెస్సులో అక్కడికి వెళ్ళి రావడం లేదు? పిల్లలు, వృద్ధ స్త్రీలు,వృద్దులు, వికలాంగుల సైతం అనేక కష్టాలకు ఓర్చుకుంటూ అడవి మార్గంలో కాలినడకన వెళ్ళగా లేనిది అన్నీ ఉన్న అనేకమంది అందుకు ముందుకు రాకపోవడానికి అసలైన కారణం "సంకల్ప లోపం". వారికి నిజంగా దైవం మీద భక్తి ఉంటే ఎవరికీ తెలియని ఆధ్యాత్మిక శక్తి స్వయంగా వారిని నడిపించుకుంటూ వెళుతుంది. దీక్ష తీసుకున్న వారికి అడుగడుగునా కష్టాలు కలగడం సహజం. అవి కేవలం స్వామి పరీక్షలే తప్ప మరోటి కాదనుకోవాలి. చివరకు ఆ భగవంతుడి మీదే సమస్త భారాలు వేసి అన్నింటినీ, అందరినీ వదిలి అడవి మార్గంలో బయలుదేరుతారు. నియమాలు,నిష్టల విషయంలో ఏ మేరకు క్రమశిక్షణను పాటిస్తామన్న దానిపైనే వారి భక్తి నాణ్యత ఆధారపడి ఉంటుందన్నది గుర్తుంచుకోవాలి. మొట్టమొదటి సారి దీక్ష తీసుకొనే వారు విధిగా పెద పాదం గుండానే వెళ్ళాలన్న నియమం ఒకటి ఉంది. భయపడే వారు భయపడుతున్నా,ప్రగాఢ భక్తి తత్పరతతో ఆ మార్గం గుండానే వెళుతున్నవారు లక్షల సంఖ్యలో కనిపిస్తారు.

"పెద పాద" మార్గమంతా చిట్టడవి!
అయ్యప్ప
ఇరుమేలి నుండి పంబదాకా ఉన్న పెదపాదం మార్గం మొత్తం చిట్టడవి. అసాధారణంగా పెరిగిన వృక్షాలు, కొండలు, లోయలగుండా ప్రయాణం సాగుతుంది. ఎరుమేలి వరకు బస్సులో వెళ్ళవచ్చు.అక్కడ్నించి యాత్రికులు పంబమీదుగా శబరిమల దాకా కాలి నడకన వెళ్తారు. తలపై ఇరుముడులు పెట్టుకొని,పాదరక్షలు లేకుండా కీకారణ్యంలో రాళ్ళు రప్పల మీదుగా, అస్త వ్యస్తమైన మార్గం గుండా రాత్రింబవళ్ళు సాగుతారు.నిజానికి అది దేశంలోని మొత్తం 27 టైగర్ రిజర్వ్ ఫారెస్ట్‌లలో ఒకటి. అయ్యప్పలు సంచరించేకాలంలో వనంలోని క్రూరమృగాలు దూర ప్రాంతానికి వలస పోతాయని చెబుతారు. ఇన్నేళ్ళుగా సాగుతున్న ఈ యత్రలో ఒక్క పెద్ద వన్యమృగమైనా స్వాములను ఇబ్బంది పెట్టిన సందర్భం లేదు.

"మకర జ్యోతి"దర్శన భాగ్యం
ప్రతి సంవత్సరం జనవరి 15 సంక్రాంతి పర్వ దినాన దర్శనమిచ్చే "మకరజ్యోతి"ని దర్శనం చేసుకోవడం ప్రతి ఒక్క స్వామికీ పెద్ద పరీక్ష అనాలి. ఆ రోజు అయ్యప్ప జ్యోతిరూపంలో ప్రత్యక్షమౌతాడు. కాబట్టి ప్రతి ఒక్కరికీ ఆ అద్భుతాన్ని కళ్ళారా చూడాలన్న కాంక్ష ప్రగాఢంగా ఉంటుంది. లక్షలాది స్వాముల శరణుఘోషుల మధ్య, కర్పూర హారతుల ధూపకాంతుల నడుమ ఆకాశంలో మకర నక్షత్రం మిలమిలా మెరుస్తుంది.

ఎక్కడ ఉంది?
దక్షిణ భారతంలోని పశ్చిమ కనుమలకు చెందిన దట్టమైన అరణ్యంలో కొండకోనల మధ్య శబరిమల నెలకొని ఉంది. రాష్ట్ర రాజధాని తిరువనంతపురం (ట్రివేండ్రం)కు 180 కి.మీ.దూరంలో ఉంటుంది. రైలులో వెళ్ళే యాత్రికులకు కొట్టాయం లేదా ఎర్నాకులం (కొచ్చి) అనుకూలమైన కూడళ్ళు. రోడ్డు మార్గంలో అయితే ఎరుమేలికి 64 కి.మీ.దూరం, పంబ నుండి 5 కి.మీ.దూరం ఉంటుంది.శబరిమల వరకూ వాహన సౌకర్యం లేదు. పంబ వరకు వాహనంలోనో లేదా కాలినడకనో వెళ్ళి,అక్కడ్నించి తప్పనిసరిగా కాలినడకన కానీ, లేదా డోలీలో కానీ వెళ్ళాల్సిందే.

ఎవరైనా వెళ్ళవచ్చు!
శబరిమలకు ఎవరైనా,ఎప్పుడైనా వెళ్ళవచ్చు.కాకపోతే అక్కడ అయ్యప్పస్వామి దేవాలయం తెరచే కాలం మాత్రం సంవత్సరంలో ఆయా నిర్థిష్ట సమయాలలోనే. అటు దైవభక్తి, ఇటు ప్రకృతి ఆరాధన రెండూ ఏకకాలంలో కావాలనుకునే వారికి శబరిమల ఒక అద్భుతమైన యాత్ర.కాబట్టి, దీక్ష తీసుకోని వారి సైతం అక్కడికి వెళ్ళి స్వామి దర్శనం చేసుకోవచ్చు.కాకపోతే ఆలయం ముందున్న పరమ పవిత్రమైన పద్దెనిమిది మెట్లను మాత్రం కేవలం దీక్షపరులైన "అయ్యప్ప"లు మాత్రమే అధిరోహిస్తారు. 



 1250 కి.మీ. కాలినడకతో అయ్యప్ప దర్శనం
కఠోర దీక్షను చేపట్టి, వేలాధి కిల్లోమిటర్లను పాద యాత్ర ద్వారా శబరీ చెరుకుని స్వామిని దర్శించుకోవటం స్వాముల దీక్షకు నిజంగానే పరీక్ష. సుమారు 200మంది అయ్యప్పస్వాములు కాలి నడకన శబరీమలైలోని అయ్యప్ప స్వామిని దర్శించుకోవడానికి సిద్ధ్దమై తరలివెళ్ళానున్నారు.

దుండిగల్ల వేణుగోపాల్‌ గురుస్వామి ఆధ్వర్యంలో రెండు వందల మందిస్వాములు మహాపాదయాత్రకు శ్రీకారం చూట్టారు. కూకట్‌పల్లికి చెందిన డెబె్బై ఐదు సంవత్సరాల వయస్సు కలిగిన దుండిగల్ల వేణుగోపాల్‌ గురుస్వామి పాదయాత్ర ద్వారా ఇప్పటికి 18వ సార్లు శబరీమలకు వెళ్లి అయ్యప్పను దర్శించుకోగా, 19వసారిగా మంగళ వారం సికింద్రాబాద్‌లోని వినాయక దేవాలయం నుంచి వేణుగోపాల్‌ గురుస్వామి బందం బయలుదేరారు. గురుస్వామి వెంట జంటనగరాల్లో వివిధ ప్రాంతాలకు చెందిన అయ్యప్ప స్వాములతోపాటు కరీంనగర్‌, అదిలాబాద్‌, నిజామాబాద్‌, వరంగల్‌, జిల్లాలకు చెందిన వివిధ ప్రాంతా లకు చెందిన స్వాములందరికి మంగళవారం ఉదయం ఆరుగంటల నుంచి స్వాములకు వేణుగోపాల్‌ గురుస్వామి స్వయంగా ఇరుముడ్లు కట్టి న ఆనంతరం ఉదయం 11గం.లకు గణపతి ఆలయం నుంచి పాదయా త్ర ప్రారంభమౌతుంది.

సికింద్రాబాద్‌ నుంచి 1250కిలో మీటర్ల దూరంలో ఉన్న శబరీమలైని 38రోజుల్లో ప్రయాణం చేసి చేరుకోగా, ఈ పాదయాత్ర మన రాష్ట్రంలో 17రోజుల పాటు, 5రోజులపాటు కర్ణాటక లో, 12 రోజులు తమిళనాడు, 2రోజులపాటు కేరళరాష్ట్రంలో పాద యాత్ర ప్రయాణం జరుగుతుందని, నవంబర్‌ 25వ తేదిన అయ్యప్ప సన్నిదానం చేరుకుంటామని దుండిగల్ల వేణుగోపాల్‌ గురుస్వామి తెలిపారు. అయ్యప్ప దేవస్థానం పాదయాత్ర ద్వారా వచ్చిన అయ్యప్ప భక్తులకు ప్రత్యేక దర్శనం సౌకర్యాన్ని కలిపిస్తుందని, తాము అయ్యప్ప స్వామిని దర్శించుకుని ప్రత్యేక అభిషేకము, పూజ కార్యక్రమాల్లో పాల్గొని తిరిగి ప్రయాణం ఉంటుందని, ఇప్పటి వరకు 18 పర్యాయములు విజ యవంతంగా పాదయాత్రను పూర్తిచేసి 19వసారి ఇప్పుడు జరిగే పాద యాత్రకు అత్యంత ప్రాధాన్యత సంతరించుకుందని ఆయన తెలిపారు.

1250 కిలో మీటర్ల పొడవునా కాలి నడక ద్వారా శబరీమలై అయ్యప్ప స్వామిని దర్శించుకోవడం ఎంతో అరుదైన విషయం కావడంతో లిమ్కా బుక్‌ ఆఫ్‌ ఇండియా వారు సైతం గురుస్వామి పాదయాత్ర యొక్క విశిష్ట తను గుర్తించారని, పాదయాత్ర సందర్భంగా ఎన్నో వ్యయప్రయాసాలకు ఇబ్బందులను, చిన్న చిన్న గాయాలను సైతం లెక్క చేయకుండా అయ్యప్ప స్వామి కృపతోనే పాదయాత్రను విజయవంతంగా కొనసాగిస్తున్నాని తెలిపారు. అయ్యప్ప కృపదయతోనే అన్ని ఇబ్బందులను ఆధిగమిచు న్నాని దుండిగళ్ల వేణుగోపాల్‌ గురుస్వామి ‘మేజర్‌న్యూస్‌’కు తెలిపారు.

గతంలో మానస సరోవర్‌, అమర్‌నాథ్‌, షిర్డీ, తిరుపతి, శ్రీశైలం, భద్రా చలం వంటి అనేక పుణ్యక్షేత్రాలను పాదయాత్ర ద్వారా దర్శించుకున్నాని పాదయాత్ర వల్ల కలిగే అనుభూతిని వర్ణించలేమని పేర్కొన్నారు. దీక్షలను స్వీకరించే అయ్యప్ప భక్తులు ఎంతో నిశ్టతతో దైవభక్తికి ప్రతిబింబం అయిన గురుస్వామి సమక్షంలో దీక్షను చేపట్టడానికి అనేక మంది అయ్య ప్ప భక్తులు మక్కువ చూపుతున్నారు. గురుస్వామి చేతుల మీదుగా అయ్యప్ప దీక్షను చేపట్టిన స్వాములకు అన్ని విధాలుగా మంచి జరుగు తుండడంతో పాటు జంటనగరాల్లోని అత్యంత విశిష్టత దైవభక్తి కలిగిన గురుస్వామి వేణుగోపాల స్వామిని అయ్యప్ప భక్తసేవ సమాజానికి ఆధర్శ మైన గురుస్వామిగా అయ్యప్పల విశ్వాసం.

అయ్యప్ప గుడి వివరాలు
Ayyappa Temples
Anaparthi
Ayyappa Swami Temple, Canal Road, Anaparthi
Bhimavaram
Ayyappa Swami Temple, Gunupudi, Bhimavaram
Ayyappa Swami Temple, Suryanarayana puram.Bhimavaram
Dwarapudi
Ayyappa Swami Temple, Canal Road, Dwarapudi
Hyderabad/Secunderabad
Ayyappa Temple, Bharat Nagar, Hyderabad
Ayyappa Temple, Bolarum, Hyderabad
Ayyappa Temple, BHEL, Hyderabad
Ayyappa Temple, GTS Colony, Hyderabad
Ayyappa Temple, HAL Colony, Balanagar, Hyderabad
Ayyappa Temple, Lal Bazar, Hyderabad
Ayyappa Temple, Metluguda, Hyderabad
Ayyappa Temple, Nalla Kunta, Hyderabad
Ayyappa Temple, Sanath Nagar, Hyderabad
Ayyappa Temple, Srininagar Colony, Hyderabad
Ayyappa Temple, Somajiguda, Hyderabad
Ayyappa Temple, Tirumal giri, Hyderabad
Ayyappa Temple, Vivekananda Nagar Colony, Kukat Palli, Hyderabad
Kakinada
Ayyappa Swami Temple, Bani Gudi Jn, Kakinada
Palakollu
Ayyappa Swami Temple, Palakollu
Vijayawada
Ayyappa Swami Temple, Gollapudi, Vijayawada
Yanamalakuduru,Vijayawada, Andhra Pradesh
Visakhapatanam
Ayyappa Swami Temple, Sheela Nagar, NH5, Vishakapatanam




శ్లోకములు & మంత్రములు
1 హనుమాన్ చాలీసా
2 గణపతి ప్రార్దన
3 Chejarenu gatamanta - చేజారెను గతమంతా వృధా వృధా - సాయిరాం
4 Gajavadana - గజవదనా గౌరీ నందన
5 Sri Ayyappa Ashtothara Shata Namavali - శ్రీ అయ్యప్ప అష్టోత్తర శతనామవళి
6 Thurupu Desam Podama - తూరుపు దేశం పోదామా తుమ్మి పూలు తెద్దామా
7 Chinni Chinni Vadive - చిన్ని చిన్ని వాడివే అయ్యప్పా
8 Kanne Swamy - కన్నె స్వామి
9 Bhagavan Saranam - భగవాన్ శరణం భగవతి శరణం
10 Ayyappa Nava Pata - అయ్యప్ప నావ పాట
11 Saranu Ganesha - శరణం గణేశా శరణం గణేశా
12 Satyamu Jyothiga Velugunayya - సత్యము జ్యోతిగ వెలుగునయా
13 Ayya Dharsanam - అయ్యా దర్శనం స్వామి అయ్యా దర్శనం
14 Kobbarikayalu Ayyappake - కొబ్బరి కాయలు అయ్యప్పకే
15 Nee Nama Smarana leka - నీ నామ స్మరణ లేక శరణ మయ్యప్ప
16 Ayyappa Swamiki Arati Mandapam - అయ్యప్ప స్వామికి అరటి మండపం
17 18 Steps - పద్దెనిమిది మెట్లు
18 Padi Pata - పడి పాట
19 Lokaveeram - లోకవీరం మహా పూజ్యం
20 Harivarasanam - హరివరాసనం విశ్వమోహనం


మీకు తెలుసా?

1 వినాయకుడు అంటే ఎవరు?
2 గురు అను పదానికి అర్ధము ఏమిటి?
3 లింగాష్టకం యొక్క అర్దం ఏమిటి?
4 8/18 అంకె కు మన హిందూ సంప్రదాయం లో గల ప్రాధాన్యత?

అయ్యప్ప దీక్ష.కం వెబ్ సైట్ గురించి:
  1. ఈ వెబ్ సైట్ తెలుగు అయ్యప్ప భక్తుల కోసం రూపొందించడమైనది.
  2. అయ్యప్ప గురించి, స్వామి దీక్ష గురించి, దీక్ష నియమాల గురించి క్లుప్తంగా ఈ వెబ్ సైట్ లొ వివరించాం.
  3. మీ మీ ప్రాంతాలలొ జరుగు పడి పూజ వివరాలను, అన్నధాన వివరాలను, భజనా కార్యక్రమ వివరాలను మాకు తెలియజెసిన యెడల, మేము ఆ వివరాలను ఈ వెబ్ సైట్ లొ పొందుపరచగలము. మరియు మీ ఫ్రాంతాలకి దగ్గరలొ ఉన్న అయ్యప్ప భక్తులకు ఈ వివరాలని SMS ద్వారా తెలియజెస్తాము.
  4. మీ యొక్క పడి పూజకి సంభందించిన ఫొటోలని, వీడియొలని మాకు పంపిన యెడల మేము ఈ వెబ్ సైట్ లొ పొందుపరచగలము. తద్వార వివిద ప్రాంతాలలొని అయ్యప్ప భక్తులు వీక్షించెదరు.
  5. 18 సంవత్సరాలు దీక్ష పూర్తి చేసిన గురుస్వాముల వివరాలను మాకు తెలియచేయండి. వారి వివరాలను, వారి అనుభావాలను ఈ వెబ్ సైట్ లొ పొందుపరచగలము.
  6. ఇంకా మీ అమూల్యమైన సలహాలను మాకు తెలియజేయండి.
మీరు సంప్రదించవలసిన వివరాలు:
అశోక్ కుమార్
ఫొన్: +91.9160321333
హైదరాబాద్

3 కామెంట్‌లు:

Unknown చెప్పారు...

swamye sharanam ayyappa this information is very usefull to devotees

Unknown చెప్పారు...

om sri swamiye sharanam ayyapa...........very very useful to ayyappa swamulu and to all devottes.... speciaaly for kanya swamies

Janaki Ramarao చెప్పారు...

Swamy Dhayatho Naku Ayyapa Swamy Dheekya Niyamlu Mana Puranamulo Brahmanda puranamulo Ayyappokyanamu nundi Grahincha badinadhi ani pedhalu chepputhunnaru kani entha prayithnichina dorakadamu ledhu eitti vivaralu manamu bhakthulaku bhodhincalanna manaku kontha purana Grandhalu chala avasaramu guruswamulu kothaga thamaku thochna vidhamuga pracharamu chesthunnaru nenu 28yea Dheekya Dhayachesi avakashamu vunte thamaru serch chesi Na mail ID ki pampinchandi Mail indurthijanakiram@gmail.com