వక్తృత్వం అనగా ఏదైనా విషయము గురించి ఆసక్తికరంగా మాట్లాడటం లేక ఉపన్యాసము చేయడం. తోటివారిపై ప్రభావం చూపడంలో, ఇది చాలా ఉపయోగం. చర్చ లాంటి కార్యక్రమాలలో కూడా ఈ కళ తెలిసినవారు చాలా సులభంగా ఇతరులను ఆకట్టుకుంటారు. అందువలన, పాఠశాల స్థాయినుండే విద్యార్థులలో వేదిక భయము పోగొట్టటానికి, వక్తృత్వ పోటీలు ఏర్పాటు చేస్తారు.
నైపుణ్యతని పెంచుకోవటానికి సూచనలు
- విషయాన్ని సమగ్రంగా తెలుసుకోవటం.
- ఉపన్యాసాన్ని తయారుచేసుకోవడం
- సమయపాలనకి, పొరపాట్లు దొర్లకుండా వుండటానికి, ముందుగా ప్రాక్టీస్ చేయడం.
- టోస్ట్ మాస్టర్ సంఘంలో సభ్యులుగా చేరటం
వ్యాస రచన
ఒక విషయాన్ని వివరంగా విస్తరించి రాయటమే వ్యాసం. వ్యాస రచన జ్ఞానానికి,సృజనశక్తికి, తార్కికతకుఅద్దంపడుతుంది. ఇతర మాధ్యమాలలో కార్యక్రమాల రూపకల్పనకు కూడా మూలం వ్యాసం రచన మెళకువలు ఉపయోగపడ్తాయి.
విషయ సూచిక |
వ్యాసములో భాగాలు
ప్రారంభం : ప్రారంభం వైవిధ్యంగా వుండాలి.మంచి సూక్తులు, గొప్ప వ్యక్తుల ప్రవచనాలు, చమత్కారాలు, కవితలోని ముఖ్యమైన పంక్తులు వాడవచ్చు.
నిర్వచనం లేదా వివరణ లేదా నేపథ్యం: దీనిలో విషయ సందర్భాన్ని, ఇప్పటివరకుతెలిసిన సంగతులను క్లుప్తంగా సమీక్షించాలి. వ్యాసము లో ముఖ్యాంశాలను క్లుప్తంగా, వ్యాసా భాగాలను పరిచయంచేయాలి. విషయం కొత్తగా అనిపించినవారికి, ఇది చదివితే మిగతా వ్యాసము అర్థం అవడానికి సులువువతుంది.
విషయ విశ్లేషణ : విషయంలో ముఖ్యమైనవాటిని విస్తరించాలి. గణాంకాలు అవసరమైనపుడు వాడాలి. (ఉదా: అక్షరాస్యత పై వ్యాసంలో, దేశాల, రాష్ట్రాల అక్షరాశ్యత గణాంకాలు, వర్గాల వారీగా, కాలానుగుణంగా మార్పుల గణాంకాలు రాయాలి. విషయానికి వ్యాస రచయిత ప్రతిపాదన వివరించాలి.
అనుకూల, ప్రతికూల అంశాలు
ప్రతిపాదనకు అనుకూల, ప్రతికూల అంశాలు రాయాలి.
సూచనలు:సంభందిత ప్రయోగాల వివరణలు రాయాలి.
ముగింపు :వ్యాస సారాంశాన్ని రాయాలి. దీనిలోసూక్తులు, సుభాషితాలను వాడవచ్చు.
భాష తీరు :వాడుక భాషలో, సాధ్యమైనంతవరకుభాషా దోషాలు రాకుండా రాయాలి. ముఖ్యంగా వ్యక్తులు, స్థలాలు,పుస్తకాల పేర్లలో తప్పులుండకూడదు.
సామాన్య పదాలదోషాలు :
- వత్తులు
- అచ్చుకి బదులు హల్లు వాడటం ఉదా: వొకడు (తప్పు) ఒకడు(ఒప్పు)
- హల్లుకి బదులు అచ్చు వాడటం. ఉదా: ఎంకయ్య(తప్పు) వెంకయ్య(ఒప్పు)
- చ, శ,ష,స లో పొరపాటు పడటం .ఉదా: వేషం, శనగలు, పరీక్ష (ఒప్పు )
- సంయుక్తాక్షరాలో దోషం. ఉదా: మధ్యాహ్నం (ఒప్పు), మజ్జాన్నం (తప్పు) మద్దాన్నం(తప్పు);న్యాయం (ఒప్పు),నాయం(తప్పు)
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి