1.వస్తా వట్టిది... పోతా వట్టిది! ఆశ ఎందుకంటా? చేసిన ధర్మము చెడని పదార్థము... చేరును నీవెంట..2.నువ్వు తినే ప్రతి ఒక మెతుకు ఈ సంఘం పండించింది గర్వించే ఈ నీ బ్రతుకు సమాజమే మలిచింది ఋణం తీర్చు తరుణం వస్తే తప్పించుకు పోతున్నావా తెప్ప తగలపెట్టేస్తావా ఏరు దాటగానే...

25, డిసెంబర్ 2010, శనివారం

సాహసం నా పదం

 

 

సాహసం నా పదం రాజసం నా రధం
సాగితే ఆపడం సాధ్యమా
పౌరుషం ఆయుధం పోరులో జీవితం
కైవసం కావడం కష్టమా
లోకమే బానిసై చెయదా వూడిగం
శాసనం దాటడం శఖ్యమా
నా పదగతిలో ప్రతిఘటన
పిడికిలిలో తానొదుగునుగా
సాహసం నా పదం రాజసం నా రదం
సాగితే ఆపడం సాధ్యమా

నిశ్చయం, నిశ్చలం. హహహా.
నిర్భయం నా హయం

కానిదేముంది నే కోరుకుంటే పూని సాధించుకోనా
లాభమేముంది కలకాలముంటే కామితం తీరకుండా
తప్పని ఒప్పని తర్కమే చేయను.
కష్టమో నష్టమో లెక్కలే వేయను
ఉరుకుంటే కాలమంతా జారిపోదా ఊహవెంట
నే మనస్సు పడితే కలలైనా
చిటికకోడుతు నే పిలువనా

సాహసం నా పదం రాజసం నా రధం
సాగితే ఆపడం సాధ్యమా
పౌరుషం ఆయుధం పోరులో జీవితం కైవసం కావడం కష్టమా

అదరని బెదరని ప్రవృత్తి
ఒదగని మదగజమే మహార్షి

వేడితేనేని ఓడిచేరుతందా వేటసాగాలి కాదా
ఓడితే జాలి చూపేన కాలం కాలరాసేసి పోదా
అంతమో సోంతమో పంతమే వీడను.
మందలో పందలా ఉండనే ఉండను
భీరువల్లే పారిపోను రేయి ఓళ్ళోతూలిపోను
నే మొదలు పెడితే సమరమైనా నాకెదురుపడునా అపజయం

సాహసం నా పదం రాజసం నా రధం
సాగితే ఆపడం సాధ్యమా
పౌరుషం ఆయుధం పోరులో జీవితం కైవసం కావడం కష్టమా
లోకమే బానిసై చెయదా వూడిగం
శాసనం దాటడం శఖ్యమా
నా పదగతిలో ప్రతిఘటన
పిడికిలిలో తానొదుగునుగా

సాహసం నా పదం రాజసం నా రధం సాగితే ఆపడం సాధ్యమా

తకిటజం తరితజం తనతజం జమ్తజం తకిటజం తరితజం జమ్తజం

 

కామెంట్‌లు లేవు: