ఈ ప్రపంచం అనే ఎడారిలో నేను ఎప్పుడు వంటరి బాటసారిగానే మిగిలిపోతుంటాను…అక్కడక్కడ మేమున్నాం అంటూ పలకరించే జన సందోహాలు, నీటి గుంటలు (ఒయాసిస్సులు) నాలో ఆశలను రేపుతాయి, కాని అవి అక్కడే ఆగిపోతాయి అని తెలిసి, అవి క్షనికాలని తెలిసి కూడా నేను వాటికి బందీగా మరిపోతుంటాను.....వాటిని వదిలి ముందుకు సాగితే నా (జీవిత) గమ్యాన్ని సులభంగా చేరగలను కాని..... వాటిని వదలి వెళ్ళలేను...పోనీ అవి నాతో వస్తాయా అంటే రానే రావు ..అవి అక్కడే వుండి నన్ను అమితంగా ఆకర్షిస్తాయి, ఆకట్టుకుంటాయి, ఆనందాన్నిస్తాయి ...ఈ అందానికి, ఆనందానికి బానిసగా మారిన నేను నా గమ్యం వైపు సాగే ప్రయాణాన్ని ఆపివేస్తుంటాను......
నాకు ఇలా జరగడం కొత్త అనుకుంటే పొరపాటే....ఇది కల చక్రంలోను, మనిషి జీవిత చక్రంలోను సాగే ఒక నిరంతర ప్రక్రియ ..నేను ఇలా అనుకుంటూనే వుంటాను........ ఈ ఎడారి నా జీవితం ...ఆ ఒయాసిస్సులు, జన సందోహాలు నా జీవిత గమనంలో వచ్చే బంధువులు, బంధుత్వాలు, బంధాలు, స్నేహాలు,ప్రేమలు.....అవి దాటితే నేను నా అసలైన లక్ష్యాన్ని చేరుకోగలను అని నాకు తెలుసు, కాని వారికి ఆనందాన్ని ఇస్తూ, వారి ద్వార ఆనందాన్ని పొందడం కూడా లక్ష్యంలో బాగమే అనుకుంటూ వుంటాను ......
కాసేపు ఆనందం ..కాసేపు దుఖం....కాసేపు ఆత్మ శోధన...కాసేపు ధ్యాన సాధన....చూడాలి నా ఈ ఆలోచన అనంతరంగం ఎటు పోతుందో...ఈ తీరాలకు చేర్చుతుందో...
నా అనంతరంగం ...అమ్మ శ్రీనివాస్
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి