పర్యావరణ పరిరక్షణ ఇప్పుడు అత్యంత ప్రధానమైన అంశమైంది. కొన్ని దశాబ్దాలపాటు విచక్షణరహితంగా కొనసాగిన అడవుల నరికివేత, ప్లాస్టిక్, ఎలక్ట్రానిక్ వస్తువుల వాడకం వంటివన్నీ పర్యావరణ సమతుల్యతను తీవ్రంగా దెబ్బతీసిన నేపథ్యంలో గ్లోబల్ వార్మింగ్ అనే పదం తరచుగా వినిపిస్తోంది. దీని గురించి మనకు తెలిసిన విషయాలను చెక్ చేసుకుందాం.
1.గ్లోబల్ వార్మింగ్ అంటే భూమండలం మీద ఉష్ణోగ్రత పెరగడం.
ఎ. అవును
బి. కాదు
2.{Xన్హౌస్ గ్యాసెస్ ప్రభావం అంటే భూమి మీద వాతావరణం ఒక నిర్ణీతమైన ఉష్ణోగ్రతతో ఉండేలా చేసేందుకు ఉపకరించే వాయువులు.
ఎ. అవును
బి. కాదు
3.కార్బన్ డై ఆక్సైడ్, నీటి ఆవిరి, నైట్రస్ ఆక్సైడ్, మిథేన్లను గ్రీన్ హౌస్ గ్యాసెస్గా పరిగణిస్తారు.
ఎ. అవును
బి. కాదు
4.మంచుపర్వతాలు కరిగిపోవడాన్ని గ్లోబల్ వార్మింగ్తో వచ్చే తక్షణ ప్రమాదంగా గుర్తించవచ్చు.
ఎ. అవును
బి. కాదు
5.కరిగిన మంచు నీరై సముద్రాల్లోకి చేరడంతో సముద్రాల వైశాల్యం పెరుగుతుంది.
ఎ. అవును
బి. కాదు
6.సముద్రాల వైశాల్యం పెరిగితే లోతట్టు ప్రాంతాలు, ద్వీపాలు మునిగిపోతాయనడంలో వాస్తవం లేదు.
ఎ. కాదు
బి. అవును
7.గ్లోబల్ వార్మింగ్ కారణంగా సముద్రంలో పెరిగే మొక్కల జాతులైన శైవలాలు నశించిపోవడం మరొక ప్రధాన సమస్య.
ఎ. అవును
బి. కాదు
8.వీటి నాశనంతో సముద్రజీవులు ఆహారంతోపాటు ప్రధానమైన ఆక్సిజన్ వనరును కూడా కోల్పోతాయి.
ఎ. అవును
బి. కాదు
9.గ్లోబల్ వార్మింగ్ తీవ్రత పెరిగితే ఆమ్లవర్షాలు, ఎండాకాలంలో అడవులు అగ్నిప్రమాదాల బారినపడే అవకాశాలు పెరగవచ్చు.
ఎ. అవును
బి. కాదు
మీ సమాధానాల్లో 'ఎ'లు ఆరుకంటే ఎక్కువగా వస్తే మీకు గ్లోబల్ వార్మింగ్, దాని పర్యవసానాల గురించి ప్రాథమిక అవగాహన ఉన్నట్లు అర్థం.
Thanks & Regards
S. Sreenivasa Prasad Rao
<Protect Trees—Protect yourself>
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి