1.వస్తా వట్టిది... పోతా వట్టిది! ఆశ ఎందుకంటా? చేసిన ధర్మము చెడని పదార్థము... చేరును నీవెంట..2.నువ్వు తినే ప్రతి ఒక మెతుకు ఈ సంఘం పండించింది గర్వించే ఈ నీ బ్రతుకు సమాజమే మలిచింది ఋణం తీర్చు తరుణం వస్తే తప్పించుకు పోతున్నావా తెప్ప తగలపెట్టేస్తావా ఏరు దాటగానే...

4, ఫిబ్రవరి 2011, శుక్రవారం

వీల్‌పవర్

సలాలుద్దీన్ పాషా చిన్నప్పుడు తన ఊళ్లో మానసిక, శారీరక వికలాంగులను చూసి బాధపడేవాడు. పెద్దయ్యాక వాళ్ల కోసం ఏదైనా చేయాలనుకునేవాడు. పాషా పెద్దయ్యాక భరతనాట్యం, కథక్, యోగా, మార్షల్ ఆర్ట్స్ నేర్చుకున్నాడు. తాను నేర్చుకున్న కళలను వికలాంగులకు నేర్పాలనుకున్నాడు. ‘యూనిక్ ఎబిలిటీ ఫౌండేషన్’ అనే సంస్థను మొదలుపెట్టి వీల్‌చైర్ మీద నాట్యం, యోగా, మార్షల్స్ ఆర్ట్స్ నేర్పించడం మొదలు పెట్టాడు.

ఇలాంటి సంస్థ ప్రపంచంలోనే మొదటిది. శిక్షణ ఇవ్వడమే కాకుండా వేదికల మీద ప్రదర్శన ఇచ్చే అవకాశం కూడా ఈ సంస్థ కల్పిస్తుంది. రెండువందల మంది వికలాంగులతో ‘రామాయణ్ ఆన్ వీల్‌చైర్స్’ను ప్రపంచం నలుమూలలా ప్రదర్శిస్తున్నారు.

వికలాంగులకు నాట్యం నేర్పడం అంతే సులువేమీ కాదు అంటున్నారు పాషా. నాట్యం నేర్పడానికంటే ముందు తాను స్వయంగా వీల్‌ఛైర్‌లో కూర్చొని, నాట్యాన్ని నేర్చుకునేటప్పుడు వికలాంగులు ఎదుర్కొనే సమస్యలను పూర్తిగా అర్థం చేసుకున్నాడు. వారి ప్రవర్తనను కూడా గమనించేవాడు. ఆలస్యంగా నేర్చుకునే స్వభావం ఉన్నవారికి ‘ఫాస్ట్ రిథమ్’, చాలాచురుగ్గా ఉన్న వాళ్లకు ఫ్లూట్ నేర్పించి వాళ్ల స్వభావాలను సమన్వయపరిచేవాడు. సౌలభ్యం కోసం ప్రత్యేకమైన వీల్‌చైర్‌లను తయారుచేయించాడు. నాట్యంఅభ్యసించడానికి అంగవైకల్యం అవరోధం కాదని రుజువు చేసి పాషా తన కృషితో అసాధ్యాన్ని సుసాధ్యం చేశాడు.

కామెంట్‌లు లేవు: