1.వస్తా వట్టిది... పోతా వట్టిది! ఆశ ఎందుకంటా? చేసిన ధర్మము చెడని పదార్థము... చేరును నీవెంట..2.నువ్వు తినే ప్రతి ఒక మెతుకు ఈ సంఘం పండించింది గర్వించే ఈ నీ బ్రతుకు సమాజమే మలిచింది ఋణం తీర్చు తరుణం వస్తే తప్పించుకు పోతున్నావా తెప్ప తగలపెట్టేస్తావా ఏరు దాటగానే...

9, ఫిబ్రవరి 2011, బుధవారం

"నా" అని "నన్ను" అనుకునేవారి కోసం, నా కోసం ఆలోచించే వారి కోసం ...

(ప్రస్తుత) నా జీవిత లక్ష్యం "నా"   అని "నన్ను" అనుకునేవారి కోసం, నా కోసం ఆలోచించే వారి కోసం సమయాన్ని కేటాయించనివ్వక........నాతో కొత్తగా వచ్చి చేరుకుంటున్న, నాకు కొత్తగా పరిచయం అవుతున్న, నాతో పాటుగా ఇతరులకు సేవ చెయ్యాలని ముందుకు వస్తున్న వారికి ప్రేరణ ఇవ్వడం కోసం,వారిలో సేవ చెయ్యాలనే భావనలను పెంచడం కోసం వారికి ఎక్కువ సమయాన్ని కేటాయించేటట్టు చేస్తోంది.......

ఈ కొత్త పరిచయాల వరవడిలో నేను ఎటు పోతున్నానో నాకు ఖచ్చితంగా తెలుస్తున్నప్పటికీ ....పాట పరిచయాలను మరుస్తున్నానేమో, వారికి తక్కువ సమయాన్ని కేటాయిస్తున్నానేమో  అన్నభావనను, భావనలను కలుగచేస్తూ... నాలో నాకే, నాపై నాకే ఎన్నో సందేహాలను, అనుమానాలను రేకెత్తిస్తోంది......

ఇలాంటి భావన నా సన్నిహిత స్నేహితులకు నాపై కలగడంతో...నాలో బాధ, ఏమి చెయ్యాలో, చెప్పాలో తెలియని అయోమయ స్థితితో పాటు...ఇలా అయితే నాకు జీవితాంతం తోడుగా వుండే పరిచయాలు, స్నేహాలే ఉండవేమో అన్న అనుమానం కలుగుతోంది.

ప్రస్తుత నా పరిస్థితి ఎటు చూసిన స్నేహితులే, ఆప్యాయంగా పలకరించే వాళ్ళే...కాని ఎవ్వరూ దీర్గ కాలం పాటు నా వెన్నంటి వుండరేమో.....????

నా అడుగడుగులో వెన్నంటి, ప్రతి విషయాన్నీ పంచుకుంటూ ఉన్న, నా ఆశయాలు, ఆశలు, నడవడిక, ప్రవర్తనతో పాటు నన్ను అణువణువునా తెలిసిన పరిచయాలు, స్నేహాలు, మంచి మనసులు కూడా ఏదో ఒక సమయంలో నా ఈ స్థితిని, పరిస్థితిని నిర్లక్షపు భావనలుగా స్వీకరించి, అవకాసవాదిగా ఉహించి, నాకు వారు ఇచ్చిన, ఇస్తున్న అత్యంత విలువైన ప్రోత్సాహాన్ని ఇవ్వడం మానేస్తారేమో?....అలా చెయ్యడంలో తప్పు లేదు కూడా... ఎందుకంటే వారు నాపై చూపిస్తున్న ప్రేమాభిమానాలు, ఆప్యాయతలను, వారు నాకోసం వెచ్చిస్తున్న్నకాలాన్ని నేను వారికి తిరిగి వారు తృప్తి చెందేట్టుగా ఇవ్వలేకపోవచ్చు కాబట్టి.......

కాని నాతో ఇంత (కొంత) కాలం వెన్నంటి ఉండి, నా ఈ స్థితికి కారణమైన, నా లోని బలాలు, బలహీనతలు, లోపాలు తెలిసిన సహ్రుదయాలే నన్ను అర్ధం చేసుకోనలేకపోతే .....ఇక నేను ఇంకెవరికైనా అర్ధం అవుతాననే నమ్మకం నాపై నాకు కలుగుతుందా ? 

కష్టమే...

కానీ.....అన్నీ అశాశ్వతమైన ఈ లోకంలో, జీవితంలో, జీవనంలో...ప్రాణం ఉన్నంతలో నైన ఇతరుల సేవలో వుపయోగించాలనే లక్ష్యంతో.....వుపయోగిస్తున్నాననే భావనతో........వారు నన్ను అర్ధంచేసుకుంటారని, అర్ధం చేసుకొని తిరిగి నాతో పయనాన్ని కొనసాగిస్తారని ఆశిస్తూ..అలా నాకు నేను సర్దిచేప్పుకొంటూ... నా జీవిత లక్ష్యమైన ఇతరులకు సేవ చెయ్యడం అనే బ్రతుకు బాటలో ....జగమంత కుటుంబం నాది....ఏకాకి జీవితం నాది అనుకుంటూ ముందుకు పోవడం తప్ప నేనేమి చెయ్యగలను ?????

ఎవరైనా నన్ను భౌతికంగా వీడి దూరంగా వెళ్తున్న, వెళ్ళాలనుకున్నా....నా ఈ  స్తితికి కారణమైన ఏ ఒక్కరు నా హృదయాలయంలోనుంచి వెళ్ళే అవకాశమే లేదని...నా హృదయ మందిరంలో నా చివరి శ్వాస వరకు కొలువుంటారని మనవి చేసుకుంటూ...అలంటి అన్ని సహ్రుదయాలకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుకుంటూ.......మీ శ్రీనివాస్ / ప్రసాద్

నా అనంతరంగం ................అమ్మ శ్రీనివాస్ ....

కామెంట్‌లు లేవు: