'అవతల టైమ్ అయిపోతుంటే... అంత నిదానంగా నడుస్తావేం... త్వరగా పద...', 'నా ఫైల్సూ, పర్సూ ఏమయ్యాయ్?...' అంటూ హడావుడి పెట్టేస్తుంటారు కొందరు. ఇలాంటి వ్యక్తుల్ని మనచుట్టూ చూస్తూనే ఉంటాం. మీరూ ఆ కోవకే చెందుతారా? చెక్ చేసుకోండి.
1. ప్రతి పనిని త్వరగా చేయాలని హడావుడి పడిపోతుంటారు. ఆ పని కాకపోతే కోపంతో కుటుంబ సభ్యులపై విరుచుకుపడతారు.
ఎ. అవును
బి. కాదు
2. చాలా త్వరగా గమ్యస్థానాన్ని చేరుకోవాలని వేగంగా నడవటం లేదా వాహనాన్ని స్పీడుగా నడపడం చేస్తారు.
ఎ. అవును
బి. కాదు
3. ఎదుటివారు చెప్పేది వినకుండా నాన్స్టాప్గా మాట్లాడుతుంటారు.
ఎ. అవును
బి. కాదు
4.మీరు ప్రయాణం చేస్తున్న బస్సు లేదా ఆటో ట్రాఫిక్లో ఆగిపోతే త్వరగా పొమ్మని డ్రైవర్ మీద మండిపడతారు.
ఎ. అవును
బి. కాదు
5.మరచిపోయిన విషయాలను జ్ఞప్తికి తెచ్చుకోవాలంటే మీకు చాలా చికాకు.
ఎ. అవును
బి. కాదు
6.{పతి విషయానికి కంగారుపడవద్దని మీ స్నేహితులు, తల్లిదండ్రులు, తెలిసినవాళ్లు మీతో తరచూ చెబుతుంటారు.
ఎ. అవును
బి. కాదు
7.డాక్టర్ దగ్గరకో, ఇంటర్వ్యూకో వెళ్లినప్పుడు రిసెప్షన్ కౌంటర్ దగ్గర కుర్చీలో కుదురుగా కూర్చోలేరు. అక్కడ నిరీక్షించాల్సి వస్తే హడావుడిగా అటు ఇటు తిరుగుతూ కాలక్షేపం చేస్తారు
ఎ. అవును
బి. కాదు
8.మీ కెరీర్లో సస్పెన్షన్లు, సంజాయిషీలు ఉన్నాయి.
ఎ. అవును
బి. కాదు
9.{పయాణాల్లో బస్సులు, రైళ్లు మిస్ అవడం, వాటిని అందుకునేందుకు పరుగెత్తి కింద పడిపోవడం లాంటి అనుభవాలు ఉన్నాయి.
ఎ. అవును
బి. కాదు
10.టాక్సీల్లో, ఆటోల్లో సామాన్లు మర్చిపోయి, ఇంటికొచ్చాక గుర్తుకొచ్చిన సందర్భాలు ఉన్నాయి.
ఎ. అవును
బి. కాదు
'ఎ' సమాధానాలు 7 దాటితే మీకు కంగారు ఎక్కువని అర్థం. 'బి' సమాధానాలు 6 దాటితే కంగారు పడకుండా మీ పనులను సక్రమంగా పూర్తి చేస్తారు.
Love all-Serve all
పరోపకారాయ ఫలంతి వృక్షాః! పరోపకారాయ వహంతి నద్యాః! పరోపకారాయ చరంతి గావః! పరోపకారార్థ మిదం శరీరం!!
This body is to serve the needy, as how the Trees, Rivers and Cows do...
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి