1.వస్తా వట్టిది... పోతా వట్టిది! ఆశ ఎందుకంటా? చేసిన ధర్మము చెడని పదార్థము... చేరును నీవెంట..2.నువ్వు తినే ప్రతి ఒక మెతుకు ఈ సంఘం పండించింది గర్వించే ఈ నీ బ్రతుకు సమాజమే మలిచింది ఋణం తీర్చు తరుణం వస్తే తప్పించుకు పోతున్నావా తెప్ప తగలపెట్టేస్తావా ఏరు దాటగానే...

14, ఫిబ్రవరి 2011, సోమవారం

నిద్రిస్తున్ననేటి తరాలు-ఏమవుతాయో తెలియని భావితరాలు-వెలియాలి ఎటు చుసిన హరిత వనాలు-నాటాలి ప్రతి ఒక్కరు పచ్చని చెట్లు - ఇవే ఇవే మన ప్రగతి కి మెట్లు

--------- Forwarded message ----------
Date: 2010/5/7



వాన కాలంలో మితిమీరిన ఎండలు
ఎండాకాలంలో ఎడతెరిపిలేని (అకాల) వర్షాలు
బీళ్ళు బారుతున్న పంటపొలాలు
తిండి లేక జనాల హా హా కారాలు

ఎటు చూసిన ఆకలి కేకలు
రైతుల ఆత్మహత్యలు
వీధిన పడుతున్న పచ్చటి కుటుంబాలు
అతి వృష్టి లేక అనావృస్టి వికృత చేష్టలు

ఏమిటీ వినాసపు పోకడలు
తెలియవా నీకు  కారణాలు ...
తెలుసుకోలేవా వినాశాకాలు..
అవే అవే....

చెట్లు/అడవుల నరికివేతలు
అనవసరపు విద్యుత్ కాంతుల జిలుగు వెలుగులు
ఆదా చేయలేకపోతున్న భూగర్భ జలాలు
ఇవే ఇవే కారణాలు..

మితి మీరుతున్న ఆధునిక పోకడలు
హద్దు మీరుతున్న విలాసాలు
మరుస్తున్న ప్రకృతి పరిరక్షణ భావాలూ
నిద్రిస్తున్న నేటి తరాలు
ఏమవుతాయో తెలియని భావితరాలు.....

మన వినాశనానికి మనమే ముఖ్య కారకాలు
మార్చుకో చిన్న చిన్న జీవన విధానాలు,
జీవితపు అలవాట్లు
సరిదిద్దుకో పొరపాట్లు

ఇవే ఇవే ప్రకృతి పరిరక్షణకు ఉత్ప్రేరకాలు
మనకు జీవితానికి మూలాధారాలు
వెలియాలి ఎటు చుసిన హరిత వనాలు- నాటాలి ప్రతి ఒక్కరు పచ్చని చెట్లు - ఇవే ఇవే మన ప్రగతి కి మెట్లు
 నా అనంతరంగం "అమ్మ" శ్రీనివాస్




కామెంట్‌లు లేవు: