గుర్తుంచుకో...!
కృశించిన ఈ దేహాన్ని వదిలి మరో కొత్త రూపంలోకి ప్రవేశించక తప్పదు, అది దైవ శాసనం...
భవ బంధాల నుంచి విముక్తిని ప్రసాదించే వరం, మరణం...
జనన మరణ చక్ర ప్రయాణం నుంచి ముక్తిని ప్రసాదించే భగవన్నామ స్మరణం ఈ మరణం...
ఎన్ని దేశాలు చూసినా, ఎన్ని మార్గాలలో పయనించినా...
భక్తి మార్గం చూడలేని కన్నులెందుకు, ముక్తి మార్గం చేరలేని పయనమెందుకు...?
ఎన్ని విద్యలు అభ్యసించినా, ఎన్ని లక్షలు సంపాదించినా...
లోకజ్ఞానం అభ్యసించలేని విజ్ఞానమెందుకు, లక్షణమైన లక్షణాలు లేని లక్షలెందుకు...?
ఒంటరిగా మనలోకి వచ్చిన ప్రాణం ఒంటరిగానే పోతుంది...
అమ్మ నాన్న, భార్యా భర్త, కొడుకు కోడలు, కూతురు అల్లుడు, మనవడు మనవరాలు అంతా మాయ...
ప్రాణం లేని దేహం విలువ లేనిది, చితిలో అస్తికలుగా మారేది...
ఆస్తి అంతస్తు, పరువు మర్యాద, మంచి చెడు, కష్టం సుఖం, మానవత్వం మనల్ని అమరత్వంలోకి తీసుకెల్లేవి...
మరణించేది మరలా జన్మించడానికే అన్నది ఎంత నిజమో...
జన్మించేది ఏదో ఒక రోజు మరణించడానికేనన్నది కూడా అంతే నిజం కాని...
జీవించిన ఈ జీవితంలో బారసాలకు కర్మకాండకు మధ్య, ఏమి సాధించామన్నదే ముఖ్యం...
ఎన్ని ఆస్తులు సంపాదించాం, ఎన్ని అంతస్తులు నిర్మించాం, ఎన్ని లక్షలు కూడపెట్టామన్నది ముఖ్యం కాదు...
జీవించినంత కాలం ఉన్న దానితో తృప్తిగా జీవించు, ఉన్నంతలో మనస్శాంతిగా జీవించు...
ఈ భూమి మీద ఎవ్వరు శాస్వతంగా ఉండేది లేదు, ప్రేమ ఒక్కటే శాస్వతంగా ఉండేది కనుక మానవత్వంతో అందరితో ప్రేమగా ప్రేమిస్తూ జీవించు...
ఆశాస్వామైనా ఈ ప్రాణాన్ని దైవం నీ నుంచి దూరం చేయవచ్చు కాని...
అనంతమైన ఈ ప్రేమను ఆ దైవం సైతం నీ నుంచి దూరం చేయలేదని గుర్తుంచుకో...!
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి