ధ్యానం చేసే పద్ధతి
Source: http://anapanasatimeditation.blogspot.com/
http://www.pssmovement.org/pss.htm
సుఖాసనంలో హాయిగా కూర్చొని, చేతులు రెండూ కలిపి, కళ్ళు రెండూ మూసుకుని, ప్రక్రుతిసహజంగా జరుగుతూన్న ఉచ్చ్వాస నిశ్వాసలనే ఏకధారగా, ఆహ్లాదంగా గమనిస్తూండాలి! మధ్య మధ్య అనేకానేక ఆలోచనలు వస్తున్నా, వాటిని ఎప్పటికప్పుడు 'కట్' చేస్తూ, మళ్ళి మళ్ళి శ్వాస మీదకే, ధ్యాసను మరల్చుతూ వుంటే, క్రమ క్రమంగా... ఆలోచనా రహిత స్థితి కలుగుతుంది. మనస్సు నిర్విషయం, శూన్యం అయిపోతుంది... అదే ధ్యాన స్థితి!
ఈ ఆలోచనా రహిత స్థితిలో కలిగే అనేకానేక శారీరక, నాడిమండల, ఆత్మానుభవాలను శ్రద్ధగా గమనిస్తూ వుండాలి. ఆ స్థితిలో శరీరం వెలుపల వున్న విశ్వమయ ప్రాణశక్తి... అపారంగా శరీరంలోకి ప్రవేశించి... నాడిమండలాన్ని శుద్ధి చేస్తుంది.
ధ్యాన లాభాలు
- బుద్ధి కుశలత
- జ్ఞాపక శక్తి
- ఏకాగ్రత
- పట్టుదల
- మనోస్థైర్యం
- ఆత్మవిశ్వాసం
- నిశ్చలత్వం
- పరస్పర అవగాహన
- ఆత్మానందం
- శరీరానికి- సంపూర్ణ ఆరోగ్యం
- మనస్సుకు- మానసిక ప్రశాంతత
- ఆత్మకు- ముక్తి
ఏ ప్రతిబంధకాలూ లేని స్వేచ్ఛా విహారమే ఆనందం !
ఏ తప్పొప్పుల్నీ ఎంచని భావ వ్యక్తీకరణ స్వేచ్చ యే ఆనందం !
ఏ తప్పునూ ఆపాదించుకోకుండా నిర్మలత్వంతో నిర్భయంగా ఉనికి స్థితిలో ఉండడమే ఆనందం !
స్వీయ నియమాలతో జీవితాన్ని స్వేచ్చ తో మనమే సృష్టించుకున్నామన్న ఎరుకే ఆనందం !
ప్రజ్ఞా పూర్వకమైన ఆత్మ పులకరింతే ఆనందం !
---- ఎస్. మాధవి , హైదరాబాద్
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి