ఏమి జీవితం రా …..
కాలేజి లో ఉన్నన్నాళ్ళు చదువులు ఎప్పుడు అయిపోతాయ్ , exams నుంచి విముక్తి ఎప్పుడు వస్తుంది , job లో డబ్బులు ఎప్పుడు సంపాదిస్తాం అని తొందర పడతాం . ఉన్న జాబును వదేలయసే ఈప్పుడు చూడు again job search లో నా .. నా తిప్పలు పడి కనపడిన ప్రతి company interview attend అయి , ఏదోలా job సంపాదిస్తాం .
Job join.
First month - no work.only enjoy - all happies
Second month - work + enjoy – ok
Third month - only work. no enjoy - problem starts
అప్పటికి office politics తెలుస్తాయ్ .
పక్క team లో manager మంచోడు అయుంటాడు .
పక్క team లో అమ్మాయిలు బావుంటారు .
పక్క team లో hikes బాగా ఇస్తారు .
పక్క team లో work అసలే ఉండదు .
మనకి మాత్రం రోజు festival..
చేసిన పనికి ... చెయ్యని పనికి దొబ్బించుకోవటమే . ఒక్కో client ఏమో పిచ్చి నా .. requirements ఇస్తాడు . అవి పని చెయ్యవు అని తెలిసి కూడా అలానే చెయ్యాలి . అర్ధ రాత్రి support లు . onsite వాడిని బూతులు తిట్టి పారిపోదాం అనిపిస్తుంది . కానీ office లో net connection free and coffee free అనే ఒక్క ఆలోచన ఆపేస్తుంది . మనకి ఒక batch తయారవుతుంది .
ప్రతి రోజు TL, AM, M's ని తిట్టుకుంటూ ఒక ఆరు నెలలు గడిపేస్తాం . ఇలా loop లో పెట్టి కొడితే రెండు ఏళ్ళు అయిపోతాయ్ . అప్పటికి కళ్ళ చుట్టూ black circles, వేళ్ళు వంకర్లు , మెడ నొప్పులు ... పిచ్చ నా .. జబ్బులు అన్ని వచ్చేసి ఉంటాయ్ . సొంత అమ్మ , నాన్న , అక్క , చెల్లి , అన్న , తమ్ముడి నే చుట్టం చూపుగా చూడటానికి వెళ్తుంటాం . ఒక వేళ bro/sis ఉంటే , వాళ్ళే .. s/w field లో ఉంటే .. అర్ధం చేసుకొని తిట్టటం మానేస్తారు . అలా లేకపోతే phone చేసిన ప్రతిసారి సంజాయిషీ .
salary పడుతూ ఉంటుంది . bonds కి అని , mutual funds కి అని , credit card bills కి అని కట్టి కట్టి .. సంపాదించింది అంతా ధార పోస్తాం . ఇంకేమన్నా మిగిలితే తెలివైనోడు అయితే home loan మీద , మనలాంటి వాడు అయితే గాలి తిరుగుడు మీద తగలేసేస్తాం .
ఇలా జీవితం ప్రశాంతంగా సాగుతూ .. ఉండగా one fine day ఎవడో ఒక ex-colleague / colleague పెళ్లి settle అయింది అని పిలుస్తాడు . మనకి ఒక అమ్మాయ్ ఉంటే బావుండు అనే ఒక వెర్రి ఆలోచన పుడుతుంది . మన s/w field లో బావున్న అమ్మాయిలు అంతా booked, married or north indians అయి ఉంటారు . అక్కడే వంద లో 95 మంది filter అయిపోతారు . మిగతా ఐదు లో 4 మందిని "friend" కంటే అక్కా .. అని పిలవటం better అనేటట్టు ఉంటారు . ఆ మిగిలిన ఒక్క అమ్మాయ్ కోసం team అంతా కొట్టేసుకుంటూ ఉంటాం . ఆ అమ్మాయ్ ఎవరితోనూ commit అవ్వకుండానే అందరితో free గా బతికేస్తూ .. ఉంటుంది . One more fine day పెళ్లి card ఇస్తుంది . ఇంకేముంది Heart breaking లా దేవదాస్ లా గడ్డం పెంచేసుకొని .. ఆ అమ్మాయి మంచిది కాదు అని deciding. next day నుంచి ఇంకొకళ్ళకి trying.
Reviews వస్తాయ్ . " నువ్వు excellent, నువ్వే లేనిదే company లేదు , కత్తి , కేక , కమాల్ , etc, etc ... " అని చెప్పి ఊరించి చివర్లో .. "but" అంటారు . తీరా చూస్తే నీ salary లో ఇంకో సనక్కాయ్ పెంచాం , పో .. అంటారు . Resume update cheyyali అని గత ఆరు నెలలు గా తీస్కుంటున్న decision ని మళ్ళా ఒకసారి స్మరించుకుని .. అలా ఇచ్చిన సనక్కాయల మీద బతికేస్తుంటాం .
… ఛీ .. ఎదవ జీవితం !!!
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి