1.వస్తా వట్టిది... పోతా వట్టిది! ఆశ ఎందుకంటా? చేసిన ధర్మము చెడని పదార్థము... చేరును నీవెంట..2.నువ్వు తినే ప్రతి ఒక మెతుకు ఈ సంఘం పండించింది గర్వించే ఈ నీ బ్రతుకు సమాజమే మలిచింది ఋణం తీర్చు తరుణం వస్తే తప్పించుకు పోతున్నావా తెప్ప తగలపెట్టేస్తావా ఏరు దాటగానే...

19, మే 2011, గురువారం

షట్చక్రములు



Posted: 18 May 2011 08:49 PM PDT
షట్చక్రాలు అని మనం వినేఉంటాం. వాటి గురించి కూడ తెలుసుకొందాం. మాములుగా అంటూంటారు బాగా యోగ సాధనచేసేవారికి తప్ప అలాంటివి అర్ధంకావు అని. అది నిజమే సుమా, సాధన చేసేవారు ఆ చక్రాలను అనుభవించగలరు. కనీసం ఆ చక్రాల పేర్లెంటో అవి ఎక్కడ ఉంటాయో తెలుసుకొందాం. అందులో తప్పులేదు కదా.

"మూలాధారం గుదస్థానం, స్వాదిస్ఠానం తు మేహనం

నాభిస్థు మణిపూరాఖ్యాం, హృదయాబ్జ మనాహతం

తాలుమూలం విశుద్దాఖ్యం, ఆఙ్ఞాఖ్యం నిటలాంబుజం
సహస్రారాం బ్రహ్మరంధ్ర ఇత్యాగమ విదోవిదుః "
వీటిని ఊర్ద్వలోక సప్తకమంటారు.

షట్చక్రములు : మూలాధారం. స్వాదిస్ఠానం, మణిపూరకం, అనాహతం, విశుద్దం, ఆఙ్ఞాచక్రం, సహస్రారం.

7. సహస్రారం -- సత్యలోకం -- పరమాత్మస్థానం
6. ఆఙ్ఞాచక్రం -- తపోలోకం -- జీవాత్మస్థానం
5. విశుద్దం -- జనలోకం -- ఆకాశభూతస్థానం
4. అనాహతం -- మహ్ర్లోకం -- వాయుభూతస్థానం
3. మణిపూరకం -- సువర్లోకం -- అగ్నిభూతస్థానం
2. స్వాదిస్ఠానం -- భువర్లోకం -- జలభూతస్థానం
1. మూలాధారం -- భూలోకం -- పృధ్విభూతస్థానం



మూలాధారం:
మలరంధ్రానికి 2అంగుళాల పై భాగంలో ఉంటుంది. దీనిరంగు ఎర్రగా రక్తవర్ణంలో ఉంటుంది. 4రేకులు కల తామరపువ్వు ఆకారంలో ఉంటుంది. ఈ చక్రానికి అధిపతి గణపతి, వాహనం ఏనుగు.

స్వాధిష్టానం :
ఇది జననేద్రియం వెనుక భాగాన, వెన్నుముకలో ఉంటుంది. అధినేత బ్రహ్మ, తత్వం జలం. సింధూరవర్ణంలో ఉంటుంది, 6 రేకుల పద్మాకారంలో ఉంటుంది. వాహనం మకరం.

మణిపూరకం : బొడ్డునకు మూలంలో వెన్నుముకయందు ఉంటుంది. అధిపతి విష్ణువు, 10 రేకుల పద్మాకారంలో, బంగారు వర్ణంలో ఉంటుంది, వాహనం కప్ప.

అనాహత చక్రం : హృదయం వెనుక వెన్నుముకలో ఉంటుంది. అధిదేవత రుద్రుడు, 12 రేకుల తామరపువ్వు వలె నీలం రంగులో ఉంటుంది. తత్వం వాయువు, వాహనం లేడి.

విశుద్ధచక్రం : కంఠం యొక్క ముడియందు ఉంటుంది. అదిపతి జీవుడు, నలుపురంగులో ఉంటుంది. తత్వం ఆకాశం, వాహనం ఏనుగు.

ఆఙ్ఞాచక్రం : రెండు కనుబొమ్మల మధ్యలో భ్రుకుటి స్థానంలో ఉంటుంది. అధిపతి ఈశ్వరుడు, రెండుదళాలు గల పద్మాకారంలో, తెలుపు వర్ణంలో ఉంటుంది.

సహస్రారం : కపాలం పై భాగంలో, మనం మాడు అని పిలిచేచోట ఉంటుంది. దీనినే బ్రహ్మరంధ్రం అంటారు. అధిపతి పరమేశ్వరుడు, వేయిరేకుల పద్మాకృతిలో ఉంటుంది. సుషుమ్నా నాడి పై కొన మీద ఈ చక్రం ఉంటుంది. దీనికి ఫలం ముక్తి.







కామెంట్‌లు లేవు: