1.వస్తా వట్టిది... పోతా వట్టిది! ఆశ ఎందుకంటా? చేసిన ధర్మము చెడని పదార్థము... చేరును నీవెంట..2.నువ్వు తినే ప్రతి ఒక మెతుకు ఈ సంఘం పండించింది గర్వించే ఈ నీ బ్రతుకు సమాజమే మలిచింది ఋణం తీర్చు తరుణం వస్తే తప్పించుకు పోతున్నావా తెప్ప తగలపెట్టేస్తావా ఏరు దాటగానే...

8, మే 2011, ఆదివారం

కనిపించే దైవం అమ్మ-నడిపించే నమ్మకం అమ్మ Happy Mothers Day


  

సృష్టి రహస్యం అమ్మ-నీ సృష్టి కర్త  అమ్మ,
ప్రేమకు ప్రతి రూపం అమ్మ-సృష్టిలో తియ్యని పదం అమ్మ,
నిస్వార్ధ సేవకు పర్యాయపదం అమ్మనిన్ను తీర్చి దిద్దే మొదటి గురువు అమ్మ


అలసిన మనసుకు ఓదార్పు  అమ్మ-నీ మనసు అలికిడిల తొలిపిలుపు అమ్మ
నీ మనసు అలజడుల తొలి వినికిడి అమ్మనీ మనసు అలజడుల తొలి పిలుపు అమ్మ
నీ ప్రాణానికి ప్రాణం అమ్మ - అమృతం అమ్మ


నీ ఆప్యాయతల తొలి చిట్టా అమ్మ-నీ అనుభూతుల ఆలంబన అమ్మ
నీ చిలిపి పనుల డైరీ అమ్మ-నీ చిరునవ్వుల చిరునామా అమ్మ
నీ కేరింతల తుళ్ళింత అమ్మ-నీ సావాసపు యద సడి అమ్మ


నీ గమ్యాల గమనం అమ్మ - నీ ఆశయాల అమ్ములపొది అమ్మ


ఇంటికి దీపం అమ్మ - నీ విజ్ఞాన జ్యోతులకు బీజం అమ్మ
కుటుంబ గవురవం అమ్మ-నిరాడంబరపు జీవితం అమ్మ
కుటుంబమనే నావకు చుక్కాని అమ్మ

ప్రేగుల పలకరింపు అమ్మ- అనుబందాల ఇందనం అమ్మ
త్యాగం అమ్మ-స్వచ్చతకు రూపం అమ్మ


నీ విలువైన సంపద అమ్మ - వెలకట్టలేని వజ్రం అమ్మ
నిను వీడని నేస్తం అమ్మ - నీ సరదాల సంబరాలు అమ్మ
సున్నితపు మందలింపు అమ్మ -నీ ఆయువు వాయువు అమ్మ


నీలి మేఘం అమ్మ-నిండు చంద్రుడు అమ్మ
పండు వెన్నల అమ్మ-పుడమి సహనం అమ్మ
చల్లగాలి అమ్మ - నును వెచ్చని గ్రీష్మం అమ్మ


ప్రకృతి ప్రతీక అమ్మ - పరమ పావని అమ్మ
కనిపించే దైవం అమ్మ-నడిపించే నమ్మకం అమ్మ
ఉమ్మపాల ఊపిరి అమ్మ - ఉగ్గుపాల లాలన అమ్మ


నీ తొలి పిలుపు అమ్మ- నీ తొలి పలుకు అమ్మ
నీ తొలి ప్రేమ అమ్మ-నీ తొలి అలక అమ్మ
నీ ఓదార్పు అమ్మ - నీ నిట్టూర్పు అమ్మ


నీ ఆనందం అమ్మ - నీ అనురాగం అమ్మ
నీ ఆహ్లాదం అమ్మ - నీ ఆప్యాయత అమ్మ
నీ ఉత్సాహం అమ్మ - నీకు ఊతం అమ్మ


నీ తప్పటడుగుల సర్దుబాటు అమ్మ-నీ తప్పుటడుగుల దిద్దుబాటు అమ్మ
అపాయాల ఉపాయం అమ్మ-నీ ధైర్యం అమ్మ-నీ స్థైర్యం అమ్మ
నీ పునాది అమ్మ-నీ భాధలకు బరోసా అమ్మ


నీ ఆకలి అమ్మ-నీ ఏడుపు అమ్మ
నీ ఆలోచనల అంతరంగం అమ్మ - నీ సర్వస్వం అమ్మ

అమ్మ అనురాగపు తొందర్ల వడిలో తేలియాడని మనిషి ఉండడేమో అంటే అతిశయోక్తి కాదేమో...నీ వ్యక్త పరచలేని భావాలను సైతం కనుగొనే తొలి శక్తి...నీ కోసం నీ కంటే ఎక్కువ ఆలోచించే, తపించే....ప్రేమించే వ్యక్తి..నీ పుట్టుక కోసం తన జీవితాన్నిఫణంగా పెట్టి, ఆనాటి నుండి తన తుది శ్వాస వరకు నిన్ను కంటికి రెప్పల చూసుకొనే "అమ్మ" అనే ఒక కనిపించే దైవాన్ని, నడిపించే నమ్మకానికి మనం ఏమి చేస్తున్నామో, ఎలా చూస్తున్నామో మనల్ని మనం ఒక్కసారి ప్రశ్నించుకుందాం....వారికీ తగిన గౌరవం ఇస్తున్నామా? ఆమె నిస్వార్ధ సేవకు మనం ఈనాడు, ఏనాడూ  ఏమి ఇచ్చినా  ఋణం తీర్చుకోలేం, ప్రేమని తిరిగి ఆమెకు పంచలేము.. అలాంటప్పుడు మన కనీస భాద్యతగా ఆమె సంతోషం ఉండేటట్టు చూసుకోవాలని కోరుకుంటూ.....  వారి నిస్వార్ధ సేవకు పాదాభి వందనం చేస్తూ "మీ అమ్మ శ్రీనివాస్ (నా అనంతరంగం)"







M... is for the million things she gave me, 

O... means only that she's growing old, 

T... is for the tears she shed to save me, 

H... is for her heart of purest gold; 

E... is for her eyes, with love-light shining, 

R... means right, and right she'll always be. 

Put them all together, they spell "MOTHER,"
A word that means the world to me





AMMA Srinivas

1 కామెంట్‌:

Amma Sreenivas చెప్పారు...

1 comments:

SAI చెప్పారు...

నీ పుట్టుక కోసం తన జీవితాన్నిఫణంగా పెట్టి, ఆనాటి నుండి తన తుది శ్వాస వరకు నిన్ను కంటికి రెప్పల చూసుకొనే "అమ్మ" అనే ఒక కనిపించే దైవాన్ని, అడగకుండానే ఆకాశమంత ప్రేమను అందిస్తుంది అమ్మ,

నీ వ్యక్త పరచలేని భావాలను సైతం కనుగొనే తొలి శక్తి...నీ కోసం నీ కంటే ఎక్కువ ఆలోచించే, తపించే అమ్మ నడిపించే నమ్మకానికి మనం ఏమి చేస్తున్నాము, వారికీ తగిన గౌరవం ఇస్తున్నామా?

ఒక్క రోజు బిడ్డ కనిపించకపోతే అల్లాడిపోయే అమ్మలు.. అనాధాశ్రమాల పాలవుతున్నారు

తమ బిడ్డల ఉన్నతికి అహర్నిశలు కృషి చేసిన మాతృమూర్తులు ఇప్పుడు అనాధల్లా మిగిలితున్నారు,

అన్నం పెట్టిన అమ్మ.. నాకు అన్నం పెట్టరా నాయనా అంటూ ప్రాదేయపడాల్సిన దుస్థితి ఏర్పడింది.

ఆఖరి రోజుల్లో ఆసరాగా ఉంటారనుకున్న కన్నబిడ్డలు ఆకాశంలో తేలిపోతూ అమ్మలను నిర్లక్ష్యం చేస్తున్నారు.. దీంతో ఆ తల్లి గుండె తల్లడిల్లిపోతోంది

కన్నబిడ్డలు చేరదీయకున్నా తమ బిడ్డలను వెనకేసుకొచ్చే ఆ అమ్మలకు హ్యాట్సాప్‌.. హ్యాట్సాప్‌..

lovelynani4u@gmail.com
8 మే 2011 1:14 సా