---------- Forwarded message ----------
From: Gurukrupa <gayathrisvr@gmail.com>
From: Gurukrupa <gayathrisvr@gmail.com>
Gurukrupa |
శ్రీవిష్ణు సహస్రనామము (38 - 55) Posted: 10 Jul 2011 06:20 PM PDT 38. పద్మనాభో రవిందాక్ష పద్మగర్భః శరీరబృత్ మహర్ధిః బుద్ధో వృధాత్మా మహాక్షో గరుడద్వజః పద్మనాభః = సూర్యుని వంటి దివ్య తేజస్సు కలవాడు అరవిందాక్షః = ఙ్ఞాన రూపములైన కన్నులు కలవాడు పద్మగర్భః = బ్రహ్మ శరీరబృత్ = జగత్తునకు భర్త మహార్ధిః = గొప్ప అభివృద్ధి కలవాడు బుద్ధః = ఙ్ఞానమాది గుణములు కలవాడు వృద్ధాత్మా = విశ్వరూపి మహాక్షః = పెద్ద కన్నులు కలవాడు గరుడద్వజః = గరుత్మంతుడిని ద్వజముగా కలవాడు 39. అతుల శ్శరభో భీమ స్సమయఙ్ఞో హవిర్హరిః సర్వలక్షణ లక్షణ్యో లక్ష్మీవాన్ సమితింజయః అతులః = సాటిలేనివాడు శరభః = త్రిపుర సమ్హార కాలమున శివునకు బాణం ఐనవాడు భీమః = దుష్టజన భయంకరుడు సమయఙ్ఞః = శాస్త్రములను తెలుసుకొన్నవాడు హవిర్హరిః = ఆహుతులను హరించువాడు సర్వలక్షణ లక్ష్యణ్యః = సర్వ లక్షణములు కలిగిననూ, గుర్తింప దగనివాడు లక్ష్మీవాన = లక్ష్మిని కలిగినవాడు సమితిం జయః = యుద్ధమునందు గెలుచువాడు 40. విక్షరో రోహితో మార్గో హేతు ర్ధామోదరః సహః మహీధరో మహాభాగో వేగవా నమితాశనమః విక్షరః = నాశములేనివాడు రోహితః = ఎర్రని వర్ణము కలవాడు మార్గః = భక్తులకు మోక్షమార్గమును చూపువాడు హేతుః = జగత్తుకు కారణమైన వాడు దామోదరః = దానము చేయువారికి సంతోషమును కలిగించువాడు సహః = అన్నింటినీ సహించువాడు మహాభాగః = గొప్ప కాంతికల మందర/గోవర్ధన పర్వతములను కలవాడు వేగవాన్ = గజేంద్రుడు మొదలగు భక్తులను కాపాడుతలో వెగము కలవాడు అమితాశనః = మితముగా భుజింపనివాడు 41. ఉధ్బవః క్షోభణో దేవః శ్రీగర్భః పరమేశ్వరః కరణం కారణం కర్తా వికర్తా గహనో గుహః ఉద్భవః = జన్మము లేనివాడు క్షోభణః = ప్రకృతి పురుషులను క్షోభింపచేయువాడు దేవః = స్తుతించుటకు తగినవాడు శ్రీగర్భః = లక్ష్మీ కారకుడు పరమేశ్వరః = గొప్పవాదైన ఈశ్వరుడు కరణం = బలమును, సుఖమును కరతలామలకముగా ఉన్నవాడు కారణం = జగమునకు కారకుడు కర్తా = అన్నింటిని చేయువాడు వికర్తా = వివిధములైన పనులు చేఉవాడు గహనః = తెలుసుకొనుటకు వీలులేనివాదు గుహః = సమరూపమును దాచువాడు 42. వ్యవసాయో వ్యవస్థానః సంస్థానః స్థానదో ధ్రువః పరర్ధిః పరమస్పష్టః తుష్టః పుష్టః శుభేక్షణః వ్యవసాయః = నిశ్చయము కలవాడు వ్యవస్థానః = దేవతలను అనుగ్రహించువాడు సంస్థానః = భక్తులకు ప్రాణభూతుడు స్థానదః = భక్తులకు వైకుంఠాది స్థానములను ఇచ్చువాడు ధ్రువః = స్థిరముగా, నిశ్చలముగా ఉండుట వలన ధ్రువుడు పరర్ధిః = ఎతరుల అభివృద్ధి కాంక్షించువాడు పరమస్పష్టః = పరముడును, అవ్యక్తుడును అయినవాడు తుష్టః = భక్తుల సేవకు సంతసించువాడు పుష్టః = జీవులను పోషించువాడు సుభేక్షణః = సుభమైన చూపులు కలవాడు 43. రామో విరామో విరజో మార్గో నేయో నయో నయః వీరః శక్తిమతాం శ్రేష్టో ధర్మో ధర్మ విదుత్తమః రామః = రమింపచేయువాడు విరామః = విశిష్టమైన లక్ష్మి కలవాడు విరజః = రజో గుణము లేనివాడు మార్గః = సింహ ముఖము కలవాడు, నరసింహుడు నేయః = ఉపదేశరూపమున భక్తులను చేరువాడు నయః = తానే ఉత్తముడు అగుటవలన వేరోచోటకి పొవలసినపనిలేనివాడు అనయః = వాయు సంచాలకుడు వీరః = పరాక్రమవంతుడు శక్తిమతాంశ్రేష్టః = మిక్కిలి శక్తిమంతుడు ధర్మః = ధర్మగుణం కలిగినవాడు ధర్మవిదుత్తమః = ధర్మము తెలిసినవారిలో ఉత్తముడు 44. వైకుంఠః పురుషః ప్రాణః ప్రాణదః ప్రణవః పృధూః హిరణ్యగర్భ శ్శతృఘ్నో వ్యాప్తో వాయు రధోక్షజః వైకుంఠః = వైకుంఠములో ఉండువాడు పురుషః = పూర్ణుడు ప్రాణః = ఙ్ఞానము కలవాడు ప్రాణదః = దుఖములను ఖండించువాడు ప్రణవః = మిక్కిలి నూతనమైనవాడు పృధూః = ప్రఖ్యాతమైనవాడు హిరణ్యగర్భః = హిరణ్యరూపమగు బ్రహ్మాండమును గర్భమునందు కలవాడు శతృఙ్ఞః = శతృవులను చంపువాడు వ్యాప్తః = గరుడుని వాహనముగా కలవాడు వాయుః = బంధించువాడు అధోక్షజః = వసుదేవాదులనుండి పుట్టినవాడు 45. ఋతు స్సుదర్శనః కాలః పరమేష్ఠీ పరిగ్రహః ఉగ్ర స్సంవత్సరో దక్షో విశ్రామో విశ్వదక్షిణః ఋతుః = మోక్ష సాధకుడు సుదర్శనః = చక్రము కాలః = కాలుడు పరమేష్ఠీ = హృదయాకాశమునందు ఉండువాడు పరిగ్రహః = హరిభక్తులను అనుగ్రహించువాడు ఉగ్రః = బ్రహ్మాదులను సంతసపరచువాడు సంవత్సరః = తనకు కుమారులైన బ్రహ్మాదులను ఆనందపరచువాడు దక్షః = రాక్షసులు విశ్రామః = శ్రమలేనివాడు విశ్వదక్షిణః = జగత్ సృష్టి మొదలగు కార్యములందు కుశలుడైనవాడు 46. విస్తార స్స్థావర స్స్థాణుః ప్రమాణం బీజమవ్యయం అర్ధో నర్ధో మహాకోశో మహాభోగో మహాధనః విస్తారః = లోకములను విస్తరింపచేయువాడు స్థావరః = బ్రహ్మాదులకంటే ఉత్తముడు స్థాణుః = రుద్రునికి అంతర్యామిగా ఉండువాడు ప్రమాణం = ప్రకృష్టములైన, ఇహ, పర రెండు రూపములైన సుఖములు కలవాడు బీజం = తనకు తాను వ్యక్తమయ్యెవాడు అవ్యయం = నాశరహితుడు అర్ధః = భక్తులచేత తెలుసుకొనబడువాడు అనర్ధః = అయోగ్యులకు కీడును ఇచ్చువాడు మహాకోశః = గొప్ప ధనము కలవాడు మహాభోగః = పూర్ణమైన ఆనందం కలవాడు మహా ధనః = ఎక్కువైన ధనము కలవాదు 47. అనిర్విణ్ణ స్స్థవిష్ణో భూర్ధర్మయూపో మహామఖః నక్షత్ర నేమి ర్నక్షత్రీ క్షమః క్షామః సమీహనః అనిర్విణ్ణః = ఙ్ఞానము ఆనందము కలవాడు స్థవిష్ణః = మిక్కిలి పెద్దవాడు అభూః = ఆధారము లేనివాడు ధర్మయూపః = ధర్మ - ధర్మసాధనమైన, యూపో - యఙ్ఞ సమయంలో బలిపశువును కట్టూ స్తంబమునకు హేతువు మహామఖః = వామనుడికి 3 అడుగులు కొలుచు సందర్భంలో ఆకాశము కూడ చాలలేదు, అందుకే కనుకనే మహామఖుడు అనగా వామనుడు నక్షత్రనేమిః = బ్రాహ్మణులకు ఆధారభూతుడు నక్షత్రీ = నక్షత్రములను నియమించువాడు క్షమః = నాశనము క్షామః = భూమిని స్వీకరించినవాడు వామనుడు సమీహనః = సర్వచైతన్యుడు 48. యఙ్ఞ ఇజ్యో మహేజ్యశ్చ కృతు స్సత్రం సతాంగతిః సర్వదర్శీ విముక్తాత్మా సర్వఙ్ఞో ఙ్ఞానముత్తమం యఙ్ఞ ఇజ్యః = యఙ్ఞము నందు కీర్తించబడువాడు మహేజ్యః = రాముడు క్రతుః = ఙ్ఞాన రూపం కలవాడు సత్రం = మంచివారిని రక్షించువాడు సతాంగతిః = సత్పురుషులకు ప్రాప్యుడు సర్వదర్శీ = అన్నీ విషయములను చూచువాడు విముక్తాత్మా = ఎవనిచేత జీవులు విముక్తి గావింపబడుదురో అతను సర్వఙ్ఞః = అన్ని విషయములు తెలిసినవాడు ఙ్ఞానముత్తమం =ఙ్ఞానముచేత ఆనందము కలిగించువాడు 49. సువ్రతః సుముఖః సూక్ష్మః సుఘొషః సుఖదః సుహృత్ మనోహరో జితక్రోధో వీరబాహు ర్విదారణః సువ్రతః = ఎవరిని గురించి సుముఖః = శోభాయమానమైన ముఖము కలవాడు సూక్షమః = సూక్ష్మరూపం కలవాడు సుఘొషః = సొభనమైన శబ్దము కలవాడు, పాంచజన్యశంఖము ధ్వని సుఖదః = మోక్ష సంబంధమైన ఆనందమును ఇచ్చువాడు సుహృత్ = మంచి హృదయము కలవాడు మనోహరః = భక్తుల మనసుచే ఆకర్షింపబడువాడు జితక్రోదః = అరిషడ్వర్గములను జయించినవాడు వీరబాహుః = ఎవని చేతులనుంది వీరులు ఉద్భవించెనో అతను విదారణః = ఙ్ఞానగమ్యుడు 50. స్వాపనః స్వవశో వ్యాపీ నైకాత్మా నైక కర్మకృత్ వత్సరో వత్సలో వత్సీ రత్నగర్భో ధనేశ్వరః స్వాపనః = ఙ్ఞానదాతా స్వవశః = ధనము తన వశమునందు కలవాడు వ్యాపీ = వ్యాపించి ఉండువాడు నైకాత్మా = అనేకులకు స్వామి నైకకర్మకృత్ = సృష్టి, స్థితి, లయ మొదలగు అనేక కర్మలు చేయువాడు వత్సరః = ఆవు, దూడలతో ఆడుకొన్నవాడు , కృష్ణుడు వత్సలః = భక్త వత్సలుడు వత్సీ = "శ్రీవత్స" అను పుట్టుమచ్చ కలవాడు రత్నగర్భః = రత్నములను గర్భమునందు కలవాడు ధనేశ్వరః = ధనమునకు ఈశుడు 51. ధర్మకృ ద్ధర్మ బ్ధర్మీ సదసత్క్షర మక్షరం అవిఙ్ఞాతా సహస్రాంశు విధాతా కృతలక్షణః ధర్మకృత్ = ధర్మమును చేయువాడు ధర్మగుప్ = భీముని అన్నయగు ధర్మరాజు ధర్మీ = నియమించువాడు. యముడు సదసత్క్షరం = యఙ్ఞశాలల యందు సోమపానము అందించువాడు అక్షరం = నాశరహితుడు అవిఙ్ఞాతా = సర్వఙ్ఞుడు సహస్రాంశుః = వెయ్యి కిరణములు కలవాడు విధాతా = పోషించువాడు కృతలక్షనః = పరిపూర్ణమైన లక్షణములు కలవాడు 52. గభస్తినేమిః సత్వస్థః సింహో భూత మహేశ్వరః ఆదిదేవో మహాదేవో దేవేశో దేవభృ ద్గురుః గభస్తినేమిః = కిరణములు చక్రము అంచువలే కలవాడు సత్వస్థః = జీవుని యందు అంతర్యామిగా ఉండువాడు సింహః = శ్రేష్ఠుడు భూతమహేశ్వరః = ప్రాణులకు ఈశ్వరుడు ఆదిదేవః = ఆరాధ్యుడు మహాదేవః = ప్రళయకాలమునందు జగత్తును తనలో లయం చేసుకొనువాడు దేవేశః = దేవతలకు ఈశ్వరుడు దేవభృత్ = గొప్ప తేజస్సు కలవాడు గురుః = ఉపదేశము ఇచ్చువాడు 53. ఉత్తరో గోపతి ర్గోప్తా ఙ్ఞానగమ్యః పురాతనః శరీరభూతభృ ద్భోక్తా కపీంద్రో భూరిదక్షిణః ఉత్తర = మిక్కిలి ఉత్త్కృష్టుడు, గొప్పవాడు గోపతిః = గో పాలకుడు గోప్తా = రక్షకుడు ఙ్ఞానగమ్యః = ఙ్ఞానము చేత చేరదగినవాడు పురాతనః = మిక్కిలి ప్రాచీనుడు శరీరం = శరీర-సకల భువనములు, శరీరం - భువనములన్ని ఇతని యందు క్రీడించుటవలన ఇతను శరీరుడు భూతభృత్ = ఙ్ఞాన ప్రకాశకుడు భోక్తా = అన్నింటినీ తినువాడు కపీంద్రః = వాలిని చంపినవాడు భూరిదక్షిణః = బంగారమును దక్షిణగా కలవాడు 54. సోమపో మృతపః సోమః పురు జిత్పురుసత్తమః వినయో జయః సత్యసంధో దాశార్హః సాత్వతాం పతిః సోమపః = సోమరసమును త్రాగువాడు అమృతపః = అమృతమును త్రాగువాదు సోమః = సౌమ్యుడు పురుజిత్ = అనేకమంది సతృవులను జయించినవాడు పురుసత్తమః = దేశ, కాలాతీతుడు కావున శోభించువాడు వినయః = దండించువాడు జయః = జయమును పొందువాడు సత్యసంధః = సత్యమును సాధించువాడు దాశార్హః = సుఖాది దానమునకు అర్హుడు సాత్వతాం పతిః = పాంచరాత్రిక దేవతలైన శ్రీదేవి మొదలగు 9 మూర్తులకు అధిపతి 55. జీవో వినయితా సాక్షీ ముకుందో మిత విక్రమః అంభోనిధి రనంతాత్మా మహోదధి శయోంతకః జీవః = జనులను జీవింపచేయువాడు వినయితా = విశేషముగా భక్తులను తన వద్దకు రప్పించుకొనేవాడు సాక్షి = బలవంతుడు ముకుందః = మోక్షమును ప్రసాదించువాడు అమితవిక్రమః = మితములేని పరాక్రమము కలవాడు అంభోనిధిః = విష్ణు లోకాదులు తనయందు కలవాడు అనంతాత్మః = అపరిమితములైన దేహములు కలవాడు మహోదధిశయః = క్షీర సాగరమునందు పరుండువాడు అంతకః = సేతువును నిర్మించినవాడు |
You are subscribed to email updates from Gurukrupa To stop receiving these emails, you may unsubscribe now. | Email delivery powered by Google |
Google Inc., 20 West Kinzie, Chicago IL USA 60610 |
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి