1.వస్తా వట్టిది... పోతా వట్టిది! ఆశ ఎందుకంటా? చేసిన ధర్మము చెడని పదార్థము... చేరును నీవెంట..2.నువ్వు తినే ప్రతి ఒక మెతుకు ఈ సంఘం పండించింది గర్వించే ఈ నీ బ్రతుకు సమాజమే మలిచింది ఋణం తీర్చు తరుణం వస్తే తప్పించుకు పోతున్నావా తెప్ప తగలపెట్టేస్తావా ఏరు దాటగానే...

9, జులై 2011, శనివారం

శ్రీవిష్ణు సహస్రనామము





శ్రీవిష్ణు సహస్రనామము (19 - 37)

Posted: 08 Jul 2011 12:14 PM PDT

19. మహా బుద్ధి ర్మహా వీర్యో మహాశక్తి ర్మహద్యుతిః
అనిర్దేశ్య వపుః శ్రీమాన్ అమేయాత్మా మహాధ్రి దృక్

మహాబుద్ధిః = గొప్ప బుద్ధి కలవాడు
మహావీర్యో = గొప్ప పరాక్రమము కలవాడు
మహాశక్తిః = గొప్ప శక్తి కలవాడు
మహాద్యుతిః = గొప్ప తేజము కలవాడు
అనిర్దేశ్యవపుః = వర్ణింపలేని ( నిర్దేశించలేని) శరీరము కలవాడు
శ్రీమాన్ = లక్ష్మీ సహితుడు
అమేయాత్మా = అవ్యక్తుడు
మహాద్రిధృక్ = గొప్పదియగు మందర / గోవర్ధన పర్వతమును ధరించినవాడు

20. మహేష్వాసో మహీభర్తా శ్రీనివసః సతాం గతిః
అనిరుద్ధ స్సురానందో గోవిందో గొవిదాం పతిః

మహేష్వాసః = గొప్పదైన అమ్ములపొది కలవాడు
మహీభర్తా = భూదేవి భర్త అయినవాడు
శ్రీనివాసః = లక్ష్మి నివసించును కనుకనే శ్రీనివాసము
సతాంగతిః = ఆత్మఙ్ఞానము కలవారికి శరణ్యుడు
అనిరుద్ధః = ఎవరిచేత ఆపుటకు వీలులేనివాడు
సురానందొ = సుర - ఙ్ఞానమును ఇచ్చువాడు, అనందో - ఆనందించువాడు
గోవిందో = గో - భూమి, బానము, గోవు, విందః - పొందువాడు
గోవిందాంపతిః = వేదములు తెలిసినవారికి, జలచరములకు పతి అగువాడు

21. మరీచి ర్దమనో హంసః సుపర్ణో భుజగోత్తమః
హిరణ్య నాభః సుతపాః పద్మనాభః ప్రజాపతిః

మరీచిః = ఇతని చేత తమొగుణము, చీకటి చంపబడుచున్నది
దమనః = దమనుడు అను రాక్షసుడిని సం హరించినవాడు
హంసః = దోషహీనుడు, సారవంతుడు కనుక హంసుడు
సుపర్ణః = ఆనందస్వరూపుడు
భుజగోత్తమాః = పాములలో శ్రేష్ఠమైన దానిని శయ్యగా గలవాడు / శేషశయనుడు
హిరణ్యనాభః = హిరణ్యుడు అను పేరు గల రాక్షసుడిని నాశనమొనరించినవాడు
సుతపాః = మంచి ఙ్ఞానము కలవాడు
పద్మనాభః = చతుర్ముఖుడిని బొడ్డు యందు కలవాడు
ప్రజాపతిః = ప్రజలకు అధిపతి

22. అమృత్యు స్సర్వదృక్ సింహః సంధతా సంధిమాన్ స్థిరః
అజో దుర్మర్షణ శ్శాస్తా విశృతాత్మా సురారిః

అమృత్యుః = మృత్యువులేనివాడు
సర్వదృక్ = అన్ని వైపులా చూచువాడు
సింహః = హింసను నశింపచేయువాడు
సంధాతా = బాగుగా ధరించువాడు
సంధిమాన్ = సుగ్రీవుడు, విభీషణుడు తో సంధి కుదుర్చుకొనడం వలన ఈ పేరు వచ్చింది
స్థిరః = అనాది, నిత్యుడు అగుటవలన స్థిరుడు
అజః = పుట్టుకలేని వాడు
దుర్మర్షణః = సహించుటకు శఖ్యము కానివాడు
శాస్తా = జగత్తును శాసించువాడు
విశ్రుతాత్మా = ప్రసిద్ధమైన స్వరూపము కలవాడు
సురారిః = రాక్షసులను సంహరించువాడు

23. గురుర్గురు తమోధామ స్సత్యః సత్యపరాక్రమః
నిమిషో నిమిష స్స్రగ్వీ వాచస్పతి రుదారధిః

గురువుః = ఉపదేశము చేయువాడు
గురుతమః = మిక్కిలు వ్యాప్తుడైనవాడు
ధామః = తేజోరూపం కలవాడు
సత్యః = సత్య, ధర్మములే రూపముగా కలిగినవాడు
సత్యపరాక్రమః = సత్యమైన పరాక్రమము కలిగినవాడు
నిమిషః = నిమి అను రాజునకు బలమును ఇచ్చినవాడు
అనిమిషః = కనురెప్పపాటు కాలం కూడ భక్తులను వదలకుండా కాపాడువాడు
స్రగ్వీ = స్రక్ – పూలదండ, అది కలవాడు స్రగ్వీ
వాచస్పతిః = వేదములకు అధిపతి
ఉదారధిః = దోషరహితమైన బుద్ధి కలవాడు

24. అగ్రణీ ర్ర్గామణిః శ్రీమాన్ న్యాయోనేతా సమీరణః
సహస్రమూర్ధా విశ్వాత్మా సహస్రాక్ష స్సహస్రపాత్

అగ్రణీః = మార్గదర్శి
గ్రామణీః = కర్మఫల ప్రదాత
శ్రీమాన్ = లక్ష్మీ సమేతుడు
న్యాయః = మిక్కిలి లాభము కలవాడు
నేతా = ప్రాణులకు యోగ్యమైన ఫలములు ఇచ్చువాడు
సమీరణః = లక్ష్మీదేవి చేత బాగుగా స్తుతింపబడువాడు
సహస్రమూర్ధా = వెయ్యి తలలు కలవాడు
విశ్వాత్మా = ప్రపంచమును నియమించువాడు
సహస్రాక్షః = వెయ్యి కనులు కలవాడు
సహస్రపాత్ = వెయ్యి పాదములు కలవాడు

25. ఆవర్తనోనివృతాత్మా సంవృత స్సంప్రమర్దనః
అహస్సంవర్తకో వహ్ని రణిలో ధరణీ ధరః

ఆవర్తనః = మేలైన నడవడిక కలవాడు
నివృతాత్మా = ప్రళయము ఎవరిచేత నివృతి చేయబడునో అతను
సంవృతః = గుణసంపూర్ణుడు
సంప్రమర్దనః = రాక్షసులను మర్ధించువాడు
అహస్సంవర్తకః = భక్తులను విడువనివాడు
వహ్నిః = జగత్తును వహించువాడు
అనిలః = ఇంకొకరి యందు తాను వినీలమగుట జరుగదు కనుక అతను అనిలుడు
ధరణీధరః = భూమిని ధరించువాడు

26. సుప్రసాదః ప్రసన్నాత్మా విశ్వధృ గ్విశ్వభు గ్విభుః
సత్కర్తా సత్కృతిః సాధుర్జహ్ను ర్నారాయణో నరహః

సుప్రసాదః = ఉత్తమమైన సుఖము కలవాడు
ప్రసన్నాత్మా = ప్రసన్నమైన మనస్సు కలవాడు
విశ్వధృక్ = విశ్వమును ధరించువాడు
విశ్వభుక్ = విశ్వమును అనుభవించువాడు
విభుః = వివిధ రూపుడుగా వ్యాపించినవాడు
సత్కర్తా = రాక్షశ నాశకుడు
సత్కృతిః = ఉత్తమమైన లక్షనములు కల "కృతి" అను భార్య కలవాడు
సాధుః = ఇతరుల కార్యములు సాదించువాడు
జహ్ను: = అయోగ్యులను విడుచువాడు
నారాయణః = నారమనగా మానవుల సమూహము, అవరిచే నమస్కరింపదగినవాడు
నరః = నిర్వికారుడు

27. అసంఖ్యేయో ప్రమేయాత్మా విశిష్టః శిష్టకృ చ్చుచిః
సిద్ధార్ధః సిద్ధసంకల్పః సిద్ధిధః సిద్ధిసాధనః

అసంఖ్యేయః = లెక్కింపలేని గుణములు కలవాడు
అప్రమేయాత్మా = కొలతకు అందని
విశిష్టః = విశేషముగా
శిష్టకృత్ = ఘటనాఘటనా సమర్ధుడు
శుచిః = పరిశుద్దుడు
సిద్ధార్ధః = ఈప్సితార్ధుడు
సిద్ధిసంకల్పః = భక్తుల కోరికలను తీర్చువాడు
సిద్ధిదః = యోగ్యులకు మోక్షమును ఇచ్చువాడు
సిద్ధిసాధనః = మోక్షరూపమైన ఫలమును ఇచ్చువాడు

28. వృషాహి వృషబో విష్ణు ర్వృషపర్వా వృషోదరః
వర్ధనో వర్ధమానశ్చ వివిక్తః శ్రుతిసాగరః

వృషాహి = ధర్మముచేత వ్యాపించువాడు
వృషభః = వర్షించువాడు
విష్ణుః = సంసారరూప ప్రవాహము లేనివాడు
వృషపర్వా = వృష – పుణ్యము, దనికి సాధనములైన అమావాశ్య మొదలగు పర్వములు కలవాడు
వృషోదరః = వృషొద – గంగోదకము, రః – ఇచ్చువాడు
వర్ధనః - అభివృద్ధి పరచువాడు
వర్ధమానః = నిత్యము అభివృద్ధి చేందువాడు
వివిక్తః = జగత్తు కంటే భిన్నుడు
శ్రుతిసాగరః = సృతిసా + ఆగరః – వేదములను ఇచ్చినవాడు

29. సుభుజో దుర్ధరో వాగ్మీ మహేంద్రో వసుదో వసుః
నైకరూపో బృహద్రూపః శిపివిష్టః ప్రకాశనః

సుభుజః = మనిచి భుజము కలవాడు
దుర్ధరః = ధరించుటకు అశక్యమైనవాడు
వాగ్మీ = మహావక్త
మహేంద్రః = గొప్పవాడైన ఇంద్రుడు
వసుదః = ధనము
వసుః = అన్నిచోట్ల నివసించువాడు
నైకరూపః = అనేకరూపములు కలవాడు
బృహద్రూపః = పెద్దరూపం కలవాడు
శిపివిష్టః = కష్ఠములయందు అగ్నిరూపంలో అంతర్యామిగా ఉండువాడు
ప్రకాశనః = భక్తులను ప్రకాశింప చేయువాడు

30. ఓజస్తేజో ద్యుతిధరః ప్రకాశాత్మా ప్రతాపనః
బుద్ధః స్పష్టాక్షరో మంత్రశ్చంద్రాంశు ర్భాస్కరద్యుతిః

ఓజస్తేజోద్యుతిధరః = పదావష్టంబనశక్తి, ప్రతాపము, ప్రకాశము కలవాడు
ప్రకాశాత్మా = ప్రకాశస్వరూపము కలవాడు
ప్రతాపనః = ఎక్కువగా వ్యాపించి ఉన్న నీటి సమూహమును ఆవిరి రూపమున తీసుకొనుపోవువాడు
బుద్ధః = అభివృద్ధినందినవాడు
స్పష్టాక్షరః = వేదప్రతిపాదకములైన అక్షరములు కలవాడు
మంత్రః = మననము చేత రక్షించువాడు
చంద్రాంశుః = చంద్రునకు తేజమును ఇచ్చువాడు
భాస్కరద్యుతిః = సూర్యునికి కాంతిని ఇచ్చువాడు

31. అమృతాంశూద్భవో భానుః శశబిందు స్సురేశ్వరః
ఔషధం జగతస్సేతుః సత్యధర్మ పరాక్రమః

అమృతాం సూద్భవః = అమృతమువంతి చంద్రుడి యొక్క కిరణములనుండి ఉద్భవించినవాడు
భానుః = ప్రకాశించువాడు
శశబిందువుః = శశుడు = సుఖస్వరూపుడు, బిందుః = ఙ్ఞాని
సురేశ్వరః = దేవతలకు ప్రభువు
ఔషధం = తాపత్రయాఙ్ఞులకు అవ్షది వంటివాడు
జగతస్సేతుః = సంసారసాగరమును దాటింపచేయువాడు
సత్యధర్మపరాక్రమః = సత్య ధర్మములు ఆచరించుటలో పరాక్రమము కలిగినవాడు

32. భూత భవ్య భవన్నధః పవనః పావనోనలః
కామః కామకృత్ కాంతః కామః కామప్రదః ప్రభుః

భూతభవ్యభవన్నధః = భూతములచేత, సంసారులచేత, అఙ్ఞానులచేత ప్రార్ధింపబడువాడు
పవనః = రాజపోషకుడు
పావనః = పవిత్రము చేయువాడు
అనలః = అనివార్యుడు
కామహ = కోరికను చంపువాడు
కామకృత్ = భక్తకామదుడు
కాంతః = రాక్షసులకు దుఖదాయకుడు
కామః = జనులచే కొరబడువాడు
కామప్రదః = కోరికలను తీర్చువాడు
ప్రభుః = ప్రకర్షముగా ఉండువాడు

33. యుగాదికృ ద్యుగావర్తో నైకమాయో మహాశనః
అదృశ్యో వ్యక్తరూపశ్చ సహస్రజి దనంతజిత్

యుగాదికృత్ = యుగములను విభజించి చూపువాడు
యుగావర్తః = యుగములను పునరావృతం చేయువాడు
నైకమాయః = అనేకమైన కోరికలు కలవాడు
మహాశనః = గొప్ప భోజనము కలవాడు
ఆదృశ్యః = కనపడనివాడు
అవ్యక్తరూపః = స్పష్టముగా లేని రూపం కలవాడు
సహస్రజిత్ = వెయ్యి మంది రాక్షసులను గెలుచువాడు
అనంతజిత్ = అనంతమైన వస్తువులను పొందువాడు

34. ఇష్టో విశిష్టః శిష్టేష్టః శిఖండీ నహుషో వృషః
క్రోధహా క్రోధ కృత్కర్తా విశ్వభాహు ర్మహీధరః

ఇష్టో = అందరికి ఇష్టమైనవాడు
విశిష్టః = భక్త శాసకుడు
శిష్టేష్టః = శిష్టులచేత పూజింపబడేవాడు
శిఖండీ = బాల్యమునందు శిఖను ముడి వేసినవాడు
నహుషః = రాక్షసులను బంధించువాడు
వృషః = భక్తుల ఇష్టమును వర్షించువాడు
క్రోధః = దయాస్వరూపుడు కావున క్రోధమును చంపువాడు
క్రోధకృత్ = హింస నుండి దూరము చేయువాడు
కర్తా = స్వతంత్రుడు
విశ్వబాహుః = వాయువును సృష్టించినవాడు
మహీధరః = భూమిని ధరించువాడు

35. అచ్యుతః ప్రధితః ప్రాణః ప్రాణవో వాసవానుజః
అపాం నిధి రధిష్ఠాన మప్రమత్తః ప్రతిష్ఠితః

అచ్యుతః = నాశము లేనివాడు
ప్రధితః = ప్రసిద్ధుడు
ప్రాణః = గొప్పవారిని తనలోకమునకు తీసుకొనిపోవువాడు
ప్రాణదః = ప్రాణములను ఇచ్చువాడు
వాసవానుజః = వాసవుని అనుజుడు – వామనుడు
అపాం నిధిః = దేవతలకు ఆశ్రయం ఐనవాడు
అధిష్ఠానం = జగన్మూలక కారకుడు
అప్రమత్తః = నిత్య జాగురుకుడు
ప్రతిష్ఠితః = ప్రతిష్ఠ కలవాడు

36. స్కందః స్కందధరో ధుర్యో వరదో వాయువాహనః
వాసుదేవో బృహత్భాను రాదిదేవః పురందరః

స్కందః = సంసార తాపత్రయమును శొషింపచేయువాడు
స్కందధరః = కుమారస్వామిని ధరించినవాడు
ధుర్యః = బరువును మోయువాడు
వరదః = మోక్షరూపమైన వరమును ఇచ్చువాడు
వాయువాహనః = వాయువును వాహనముగా కలవాడు
వాసుదేవః = వసుదేవుని కుమారుడు
బృహత్భానుః = సహస్ర కిరణములు కలవాడు
ఆదిదేవః = అన్నింటికి కారణమైనవాడు
పురందరః = శతృవును చీల్చువాడు

37. అశోక స్థారణః తారః శూరః శౌరి ర్జనేశ్వరః
అనూకూల శతావర్తః పద్మీ పద్మ నిభేక్షణః

అశోకః = శోకములేనివాడు
తారణః = సూర్యునికి సంబంధించినవాడు
తారః = తరింపచేయువాడు
శూరః = సుఖమును పెంచువాడు
శౌరిః = శూరుని వంశమునందు జనించినవాడు
జనేశ్వరః = జనులకు ఈశుడు
అనుకూలః = తీర్ధములందు, క్షేత్రములందు నివసించువాడు
శతావర్తః = దుష్టులకు కష్టకారకుడు
పద్మ = పద్మము కలవాడు
పద్మ నిభేక్షణః = పద్మ సమానమైన కనులు కలవాడు

శ్రీవిష్ణు సహస్రనామము (1-18)

Posted: 07 Jul 2011 08:14 PM PDT

1. విశ్వం విష్ణుర్వషట్కారో భూతభవ్య భవత్ ప్రభుః
భూతకృత్ భూతభృత్ భావో భూతాత్మా భూతభావనః

విశ్వం = విశ్వ - విశ్వమును, వం - వర్తింపచేయువాడు / నడిపించువాడు
వి+ష్ణుః = వి - విశేషముగా 3పాదములతో , ష్ణుః - వ్యాపించినవాడు.
వషట్కారః = ఐష్వర్యము, వీర్యము, యశస్సు, శ్రీ, ఙ్ఞానము, వైరాగ్యము అనే 6 ఎవనివద్ద ఉన్నవో అతనే వషట్కారుడు.
భూత + భవ్య + భవతాం + ప్రభుః = గడచిన, రానున్న, జరుగుచున్న కాలములకు ప్రభువు
భూతకృత్ = భూతములకు (ప్రాణులకు) వచ్చు ఉపద్రవములను చ్చేదించువాడు.
భూత + బృత్ = భూతములను (ప్రాణులను) భరించువాడు.
భావః = ప్రపంచమును ఉత్పాదింపచేయువాడు.
భూతాత్మా = భూ-భూమి యందు, త-వ్యాపించియున్న ఆత్మ / సర్వవ్యాపి
భూత భావనః = భూమియందు వ్యాపించిన కాంతి కలవాడు మరియు రక్షకుడు.

2. పూతాత్మా పరమాత్మాచా ముక్తానాం పరమాగతిః
అవ్యయః పురషః సాక్షీ క్షేత్రఙ్ఞో క్షరయేవచ

పూతాత్మా = పూత - పవిత్రులైన వారియొక్క, ఆత్మ - మనస్సు ఎవరివద్ద ఉండునో అతడే.
పరమాత్మా = పర - గొప్పదైన, మా - లక్ష్మీదేవి, ఆత్మా - కలవాడు, లక్ష్మీవంతుడు
ముక్తానాం పరమాగతిః = ముక్తులకు ఉత్తమమైన గమ్యస్థానమైనవాడు.
అవ్యయః = అవేః - సూర్యుని యొక్క , అయః - గమనము ఎవరివలనో అతను.
పురుషః = పుర్ - అందరికంటే ముందు, షః - నడచువాడు, నాయకుడిగా అందరిని నడిపించువాడు.
సాక్షీ = ప్రత్యక్షముగా చూచువాడు.
క్షేత్రఙ్ఞః = క్షేత్రము - భగవంతుడు ఉండు ప్రదేశము., ఙ్ఞః - తెలుసుకొన్నవాడు.
అక్షరః = క్షయము లేనివాడు.

3. యోగోయోగ విదాం నేతా ప్రధాన పురుషేశ్వరః
నారసింహ వపుః శ్రీమాన్ కేశవః పురుషోత్తమః

యోగః = యోగులచేత హృదయములందు ధ్యానింపబడువాడు
యోగ +విదాం + నేతా = యోగమనగా సమాధి, దానిని పొందినవారు యోగవిదులు(భక్తులు), వారిని "మొక్షం" అను ఫలమునకు చేర్చువాడు.
ప్రధాన పురుషేశ్వరః = ప్రధానమనగా ప్రకృతి, పురుషులనగా జీవులు, ఈ రెండింటికినీ ఈశ్వరుడైనవాడు.
నారసింహవపుః = నరుని యొక్క, సింహము యొక్క రూపము కలవాడు.
శ్రీమాన్ = లక్ష్మీదేవి కి ఆధారమైన వాడు / భర్త
కేశవః = కేశి అనే రాక్షసుడిని చంపినవాడు.
పురుషోత్తమః = పురుషులయందు ఉత్తముడు.

4. సర్వః శర్వః శివః స్థాణుః భూతాది ర్నిధి రవ్యః
సంభవో భావనో భర్తా ప్రభవః ప్రభురీశ్వరః

సర్వః = సర్వము వ్యాపించి ఉండటమువలన సర్వుడు
శర్వః = దుష్టులను శిక్షించువాడు
శివః = మంగళకరుడు
స్థాణుః = అణురూపంలో జగత్వ్యాపకమై ఉన్నవాడు.
భూతాది = భూతములకు కారణమైనవాడు.
నిధిః = నిధి వంటివాడు
అవ్యయః = సూర్యుని యందు నడచువాడు
సంభవః = గ్రహనక్షత్రములను వాని వాని గతులయందు ప్రవర్తింపచేయువాడు.
భావనః = భావ - అభిప్రాయము, నః - నడిపించువాడు, మనః ప్రేరకుడు
భర్తా = పోషించువాడు
ప్రభవః = జీవులను ఉద్ధరించువాడు
ప్రభుః = ప్ర - సర్వకార్యములందు, భుః - సమర్ధుడైనవాడు
ఈశ్వరః = శాసించు లక్షణము కలవాడు.

5. స్వయంభూ శ్శంభు రాదిత్యః పుష్కరాక్షో మహాస్వనః
అనాది నిధనో ధాతా విధాతా ధాతు రుత్తమః

స్వయంభూ = స్వయముగా అవతరించినవాడు
శంభుః = శం - ముఖమును, భుః - భావింపచేయువాడు
ఆదిత్యః = సూర్యుడు
పుష్కరాక్షో = కమలము వంటి కనులు కలవాడు
మహాస్వనః = ఘంభీరమైన కంఠధ్వని కలవాడు.
అనాది నిధనః = ఆది - ఆదియును, నిధనః = మరణము లేనివాడు
ధాతా = ధారణము చేయువాడు
విధాతా = వి - గరుడుడు, ధాతా = ఎవరికి వాహనమో అతను
ధాతురుత్తమః = ధాతుః - బ్రహ్మ కంటే, ఉత్తమః - ఉత్తమమైనవాడు

6. అప్రమేయో హృషీకేశః పద్మనాభో మరః ప్రభొః
విశ్వకర్మా మనుస్త్వష్టా స్థవిష్ఠః స్థవిరో ధ్రువః

అప్రమేయః = అన్ని అనికాని, ఇటువంటి గుణములు అని కాని కొలిచి చెప్పుటకు వీలులేని గుణములు కలవాడు
హృషీకేశః = తాను ఆనందభరితుడగుచూ, లక్ష్మీ, బ్రహ్మ, రుద్రులకు నియామకుడైనవాడు
పద్మనాభః = పద్మమును నాభి యందు కలవాడు
అమరప్రభుః = అమరుడైన మహాత్ముడు
విశ్వకర్మా = ఎవరివలన విశ్వము కర్మకలదిగా అగుచున్నదో
మనుః = ఙ్ఞానమే రూపముగా కలవాడు
త్వష్టా = తేజస్వరూపుడు
స్థవిస్ఠః = అన్నింటికంటే పెద్దవాడు
స్థవిరః = వృద్ధుడు
దృవః = స్థిరమైనవాడు

7. అగ్రాహ్యః శాశ్వతః కృష్ణో లోహితాక్షః ప్రతర్దనః
ప్రభూతః త్రిక కుబ్ధామ పవిత్రం మంగళం పరం

అగ్రా హ్యః = పూర్తిగా తెలుసుకొన వీలులేనివాడు
శాశ్వతః = ఎప్పుడూ ఒకేరూపం కలవాడు
కృష్ణః = అదుపులో పెట్టుట మొదలగు పనులచేత సకలలోకమును తనవైపు త్రిప్పువాడు
లోహితాక్షః = ఎర్రనైన కన్నులు కలవాడు
ప్రతర్దనః = శతృవులను శిక్షించువాడు
ప్రభూతః = ఊతః - గుణములచే వ్యాపించినవాడు, ప్రభు - సామర్ధ్యము కలిగినవాడు
త్రిక కుబ్ధామ = త్రిక - మూడు, కకుబ్ - దిక్కులు, ధామ - ఇల్లు గా కలవాడు
పవిత్రం = పవి - వజ్రాయుధం, త్రం - రక్షించువాడు
మంగళం = మంగళస్వరూపుడు
పరం = అన్ని ప్రానులకంటే ఉత్తమమైనవాడు

8. ఈశానః ప్రాణదః ప్రాణో జేష్ఠః శ్రేష్ఠః ప్రజాపతిః
హిరణ్యగర్భో భూగర్భః మాధవో మధుసూధనః

ఈశానః = లక్ష్మీదేవి కి సుఖము కలిగించువాడు
ప్రాణదః = ప్రాణములు ఇచ్చువాడు
ప్రాణః = ప్రకృష్టమైన చేష్ట కలవాడు
జేష్టః = గుణములచేతను, కాలముచేతను వృద్ధుడు
శ్రేష్టః = ప్రశస్తమైన వారిలో ప్రధముడు
ప్రజాపతిః = ప్రజలకు అధిపతి
హిరణ్యగర్భః = బ్రహ్మాండమును గర్భమునందు కలవాడు
భూగర్భః = భూమిని గర్భమునందు కలవాడు
మాధవః = మధువు యొక్క వంశానికి చెందినవాడు
మధుసూదనః = మధువు అను రాక్షసుడిని సంహరించినవాడు

9. ఈశ్వరో విక్రమీ ధన్వీ మేధావీ విక్రమః క్రమః
అనుత్తమో దురాధర్షః కృతఙ్ఞః కృతిరాత్మవాన్

ఈశ్వరః = ఈశ - ఈశ్వరుడు, బ్రహ్మ కంటే, వరః - శ్రేష్టుడు
విక్రమీ = విక్రమము కలవాడు
ధన్వీ = ధనువు కలవాడు
మేధావీ = తెలివి కలవాడు
విక్రమః = క్రము అంటే అడుగు వేయుత, విక్రమ అంటే పాద విక్షేపణం కలవాడు, వామనుడు
క్రమః = పదదేవత అను పేరు కలవాడు
అనుత్తమా = తనకంటే ఉత్తముడు లేనివాడు
దురాదర్షః = బయపెట్టుటకు వీలులేనివాడు
కృతఙ్ఞః = తనకు చేయబడు ఆరాధనలను తెలుసుకొను వాడు
కృతిః = ప్రయత్నరూపం కలిగి ఉండుట
ఆత్మవాన్ = నిత్యమూ ఆత్మ కలవాడు

10. సురేశః శరణం శర్మ విశ్వరేతా ప్రజాభవః
అహస్సం వత్సరో వ్యాలః ప్రత్యయః సర్వదర్శనః

సురేశః = సుర అంటే మంచి ప్రకాశం కలవారు సురులు, వారికి ఈశుడు సురేశుడు
శరణం = ఆస్రయం ఇచ్చువాడు
శర్మ = అశుభమును నశింపచేయువాడు
విశ్వరేతా = జగమునకు కారణభూతుడు
ప్రజాభవః = భగవత్భక్తులకు జన్మ లేకుండా చేయువాడు
అహః = మృత్యుంజయుడు
సంవత్సరః = ప్రతీ ప్రాణి హృదయమునందు అంతర్యామిగా నివసించువాడు
వ్యాలః = సతృవులను నివారించు సామర్ధ్యము కలవాడు
ప్రత్యయః = ఙ్ఞాన స్వరూపుడు
సర్వదర్శనః = అన్ని విషయములను చూచినవాడు

11. అజః సర్వేశ్వరః సిద్ధః సిద్ధి స్సర్వాది రచ్యుతః
వృషాకపి రమేయాత్మా సర్వయోగ వినిస్మృతః

అజః = జ - పుట్టుక, అ - లేనివాడు
సర్వేశ్వరః = అందరికి ఈశుడు
సిద్ధః = భక్త రక్షణకు సంసిద్దుడైనవాడు
సిద్దిః = నిరతిశయమైన రూపం కలిగినవాడు
సర్వాది = అన్నింటికీ కారణమగు వాడు
అచ్యుతః = నాశము లేనివాడు
వృషాకపిః = ధర్మము చేత దుఖమును దూరము చేయువాడు
అమేయాత్మా = పూర్తిగా తెలుసుకొనుట
సర్వయోగ = అన్ని యోగములు యెవరినుండి
వినిస్మృతః = ఆరంభమైనవో

12. వసుర్వసుమనాః సత్యః సమాత్మా సమ్మితః సమః
అమోఘః పుండరీకాక్షో వృషకర్మా వృషాకృతిః

వసుః = అంతటా నివసించువాడు
వసుమనాః = భక్తులు సంపర్పించు ధన, జల, ద్రవ్యములందు మనసు కలవాడు
సత్యః = సత్భావమును
సమాత్మా = లక్ష్మి యందు ఆత్మ కలవాడు, లక్ష్మీపతి
సమ్మితః = బాగుగా కొలవబడినవాడు
సమః = అన్ని రూపములయందు సమత్వము కలిగినవాడు
అమోఘః = జగత్తును సృష్టించడంలో సఫలుడు
పుండరీకాక్షః = పుండరీకము - పద్మము, అక్ష - కన్నులు
వృషకర్మా = ఎద్దులకు ముకుతాడు కట్టుట మొదలగు పనులు
[ నాగ్నజితి అను యువతిని వివాహమాడుటకై ఒకేసారి 7 ఎద్దులను లొంగతీసుకోవాల్సి వచినపుడు వాటినన్నింటికి ముకుతాడు వేసి ఆటకట్టించాడు. అలా వృషకర్ముడైనాడు ]
వృషాకృతిః = ఎద్దు ఆకృతి కలవాడు.

13. రుద్రో బహుశిరా బభ్రుః విశ్వయోనిః శుచిశ్రవాః
అమృతః శాశ్వతః స్థాణుః వరారోహో మహాతపాః

రుద్రః = భేరి మొదలగు వాద్యములకు శబ్దములనిచ్చువాడు
బహుశిరా = అధికమైన శిరస్సులు కలవాడు
బభ్రుః = జగత్తును భరించువాడు
విశ్వయోనిః = జగత్తే స్థానముగా కలవాడు
శుచిశ్రవాః = వినదగిన వానిని వినువాడు
అమృతః = అపరిమితమైన శాస్త్రము కలవాడు
శాశ్వతః = నిత్యుడు
స్థాణుః = అణువణువునా వ్యాపించి ఉన్నవాడు
వరారోహా = వర - గొప్ప, అరాణి - దోషములు కలవారు, హః - చంపువాడు
మహాతపాః = గొప్పదైన ఙ్ఞానము కలవాడు.

14. సర్వగః సర్వవిద్భానుః విష్వక్సేనో జనార్ధనః
వేదో వేద విదవ్యంగో వేదాంగో వేద విత్కవిః

సర్వగః = అన్ని విషయములు తెల్సినవాడు
సర్వవిద్ = సర్వమును పొందువాడు
భానుః = ప్రకాశించువాడు
విష్వక్సేనః = అన్ని దిక్కులకు సేనలను పంపువాడు
జనార్ధనః = జన - సముద్రంలో ఉండు ఒకజాతి రాక్షసులను సంహరించువాడు
వేదః = తెలియచేయువాడు
వేదవిత్ = వేదమును తెలుసుకొనినవాడు
అవ్యంగః = వి-గరుత్మంతుడు, అవి - గరుడునకు శతృవైన ఆదిశేషుడు, అంగః - అతనిమీద శరీరము కలవాడు. ఆదిశేషుడు
వేదాంగః = వేదాభిమానముగల దేవుళ్ళని అంగముగా కలవాడు
వేదవిత్ = వేదములను మత్సరూపమున బ్రహ్మదేవుడికి అందించినవాడు
కవిః = పొగడ దగినవాడు.

15. లోకధ్యక్షః సురాధ్య క్షో ధర్మాధ్యక్షః కృతాకృతః
చతురాత్మా చతుర్వ్యుహ శ్చతుర్ర్దంష్ట్ర శ్చతుర్భుజః

లోకధ్యక్షః = లోకములకు అధిపతి
సురాధ్యక్షః = సురులకు అధిపతి
ధర్మాధ్యక్షః = ధర్మమునకు అధిపతి
కృతాకృతః = కర్మ బంధము లేని ప్రదేశము ఎవని చేత సృష్టించబడునో అతను
చతురాత్మా = నేర్పుతో తిరుగువాడు
చతుర్వ్యుహః = వాసుదేవాది 4 సంఖ్యగల ఆత్మలు కలవాడు
చతుర్దంష్ట్రః = 4 కోరలు కలవాడు
చతుర్భుజః = 4 భుజములు కలవాడు

16. భ్రాజిష్ణుర్ భోజనం భోక్తా సహిష్ణు ర్జగదాదిజః
అనఘో విజయో జేతా విశ్వయోనిః పునర్వసుః

భ్రాజిష్ణుర్ = దీప్తిమంతుడు
భోజనం = అందరికి ఆధారభూతుడైనవాడు
భోక్తా = సమస్త పదార్ధములను భుజించువాడు
సహిష్ణుః = భక్తుల యొక్క అపరాధములు సహించువాడు
జగదాదిజః = జగమునకు మూలమైన చతుర్ముఖుడు ఎవని యందు పుట్టెనో అతను
అనఘః = పాపరహితుడు
విజయః = జయము కలవాడు
జేతః = జయమే శీలముగా కలవాడు
విశ్వయోనిః = ప్రపంచమునకు కారణభూతుడు
పునర్వశూః = మాటిమాటికి ద్రవ్యము ఎవరివలన వచ్చునో అతను

17. ఉపేంద్రో వామనః ప్రాంశు రమోఘః సుచిరూర్జితః
అతీంద్రః సంగ్రహః సర్గో ధృతాత్మా నియమో యమః

ఉపేంద్రః = ఇంద్రుని తమ్ముడు
వామనః = శతృనాశనం చేయువాడు
ప్రాంశుః = త్రివిక్రమ రూపంతో మిక్కిలి ఎత్తైనవాడు
అమోఘః = అమోఘమగు వాక్కు కలవాడు
శుచిః = శుద్ధమైనవాడు
ఊర్జితః = సారవంతమైన అన్నం కలవాడు
అతీంద్రః = ఇంద్రుడిని అతిక్రమించినవాడు
సంగ్రహః = భక్తులను సంగ్రహించినవాడు
సర్గః = సృష్టి చేయువాడు
ధ్రుతాత్మా = ధైర్యమైన మనస్సు కలవాడు
నియమః = నియంత్రణలోకి తెచ్చుకొనువాడు
యమః = నియమించువాడు

18. వేద్యో వైద్య సదా యోగి వీరహా మాధవో మధూః
అతీంద్రియో మహామాయో మహోత్సాహో మహాబలః

వేద్యః = తెలుసుకొనుదగినవాడు
వైధ్యః = భవసాగరములను తొలగించువాడు
సదాయోగి = కపిలాది రూపములతో ఎల్లపుడూ యోగాభ్యాసము చేయువాడు
వీరహ = వీ - విగతుడు, ఈర - వాయువు, హ - హరించువాడు
మాధవః = లక్ష్మిని కంపింప చేయువాడు
మధుః = సుఖరూపం కలిగినవాడు
అతీంద్రియః = ఇంద్రియములకు అతీతుడు
మహామాయో = లక్ష్మిని ప్రసాదించువాడు
మహోత్సాహః = జగత్తును సృష్టించుట మొదలగు వాని యందు ఉత్సాహము కలవాడు
మహాబలః = మహా బలశాలి

శ్రీవిష్ణుసహస్రనామము యొక్క అర్ధము

Posted: 08 Jul 2011 05:32 AM PDT

నేను చాలారోజులనుండి , తెలుగులో శ్రీవిష్ణుసహస్రనామము యొక్క అర్ధము కోసం వెతికాను. దేవుడి దయవల్ల నేను తెలుసుకోవాలి అనే విషయం ఈరోజుకి నాకు అందవచ్చింది. అది మీ అందరితో కూడా పంచుకుంటున్నాను. ఎక్కడైన పొరపాటున పదదోషం ఉంటే చెప్పండి...
You are subscribed to email updates from Gurukrupa
To stop receiving these emails, you may unsubscribe now.
Email delivery powered by Google
Google Inc., 20 West Kinzie, Chicago IL USA 60610




కామెంట్‌లు లేవు: