1.వస్తా వట్టిది... పోతా వట్టిది! ఆశ ఎందుకంటా? చేసిన ధర్మము చెడని పదార్థము... చేరును నీవెంట..2.నువ్వు తినే ప్రతి ఒక మెతుకు ఈ సంఘం పండించింది గర్వించే ఈ నీ బ్రతుకు సమాజమే మలిచింది ఋణం తీర్చు తరుణం వస్తే తప్పించుకు పోతున్నావా తెప్ప తగలపెట్టేస్తావా ఏరు దాటగానే...

22, జులై 2011, శుక్రవారం

శ్రీవిష్ణుసహస్రనామము (94-108)



---------- Forwarded message ----------
From: Gurukrupa <gayathrisvr@gmail.com>

Gurukrupa


శ్రీవిష్ణుసహస్రనామము (94-108)

Posted: 21 Jul 2011 04:21 AM PDT

94. విహాయసగతి ర్జ్యోతి స్సురుచి ర్హుతభు గ్విభుః
రవి ర్విరోచన స్సూర్య స్సవితా రవిలోచనః

విహాయసగతిః =గరుడుని ద్వారా నడక కలవాడు

జ్యోతిః=తేజ్యోమంతుడు
సురుచిః = మంచి కాంతి కలవాడు
హుతభుక్ = హోమము చేసిన హవిస్సును భుజించువాడు
విభుః= ఇతని వలన విశిష్టులుగా అగుచ్చున్నారు
రవిః = అవిఙ్ఞేయుడగుటవలన రవి
విరోచనః =విశిష్టములైన సూర్యాది ప్రకాశములు ఎవని వలన కలిగినవో అతను

సూర్యః = సురులచేత చేరదగినవాడు
సవితా = సృష్టించువాడు

రవిలోచనః = సుర్యుడిని కుడికన్నుగా కలవాడు


95. అనంతో హుతభుగ్భోక్తా సుఖదో నైకజో గ్రజః

అనిర్విణ్ణ స్సదామర్షీ లోకాధిష్ఠాన మద్భుతః

అనంతః = అంతము లేనివాడు
హుతభుగ్భోక్తా = తనను స్తుతించువారిని రక్షించువాడు

సుఖదః= సుఖమును ఇచ్చువాడు
నైకజః = పద్మములు ఏ వనమునందున్నవో అక్కడ నివసించువాడు

అగ్రజః = అగ్ర-సృష్టికి ముందుగా, జః-వ్యక్తమగువాడు
అనిర్విణ్ణః = శ్రమలేనివాడు

సదామర్షీ = సదా దైత్యాదులయందు కోపము కలవాడు
లోకాధిష్ఠానం = లోకమునకు ఆశ్రయమైనవాడు

అద్భుతః = ఆశ్చర్యమైన రూపము కలవాడు


96. సనాత్ సనాతనతమః కపిలః కపి రవ్యయః

స్వస్తిదః స్వస్తికృత్ స్వస్తి స్వస్తిభు క్స్వస్తి దక్షిణః


సనాత్ = సన-లాభమును, ఆతయతి-పొందించువాడు

సనాతన తమః = సన-లాభమును, ఆతన-పొందించువాడు, తమః - మిక్కిలి

కపిలః = కపి-హనుమంతుని, లః- దాసునిగా స్వీకరించినవాడు
కపిః = క-సుఖమును, పిః-అనుభవించువాడు

అవ్యయః = స్వర్గాది ప్రాపకుడు
స్వస్తిదః = భక్తుల కొరకు మంగళమును ఇచ్చువాడు
స్వస్తికృత్ = శోభనమైన సత్తను చేయువాడు

స్వస్తి = సుఖస్వరూపుడు

స్వస్తిభుక్ = సుఖమును భుజింపచేవాడు
స్వస్తి దక్షిణః = మంగళప్రదానమునందు కుశలుడు


97. అరౌద్రః కుండలీ చక్రీ విక్ర మ్యూర్జి తశాసనః
శబ్దాతిగ శ్శబ్దసహ శ్శిశిర శ్శర్వరీకరః

అరౌద్రః = కోపములేనివాడు
కుండలీ = మకర కుందలములు కలవాడు
చక్రి = సుదర్శన చక్రము కలవాడు
విక్రమీ = పరాక్రమశాలి
ఊర్జిత శాసనః = స్థిరమైన శాసనము కలవాడు

శబ్దాతిగః = శబ్దమును అతిక్రమించినవాడు

శబ్దసహః = భృగుమహర్షి మొదలగు భక్తుల చేత చేయబడిన బెదిరింపుల రూపమున ఉన్న శబ్దమును సహించువాడు
శిశిరః = చంద్రుని యందు రమించువాడు
శర్వరీకరః = శర్వరీ-రాత్రిని, కరః-సృష్టించువాడు

98. అక్రూరః పేశలో దక్షో దక్షిణః క్షమిణాంవరః

విద్వత్తమో వీతభయః పుణ్యశ్రవణకీర్తనః


అక్రూరః = క్రూరుడు కానివాడు
పేశలః = మనోహరుడు
దక్షః = సమర్ధుడు

దక్షిణః = కుశలుడు
క్షమిణాంవరః =క్షమ కలవారిలో శ్రేష్ఠుడు

విద్వత్తమః = అత్యంత ఙ్ఞాని

వీతభయః = భయములేనివాడు
పుణ్యశ్రవణకీర్తనః = ఎవని విషయంలో శ్రవణము,కీర్తనము పుణ్యమైనవో అతను


99. ఉత్తారణో దుష్కృతిహా పుణ్యో దుస్స్వప్న నాశనః

వీరహా రక్షణ స్సంతో జీవనః పర్యవస్థితః

ఉత్తారణః = సంసార సముద్రమును దాటించువాడు
దుష్కృతిహా = పాపులను చంపువాడు

పుణ్యః = ధర్మాదులను చెప్పువాడు

దుస్వప్ననాశనః = దఃస్వప్నములను నశింపచేయువాడు

వీరహా = విశేషముగా మద్యం సేవించువారిని చంపువాడు

రక్షణః = రక్షించువాడు
సంతః = దోషరహితుడు
జీవనః = బ్రతికించువాడు

పర్యవస్థితః = అన్నివైపులనుండి సర్వులను రక్షించువాడు

100. అనంతరూపో నంతశ్రీ ర్జితమన్యు ర్భయాపహః

చతురశ్రో గభీరాత్మా విదిశో వ్యాదిశో దిశః


అనంతరూపః = అపరిమిత రూపములు కలవాడు
అనంతశ్రీః = నాశరహితమైన స్వరూప సౌందర్యము కలవాడు
జితమన్యుః = కోపమును జయించేటంత ఙ్ఞానము కలవాడు
భయాపహః = భయమును తొలగించువాడు

చతురస్రః = చతుర-నేర్పరి, స్రః- కదులువాడు

గభీరాత్మా = లోతైన మనస్సు కలవాడు

విదిశః = ఙ్ఞానులకు ఆనందము ఇచ్చువాడు
వ్యాదిశః = గరుడాది సేవకులకు ఆనందమును ఇచ్చువాడు

దిశః = ధర్మస్వరూపుడు

101. అనాది ర్భూర్భువోలక్ష్మీ స్సువీరో రుచిరాంగదః

జననో జనజన్మాది ర్భీమో భీమపరాక్రమః

అనాదిః = వాయువునకు ప్రభువు
భూర్భువోలక్ష్మీః = యఙ్ఞగృహములందు ఉండువాడు
సువీరః = వాయువునకు దేవత్వమును కల్పించినవాడు

రుచిరాంగదః = మనోహరమైన రూపము కలవాడు
జననః = జనులను నడిపించువాడు
జనజన్మాదిః = సృష్టికర్త

భీమః = భయంకరుడు
భీమపరాక్రమః = భీముని పరాక్రమమునకు కారకుడు

102. ఆధారనిలయో ధాతా పుష్పహాసః ప్రజాగరః
ఊర్ధ్వగ స్సత్పధాచారః ప్రాణదః ప్రణవః పణః

ఆధారనిలయః = ఆ-అన్నివైపులనుంది, ధార-దేవేంద్రునిచే సృష్టింపబడిన వానధారలకు, నిలయః-గోపాలురకు ఆశ్రయమైనవాదు, గోవర్ధనధారి
ధాతా = ధారణము చేయువాడు

పుష్పహాసః = పువ్వువంటి నవ్వు కలవాడు
ప్రజాగరః = ప్ర-ఎక్కువగా, జాగరః-మెల్కొని ఉండువాడు.
ఊర్ధ్వగః = వైకుంఠాది లోకములందు ఉండువాడు

సత్పధాచారః = మంచిమార్గమునందు నడిపించువాడు

ప్రాణదః = మోక్షదుడు
ప్రణవః = 4రూపములయందుండు విష్ణువు యొక్క నామము
పణః = జనులచే స్తుతించబడువాడు

103. ప్రమాణం ప్రాణనిలయః ప్రాణభృ త్ప్రాణజీవనః

తత్త్వం తత్త్వవి దేకాత్మా జన్మ మృత్యు జరాతిగః

ప్రమాణం = ప్ర-ప్రకృష్టమైన, మానం-ఙ్ఞానము
ప్రాణనిలయః = ప్రాణమునకు ఆశ్రయుడు
ప్రాణభృత్ = ప్రాణములను భరించువాడు

ప్రాణజీవనః = ప్రాణములతో జనులను బ్రతికించువాడు

తత్త్వం = ఙ్ఞానస్వరూపుడు
తత్త్వవిదేకాత్మా = తత్త్వవిదుని కొరకు బలాదులను కలిగింపచేయువాడు
తత్త్వవిత్ = స్వస్వరూపమును తెలుసుకొన్నవాడు

ఏకాత్మా = ఏక-ముఖ్యమైన, ఆత్మా=స్వామి
జన్మమృత్యు జరాతిగః = జనన, మరణ, ముసలితనము వలన కలుగు సమస్త దోషములను దాటి ఉండువాడు

104. భూర్భువస్స్వస్తరు స్తారః సవితా ప్రపితామహః
యఙ్ఞో యఙ్ఞపతి రజ్వా యఙ్ఞాంగో యఙ్ఞవాహనః

భూర్భువస్సవస్తరః = భు,భువ,స్వర్గలోకములందుండు జనులను తరింపచేయువాడు
తారః = ఓంకారవాచ్యుడు
సవితా = సృష్టించుటవలన సవితా
ప్రపితామహః = పితామహుడనగా బ్రహ్మ, అతని తండ్రి అగుటవలన ప్రపితామహుడు

యఙ్ఞః = యఙ్ఞభోక్త అగువాడు
యఙ్ఞపతిః = యఙ్ఞములకు యజమాని

యజ్వా = యఙ్ఞము చేయువాడు

ఙ్ఞాంగః = యఙ్ఞమునకు ఉద్దేశ్యమైనవాడు యఙ్ఞవాహనః = యఙ్ఞము చేయువారిని నడిపించువాడు

105. యఙ్ఞభృత్ యఙ్ఞకృత్ యఙ్ఞీ యఙ్ఞభుక్ యఙ్ఞ సాధనః

యఙ్ఞాంతకృత్ యఙ్ఞగుహ్య మన్న మన్నాద ఏవచ


యఙ్ఞకృద్యఙ్ఞభృత్ = యఙ్ఞమందలి యజమానికి ఆహారుదాలను ఇచ్చి పోషించుదాతలను పోషించువాడు
యఙ్ఞభృత్ = యఙ్ఞమును భరించువాడు

యఙ్ఞకృత్ = యఙ్ఞమును చేయువాడు

యఙ్ఞీ = యఙ్ఞము కలవాడు
యఙ్ఞభుక్ = యఙ్ఞ ఫలమును అనుభవించువాడు

యఙ్ఞసాధనః = యఙ్ఞమునకు కావలసిన మంత్రాదికములు ఎవనినుండి వచ్చునో అతను
యఙ్ఞాంతకృత్ = యఙ్ఞ ఫలప్రదాత
యఙ్ఞగుహ్యం = యఙ్ఞము అను రహస్యమైన పేరు కల విష్ణువు

అన్నం = అన్నము అయినవాడు
అన్నాదః = అన్నమును భుజించువాడు


106. ఆత్మయోని స్స్వయంజాతో వైఖాన స్సామగాయనః

దేవకీనందన స్సృష్టా క్షితీశః పాపనాశనః


ఆత్మయోనిః = జీవులకు, బ్రహ్మకు కారణమైనవాడు
స్వయంజాతః = తనంతట తానుగా పుట్టినవాడు
వైఖానః = దేహానంతరం ఖననములేనివారు ముక్తులు, వారికి సంబంధించినవాడు వైఖనుడు
సామగాయనః = సామవేదముము పాడువాడు

దేవకీనందనః = దేవకీదేవి కుమారుడు

స్రష్టా = సృష్టి చేయువాడు

క్షితీశః = భూమికి రాజు

పాపనాశనః = పాపమును నశింపచేయువాడు

107. శంఖభృత్ న్నందకీ చక్రీ శార్ఙ్ఞ్గధన్వా గదాధరః
రధాంగపాణి రక్షోభ్య స్సర్వప్రహరణాయుధః

శంఖభృత్ = పాంచజన్యమును భరించువాడు
నందకీ = నందకము అను ఖడ్గమును కలవాడు
చక్రీ = సుదర్శన చక్రం కలవాడు
శార్ఙ్ఞ్గధన్వా = శార్ఙ్ఞ్గము అను ధనస్సు కలవాడు
గదాధరః = కౌమోదకి అను గదను ధరించినవాడు

రధాంగపాణి = రధాంగ-చక్రము, పాణిః-చేతియందు కలవాడు
అక్షోభ్యః = క్షోభింపచేయుటకు వీలుకానివాడు

సర్వప్రహరణాయుధః = శతృవులను శిక్షించుటకు కావలసిన ఆయుధములు కలవాడు


108. శ్రీ సర్వప్రహరణాయుధ ఓం నమ ఇతి
వనమాలీ గదీ శార్ఙ్ఞ్గీ శంఖీ చక్రీ చ నందకీ
శ్రీమాన్నారాయణో విష్ణు ర్వాసుదేవో భిరక్షతు (ఈ శ్లోకమును 3సార్లు చదువవలెను)
You are subscribed to email updates from Gurukrupa
To stop receiving these emails, you may unsubscribe now.
Email delivery powered by Google
Google Inc., 20 West Kinzie, Chicago IL USA 60610


కామెంట్‌లు లేవు: