ఈ రోజు ఒక సిటిజెన్ గా / ఇండియన్ గా నేను, మనం అందరం జన లోక్పాల్ ని ఎందుకు కోరు కుంటున్నామో. అసలు జన లోక్పాల్ కి గవర్నమెంట్ లోక్పాల్ కి వున్నా తేడాని తెలియని వారికి తెలియ పరచవలసిన అవసరం అందరిపైన వున్నది.
మన డిమాండ్ ఒక్కటే సింగెల్, ఇండిపెండింట్ & స్ట్రాంగ్ ఏంటి-కరప్షన్ సిస్టం
*** సింగెల్ ఏంటి-కరప్షన్ సిస్టం
ఈరోజు మనకు చాల ఏంటి-కరప్షన్ సంస్తలు ACB , CVC , CBI, Departmental Vigilance ... వున్నాయి కానీ వాటి మద్య సమన్వయం లేదు , వాటన్నిటిని ఒకే ఒక సింగెల్ ఏంటి-కరప్షన్ లోక్పాల్ సిస్టంలో మేర్జి చేయాలి. కానీ గవర్నమెంట్ లోక్పాల్ ఇది లేదు.
కానీ జన లోక్పాల్ తో అన్ని ఏంటి-కరప్షన్ సంస్తలను లోక్పాల్తో మేర్జి చేసి సింగెల్ ఏంటి-కరప్షన్ సిస్టం సాద్యం అవుతుంది.
రాష్ట్రాలలో / జిల్లాలలో అవినీతి
కరప్షన్ అడ్డుకోవడానికి సెంట్రల్ లో లోక్పాల్, అన్ని రాష్ట్రాలలో లోకాయుక్త ను, జిల్లాలలో అంబుడ్స్ మాన్ ఆఫీసుర్స్ ను అమలు చేయాలి. కానీ గవర్నమెంట్ లోక్పాల్ లో లోకాయుక్త ను అన్ని రాష్ట్రాలలో అమలు చేయటం లేదు, అంటే రాష్ట్రాలలో/జిల్లాలలో జరిగే అవినీతికి గవర్నమెంట్ లోక్పాల్తో అలానే వుంటుంది.
కానీ జన లోక్పాల్ తో అన్ని రాష్ట్రాలలో అవినీతి మిద కూడా లోకాయుక్త తో ఉక్కు పాదం వేస్తుంది.
హయర్ & లోవర్ బురోక్రాసి అవినీతి
గవర్నమెంట్ లోక్పాల్ ఒక్క గ్రూప A ఆఫీసుర్స్ (IAS , IPS ... ) మాత్రమే విచారించ గలదు, కింది స్తాయి ఆఫీసుర్స్ ఇందులో రారు, నిజానికి కరప్షన్ కింది స్తాయి నుంచి మొదలు అవుతుంది. దిని వలన ఒక కామన్ మాన్ కి తన కరప్షన్ ఇస్సుఎస్ RTA , GHMC , Passport , Electricity , Water etc ఇందులో రావు.
కానీ జన లోక్పాల్ తోఅన్ని స్టేట్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్ ఆఫీసర్స్ కరప్షన్ ని లోక్పాల్ విచారించగలదు. ఎటువంటి కరప్షన్ ఇష్యూ ఐన ప్రజలు లోక్పాల్ కు విన్న వించుకోవచ్చు.
సింగెల్ ఏంటి-కరప్షన్ సిస్టంను , రాష్ట్రాలలో / జిల్లాలలో అవినీతి, హయర్ & లోవర్ బ్యురోక్రాసి అవినీతిని అరికట్ట డానికి గవర్నమెంట్ ఒప్పుకోక పోవడం చూస్తుంటే అసలు గవర్నమెంట్ కరప్షన్ అడ్డు వేయాలని చూడట్లేదని తెలుస్తుంది
**** ఇండిపెండింట్ ఏంటి-కరప్షన్ సిస్టం
ఇప్పుడు ఉన్న ఏంటి-కరప్షన్ సంస్తలు ACB , CVC , CBI, Departmental Vigilance ఇండిపెండింట్ గా పని చేయలేక పోతున్నాయి. ఇవి రాజకీయ నాయకుల అజ్నలలో పనిచేస్తున్నాయి. వాటన్నిటిని ఒకే ఒక సింగెల్ ఏంటి-కరప్షన్ లోక్పాల్ సిస్టంలో మేర్జి చేసి సెల్ఫ్ కాంట్రోలడ్ ఏంటి-కరప్షన్ సంస్తను ఏర్పాటు చేయాలి. కానీ గవర్నమెంట్ లోక్పాల్ ఇది లేదు. జన లోక్పాల్ తో ఇది సాద్యం అవుతుంది.
లోక్పాల్ మెంబెర్స్ ను సెలెక్ట్ చేసే విదానం
జన లోక్పాల్ - మొత్తం 8 మంది సబ్యులు లోక్పాల్ మెంబెర్స్ ను సెలెక్ట్ చేస్తారు. 2 Politicians, 4 Judges అండ్ 2 Independent Constitutional Authorities.
గవర్నమెంట్ లోక్పాల్ - మొత్తం 10 మంది సబ్యులు లోక్పాల్ మెంబెర్స్ ను సెలెక్ట్ చేస్తారు. 10 మంది సబ్యులు 5 గురు రులింగ్ పార్టీ మెంబెర్స్ వుంటారు, అంటే రుల్లింగ్ పార్టీ వాళ్ళకు నచిన వాళ్ళను సెలెక్ట్ చేసుకుంటుంది
లోక్పాల్ మెంబెర్స్ తీసేసే విదానం
జన లోక్పాల్ - లోక్పాల్ మెంబెర్ కరప్ట్ అని బావిస్తే ఎవరినా ఇండియన్ సుప్రేం కోర్ట్ కు లోక్పాల్ మెంబెర్స్ మిద కంప్లైంట్ చేసి తీసివేయడానికి కోర వచ్చు
గవర్నమెంట్ లోక్పాల్ - గవర్నమెంట్ మాత్రమే లోక్పాల్ మెంబెర్ ని తీసేయడానికి కోరగలదు.
లోక్పాల్ మెంబెర్స్ సెలెక్టింగ్ అండ్ రెమొవల్ గవర్నమెంట్ చేతులోనే వుంటుంది. అంటే లోక్పాల్ గవర్నమెంట్ చేతిలో తోలు బొమ్మ గా మారుతుంది.
అదే జన లోక్పాల్ లో లోక్పాల్ ఇండిపెండెంట్ గా వుంటుంది మరియు లోక్పాల్ లో మెంబెర్స్ కరప్ట్ అని బావిస్తే ఎవరినా ఇండియన్ సుప్రేం కోర్ట్ కు కంప్లైంట్ చేసి తీసివేయడానికి కోర వచ్చు .
**** స్ట్రాంగ్ ఏంటి-కరప్షన్ సిస్టం
కరప్షన్ పాల్పడిన వాళ్ళకు శిక్షలు
జన లోక్పాల్ -
2 సం నుండి 10 సం ల వరకు జైలు శిక్ష
కరప్షన్ వలన ప్రజా దానానికి కి ఐన నష్టం కంటే ఎక్కువగా వారి ఆస్తులను లేదా బిజినెస్ సంస్తల నుండి రికవర్ చేస్తారు
కరప్షన్ లో పాల్పడిన బిజినెస్ సంస్తను బ్లాకు లిస్టు చేస్తారు
కేసు జరుగు విచారణ అవుతున్న సమయంలోనే కరప్షన్ జరిగినట్లు ప్రాదమిక అదరాలు ఉన్నట్లయితే వాటిని అప్పటినుండి జరగకుండా వెంటనే ఆర్డర్స్ ఇస్తుంది. ఒకవేళ దానికి High Coart పర్మిషన్ అవసరమైతే లోక్పాల్ తీసుకుంటుంది. ఉదాహరణకు 2G స్కాం లో ఇప్పటి వరకు కరప్షన్ జరిగింది అని తెలిసిన ఎటువంటి ఆర్డర్స్ దానిని జరగకుండా ఇవ్వలేదు.
గవర్నమెంట్ లోక్పాల్ -
6 నెలలు నుండి 10 సం ల వరకు జైలు శిక్ష . ఎటువంటి నష్టాన్ని రికవర్ చేయరు.
కరప్షన్ మిద కంప్లయంట్ చేసిన వాళ్ళకు శిక్షలు
జన లోక్పాల్ -
చేసిన కంప్లిఎంట్ రుజువు కాకపోతే ఎటువంటి జైలు శిక్ష వుండదు కానీ ఫైన్ వుంటుంది
గవర్నమెంట్ లోక్పాల్ -
2 సం నుండి 5 సం ల వరకు జైలు శిక్ష మరియు ఫైన్ వుంటుంది
ఎవరినా కంప్లిఎంట్ కరప్ట్ మిద కంప్లయంట్ చేస్తే , వాళ్ళు తిరిగి కంప్లయంట్ చేసిన వల్ల మిద తిరిగి కంప్లయంట్ చేయ వచ్చు, గవర్నమెంట్ కరప్ట్ ఆరోపించిన వాళ్ళకు ఉచితంగా ప్రోసుకుటర్ ని ఇస్తుంది . కంప్లయంట్ చేసిన వాళ్ళు ప్రోసుకుటర్ కర్చులు వాళ్ళే బరించాలి. అంటే ఎవరినా కంప్లేంట్ చేస్తే వాళ్ళను హర్రాసే చేయడం జరుగుతుంది.
ఇక్కడ గవర్నమెంట్ లోక్పాల్ విచిత్రం ఏమిటంటే కరప్షన్ పాల్పడిన వాళ్ళకు మినిమం శిక్ష 6 నెలలు కానీ కంప్లిఎంట్ చేసిన వాళ్ళకు మినిమం శిక్ష 2 సంవత్సరాలు, అంటే కంప్లయంట్ చేయడానికి బయపడతారు.
జుడ్జిమేంట్
జన లోక్పాల్ - కరప్షన్ సంబందిచిన కేసుల విచారణ కోసం స్పెషల్ బ్రాంచెస్ ని హై కోర్ట్ లో ఏర్పాటు చేయాలి . దీనివలన విచారణ తొందరగా జరుగుతుంది, తప్పు చేసిన వాళ్ళకు శిక్ష తొందరగా పడుతుంది. ఏ కరప్షన్ కేసు ఐన 1 సంవత్సరంలో పూర్తీ చేయాలి.
గవర్నమెంట్ లోక్పాల్ - ఎటువంటి స్పెషల్ బ్రాంచెస్ ఏర్పాటు చేయరు. దీని వలన కేసు పూర్తీ అవడాని ఎన్ని సంవత్సరములు ఐన పట్టవచ్చు.
ఏ ఏంటి-కరప్షన్ సంస్త ఎంత బాగా పనిచేసిన, జుడ్జిమేంట్ కోసం కోర్ట్ లో సంవత్సరములు పడితే ఉపయోగం సున్యం. కరప్షన్ సంబందిచిన కేసుల విచారణ కోసం స్పెషల్ బ్రాంచెస్ ని కోర్ట్ లో ఏర్పాటు చేయాలి. కరప్షన్ కేసు 1 సంవత్సరంలో పూర్తీ చేయాలి.
MPs
జన లోక్పాల్ - పార్లమెంట్ లో MPs వోట్ చేయడానికి లేదా మాట్లాడటానికి లంచం తీసుకొంటే లోక్పాల్ విచారణ చేయగలదు
గవర్నమెంట్ లోక్పాల్ - అర్తికాల్ 105 (2) ప్రకారం లోక్పాల్ పార్లమెంట్ లో MPs వోట్ చేయడానికి లేదా మాట్లాడటానికి లంచం తీసుకొంటే విచారణ చేయలేదు
అర్తికాల్ 105 (2) వున్నది స్వతంత్రంగా పార్లమెంట్ లో వోట్ వేయడానికి లేదా మాట్లాడటానికి, కానీ లంచం తీసుకోడానికి కాదు.
PM
జన లోక్పాల్ - లోక్పాల్ PM మీద ఉన్న కరప్షన్ సంబందిచిన కేసుల విచారణ చేయగలదు కానీ కొన్ని షరతులతో
గవర్నమెంట్ లోక్పాల్ - లోక్పాల్ PM మిద ఉన్న కరప్షన్ సంబందిచిన కేసుల విచారణ చేయలేదు
Prevention of Corruption Act ప్రకారం PM ని కరప్షన్ పాల్పడితే విచారణ చేయ వచ్చు. PM కింద వచ్చే CBI , PM ని విచారణ చేయగలదు కానీ లోక్పాల్ విచారణ చేయలేదు.
జుడిషరి
గవర్నమెంట్ లోక్పాల్ - Judges మిద వున్నా కరప్షన్ సంబందిచిన కేసుల విచారణ చేయలేదు. JAB (Judicial Accountability Bill) బిల్ ను అమలు చేస్తాము అని గవర్నమెంట్ అంటుంది.
జన లోక్పాల్ - Judges మిద వున్నా కరప్షన్ సంబందిచిన కేసుల విచారణ చేయగలదు.
లేదంటే స్ట్రాంగ్ JAB (Judicial Accountability Bill) బిల్ ని లోక్పాల్ బిల్ తో పాటూ వెంటనే అమలు చేయాలి.
JAB (Judicial Accountability Bill) బిల్ ను అమలు చేస్తాము అని గవర్నమెంట్ అంటుంది. JAB బిల్ ని ఎప్పుడు అమలు చేస్తారో తెలియదు మరియు ఇందులో కరప్షన్ గురించి లేదు ఇది మిస్బిహేవియర్ గురుంచే చెపుతుంది.
ఇలా ఇక్కడ కొన్ని ముక్యమైన విషయాలు మాత్రమే పొందు పరచ గలిగాము ఫూర్తి వివరాల కొరకు http://www.indiaagainstcorruption.org/ సైట్ ను సంప్రదించండి
గవర్నమెంట్ లోక్పాల్ బిల్ చుసిన తరువాత గవర్నమెంట్ కి అసలు కరప్షన్ తగ్గిన్చాలని చూస్తున్నట్టు లేదు. ప్రజల కోరికను అసలు పరిగణలోకి కూడా తీసుకోవడం లేదు. చూస్తుంటే గవర్నమెంట్ ఇంకో పనికి రాణి ఏంటి-కరప్షన్ సంస్త లోక్పాల్ ను అమలు చేయడానికి చూస్తుంది.
మార్పు ఎవరో దగ్గరి నుండి రాదు ప్రజలు/మన దగ్గరి నుండే వస్తుంది. నేను ఒక సింగెల్, ఇండిపెండింట్ & స్ట్రాంగ్ ఏంటి-కరప్షన్ సిస్టం జన లోక్పాల్ బిల్ కోసం బయటకు వచ్చి నా కోరికను తెలియ చేస్తాను, అది జరిగినంతవరకు పోరాడతాను, మరి మీరు ? ప్రజలు తలుచు కొంటె ఏది అయిన జరుగుతుంది
జై హింద్
To create awareness just forward it to your friends
Love all-Serve all
AMMA Srinivas
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి