1. "మనిషి మనస్పూర్తిగా నమ్మి ఆచరించవలసిన జీవన విధానం "మతం"... ఎవరికీ నచ్చిన, ఎవరు మెచ్చిన విధానాన్ని వారు అలవరుచుకోవచ్చు... ఇందులో ఎవరు ఎవరిని కించ పరచవలసిన, బలవంత పరచాల్సిన అవసరం లేదు....దాని కోసం ప్రాణాలను తీయడం, తమ ప్రాణాలు కోల్పోవడం అనేది అవివేకం. మనిషికి మనుగడను ప్రసాదించలేని మతం మతం కాదు...ఇది అసలు మతం యొక్క అభిమతమే కాదు...
నీకు ఆనందాన్నిచ్చేది, నిన్ను మంచిగా, మనిషిగా తీర్చిదిద్దేది ఏ మతమైన పర్వాలేదు.....విష్ణువు ఐనా, అల్లా ఐనా, జీసస్ ఐనా అందరు ప్రపంచ శాంతికోసం, పరులకు ఉపకారం, చేతనైన సహాయం చెయ్యడానికే పుట్టారు, అలాగే చేసారు.........మరి నువ్వెందుకు వారిని అడ్డం పెట్టుకొని ప్రపంచంలో అరాచకం సృష్టిస్తున్నావు? నీ మతం ఆనందదాయకం కావాలి కాని, అరాచకం సృష్టించే మృగం కాకూడదు.......ముందు నిన్ను, నీ ఇంటిని, నీ వారిని చక్కదిద్దుకొని తర్వాత ప్రపంచాన్ని చూడు....
మతం మనుషులను ఒక్కటి చెయ్యాలి, భేదాలు తగ్గించాలి కానీ, మనుషులలో విభేదాలు సృష్టించకూడదు... నీకు నచ్చినది అందరికి నచ్చాల్సిన అవసరంలేదు....నీకు నచ్చింది నువ్వు ఆచరించు...అవతలి వారికి నచ్చింది వారు ఆచరిస్తారు...
ఏదో కనిపించని కుల-మతాల కోసం కనిపించే నీ మనుషుల్ని దూరం చేసుకుంటూ తద్వారా నీ ఆనందాన్ని దూరం చేసుకుంటూ, పరుల ఆనందాన్ని నాశనం చెయ్యడం ఎంత వరకు సముచితం?
ఏ మతమైనా చెప్పేది మంచి పనులు చెయ్యమని కాని, మారణ హోమం సృష్టించమని కాదు.....
సాటిమనిషికి సాయం చేసే మతమే నా మతము -మానవ సేవే -మాధవ సేవను మతమే సమ్మతము.....
సందేహిస్తుంటే అతిగా సంకల్పం నెరవేరదుగా-ఆలోచన కన్నా త్వరగా అడుగేద్దాం ఆరంభంగా...
నా అనంతరంగం అమ్మ శ్రీనివాస్
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి