9. కాశీ విశ్వనాధుడు
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో వారణాసి (కాశీ) లో విశ్వేశ్వరలింగము ఉంది. కాశీ యాత్ర చేయనిదే స్వర్గద్వారాలు తెరుచుకోవని హిందువుల నమ్మకము. ఆలయ ప్రవేశము హిందువులకు మాత్రమే. కాశీలో 100 శివాలయాలు, 64 స్నాన ఘట్టాలు ఉన్నాయి. గంగానది ఉత్తరవాహినియై ప్రవహించు చున్నది. ఈ పుణ్య స్టలములోనే అశోకుడు నిర్మించిన సారనాధ స్ధూపం ఉంది.
వరుణ, అసి నదుల మధ్య ప్రదేశం కనుక ఇది వారణాశైంది. పార్వతీదేవి అన్నపూర్ణమ్మగా, విశాలాక్షిగా నివాసమేర్పరచుకున్న చోటు. అయ్యవారు విశ్వనాథుడై వెలసి విశ్వాన్ని శాసిస్తూ తరింప చేస్తున్న చోటూ ఇదే. ఆధ్యాత్మిక ఔనత్యంగల కాశీ పరమత సహనానికి ప్రతీకగా కనిపిస్తుంది. ఎందుకంటే విశ్వనాథ ఆలయానికి ప్రక్కనే దర్శనమిస్తుంది మసీదు. గుడిగోపురం, పై భాగాలను తొలగించి పవిత్రమైన ఆ పునాదులపై, కుడ్యాలమీదా ఔరంగజేబు మసీదు నిర్మాణం చేయించాడు. ప్రస్తుతం మనం చూస్తున్న విశ్వనాధాలయాన్ని 1780సం.లో హోల్కరుల వంశకీర్తి మహారాణి అహల్యాబాయి కట్టించింది.పూర్వం లంకకు రాజు విశ్రవసుబ్రహ్మ పెద్ద కుమారుడు వైశ్రవుడు (కుబేరుడు). సవతి తల్లి కొడుకు అయిన రావణుడు వైశ్రవుడును వెడల గొట్టి, లంకను ఆక్రమించెను. వైశ్రావణుడు విశ్వకార్మచే కాశీ నగరమును నిర్మాణమును చేయించుకొని, దీర్ఘకాలం తపస్సు చేశాడు. పార్వతి పరమేశ్వరులు సాక్షాత్కరించి, అలకాపుర పాలానాధికారము, మితిలేని ధనము, దిక్పాలకులందు స్దానాన్ని ప్రసాదించారు. వైశ్రవుడు కోరిక ప్రకారము అన్నపూర్ణ, విశ్వనాధ నామములతో కాశీలో వెలసినారు. కాశీ క్షేత్రము నందు మరణించిన వారికి కైలాసప్రాప్తి కలుగును. ఈ కాశీ పురమున అష్ట భైరవులు, నవ దుర్గలు, నవ గౌరీ దేవతలు, ఏకాదశ రుద్రులు, ద్వాదశాదిత్యులు, ఇరువది యిద్దరు విష్ణువులు, ఏబదియార్వురు గణాధిపతులు గల గొప్ప శివ క్షేత్రము . ఇక్కడ ఉన్న స్నాన ఘట్టాలలో పంచగంగా ఘాట్, సోమేశ్వర్ ఘాట్, దత్తాత్రేయ ఘాట్, కేదార ఘాట్, హరిశ్చంద్ర ఘాట్, మణికర్ణికా, దశాశ్వమేద ఘాట్ ముఖ్యమైనవి.
10. త్ర్యంబకేశ్వరుడు
మహారాష్ట్రా లోని నాసిక్ నుండి 25కి.మి దూరంలో, గౌతమీ నదీ తీరంలో త్ర్యంబకేశ్వరుడిని మనం దర్శించవచ్చు. గోహత్య పాతాకమంతరింపటకు గౌతమ మునీశ్వరుడు నాసికా క్షేత్రమున శంకరుడు గురించి తపస్సు చేసెను. శంకరుడు గౌతమ మునీశ్వరుని సంకల్పము నెరవేర్చుటకై నీటి బిందువును ప్రసాదించాడు. ఆ నీటి బిందువు మహానది రూపమున గోవు మరణించిన చోట నుండి ప్రవహించింది. ఆ నదికి గౌతమ పేరున "గౌతమి" గా పేరు వచ్చెను. ఆ క్షేత్రం యందు గౌతమ ముని కోరికపై శంకరుడు త్ర్యంబకేశ్వరస్వామిగా వెలిశాడు. ఈ క్షేత్రమున మశ్ఛీంద్ర నాధుని పాదుకలు, 108 మహాదేవుని లింగముల స్ధానం, గోదావరీ అమ్మవారి ఆలయం దర్శించదగ్గ ప్రసిద్ధమైనవి. ఇక్కడ త్రిమూర్తుల రూపం, బొటనువేలు ఆకారంలో, లింగరూపమున, దర్శనిస్తారు. భూమిలోనే శివలింగం ఇక్కడ మనకు దర్శనమిస్తుంది.
11. కేదారేశ్వరుడు
ఉత్తరప్రదేశ్‌లో , హిమాలయంలో "కేదార" అనే పర్వతం పైన కేదారేశ్వరుడు ఉన్నాడు. ఈ ప్రాంతం రూషికేష్ కు 250 కి. మీ దూరంలో ఉంది.
పూర్వము నరనారయణులు అను వారు తపస్సు చేసి, శివున్ని ప్రత్యక్షము చేసుకుని, కేదారలింగ రూపంలో వేంచేసి ఉండమని కోరారు. గంగాధరుడు అందుకు సమ్మతించి జ్యోతిర్లింగంగా వెలిశాడు. స్వయం ప్రకాశము గల కేదారలింగమును పూజించిన నరనారాయణులు ద్వాపర యుగమున కృష్టార్జనులై జన్మించారు. పాండవులు అరణ్యవాశము నందున్నప్పుడు కేదారలింగమును సేవించతలచి కేదారనకు వచ్చారు. శంకరుడు భీముని బలమును పరీక్షించుటకై మహిష రూపము ధరించి, పారిపోసాగెను. ఆది చూచిన భీముడు ఆ మహిషం వెనుక భాగాన్ని పట్టుకొని, మహేశ్వరుని అక్కడే ఉండమని ప్రార్ధిస్తాడు . భీముని బలము వలన మహిషం వృచ్ఛ భాగం మాత్రమే కేదారంలో ఉండిపోయింది. పాండవుల చెంతనుండక పారిపోయిన మహిష, నేపాళ రాజ్యమునకు పోయి, అక్కడే మహిష శిలాకారమున నిల్చింది.
12. ఘృశ్వేశ్వరుడు
ఔరంగాబాద్ (మహారాష్ట్ర) లోని దౌలతాబాద్ నుండి 11కి.మి దూరంలో ఘృష్ణేశ్వరుడు మనకు దర్శనిమిస్తారు. కుసుమేశ్వరుడు, ఘుష్మేశ్వరుడు, ఘృష్నేశ్వరుడు అనే నామాలతో సుప్రసిద్దుడు. అహల్యాబాయి హోల్కర్ ఈ గుడిని నిర్మించారు.

1 కామెంట్:
plz update another jyotirlingas
కామెంట్‌ను పోస్ట్ చేయండి