మనిషి యొక్క అంతః శత్రువైన "అహంకారం" అనే జాడ్యం పరుల సేవలో ఉన్న పుణ్యాత్ములను వదలడం లేదు....
పరోపకారమే ప్రధమ ధర్మంగా భావిస్తున్నవారు లేక వీలున్నప్పుడు ఇతరులకు సహాయం చేస్తూ అర్ధవంతమైన, ఆనందకరమైన జీవితం గడుపుతున్నవారు సైతం "అహంకారం" అనే మాయా ఉచ్చులో బిగుసుకుపోయి, తాము చేస్తున్నది, చేయవలసింది నిస్వార్దమైన సేవ అని మరుస్తూ, దానికి స్వార్దాన్ని జత చేస్తూ....అవతలి వారి అవసరాన్ని తీర్చడం కన్నా మన అహాన్ని చల్లార్చుకోవడమో, తమకు పేరు ప్రఖ్యాతులు రావడమో, తమ భావాలను అవతలి వారి మీద రుద్దడమో లక్ష్యంగా పెట్టుకొంటూ...........
ఒక్కరిగా, ఒంటరిగా పనిచేయడం కంటే, మంచి పనులు చేస్తున్న అందరితో (మరి కొందరితో) కలసి పని చెయ్యడం వలన ఇతరులకు సేవ చెయ్యడం అనే లక్ష్యాన్ని తొందరగా చేరుకోవచ్చునని, మరింత ఎక్కువ మార్పులు తీసుకొని రావచ్చునని మరుస్తూ...... ఎవరికి వారె యమునా తీరే అన్న విధంగా ముందుకు సాగుతున్న ఎన్నో స్వచ్చంద సేవా సంస్థల, ఎంతో మంది కార్యకర్తల, సమూహాల ఆలోచనా విధానంలో మంచి మార్పు, సేవా/సహాయం మీద సంపూర్ణ అవగాహన, కలసి పనిచేయడంలోని లాభాలు, అవతలి వ్యక్తి మంచి భావాలను అర్ధం చేసుకొనే మనసు రానంత వరకు....నీ జీవితంలో నువ్వు ఎంత పరోపకారం చెయ్యాలనుకున్న, చేస్తూ ఉన్న నీ జీవితంలో ఆనందాన్ని, ఇతరులకు ఇవ్వడంలో గల మాదుర్యాన్ని పొందలేవు...
మనం చేసే (సేవా/సహాయం) పని యొక్క అంతిమ లక్ష్యం "అవతలి వారికి సాయం చేయడం" అన్న ఒక్క ముఖ్యమైన విషయం మర్చిపోనంత వరకు మన లక్ష్య సాధనకు అహంకారము, పేరు ప్రఖ్యాతలు, ఇతరుల దెప్పిపొడుపు మాటలు, నిరుత్సాహపు హేళనలు లాంటి ఏ విదమైన అడ్డంకులు నీకు అడ్డురావు, అడ్డుగోడలుగా నిలువలేవు....
-ve భావాలూ, అనవసరమైన సందేహాలు, ఆందోళనలు, భయాలు ఇవన్నీ........... నీ సంకల్పం సరిగా లేనపుడు, నీ లక్ష్య సాధనను మనస్పూర్తిగా ప్రారంభించనపుడు, నీకు-నీ లక్ష్యానికి అడ్డంగా నిలచే చిన్న చిన్న అడ్డుగోడలు....నిజంగా నీ మీద నీకు నమ్మకం, నీ లక్ష్యం మీద గురి, సాధించాలనే తపన నీకు ఉన్నప్పుడు 'నీకు అడ్డంగా నిలచే అడ్డుగోడలను సైతం పునాదులుగా మార్చుకోగల తెలివి తేటలు, శక్తి-సామర్ధ్యాలు వాటంతట అవే నీకు వస్తాయి'..... నీ అంతట నీవే, నీకు తెలియకుండానే నీలో నిద్రాణమైఉన్న అన్ని సామర్ధ్యాలను వెలికితీస్తావు.. అందరితో కలసి ఆనందంగా పనిచేస్తావు.....నీ లక్ష్య సాధనాలోని ప్రతి అడుగును అనందిస్తావు, ఆస్వాదిస్తావు, సంతోషంగా జీవిస్తావు... నీలోని లోపాలను తెలుసుకుంటావు, ఇతరుల సలహాలను విశ్లేశిస్తావు సరిదిద్దుకుంటావు.....నీ లక్ష్యాన్ని చేరుకోడానికి అవసరమైన అన్నింటిని నీవు సమకూర్చుకుంటావు....అలా చేసినప్పుడు, నలుగురికి ఆదర్శంగా నిలచినప్పుడు....ఈ సాధనకోసం నీవు త్యజించిన ఎన్నో తాత్కాలిక ఆనందాలకు అందని ఎంతో శాశ్వతమైన ఆనందాన్ని ఆస్వాదిస్తావు.....
అలా నిస్వార్ధంగా పనిచేస్తున్న, పని చేసిన, లక్ష్యాలను సాదించిన ఎందఱో మహానుభావులకు శిరసు వంచి పాదాభివందనం చేస్తూ.....అందరం కలిసి, సమిష్టిగా మంచి పని చేయడానికి ముందు ఉండాలని కోరుకుంటూ......నాకు అలాంటి శక్తిని ఇవ్వాలని ఆ భగవంతున్ని ప్రార్ధిస్తున్నాను .....
నా జీవితంలో నేను గమనిస్తున్న కొన్ని విషయాల, కొందరి వ్యక్తుల ఆలోచనల, అడుగుల సమాహారమే ఈ.............. "నా అనంతరంగం"అమ్మ శ్రీనివాస్
Love all - Serve all
AMMA Srinivas
www.aswa.co.in
www.sri4u.tk
9177999263
తల్లి వేలుపట్టుకొని బుడి బుడి అడుగులు నేర్చుకొన్న పసివాడు నడక (పరుగు) ఎంత తొందరగా నేర్చుకొంటాడా అని తల్లి ఎదురుచూస్తుంది, అంతే కానీ ఆ తల్లిని తోసేసి పరుగు నేర్చుకోవాలని కోరుకోదు....కానీ అలా జరుగుతున్నప్పుడు తల్లి ఆ పరుగును చూసి సంతోషించాలా? లేక నడక నేర్పిన గురువును పట్టించుకోక పోగా? తోసేసి వెళ్తున్నందుకు బాధపడాలా?.....
సహాయం చేసిన వారికి సహాయం చెయ్యకపోయినా పర్వాలేదు....కానీ....ఆ సహాయాన్ని మర్చిపోయి, వారిని తిరిగి నిందించే స్థాయికి, నీచానికి దిగవద్దని కోరుకుంటున్నాను......