1.వస్తా వట్టిది... పోతా వట్టిది! ఆశ ఎందుకంటా? చేసిన ధర్మము చెడని పదార్థము... చేరును నీవెంట..2.నువ్వు తినే ప్రతి ఒక మెతుకు ఈ సంఘం పండించింది గర్వించే ఈ నీ బ్రతుకు సమాజమే మలిచింది ఋణం తీర్చు తరుణం వస్తే తప్పించుకు పోతున్నావా తెప్ప తగలపెట్టేస్తావా ఏరు దాటగానే...

4, జులై 2012, బుధవారం

నాయకుల లక్షణాలు:

·         ధైర్యం

·         స్వయం నియంత్రణ

·         నిర్దిష్ట లక్ష్యం

·         పటిష్ఠమైన ప్రణాళికలు

·         అనుచరుల కన్నా ఎక్కువ కష్టపడటం

·         మంచి వ్యక్తిత్వం

·         నలుగురినీ అర్థం చేసుకోడం

·         పూర్తి బాధ్యతను భుజాలపై వేసుకోడం


నలుగురినీ కలగలుపుకు పోవడం.... పటిష్ఠ మానవ సంబంధాలు....
అందరూ తమ కోణం నుంచి చూస్తూ తమకే సమస్యలున్నాయని ఇతరులెవరికీ లేవని భావిస్తారు. దాంతో ఏ పరిస్థితినైనా తమ దృక్కోణం నుంచి చూడటం అలవాటు చేసుకొంటారు. ఫలితంగా - తాము చప్పిందే వేదమని, తమదే సమస్య అని, ఇతరులు తమను తప్పుగా అర్థం చేసుకొంటున్నారని ఇంకా ఏవేవో ఉహీంచుకొని ఉంటారు. అది ఒక వ్యక్తికి మరో వ్యక్తితో సత్సంనుధాలు కోల్పోయే ప్రమాదానికి దారి తీస్తుంది. మానవ సంబంధ్లు పటిష్ఠంగా ఉండాలంటే "మనం మంచి శ్రోత (Listener) కావాలి. ఇతరుల సమస్యల్న సావధానంగా వినగలగాలి. విజానికి మన సమస్యల్తి వినేందుకు మాత్రం ఒర్పు చూపం. దాంతో ఎవరూ మన దగ్గరికి చేరరు. అలా కాకుండా మనం ఇతరులకు కాస్తంత మాట సాయం చేస్తే మంచి మానవ సంబంధాలు ఏర్పడతాయి.

·         ఇతరుల్లో ఏ చిన్న సుగుణం ఉన్నా - మెచ్చుకోండి. చిన్నచిన్న మెచ్చుకోళ్లవల్ల మానవ సంబంధాలు పటిష్ఠమవుతాయి.

·         పిడుగులాంటి కోపాన్ని మనలోతనే దాసుకొని, నిగ్రహించుకొని, చిరునవ్వుతో గోడవలు జరగకుండా ఎదుర్కొన్న వాడే జీవితాన్నీ పరిస్ధితులనూ శాసించగలడు.

·         ఉచ్ఛ్వాస నిశ్వాసాలు ఎలాగో - మానవ జీవితంోబ ఇవ్వడాలు స్వీకారాలు అలాంటివే! లేకపోతే ప్రాణం పోయినట్లే మానవసంబంధాలూ పోతాయి.

·         "ఒక వ్యక్తి శీలం గురించి మనం మాట్లాడాలంటే మనకంటూ కొంత అర్హత ఉండాలి. అ వ్యక్తితో మనం సుదీర్ఘ కాలం కలిసి, నిష్పక్షపాతంగా అతనిని అధ్యయనం చేసిన తర్వాత మాత్రమే ఓ నిర్ణయం తీసుకోవాలి. అదీ అతనికి నేరుగా అ విషయాన్ని చెప్పాలి. అంతే గానీ ఇతరుల గురించి మనం అనవసరంగా వ్యాఖ్యానించరాదు, పరుషాలు మాట్లాడరాదు.

·         ఇతరుల్ని అనవసరంగా విమర్శించే ముందు, చాడీలు చెప్పే ముందు, పుకార్లు పుట్టించే ముందు - మనం ఆలోచించాలి - అలాంటి మనస్తత్వాన్ని అణుచుకోవాలి. ఇది మానవ సంబంధాలు అవిచ్ఛిన్నంగా కొనసాగేందుకు కీలకం!

·         ఎవరైనా మీ ఎదురుగా అక్కడలేని మరో వ్యక్తి గురించి తప్పుగా మాట్లాడారంటే మీరు లేనప్పుడు ఇతరులతో మీ గురించి అలాగే తప్పుగా మాట్లాడతాడు. గుర్తించండి.

·         ఇతరుల నుంచి సలహాలు మాత్రమే తీసుకోవాలని అంతే తప్ప వారికి దాసూహం అయిపోయి సమస్య వారి చేతిలో చర్చనీయాంశం అయిపోకూడదని తెలుసుకోక పోవడం. సమస్య వస్తే కొంచేం ఆలోచన, ఎక్కువ ఆచరణ ఉండాలని తలంచక, ఇతరుల సలహాలకు తలాడించడం వంటివి స్వీయ నిర్ణయాధికారం లోకపోవడంవల్ల వచ్చే అనర్థం.

·         "బయటి ప్రపంచాన్ని బాగు చేయడం కన్నా మనల్ని మనం పరిపూర్ణ వ్యక్తులుగా తీర్చిదిద్దుకోవడం మంచిది. కోపాలకు, అనవసర ఆవేశాలకూ, అసూయలకూ, అతి ఆలోచనలకు, ఆత్యాశలకూ, అనవసర బాధలకూ, వెర్రి వ్యాపకాలకూ, వ్యర్ధమైన కలలకు, మనల్ని మనం దూరంగా ఉంచుకొనేందుకు కృషి చేయడం ఉత్తమం"

·         ప్రతి మనిషికీ అంతర్ ప్రపంచం...మనసు లోపల ఉంటుంది. ఇక బయట ఉండే పరిసరాలు, వాతావరణం, పరిస్ధితులు... ఇవన్నీ ' బాహ్య వాతావరణం' వ్యక్తిపై, అతని మానసిక వికాసదశపై, ఆలోచనలపై ఈ కెండు వాతావరణాల ప్రభావమూ ఉంటుంది. వ్యక్తి మనస్తత్వం వ్యక్తిత్వం, మూర్తిమత్వం.... తయారయ్యేది ఈ ప్రభావం ఆధారంగానే! బాహ్య వాతావరణాన్ని అధిగమించి....అంతర్ వాతావరణం చెప్పినట్లు, నడుచుకోగలిగితే..... మనిషి వ్యక్తిత్వం పరిపక్వంగా, పాజిటివ్ గా, సమగ్రంగా రూపొందగలదు.

·         ప్రపంచాన్ని ఆనందంగా మార్చాలనుకొంటున్నారా - ఏం లేదు - మీ మనసును చూసే దృక్కోణాన్ని మీ వైఖరులను ఆలోచనా విధానాన్ని ఆనందంగా ఉంచుకోండి చాలు - ప్రపంచం దానంతట అదే ఆనందమయంగా కనిపిస్తుంది మీకు!

·         అసలు మనం ప్రపంచంపై విజయం సాధించాలంటే ముందుగా మనమేంటో సరైన అంచనా, అవగాహన ఉండాలి. మనలోని భౌతిక, మానసిక, ఆధ్యాత్మిక,బౌద్ధిక నైపుణ్యాల్ని సరిగా గుర్తించగలగాలి.
ఒకమనిషితో వ్యక్తిగతంగా మీకు భేదాభిప్రాయం ఉండొచ్చు కానీ ఆ మనిషిలో ఏదైనా ఒక పాజిటివ్ పాయింట్ ఉంటే దాన్ని ప్రశంసించగల వ్యక్తిత్వం ఉండాలి. Broad mentality ఉండాలి.

·         డబ్బు ఉంది కదా అని నిర్లక్ష్యం చేస్తే అది ఇక మీ దగ్గరకి రాదు. అందుకే ఆగర్భ శ్రీమంతులు కూడా ఒక్క పైసా దగ్గర కూడా జాగ్రత్త పడతారు. దాంతో లక్ష్మికి తనకు ప్రాధాన్యం ఇస్తున్నారు అనిపిస్తుంది. అందుకే వారి దగ్గరే ఉంటుంది. కీర్తి ప్రతిష్ఠలు కూడా అంతే. వచ్చాయి కదా ఆని విర్ర వీగితే పోతాయి. చెంప ఛెళ్లుమనిపించి మరీ పోతాయి. ఇది మన స్నేహితుల విషయంలోనూ, చుట్టూ ఉన్న వ్యక్తుల విషయంలోనూ వర్తిస్తుంది. సో.... వారిని నిర్లక్ష్యం చేస్తే మీ మానవ సంబంధాల అల్లిక విడిపోతుంది. జారిపోతుంది.

·         ఎదుటివారికి లొంగిఉన్నట్లు వారనే దానికి తలాడిస్తూ ఉన్నంత కాలం మీదెక్కి స్వారీ చేస్తారని, ఒక్కసారి ఆత్మవిమర్శ చేసుకొని మన ప్రవర్తన సవరించుకొంటే మర్యాద ఇచ్చిపుచ్చుకోవడమెలాగో అవతలివారికి తెలుస్తుంది. మనం అవమానాలు పడుతూ - ఇతరుల మెచ్చుకోళ్లకోసం పాకులాడాల్సిన పనిలేదు. మనల్ని చెడ్డ అనుకొన్నా-తిరగబడక తప్పదు. హఠాత్తుగా ప్రవర్తన మార్చుకోవాలంటే కష్టమే. కానీ, అత్మవిశ్వాసంతో పురోగమించేందుకు ఆ మాత్రం కష్టం తప్పదు.

·         ఇతరుల ప్రవర్తన బాధపెడుతుంటే సరిగ్గా మనమూ అలాగే ప్రవర్తించడం ఒక పద్ధతి. ఉదాహరణకు మీకిష్టంలేని పని చేస్తుంటే, రెండుసార్లు చెప్పారు. ఆయినా వినలేదు. ఆంతే అక్కడితో వదిలేయండి. మరోసారి చెప్పకపోతే వారికే తెలుస్తుంది. అంటే ఏ నిర్లక్ష్యాన్నయితే ఎదుటివారు చూపుతున్నారో మీరూ అదే బాటలోకి మారినట్టు తెలియజేయడమన్నమాట.

·         ఎదుటివారు మనపట్ల మర్యాదగా ప్రవర్తించినంత కాలం మనమూ అంతే మర్యాదగా ఉండాలి. అయితే ఇతరులు మనల్ని విమర్శిస్తున్నా, వీరికా విషయం తెలియదనుకొన్నట్లయితే సున్నితంగా చెప్పాలి. ఒకటికి రెండుసార్లు వారి ప్రవర్తనను ఎత్తి చూపాలి. ఎంత మాత్రం వాదనకు దిగకూడదు. ఒకవేళ అవతలివారు దిగినా మనం ఆపెయ్యాలి.

·         కావాలని నలుగురిలో ఉన్నప్పుడు మిమ్మల్ని ఏదో ఒకటి అంటూ తలవంచుకొనేలా చేసేవారికి అదేరీతిలో బుద్ధి చెప్పడం సరైన పద్ధతి. ఒక్కసారి ఆ అనుభవం ఎదురైతే మరోసారి ఎవరినీ బాధ పెట్టడానికి సాహసించరు.

·         తప్పుకు పరిష్కారం తప్పుకాదని చాలామంచి అభిప్రాయం. అలాగని, ఎదుటివారు చేసే తప్పుల్ని క్షమిస్తూపోతే చివరికి మీరే బలవుతారని గుర్తుంచుకోవాలి.

·         ఎదుటివారి నుంచి సరైన గౌరవం కోరుకొనేముందు మిమ్మల్ని మీరు సరిగ్గా అర్ధం చేసుకోవాలి. మీలో ఉన్న మంచి లక్షణాలను గుర్తు చేసుకొని అత్మస్థైర్యం పెంచుకోండి.  తక్కువ చేసుకోకూడదు

·         పార్టీల్లో, ఫంక్షన్లలో ఇతర సందర్భాల్లో ఎవరైనా మీ ఛాయిస్ అడిగినప్పుడు స్పష్టంగా చెప్పగలగాలి. ఏదయినా ఫర్వాలేదంటూ మూలకు ఒదిగిపోకూడదు.

·         ఏ సందర్భంలోనైనా, వెనుక సీట్లలో కూర్చోవడం, మనమే ఇతరులకు ముందు సీట్లు ఆఫర్ చేయడం కూడదు. 'నో' చెప్పడం

·         ఇష్టం లేకున్నా అంగీకారం తెలపకూడదు. అయిష్టాన్ని నిర్భయంగా చెప్పగలగాలి. ముందుగా చిన్న విషయాలతో మొదలెడితే మంచిది. 'నో' చెప్తున్నాం కదా అని సంజాయుషీ ఇస్సుకోవాలని భావించకూడదు. అన్ని సలయాల్లోనూ మీకా హక్కు ఉందని గుర్తుంచుకొంటే చాలు.  భావాలు తెలిసేలా.....

·         కొంతమంది చాలా సరదాగా, నవ్వుతూ మాట్లాడుతూ ఉంటారు. ఎదుటి వారిమీద జోకులు వేసి ఆనందపడిపోతూ ఉంటారు. మొదట్లోనే వారి ప్రవర్తన మీకు నచ్చలేదని చెప్తే మరోసారి ఆ ప్రయత్నం చెయ్యరు. ఈ విధంగా చెప్తే నలుగురూ ఏమనుకొంటారోననే బాధ అనవసరం. ఆ బాధలన్నీ మాటలన్న వారికి అనుభవమవుతాయి.

·         నలుగురిలోకీ వెళ్లేటప్పుడు ధైర్యంగా, ధీమాగా ఉండండి. మీ తప్పులేని విషయాలను సైతం నెత్తిన వేసుకోవాలని ఎన్నడూ ప్రయత్నించవద్దు.

·         విమర్శలకు తట్టుకొంటూ.... విమర్శకు గురయినప్పుడు అందులో ఎంత నిజం ఉందో ప్రశ్నించాలి. ఊరికే తలాడించెయ్యకూడదు. ఆ విమర్శ వెనుక ఉద్దేశం ఏమిటో గ్రహించగలగాలి.

·         విమర్శలకు అతిగా స్పందించడమూ మంచిది కాదు. మీరీ మధ్య లావయ్యారనో, ఎక్కవగా మాట్లాడతారనో ఎదుటివారంటే ఎందుకు బాధపడాలి? నిజాన్ని అంగీకరిస్తూనే సమర్ధంగా తిప్పికొట్టే నేర్పు అలవరుచుకొంటే చాలు.

·         ఏదో ఒక విషయంలో విమర్శకు గురైనంత మాత్రాన మీరంటే అవతలి వారికి ఏమాత్రం ఇష్టంలేదని బాధపడిపోకూడదు. వారన్న విషయం వరకూ మాత్రమే తార్కికంగా ఆలోచించి వివేచనతో మెలగాలి.
మీకు మీరు

·         ఎదుటి వారిని ఎదుర్కోబోయేముందు మీకు మీరు కొంత ఉత్సాహాన్ని, ధైర్యాన్ని సమకూర్చుకోవాలి. ఇందుకు మీ మనసుకు అనందం కలిగించే పని ఏదైనా చెయ్యడం తోడ్పడుతుంది.

·         ఏ కార్యమైనా ప్రారంభించేటప్పుడు ఓటమి గురించి భయపడకూడదు. ఎవరికీ అన్ని వేళలా విజయం సాధ్యంకాదని గుర్తుంచుకోవాలి. ఏడాది పూర్తయ్యేలోగా వీరు ఏం సాధించాలనుకొంటున్నారో లిస్టు రాసుకోండి. అందుబాటులో ఉండి మీరు సాధించగలననుకొన్నవి అందులో చేర్చడం మంచిది.

ఏం కోరుకుంటాం

·         వ్యక్తిగతమైన అవసరాలు, వాటి కార్యాచరణ పై స్వతంత్రంగా వ్యవహరించగలగడం, ఎదుటివారితో సమానమైన తెలివితేటలు, సామర్ధ్యంగల వారిగా మర్యాదనాశించడం.

·         మనభావాలను వ్యక్తీకరించగలగడం.

·         మీకు మీరే 'ఎస్' కానీ 'నో' కానీ చెప్పుకోగల సామర్ధ్యం ఉండటం.

·         తప్పులు చేయడం

·         అభిప్రాయాలు మార్చుకోవడం.

·         ఏదేని విషయం అర్ధం కానప్పుడు స్పష్టంగా చెప్పడం.

·         మీకు కావలసినదాన్ని నిస్సంకోచంగా అడగడం.

·         ఇతరుల సమస్యలకు బాధ్యత వహించేందుకు అంగీకరించకపోవడం.

·         ఎదుటివారిపై ఆధారపడి, వారి అంగీకారం కోసం ఎదురు చూస్తున్నట్లుగా కాకుండా వారితో వ్యవహరించగలగడం.  స్నేహ హస్తాన్ని అందించాలి

·         మీ స్నేహితుల బాధ మీకూ బాధకలిగించే మాట వాస్తవమే. మీకు తోచిన ఉపాయం చెప్పివారి బాధను తగ్గించాల్సిందిపోయి మీరే కుంగిపోవడం, ఆందోళన చెందడం అర్ధంలేని విషయం. ఆపదలో ఉన్నవ్యక్తులకు అవసరమైనవి, వారాశించేవీ తమ కష్టం నుంచి బయటపడేందుకు ఉపకరించే ధైర్యవచనాలు, ఆదుకునే ఆత్మీయులు మాత్రమే 'భయపడకు నేస్తం, నీకు నేనున్నానంటూ' ఊరడించే మాటలతో వారిని ఓదార్చడం, స్నేహహస్తాన్ని అందించడం ఆత్మీయులుగా మీ కర్తవ్యం! అంతే తప్ప వారి కష్టాలకు మీరు బాధపడటం, వారిని మరింత బాధపెట్టడం స్నేహితులుగా మీరు చేయాల్సిన పని కాదు.

·         టైం మేనేజ్ మెంట్-The Mission for Success-సమయపాలన. ప్రతి నిమిషాన్నీ ఎంత నిర్మాణాత్మకంగా ఉపయోగించుకొంటున్నామన్నది ప్రధానం. కాలక్షేపం కబుర్లతో గంటల తరబడి టైం వేస్టు చేసుకోడం - మన ప్రగతికి ప్రతిబంధకం.

·         "దూరంగా .... సుదూరంగా కనీ కనిపించని మసక వెలుతురు కన్నా చేతికి అందేంత దగ్గరలో ఉన్న అవకాశాల్తి వినియోగించుకోడమే. విజ్ఞుల కర్తవ్యం. ప్రస్తుతమే ప్రధానం. మిగిలినవన్నీ అప్రస్తుతాలై. సమయపాలనే మార్గం. ఇంతకు మించి విజయ రహస్యం లేదు."

·         "మీ మొత్తం మేధస్సును ఉత్సాహాన్ని, ఆనందాన్ని, తెలివితేటల్ని, శ్రమను, ఆత్మవిశ్వాసాన్ని, ధైర్యాన్ని మొత్తం వీటన్నింటినీ పెట్టుబడిగా పెట్టి ఈ రోజు చేయాల్సిన పనిని చిత్తశుద్దితో చేయడమే. అలా ఈరోజు చేయాల్సిన పనిని క్రమం తప్పకుండా క్రమశిక్షణతో చేసుకొంటూపోతే....గతం నుంచి తీసుకొన్న అనుభవ సారాన్ని దీనికి పెట్టుబడి పెట్టి భవిష్యత్ ఆశల్ని నేటి కార్యాచరణలో ఇంధనంగా పోసి సాగితే మీరు ఏ పని చేవట్టినా విజయవంతం అవుతుంది. అంతే కానీ - నేటి గురించి మరిచిపోయి ఈ క్షణం చేయాల్సిన కర్తవ్యాన్ని మరిచిపోయి - నిన్నటి బాధల గురించో, రేపటి బెంగలను గురించో ఆలోచిస్తూ కూర్చోడం అర్ధం లేని పని.

·         సమయాన్ని సద్వినియోగం చేసుకొంటూ, ప్రతీక్షణం ఏదో ఒక కొత్త అంశం తెలుసుకోవాలన్న తపనను మీ జీవలక్షణంగా చేసుకోండి.

·         గల్లిక్ అనే ప్రభుత్వ పాలనా శాస్త్రవేత్త - POSDCORB అనే సూత్రం చెబుతాడు:
P - Planning ప్రణాళిక
O - Organization
వ్యవస్థీకరణ
S - Staffing
సిబ్బంది
D - Directing
మార్గనిర్దేశనం
CO - Coordination
సమన్వయం
R - Reporting
నివేదన
B - Budgeting
బడ్జెటింగ్

·         మన ఆలోచనల్ని సమన్వయం చేసుకోవాలి. ఒకేసారి వంద ఆలోచనలు ఉండొచ్చు కాని వాటన్నింటినీ సమన్వయ పరుచుకోవాలి. అంతే కాని ఒక ఆలోచన ఒకసారి చేసి, దాన్ని ఆచరించకుండానే మరో ఆలోచన చేయడం వల్ల ఉపయోగం లేదు.

·         మన తప్పుల్ని మనమే గుర్తించి మనపై మనం ఆత్మ విమర్శ చేసుకోవాలి. ఆ తప్పుల్ని తగ్గించుకొని భవిష్యత్ లో సాధ్యమైనంతవరకు తప్పులు చేయకుండా సాగేందుకు ఇది ఉపకరిస్తుంది.
డబ్బునూ, నీళ్ళనూ పొదుపుగా వాడినవాడు రాజుతో సమానం.

·         నిర్ణయాలు తీసుకోవటానికి ప్రత్యేకంగా దారంటూ లేదు. కేవలం అనుభవం, సహజజ్ఞానం, వాస్తవం... ఇవే నిర్ణయాన్ని సరైన సమయంలో తేసుకొనేందుకు సహాయపడతాయి. దానికంటూ ప్రత్యేకంగా మార్ందర్శక సూత్రాలు (గైడ్ లైన్స్) లేవు.

·         ఈత నేర్చుకోవడమనేది ఎలా సాధ్యం? దానిపై ఓ పుస్తకం రాసి దాన్ని చదివి అభ్యసించడం ద్వారా సాధ్యమా? లేదా ఎవరైనా ఈత కొడుతూంటే చూస్తుంటే మనకు ఈత వస్తుందా? కాదే కేవలం సంద్రంలో దూకి సుడిలో తేలి ప్రాక్టికల్ గా ఆభ్యసించినప్పుడే కదా - అదేవిధంగా జీవితంపట్ల ప్రాక్టికాలిటీ అవసరం. అలాంటి వాస్తవిక దృక్పథం ఉంటే ప్రతి ఒక్క క్షణాన్నీ సద్వినియోగ పరచాలన్న కాంక్ష పెరుగుతుంది.
ఒక అలోచన వస్తుంది. ఇది చేసేయాలి అది చేసేయాలి అంటూ అటూ ఇటూ కలియ తిరిగేస్తాం. తీరా ఆచరణలో బద్ధకం ప్రదర్శిస్తాం. ఆలోచన రావడం దాన్ని ఆచరించడంలో చొరవ చూపకపోవడం, దానికి బదులుగా డబ్బు లేదనో మరొకటనో కారణాల్ని చెప్పడం! లాంటివి చేస్తుంటాం.

·         ఒకనిర్దిష్ట ప్రయోజనం, పటిష్ఠమైన ప్రణాళిక ఉంటే - అలోచనలను ప్రాక్టికల్ గా సక్సెస్ చేసుకోవచ్చు.

·         ఆలోచనకు ప్రాణం పోయండి. దాన్ని ఆచరణ రూపంలో ముందుకు నడిపించండి. దానికి దిశానిర్సేశం చేయండి. ఎప్పటికప్పుడు మార్పు చేర్పులు చేయండి. సక్సెస్ మీదే.
మీకు వచ్చిన ఆలోచనను ఎలా కార్యరూపంలో పెట్టదలుచుకొన్నారో ఓ కాగితం మీద రాసుకోండి ఆ ఆలోచనను అమలు పరిచేందుకు మీకు ఎంత మంది అవసరం ఉంటుందో బేరీజు వేసుకోండి. ఆలాంటి వారినందరినీ కూడగట్టుకోండి.

·         అలా మీరు ఒక గ్రూప్ ను ఏర్పాటు చేసుకొన్న తర్వాత వారందరికీ చాలా స్పష్టంగా ఒక విషయం చెప్పండి. ఈ మొత్తం వెంచర్ లో ఒక్కోక్కరూ ఏ పని చేయాలి అది చేసినందుకు ఒక్కొక్కరికి ఎంతెంత ప్రయోజనం ఉంటుంది అని వివరించండి. ఇక్కడ ఒక్క విషయం గుర్తుంచుకోండి. ఏ వ్యక్తీ తనకు ప్రయోజనం లేకుండా ఏ పనీ చేయడు. అది డబ్బు రూపంలోనో, మరో రూపంలోనో కావచ్చు. కాని ప్రయోజనం మాత్రం ఉండాలి. ఇక రెండు, మీరు ఏ వ్యక్తినుంచీ అతనికి ఏ ప్రయోజనాన్నీ అందివ్వకుండా - సేవలు పొందాలని ప్రయత్నంచకండి - అది మొదట్లో బాగానే ఉన్నా చివరికి మీకు సరైన Quality of Service అందదు.

·         మీ గ్రూప్ తో వారంలో కనీసం రెండుసార్లు సమావేశమవండి. మీరు అనుకొన్న ప్రణాళిక సక్సెస్ అయ్యేంత వరకూ కనీసం వారంలో ఇంకా ఎక్కువ సార్లు కలవడానికి ప్రయత్నించండి. ఆలాంటి సమావేశాల్లో మీరందరూ ఎదుర్కొన్న సాధక బాధకాలేమిటో గుర్తించండి. ఎక్కడ మీ అలోచనల్లో తప్పుందో గమనించండి.

·         మీ గ్రూప్ లోని ప్రతి ఒక్కరితోనూ - సామరస్యాన్నే మెయింటైన్ చేయండి. స్నేహపూర్వక సుహృద్భావ వాతావరణంలో మాత్రమే మీరు అ సక్సెస్ సాధించగలరని గుర్తించండి.

·         మీరు ఒక సక్సెస్ సాధించాలనుకొన్నారు. అది మీలో Burning desire అయినప్పుడు మీరు కష్టపడక తప్పదు. మీ ఆలోచనలోనూ ప్రణాళికలోనూ ఎట్టి పరిస్థితుల్లోనూ లోపం లేకుండా ఉండేలా చూసుకొనే బాధ్యత మీదే!

·         సమయాన్ని వృధా చేయడమన్నది సర్వపాపాల్లోకెల్లా నీచమైన, ఘోరమైన పాపం. నిజానికి మనల్ని నరకానికి తీసుకువెళ్లేది ఈ పాపపు చర్యే, ఆనరకం - మనం చనిపోయిన తర్వాత ఎదురయ్యేదికాదు - ఇప్పుడే ఈ లోకంలో ఉండగానే ఆనరకం కనిపిస్తుంది. సమయాన్ని వృధా చేసుకోవడంవల్ల, ఏ పనీ చేయలేకపోవడం వల్ల చేయాల్సిన పనులు వాయిదా వేసుకొని లేనిపోని నష్టాలకు గురవడంవల్ల - ఎదురయ్యే నరకం అది! పనుల్ని. వస్తువుల్ని, మనసును, మనల్ని మన వాళ్లనూ మన చుట్టూ ఉన్న వాళ్లను చిందరవందర చేసేసే నరకం అది. బద్ధకం వల్ల పనుల్ని వాయీదా వేసే మనస్తత్వం ప్రారంభమై అది క్రమశిక్షణ లేకపోవడంతో పరాకాష్ఠకు చేరుతుంది.

·         సాధ్యమైనంత వరకు వాయిదా మనస్తత్వం నుంచి దూరం అయ్యేందుకు ప్రయత్నించండి. ఒక పని చిన్నదైనా, పెద్దదైనా దాన్ని సాధ్యమైనంత వరకూ ఎలాంటి పరిస్థితుల్లోనూ వాయిదా వైసేందుకు ప్రయత్నించకండి. ఒక్కసారి వాయిదా వేయడానికి అలవాటు పడితే ఇంక మీరు ఏ పనీ సకాలంలో చేయలేరు.

·         ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకొని అహర్నిశలూ పని చేస్తేనే కానీ లక్ష్యాన్ని చేరలేం. గమ్యాన్ని చేరుకోలేం.. వాయిదా వేయడం అలవరుచుకొంటే - ఆ లక్ష్యం మనకు సదా ఆమడ దురంలోనే ఉంటుంది. అంతేకాదు - ఏదైనా ఒక కష్టమైన పని వస్తే సాధారణంగా ఆ పని చేయడానికి మనం వెనకాడతాం. అలా ఒక పనిలో మీరు చూపే అశ్రద్ద - తదనంతర కాలంలో వాయిదా వేసే మనస్తత్వానికి లోనవుతారు. ఇది మద్యపాన వ్యసనం కన్నా భయంకరమైంది. ఇది నిజం.

·         పనులను మీరు సకాలంలో చేయకపోవడం వల్ల - ప్రతి విషయంలోనూ మీరు ఇతరుల కన్నా వెనుకనే ఉంటారు. ప్రతి అంశంలోనూ ఆపజయాల్నే ఎదుర్కొంటారు. దాంతో మీరు తెలీకుండానే డిప్రెషన్ లో పడిపోతారు. అది ఆత్మన్యూనతా భావంలోకి దారి తీస్తుంది. కాబట్టి ఎప్పటికప్పుడు మీరు మీ పనులను ఒక ప్రణాళిక ప్రకారం - బద్ధకించకుండా చేసుకొంటూ పోండి. లేకపోతే అది మానసిక రుగ్మతలకు దారితీస్తుంది. దీంతో బాధతో కుంగిపోవడం తప్ప చేసేదేమి ఉండదు.

·         వాయిదా వేసే మనస్తత్వానికి విరుగుడు ఒక్కటే - ప్రణాళికా బద్దంగా ఏది ముఖ్యమో, ఏది అంతగా ప్రాధాన్యం కాదో గుర్తించి - ప్రాధాన్యాంశాల్ని ఏ మాత్రం పోస్టుఫోన్ చేయకుండా చేసుకొంటూ పోవడమే! ఇది చెప్పినంత సులువేమీ కాదు. విజయాన్ని సాధించాలన్న తపన, ఒక పరీక్షలో పాసవ్వాలన్న తపన, నలుగురిలో గుర్తింపు పొందాలన్న తపన, డబ్బుల్ని, కీర్తి ప్రతిష్ఠల్ని సాధించాలన్న తపన - ఇవన్నీ మీ మనసులో ఉంటే ఇక ఏదీ వాయిదా వేయమన్నా వేయరు.

·         ఒక ప్రణాళిక ఫెయిలయితే....ఒక అలోచన ఫెయిలయితే కంగారుపడకండి. మరో ప్రణాళికను సిద్ధం చేసుకొని అమలుపరచండి. అదీ ఫెయిలయిందా అయినా బెంగలేదు. మరో ప్రణాళికను సిద్ధం చేసుకోండి. ఇలా...... ఎంత కాలం అంటారా....సక్సెస్ సాధించేంతవరకు, అలా అలా వైఫల్యాలు పొందితే ఏదో ఒక సందర్బంలో మీకు సక్సెస్ ఫుల్ ప్లాన్ సిద్థం అవుతుంది. అయితే ప్రతి వైఫల్యం నుంచీ గుణపాఠం నేర్చుకొని ఆ తప్పుల్ని తిరిగి చేయకుండా ఉంటేనే.

·         మండుతున్న కాగడాను కిందకు వంచినా మంట పైకి ఎగజిమ్ముతుందే కానీ కిందికి పడిపోదు...ధైర్యవంతులూ అంతే... ఎన్ని ప్రణాళికలు ఫెయిలైనా కిందికి వరగాల్సి వచ్చినా - ధైర్యం మాత్రం పైకే ఎగజిమ్ముతుంది. అలాంటి వారినే సక్సెస్ వరించేది!.

·         మీరు ఓక్లర్క్ గానో, నిరుద్యోగిగానో ఉండిపోయారూ అంటే దానికి కారణం - మీ దగ్గర పటిష్ఠమైన ప్రణాళిక లేకపోవడం; లేదా ఆసలు ఓ ప్రణాళిక వేసుకొని జీవితంలో పైకి ఎదగాలన్న ఆలోచనే లేకపోవడం లేదా అసలు ఓ ప్రణాళిక వేసుకొని జీవితంలో పైకి ఎదగాలన్న ఆలోచనే లేకపోవడం. అసలు పటిష్ఠమైన ప్రణాళిక ఉంటే సగం సక్సెస్ సాధించినట్లే! అందుకే-A winner never quit -A quitter never wins

·         నేను రాజ్యాలను పోగొట్టుకోవచ్చు కాని కాలాన్ని పోగొట్టుకోను - నెపోలియన్.

·         కాలాన్ని మనం సరిగా ఉపయోగించకపోతే అది మనపై లాఠీచార్జి చేస్తుంది - కిరణ్ బేడి.

·         విషాదంగా చూస్తూ గతాన్ని తవ్వకు అది తిరిగి రాదు. వర్తమానాన్ని ఉపయోగించుకో - తైలివిగా ! అది నీదే. భవిష్యత్ అస్పష్ట రేఖల దోబూచులాట. ధైర్యంగా, ఆత్మవిశ్వాసంతో ఆడాల్సిన ఆట ఆది - లాంగ్ ఫెలో.

·         పనిలో ఉద్యమించండి. మీరు పట్టలేనంతగా అద్భుతశక్తి మిమ్మల్ని ఆవహించడాన్ని మీరే గమనిస్తారు - రామకృష్ణ పరమహంస

·         మి లక్ష్యసాధనకు మీ జీవితాన్ని అంకితం చేయండి. వ్యర్ధ కార్యకలాపాలకు, అనవసర కాలక్షేపాలకు కాదు. ఆప్పుడు మీ జీవితమే సార్ధకమవుతుంది.

·         పని చేయకుండా గంటల తరబడినిద్రపోవడం, కబుర్లు చెప్పడం, పుకార్లు అల్లడం లాంటివి చేయకండి. ఓ పుస్తకం చదువుకోడం, ఓ పరీక్షకు ప్రిపేర్ అవడం, ట్యూషన్లు చెప్పడం బొమ్మలు తయారుచేయడం, ఎంబ్రాయిడరీ నేర్చుకోడం, తదితర ఉత్పాదక పనుల్లో మునిగి తేలుతారు.

·         ఫాల్స్ ప్రిస్టేజిలు వద్దు ఇతరుల కోసం అనవసరంగా సమయాన్ని వృధా చేయకండి. మనం బతుకుతున్నది మన కోసం ఇతరుల కోసం కాదు - ఇతరులు ఏదో ఆనుకొంటారని మీరు వెనకడుగు వేయవద్దు. మీరు చేసే పనులను ఇతరులు విమర్శిస్తారని సంకోచించవద్దు. ఎవరో ఏదో అనుకొంటారని మీరు కూచున్న చోటనే ఉండిపోవద్దు. ఇది మీ జీవితం. మీ మనస్సాక్షి చెప్పినట్లు నడుచుకోండి. పూర్వ అనుభవాల ద్వారా మంచి పరిచయాల ద్వారా విజ్ఞానం ద్వారా సంస్కారం ద్వారా చిత్తశుద్ది ద్వారా "మంచి" వైపు నడిచేటట్లు మీ మనసును Train up చేయండి. ఆప్పుడు మీ మనస్సాక్షి ఎప్పుడూ మీకు మంచే చెబుతుంది. ఆలాంటి సంస్కారం మీ మనసుకు నేర్పండి. దీన్నే Sixth Sense అంటారు. అప్పుడు మీ మనస్సాక్షి చెప్పింది మీరు వినొచ్చు.. అది చెప్పే మంచి బాటనే నడవొచ్చు.

·         మనం మనకోసం, మన జీవిత ఆదర్శంకోసం, ఉన్నతస్థితి కోసం సమయపాలన పాటించాలి.  Creativity comes from hard work.

·         నెలనెలా కట్టే ఫోను, కరెంటు, స్కూలు ఫీజూ రసీదులను చక్కగా ఒక ఫైలులో భద్రపరిస్తే వెతుక్కోవడానికి సమయం వృధాకాదు. ఆలాగే అందరి మెడికల్ రిపోర్టులు కూడా ఒక ఫైలులో విడివిడిగా భద్రపరచాలి.

·         అవసరమైన టెలిఫోన్ నంబర్లు, అడ్రసులు అన్ని ఒకే పుస్తకంలో రాసి ఫోను పక్కనే పెట్టుకోవాలి. కాగితాల మీద నోట్ చోసుకొని ఆనక పారేసుకొని గంటలతరబడి వెదకడం వృధా.
బయటికి వెళ్లేటప్పుడు ఏయే పనులు చూసుకోవాలో గుర్తు చేసుకొని దేనికి ఎంత సమయం పడుతుంది, ఎంత దూరంలో ఉంది మొదలయిన విషయాలు ఆలోచించుకొని వరసగా చేసుకోవాలి. లేకపోతే ఆనవసరంగా తిరగడంతోపాటు టైమూ వేస్టవుతుంది.

·         వారమంతా పనితో అలసి పోయాం అనుకొంటూ అవసరం లేకున్నా ఆదివారం పూట బారెడు పొద్దెక్కే వరకు లేవకపోవడాన్ని అలవాటు చేసుకోవద్దు. అది లేని బద్దకాన్ని పెంచేందుకు తప్ప మరెందుకూ ఉపయోగించదు. దాని బదులు ఉదయాన్నే మామూలుగా లేవండి. వాకింగ్, స్విమ్మింగ్, గార్డెనింగ్ ఇలా మీకిష్టమైన హాబీని ఏదో ఒకదాన్ని ఆచరించండి.

·         ఏదన్నా పని ప్రారంభించడానికి ఇంకా పది, పదిహేను నిమిషాల టైముంటే, అప్పటి వరకూ ఎదురు చూస్తూ సమయాన్ని వృధా చేయకండి. అదే టైమును మరో చిన్నపని పూర్తి చేయడానికి వినియోగించవచ్చన్న విషయాన్ని విస్మరించకండి.

·         చేయాల్సిన పనిని రేపుచేద్దాం, మాపు చేద్దాం అంటూ వాయిదా వేస్తూ పోయే కన్నా చేసే పనిని సవ్యంగా, సకాలంలో పూర్తి చేయడం ద్వారా పరిపూర్ణతను పొందవచ్చని గ్రహించండి.

 

కామెంట్‌లు లేవు: