Gurukrupa
|
Posted: 16 Sep 2012 09:15 PM PDT
గణేశమేకదంతం చ
హేరంబం విఘ్ననాయకం లంబోదరం శూర్పకర్ణం గజవక్త్రం గుహాగ్రజం ఏదైన మంచి పని మొదలుపెడితే చాలా ఆటంకాలు ఎదురవుతాయి. సమస్త విఘ్నాలకు అధిపతి వినాయకుడు. వాటి నివారణ ఆయన ఆధీనంలో ఉంటుంది. "కార్యారంభే గణేశశ్చ పూజనీయం ప్రయత్నతః" అందుకే ఏ శుభకార్యమైన మొట్టమొదటగా వినాయకుడి పూజ చేయాలనే సంప్రదాయాన్ని మన ఋషీశ్వరులు ప్రవేశపెట్టారు. భాద్రపద శుద్ధ చవితి నాడు, మధ్యహ్న సమయమున, పార్వతి కుమారుడిగా ప్రణవస్వరూపుడైన వినాయకుడు ఆవిర్భవించాడు. బిల్వాలు, దూర్వాలు, గరిక వినాయకుడికి ఇష్టం. ఉండ్రాళ్ళు, కుడుములు, అరటి, కొబ్బరికాయలు గణేశునకు ఇష్టం. గణేషుడు క్షిప్రప్రసాది. వినాయకుడు బుద్ధిని ప్రసాదిస్తే, సిద్ధి తనంతట తానే ప్రాప్తించగలదంటారు. వినాయకుడి తొండం ఓంకారానికి ప్రతీక. ఏకదంతం పరబ్రహ్మకు, చేట వంటి చెవులు మంచి విషయాలు వినడానికి, చెడు విషయాలను విడవడానికి, ఉదరం బ్రహ్మాండానికి సంకేతం. హస్తమునందలి పాశ అంకుశాలు రాగక్రోధాలను అణచివేయుటకు, మోదకం ఆనందానికి ప్రతీకలు. అభయహస్తం రక్షణ కవచం. విఘ్నేషుడి పూజలో గరిక ప్రధానమైనది. గరిక బుద్ధి మీద పనిచేస్తుంది. చతుర్ధినాడు మట్టితో చేసిన వినాయకుడిని ఆరాధించి వర"సిద్ధి"ని పొందుతాము. హాస్య రసాధిపతి గణేసుడు. గుంజీలు తీయడం స్వామికి ఇష్టమని ప్రతీతి. చవితి నాడు చంద్రదోష పరిహారార్ధం గణేషుడిని పూజించాలి. ఛతుర్ధి దర్శనదోషం పోవడానికి సింహః ప్రసేన మవధీః సింహ జాంబవతాహతః సుకుమారక మారోతీః తమ హ్యేష శ్యమంతకః శ్యమంతకమణి అపరించాడన్న అపవాదు నుండి విముక్తుడయ్యాడనే ఈ శ్లోకం అర్ధం. అపవాద దోషాలను పోగొడుతుందని నమ్మకం |
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి