Posted: 22 Sep 2012 07:08 AM PDT
వందే నృసింహం దేవేశం హేమసింహాసనస్థితం
వివృతాస్యం త్రిణయనం శరదిందు సమప్రభం లక్ష్మ్యలింగిత వామాంగం విభూతిభిరుపాశ్రితం చతుర్భుజం కోమలాంగం స్వర్ణకుండల శోభితం ఉరోజ శోభితోరస్కం రత్నకేయూరముద్రితం తప్తకాంచన సంకాశం పీతనిర్మల వాసనం ఇంద్రాది సురమౌళిస్థ స్ఫురన్మాణిక్య దీప్తిభిః నీరాజిత పదద్వంద్వం శంఖచక్రాది హేతిభిః గరుత్మాతా సవినయం స్తూయమానం ముదాన్వితం హృత్సరోజనదావాసం ప్రహ్లాదవరదం హరిం "దేవతలకు ప్రభువైన శ్రీనృసింహస్వామి బంగారు సింహాసనం పై కూర్చొని ఉన్నారు. తెరచిన నోటితో, మూడుకన్నులతో, శరత్కాల చంద్రునివంటి చాయతో, వామభాగమున లక్ష్మీదేవితో, సమస్త మంగళకర శక్తులతో భాసిస్తున్నాడు. చతుర్భుజాలతో, సుందరతనువుతో, స్వర్ణకుండలాలతో, శ్రీవత్సలాంచన శోభితమైన ఛాతితో, రత్నకేయూరాల తో, పుటం పెట్టిన బంగారంలా, పీతాంబరధారియై శోభిస్తున్నాడు. ఇంద్రాదులు వంగి నమస్కరిస్తూండగా, వారి కిరీటాల మణుల కాంతులే హారతులై మెరుస్తున్నాయి. ఆ వెలుగులతో, శంఖచక్రాది చిహ్నాలతోనున్న పాదములు విరాజిల్లుతున్నాయి. వినయంతో ఉన్న గరుత్మంతుడు స్తోత్రిస్తుండగా ఆనందిస్తున్న శ్రీహరి ప్రహ్లాదవరదుడై నా హృదయకమలంలో యెల్లప్పుడూ నివసిస్తున్నాడు. ఆ స్వామికి వందనములు. |
మనసులో అనుభూతులను నలుగురితో పంచుకోవాలి అన్న ఆకాంక్షకు రూపం ఈ నా ప్రయత్నం.నాకు మన దేశం గురించి,మన సంప్రదాయాలు,అలవాట్లు, ఆచారాలూ,పద్దతులు మరియు మనం ప్రపంచం మొత్తానికి ఇచ్చిన ఆధ్యాత్మిక జ్ఞానం అన్న,దాని గురించి తెలుసుకోవడం అన్న,చెప్పడం అన్న చాలా ఇష్టం.అందుకే నా అంతరంగాన్ని,భావాలను,నాకు తెలిసిన,నేను సేకరించిన సమాచారాన్ని ఒక దగ్గర చేర్చాలనే ఈ బ్లాగ్ స్టార్ట్ చెయ్యడం జరిగింది.నేను ఎక్కడైనా చదివిన,చూసిన,నాకు తెలిసిన మంచి సమాచారాన్ని ఇందులోపొందుపరచి అందరికి ఒక బ్లాగ్ లో ఇవ్వాలని ఆసిస్తూ మీ శ్రేయోభిలాషి
25, సెప్టెంబర్ 2012, మంగళవారం
Re: Gurukrupa
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి