1.వస్తా వట్టిది... పోతా వట్టిది! ఆశ ఎందుకంటా? చేసిన ధర్మము చెడని పదార్థము... చేరును నీవెంట..2.నువ్వు తినే ప్రతి ఒక మెతుకు ఈ సంఘం పండించింది గర్వించే ఈ నీ బ్రతుకు సమాజమే మలిచింది ఋణం తీర్చు తరుణం వస్తే తప్పించుకు పోతున్నావా తెప్ప తగలపెట్టేస్తావా ఏరు దాటగానే...

12, జులై 2013, శుక్రవారం

FW: hii

 

1 ఆరోగ్యమే మహాభాగ్యం

2 ఆకలి రుచెరగదు, నిద్ర సుఖమెరుగదు

3 ఆడువారి మాటలకు అర్ధాలే వేరు

4 ఆకారపుష్టి నైవేద్యనష్టి

5 ఆకులు నాకేవాడిటికి మూతులు నాకేవాడు వాచ్చాడట

6 ఆడలేక మద్దెల ఓడు అన్నట్లు

7 ఆకాశానికి హద్దే లేదు

8 ఆడే కాలూ, పాడే నోరూ ఊరికే ఉండవు

9 తాను ముక్కే

10 ఆడది తిరిగి చెడుతుంది, మగవాడు తిరక్క చెడతాడు

11 ఆత్రపు పెళ్ళికొడుకు అత్త మెళ్ళో తాళి కట్టినట్లు

12 ఆడి తప్ప రాదు, పలికి బొంక రాదు

13 ఆస్తి మూరెడు ఆశ బారెడు

14 ఆదిలోనే హంసపాదు

15 ఆరిపోయే దీపానికి వెలుగెక్కువ

16 ఆలి బెల్లమాయె తల్లి అల్లమాయె

17 ఆవులలో ఆబోతై తినాలి, అత్తవారింట్లో అల్లుడై తినాలి

18 ఆరు నెలలు సావాసం చేస్తే వారు వీరవుతారు

19 ఆలూలేదు చూలులేదు కొడుకుపేరు సోమలింగం

20 ఆవు తొలిచూలు, గేదె మలిచూలు

21 ఆశకి అంతం లేదు

22 ఆవులిస్తే ప్రేగులు లెక్క పెట్టే రకం

 

కామెంట్‌లు లేవు: