1.వస్తా వట్టిది... పోతా వట్టిది! ఆశ ఎందుకంటా? చేసిన ధర్మము చెడని పదార్థము... చేరును నీవెంట..2.నువ్వు తినే ప్రతి ఒక మెతుకు ఈ సంఘం పండించింది గర్వించే ఈ నీ బ్రతుకు సమాజమే మలిచింది ఋణం తీర్చు తరుణం వస్తే తప్పించుకు పోతున్నావా తెప్ప తగలపెట్టేస్తావా ఏరు దాటగానే...

24, ఫిబ్రవరి 2014, సోమవారం

మనసెప్పుడు లక్ష్యం మీదకు పోతుంది కాని, లక్షల మీదకు పోవటం లేదు

అందరు వ్యక్తిగత జీవితం గురించి ఆలోచించు, సంపాదించు అని (నా మంచి కోసమే అనుకోండి) చెప్తూ ఉంటారు. నాకేమో కొత్తగా అనిపిస్తుంది... ఏమిటో మరి నా  మనసెప్పుడు లక్ష్యం మీదకు పోతుంది కాని, లక్షల మీదకు పోవటం లేదు... అందుకేనేమో నేనెప్పుడు సంతోషంగా ఉండ గాలుగుతున్నానేమో. ముందు చూపు మంచిదే కాదనను కాని, మరి అంత స్వార్ధంగా ఆలోచించాలాఅనిపిస్తుంది.... ఇలా నాలో జరిగే ఘర్షణలో చివరి ఆఖరికి నన్ను నేను గెలిపించుకోంటూ, అవును మన జీవితం ప్రజల సేవకే అంకితం అనుకుంటూ వెళ్లిపోతు ఉంటాను...

మనం నలుగురి కోసం ఆలోచించినప్పుడు మన కోసం ఆలోచించే వాడు ఒకడున్నాడు అన్నది నేను నమ్మేది (నా జీవితంలో జరిగేది కూడా). దీనికి తోడు మనకి డబ్బు మీద ఆసక్తి లేదు కాబట్టి ఏదో ఒక పని చేసుకొని జీతం తక్కు వైన హాయిగ, ఆనందంగా బ్రతికేయవచ్చు అనే ధీమ... నా మీద నాకు ఉన్నది విశ్వాసమే కాని ఓవర్ కాన్ఫిడెన్స్ కాదు అనిపిస్తుంది.. ఏది ఏమైనా నా జీవితం లో నేను మంచి మర్గాన నడుస్తూ, మరి కొంత మందిని త్రోవలోకి తీసుకు రావాలని... తద్వారా నాకు జన్మను ప్రసాదించిన తల్లి తండ్రుల ఋణం తీర్చుకోవాలని (చూసారా ఇక్కడ కూడా స్వార్థమే) కోరిక, అశ... అందుకే నా నర నరాల్లో మంచిని, సేవ గుణాన్ని పెంచుకోవడమే జీవిత లక్ష్యంగా పెట్టాడు మరియు ఎప్పుడు ఆశావహ దృక్పథాన్ని, ఏమి పట్టించుకోని స్వభావాన్ని ఇచ్చాడు దేవుడు.

సమయం ఉండాలే గాని... ఇలా ఏదేదో చెప్తూనే వుంటాను... అందుకే నా కలం పేరు "అనంతరంగం" అని పెట్టుకున్నాను..... ఇట్లు మీ అమ్మ శ్రీనివాస్.. నా మరిన్ని రాతల కోసం "నా రాతలు అనే కాలమ్ ని కింది బ్లాగ్ లో చదవవొచ్చు

కామెంట్‌లు లేవు: