పొద్దున్నే పికప్ కార్లో ఆఫీస్‌కెళ్లడం దగ్గర్నుండి రాత్రి వరకూ నీడపట్టూనా, Acలో గడిపేసే సాఫ్ట్‌వేర్ ఉద్యోగులూ, ఎండలోకెళ్తే పిగ్నమెంటేషన్ అవుతుందని ఎండకు అస్సలు expose అవని గృహిణులు వంటి ప్రతీ ఒక్కరూ ఓసారి బద్ధకించకుండా, కాజువల్‌గా చదివి వదిలేయకుండా
Vitamin D టెస్ట్ చేయించుకోండి.
విటమిన్ D రేంజ్ శరీరంలో 30 నుండి 100 ng మధ్య విలువ ఉంటే సరిపడా ఉన్నట్లు.
విటమిన్ D గురించి పెద్దగా ప్రచారం జరగకపోవడం వల్ల ఎవ్వరూ పెద్దగా పట్టించుకోవట్లేదు. అతి కీలకమైన ఈ విటమిన్ లోపం వల్ల కొద్దిగా వర్క్ చేసినా మజిల్ పెయిన్స్, bones వీక్ అవడం, బ్రెయిన్ మొద్దుబారిపోవడం, బ్రెయిన్‌లో న్యూరాన్ల మధ్య కమ్యూనికేషన్ లోపించడం, కొన్ని రకాల
క్యాన్సర్లూ, డిప్రెషన్, బాగా అలసటగా ఉండడం, వత్తిడి తట్టుకోలేకపోవడం, మెటబాలిక్ రేట్, బాడీలో న్యూట్రీషనల్ అబ్జాప్షన్ తగ్గడం దానివల్ల ఫుడ్ వంటబట్టకపోవడం వంటి అనేక సమస్యలు ఉత్పన్నం అవుతుంటాయి.
డాక్టర్లు BPలూ, షుగర్ల గురించీ, క్యాన్సర్ల గురించి ఎక్కువెక్కువ చెప్పేస్తుంటారు గానీ దీని గురించి ఇంతవరకూ పెద్దగా ఎవరూ పట్టించుకోవట్లేదు. యూరోపియన్ సమాజం కేవలం విటమిన్ D లోపం వల్ల చాలా సమస్యలు ఎదుర్కొంటోంది.
కేప్యూల్స్ వాడకండి...
చాలామందికి A&D విటమిన్ క్యాప్యూల్స్ వాడడం అలవాటు, లేకపోతే మల్టీమిటమిన్ టాబ్లెట్లు వేసుకుంటే చాలనుకుంటారు. నా ప్రాక్టికల్ అనుభవంలో ఇది తప్పని తేలింది. నేను రోజూ ఉపయోగించే ఓ మల్టీవిటమిన్ టాబ్లెట్‌లో 1000 IU మొత్తంలో విటమిన్ D ఉంటుందని రాయబడి ఉంది. ఒక మనిషికి రోజుకి సరపడా క్వాంటిటీనే అది. కానీ జనరల్ ఛెకప్‌లో భాగంగా అన్ని టెస్టులూ చేయించుకుంటే.. అన్ని టెస్టులూ చాలా perfectగా వచ్చాయి గానీ Vitamin D ఒక్కటి ఎంత తక్కువ వచ్చిందో మీరే ఈ ఫొటోలో చూడొచ్చు.
విటమిన్ D కొన్ని రకాల ఆహార పదార్థాల ద్వారా వచ్చినా అది శరీరానికి సరిపడా ఉండదు. అలాగే టాబ్లెట్ల వంటి సప్లిమెంట్ల ద్వారా పూడ్చుకునేదీ కాదు. ఖచ్చితంగా రోజుకి ఓ ముప్పావుగంట నుండి గంట వరకూ ఎండలో వాకింగ్ లాంటివి చేయడమో, నిలబడడమో వంటివి చేయాల్సిందే.
విటమిన్ D లోపిస్తే మీరు ఎంత కాల్షియం తిన్నా, టాబ్లెట్లు వాడినా ఎముకలు బలంగా తయారవ్వవు. కాల్షియం మాత్రమే కాదు ఇతర పోషక విలువలు అన్నీ శరీరానికి సక్రమంగా అందవు.
ఈ లాజిక్ మీకు బాగా అర్థం కావాలంటే, మీలో ఎవరికైనా మొక్కలు పెంచే అలవాటు ఉంటే ఏదైనా మొక్కని నీడలో పెట్టండి.. కొన్నాళ్లకు అది చచ్చిపోతుంది.. మనిషి పరిస్థితీ అంతే!!
సో ఫ్రెండ్స్ అన్ని రకాలుగా ఫిట్‌గా ఉండే నేను విటమిన్ D గురించి పూర్తిగా స్టడీ చేసి నా స్వీయానుభవం ద్వారా చెప్తున్న మాటలు ఇవి. నిర్లక్ష్యం చేయకండి. వెంటనే టెస్ట్ చేయించుకుని తగిన జాగ్రత్తలు పాటించండి.
దాదాపు గంట వరకూ ఎండ నేరుగా మన శరీరంపై ప్రసరిస్తే చాలు, చర్మంలోని cellsలో సూర్యుడి ద్వారా వచ్చిన D విటమిన్ భద్రపరచబడి శరీరానికి అవసరం అయినప్పుడల్లా అందించబడుతుంటుంది. మీరు అన్నట్లు 2-3 గంటలు ఉంటే అసలు ఈ సమస్యే ఉండదు - నల్లమోతు శ్రీధర్

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి