నాలుగు ఊచల్లోంచి బయటకి చూస్తున్నాను...
చల్లని గాలి, పచ్చని చెట్లు అలా అలా వెళ్లిపోతున్నాయి, రైలుతో పాటు మాత్రమే కాదు, కాలంతో పాటు,కాలగర్భంలోకి కూడా....
ఏసుదాసు గారు అద్భుతంగా ఆలపించిన "ప్రకృతి...ప్రకృతి... ఎంతటి భాగ్యశీలివమ్మా...." అనే పాట లాంటి ఎన్నో ప్రకృతి పాటలు మనసారా వినడానికి ధైర్మ్యం కూడా చాలడంలేదు....
నిజమే మరి.. నాగరికుడు నరికి నరికి నాగరికత లేని చోటుకు పయనించే క్రమంలో.... మూలాలను మరచి, మూన్నాళ్ళ ముచ్చటల కోసం..
మనిషికి కించిత్ స్వార్ధం అవసరమే మరి, కానీ ప్రకృతికి ఇంచి కూడా మిగల్చనంత స్వార్థం అత్యవసరమా లేక అతి అవసరమా ????
నా అనంతరంగం అమ్మ శ్రీనివాస్
2017/09/20 23:12
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి