1.వస్తా వట్టిది... పోతా వట్టిది! ఆశ ఎందుకంటా? చేసిన ధర్మము చెడని పదార్థము... చేరును నీవెంట..2.నువ్వు తినే ప్రతి ఒక మెతుకు ఈ సంఘం పండించింది గర్వించే ఈ నీ బ్రతుకు సమాజమే మలిచింది ఋణం తీర్చు తరుణం వస్తే తప్పించుకు పోతున్నావా తెప్ప తగలపెట్టేస్తావా ఏరు దాటగానే...

14, సెప్టెంబర్ 2017, గురువారం

3వ వ్యక్తి సమస్యని పెంచేవారా లేదా పరిష్కరించి, సంబంధాలను పునరుద్ధరించేవారా?

ఏ ఇద్దరు బంధువులు కలుసుకున్నా....
ఏ ఇద్దరు స్నేహితులు కలుసుకున్నా...
ఏ రెండు కుటుంబాలు కలుసుకున్నా...
ఏ ఇద్దరు ఉద్యోగులు కలుసుకున్నా...

కుటుంబం అయినా, సంస్థయినా, స్నేహ బృందం అయినా, ఉద్యోగస్తుల సమూహం అయినా (అందరూ అని అనలేం కానీ, ఎక్కువ శాతం మంది) తరచూ కానీ, అప్పుడప్పుడు కానీ కలుసుకున్నపుడు ఒక మంచి సహృద్భావ వాతావరణంలో ఉండక, మంచి విషయాలు చర్చించక, మంచిని, మంచితనాన్ని ప్రోత్సహించక.. తమలో వుండే లోపాలను, తమ తప్పులను కప్పిపుచ్చుకోవడం కోసం, సానుభూతి పొందడం కోసం, తమ వాదాన్ని బలపరచుకోవడం కోసం, తమ ఆహాన్ని చల్లార్చుకోవడం కోసం, మానసిక పరిపక్వత లేక, పూర్తిగా తెలుసుకోకుండా, తెలిసీ తెలియని తనంతో, తమ ఆలోచనల ఆధారంతో...లేనిది ఉన్నట్టు, వున్నది లేనట్టు, తెలియనిది తెలిసినట్టు, తెలిసిన తెలియనట్టు... చెడును ప్రోత్సాహిస్తూ, వ్యాప్తి చేస్తూ మనుషుల మధ్య, మనసుల మధ్య నిర్మించుకోలేని అంతరాలు కట్టడానికి నాంది పలుకుతున్నారు.

వీరు చేసే ఈ చిన్న తెలివి తక్కువ పని వల్ల చెడు వ్యాపించి ఎన్నో ఏళ్లుగా కష్టపడి నిర్మించుకున్న భంధాలు, బంధవ్యాలు, కుటుంబాలు, సంస్థలు ఎన్నో కూకటి వేళ్లతో సహా పెకిలించుకుపోయాయి. పాపం వారికి తెలీదు మన చిన్న చర్చ వల్ల ఇంత జరుగుతుంది అని, ఎందుకంటే వారికి మానసిక పరిపక్వత లేదు కాబట్టి...కొంత మంది తెలిసీ చేస్తారు అలాంటి వారిది నిస్సందేహంగా చెడు ఆలోచన, చెడు స్వభావమే...

3 వ వ్యక్తి ఏమి చెయ్యాలి ...

- మనస్పర్థలు వచ్చిన ఇద్దరు వ్యక్తుల మధ్య ఉన్న మంచి సంబంధాన్ని గుర్తు చేస్తూ, ఆ బంధాన్ని పెంపొందించే విధంగానో లేదా

- ఇతను (3వ వ్యక్తి దగ్గరకు వచ్చి చర్చిస్తున్న వ్యక్తి) తప్పుగా ఆలోచిస్తుంటే నీ ఆలోచన తప్పు అని చెప్పగలగడమో లేదా

- అసలు సమస్య ఎందుకు వచ్చింది దానిని పరిష్కరించుకోవడానికి 3వ వ్యక్తి దగ్గరకు వచ్చిన వ్యక్తి ఏమి చెయ్యాలని సూచన చేసే విధంగానో లేదా

- అవతలి వారిది తప్పు అని తెలిసినప్పుడు, తన దగ్గరకు వచ్చిన వ్యక్తే నేరుగా వెళ్లి ఇబ్బంది / మనస్పర్థలు ఉన్న వారితో చర్చించడం ద్వారా దానిని పరిష్కరించడానికి ... వారిద్దరే ఎలా భాద్యత తీసుకోవాలో చెప్పాలి. ఎలా సహృద్భావ వాతావరణాన్ని, బంధాన్ని ఏర్పరుచుకోవాలి చర్చించాలి.

మొత్తం మీద అవతలి వారు మరింత వెధవ అని నిర్ణయించే విధంగానో, వ్యవస్థ, సంస్థ, కుటుంబం మంచికాదు అని తీర్మానించడానికో కాకుండా మంచిని,మానవత్వాన్ని,  పోసిటీవిటీనీ పెంచి, ఆ భాధ్యతను తనే  తీసుకొని సమస్యకి పరిష్కారం కనుగొని, బంధాలను తిరిగి పునరిద్దరించుకొనే విధంగా అతనికి సూచించే విధంగా 3వ వ్యక్తి పాత్ర ఉండాలి.*

భావజాల వ్యాప్తి ఎంతగా పని చేస్తుందో చూడండి. ఇది సహజంగా మనందరం చూస్తూ ఉన్నదే, తెలిసినదే.... చెడుకు బదులు మంచిని పెంపొందిస్తూ పోతే అసలు ఇలాంటి అపార్ధాలు సమస్యలుగా మారవు.

*మనం చేసే ఏ పనిలో నైనా మంచిని పెంపొందింస్తూ, అందరిని ఒకే కుటుంబంగా దగ్గర చేయడమే మనం ప్రతి ఒక్కరం చెయ్యవలసిన కనీస పని. అది స్నేహంలో అయిన, కుటుంబంలో నైనా, ఉద్యోగంలోనైనా, సంస్థలోనైనా.....*

నా రాతలు మరిన్ని చదవాలంటే దయచేసి కింద లింక్ క్లిక్ చెయ్యండి
http://ammasrinivas4u.blogspot.in/search/label/1.%20నా%20రాతలు%20%2F%20My%20Writtings?m=0

కామెంట్‌లు లేవు: