రోజూ పడుకోబోయే ముందు మనం ఇతరులకు ఏమి సహాయం చేసాం లేదా ఏమి మంచి పని చేసాం అని ఆలోచించాలి. ఇది చాలా మంచి విషయం.
*కానీ దీనికంటే ముందు మనం మనలోని సామర్ధ్యాలను పెంచుకువడానికి, మనలోని మంచిని పెంచుకోవడానికి, మనలోని చెడును తగ్గించుకొని, లోపాలను సరిదిద్దుకివడానికి మనం ఏమి చేసాం అని ఆలోచించడం* ఇంకా ముఖ్యమైన విషయం అని నాకనిపిస్తుంది.
*అంటే నిన్ను నువ్వు మంచి వ్యక్తిత్వం గల వ్యక్తిగా మార్చుకోవడానికి, నీ కోసం, నీ అభివృద్ధి కోసం ఈ రోజు నువ్వు చేసిన పని ఏమిటి.....*
ఎవరూ... ఎవరికీ.. ఏమి చేయకపోయినా... ఎవరికి వారు మంచిగా మారితే చాలుగా... సమాజంలోని కుళ్లును కడగాలి అనుకునే ముందు, *మనలోని కుళ్లును మనమే శుభ్రం చేసుకొంటె సరిపోద్దిగా....*
*ఈ రోజు సమాజంలో అతి పెద్ద రోగం, ఎవరి శక్తి సామర్ద్యాల మీద వారికి నమ్మకం లేకపోవడంతో పాటు ఎవరి తప్పులను వారు సరిదిద్దుకోలేకపోవడమే* అని నా అభిప్రాయం...
అందరికి విజయ దశమి శుభాకాంక్షలు.....
నా అనంతరంగం .. అమ్మ శ్రీనివాస్.. 2017/09/29 23:15
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి