1.వస్తా వట్టిది... పోతా వట్టిది! ఆశ ఎందుకంటా? చేసిన ధర్మము చెడని పదార్థము... చేరును నీవెంట..2.నువ్వు తినే ప్రతి ఒక మెతుకు ఈ సంఘం పండించింది గర్వించే ఈ నీ బ్రతుకు సమాజమే మలిచింది ఋణం తీర్చు తరుణం వస్తే తప్పించుకు పోతున్నావా తెప్ప తగలపెట్టేస్తావా ఏరు దాటగానే...

30, సెప్టెంబర్ 2017, శనివారం

దేవుని కరుణ మనపై ఉన్నదా లేదా తెలుసుకోవడానికి

దేవుని కరుణ మనపై ఉన్నదా లేదా తెలుసుకోవడానికి మనకి డబ్బు సంపాదించడానికి ఎంత మంచి ఉద్యోగం ఇచ్చాడా, ఇల్లు ఇచ్చాడా, వసతులు ఇచ్చాడా అనే దానికంటే ....

ఎంత మంది గొప్ప వ్యక్తులను కలిసే అవకాశం ఇచ్చాడా, అలాంటి వారిని ఎన్ని ఎక్కువ సార్లు కలిసే అవకాశం ఇచ్చాడా, ఎన్ని ఎక్కువ రోజులు లేదా ఎంత ఎక్కువ సమయం వారితో గడిపే సమయం ఇచ్చి.. వారితో సాన్నిహిత్యాన్ని పెంచి... నిన్ను నువ్వు తెలుకొని మరింత గొప్ప వ్యక్తిగా, నలుగురికీ ఉపయోగపడే వ్యక్తిగా ఎదిగే అవకాశం ఇచ్చాడా అనే దానిమీద ఆధారపడి ఉంటుంది అని నా ఆనంతరంగం అంటుంది...

ఈ విషయంలో ఎంతో కొంత దేవుని కరుణ మా కుంటుంబం పై ఉన్నదని నా భావన

నా అనంతరంగం అమ్మ శ్రీనివాస్
2017/09/24 15:30

http://ammasrinivas4u.blogspot.in/search/label/1.%20నా%20రాతలు%20%2F%20My%20Writtings?m=0

కామెంట్‌లు లేవు: