1.వస్తా వట్టిది... పోతా వట్టిది! ఆశ ఎందుకంటా? చేసిన ధర్మము చెడని పదార్థము... చేరును నీవెంట..2.నువ్వు తినే ప్రతి ఒక మెతుకు ఈ సంఘం పండించింది గర్వించే ఈ నీ బ్రతుకు సమాజమే మలిచింది ఋణం తీర్చు తరుణం వస్తే తప్పించుకు పోతున్నావా తెప్ప తగలపెట్టేస్తావా ఏరు దాటగానే...

8, అక్టోబర్ 2018, సోమవారం

An inspiration


*Scene-1:*
*నెలకు ఒక గంట సమయం* ఇవ్వమంటే చెయ్యవలసిన పనులు మనకి వంద గుర్తొస్తాయి. జీవితంలో నెలకు 1 గంట సమయం తోటి వారికోసం ఇవ్వడం అసంభవం, అసాధ్యం అనిపిస్తుంది మనలాంటి వారికి ఎందరికో....

కానీ ఇతను ప్రతి సోమవారం  ప్రభుత్వ పాఠశాల పిల్లలతో నేరుగా *3 గంటలు* గడుపుతారు, ఇక ఇంటి నుంచి స్కూల్ కి రాను పోను *1.5 గంటకు పై మాటే,* పిల్లలకి ఏమి చెప్పాలో, ఎవరెవరు వస్తున్నారు, రావటం లేదు ఇలాంటి వాటికి కనీసం *1.5 గంట పట్టదా?* దీనికి తోడు సెషన్ అవగానే ఏమి చెప్పారు, ఎవరెవరు వచ్చారు మొదలగు వివరాలు వెంటనే మాకు తెలుపుతూ, డాక్యుమెంట్ చేసుకోవడానికి *1 గంట...* మొత్తం *7 గంటలు ఒక వారానికి అతను ఇచ్చే సమయం... అంటే సరాసరి రోజుకు గంట*

*దీనికే మనలాంటి చాలా మందిలో సూపర్ అహే నువ్వు అనే ఫీలింగు, సమాజం కోసం జీవితాన్నే త్యాగం చేస్తున్న భావన కలుగుతాయి.... కానీ ఇతనికి ఆయన ప్రాజెక్ట్ కాకుండా....* అశ్వ లో రక్త దానాలు, అన్న దానాలు, ఆశ్రమ సందర్శనలు, నెల వారీ సమావేశాలు అన్నింటిలోను ముందుంటాడు...

అలా అని ఆఫీస్ కి డుమ్మానా అంటే మీరు కాలు కుండీలో వేసినట్టే.... *అవసరనప్పుడు ఆదివారాలు, ఓవర్ టైం లు కూడా చేస్తాడు..*

పోనీ తాడు బొంగరం లేని బ్యాచిలరా అంటే.... అది కూడా కాదు... తల్లిదండ్రులు, అర్ధాంగి అంత ఒకటే చోట, ఉమ్మడి కుటుంబం....

*Scene-2:*
గత 6 సంవత్సరాలుగా (ప్రతి వారం చెయ్యడం ఎంత కష్టమో సేవా రంగంలో ఉన్న వారికే తెలుస్తుంది) పట్టువదలని విక్రమార్కుడిలా, వాలంటీర్లు వచ్చినా, రాకపోయినా, సహాయ సహకారాలు అందించినా, అందించకపోయినా, గుర్తింపు వచ్చినా, రాకపోయినా ఆ వ్యక్తికి ఏమి పట్టవు. *బాధ్యత తీసుకుంటే ఎలా ప్రాణం పెట్టి, ఇష్టంగా చెయ్యాలో అతనిని చూసే నేను నేర్చుకుంటున్నా అనడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు... అతను బాద్యతకు నిలువెత్తు నిదర్శనంలాగా కనిపిస్తాడు...*

*Scene-3:*
ప్రతి సంస్థ ఎదుర్కోనే సమస్య వాలంటీర్స్ చాలా మంది ఎందుకొస్తారో, ఎంత కాలం పని చేస్తారో, ఎందుకు వెళ్లిపోతారో తెలీదు... పోనీ వెళ్లిన కారణం తెలిస్తే, దీనికి కూడా సేవ చెయ్యడం మానేసి వెళ్లిపోయే వారుంటారా అనిపిస్తుంది. *ఎందుకంటే 90 నుంచి 95% ఎంత వేగంగా వస్తారో, అంతే వేగంగా వెళ్ళిపోతారు.. ఎందుకా అని ఆరా తీస్తే ... దుర్యోధనున్నీ చూసి పాంచాలి నవ్విందనో, ఇంగ్లాండ్లో ఇండియా టెస్ట్ లు గెలవలేదనో, అర్జున్ రెడ్డి సినిమా 100 రోజులు ఆడిందనో, ఎవరో ఉచిత సలహా ఇచ్చారనో, లేక ఇవ్వలేదనో, తన సలహా సంస్థ స్వీకరించలేదనో, తనకి పట్టం కట్టి పల్లకీలో ఊరేగించలేదనో, పని వత్తిడో, కుటుంబానికి సమయం ఇవ్వలేకపోతున్నామనో.....* ఇలా చాలానే ఉంటాయిలేండి..... *సంస్థకి కాదు, సేవకు బాయి బాయి చెప్పేస్తారు....* ఏమి చేద్దాం పాపం సేవ అంటే ఏమిటో పూర్తి అవగాహన లేదు or అర్ధం చేసుకునే మానసిక  పరిపక్వత లేదు... ఇంకేం చేద్దాం అడ్జెస్ట్ అవుదాం అనే పాటలాగా.. మరో సారి ప్రయత్నించి ఊరుకోవడం తప్ప...

*కానీ మన సినిమాలో హీరో మటుకు ప్రేమించిన పనిని, తన తృప్తి కోసం ఎలా చేసుకోవాలో చేసి చూపిస్తున్న మొదటి వ్యక్తి (ఆస్వా లో)* అనడంలో ఆవగింజంత కూడా అనుమానం లేదు, నేను ఎక్కువ కూడా చెప్పడం లేదు...

*Scene-4:*
మనోడు ప్రైమరీ స్కూల్ ప్రాజెక్ట్ లీడర్... *కానీ వేరే ప్రోజెక్ట్ లో పాల్గొన్నప్పుడు, ఇప్పుడే కార్యక్రమాలకు మొదటి సారి వచ్చిన వాడిలా బ్యానర్ లు కడుతూనో లేదా ఎవరు ఊహించని పని ఏదో చెస్తూనో కనపడుతూ ఉంటాడు...* ఏ పని అప్పగిస్తే ఆ పని చేస్తాడు, ఎవరితోను దురుసుగా మాట్లాడడు.. ఒక నవ్వు నవ్వుతాడు.. ఏముంది డ్యూడ్ మహా అయితే తిరిగిస్తారు కదా అన్న రీతిలో.....

ఇంకా చాలానే ఉన్నాయి ఈ ఒకటో నంబరు కుర్రాడి దగ్గర నేర్చుకోవాల్సినవి, స్ఫూర్తి పొందాల్సినవి.. ముఖ్యంగా ఎందుకు, ఏమిటి, ఎలా తెలుసుకోకుండా... పోనీ కార్యకర్త అయిన తరువాత తెలుసుకోవాలనే ఆలోచన కూడా లేని ఎందరో వాలంటీర్స్ కి *సేవ ఎలా, ఎందుకు చేయాలో చెప్పే నిలువెత్తు ఉదాహరణ ఇతను...*

*ఇంతకీ ఇతని పేరు చెప్పలేదు కదా... దనేశ్ కుమార్.ఖక్కర్....పిల్లలకి పాటలు చెప్పడం కోసం తెలుగు నేర్చుకుంటున్న కార్పొరేట్ కుర్రాడు.... సేవా రంగంలో ఇతనేమి ఉద్యోగం చెయ్యడం లేదు జస్ట్ వాలంటీర్... కాకపోతే ఉద్యోగి కూడా చెయ్యలేనిది చేస్తున్నాడు కదా.... ప్రేమగా, బాధ్యతగా, పద్దతిగా*

(అశ్వ లో) సేవ చేస్తున్న అందరూ గొప్ప వారే, కానీ ఇతను కొంచెం ఎక్కువ గొప్పవాడు. మనకి ప్రేరణ, స్ఫూర్తి ఎక్కడో ఉండదు...  మనం చూడగలిగితే మన ముందే ఉంటుంది, మన చుట్టూ ఉంటుంది....6 సంవత్సరాలకు పైగా అలాంటి ప్రేరణను, స్పూర్తిని నాకు ఇస్తున్న ఈ వ్యక్తికి అశ్వ ఎమిచ్చిన రుణం తీరదు.

*ఇలాంటి వ్యక్తుల నిస్వార్థ సేవల వల్లనే అశ్వ లాంటి ఎన్నో సంస్థలు ప్రజల సేవలో మమేకమై వర్ధిల్లుతున్నాయి.....* మంచి సంస్థలుగా సేవలందిస్తూ, వేనోళ్ళ కొనియాడబడుతున్నాయి...  దనేశ్ నీ సేవలు ఇలాగే ఇంకా ఎంతో మందికి చేరాలని, నువ్వు నాలాంటి ఎంతో మందికి స్ఫూర్తిగా, ప్రేరణగా,ఆదర్శంగా నిలవాలని కోరుకుంటూ... మీ అమ్మ శ్రీనివాస్  2018/09/11 00:26


7, అక్టోబర్ 2018, ఆదివారం

మానవుడు మహనీయుడే, కానీ మహా బద్ధకస్తుడు కూడా. కనీస ప్రయత్నం చెయ్యకుండా, మనకు అవకాశం వున్నా సరే....

*మానవుడు మహనీయుడే, కానీ మహా బద్ధకస్తుడు కూడా. కనీస ప్రయత్నం చెయ్యకుండా, మనకు అవకాశం వున్నా సరే, సులభంగా (పాపం) అవకాశం లేని వారికోసం ఏర్పాటు చేసిన సౌకర్యాలను అన్నీ మనం హాయిగా వాడేసుకుంటాం, పాపం చివరికి అవసరమైన వారి అవసరానికి వనరులు ఉండవు.* ఇప్పుడు అసలు విషయంలోకి వద్దాం

రోజూ కనీసం 5 నుంచి 10 మంది అత్యవసరంగా రక్తం కావాలి అని ఫోన్ చేస్తుంటారు. వారు అప్పుడున్న మానసిక స్థితిని, అవసరాన్ని మేము అర్ధం చేసుకోగలము. కానీ మన (దాతల) దగ్గర పెట్రోల్ బావులు లాగా లాగా రక్త బావి (నిధి) ఏమి ఉండదు కదా!, పాపం రక్త దాత కూడా 3 నెలలకు ఒకసారి మాత్రమే ఇవ్వగలరు. *ఇలాంటి అవకాశం పల్లెటూర్ల నుంచి వచ్చే వారు, చదువు రాకుండా, సర్కిల్ లేకుండా, ఊరు కాని ఊర్లో ఎవరు తెలియక వుండే వారికోసం, కానీ చదువుకుని, స్నేహితులు, బంధువులు, సాటి ఉద్యోగస్తులు తెలిసినవారు కనీసం ప్రయత్నం కూడా చెయ్యకుండా మాకు ఫోన్ చేస్తూ ఉండడం కొంత బాధ్యతారాహిత్యాన్ని సూచిస్తుంది.*

సినిమా కోసమో, IPL టికెట్స్ కోసమో, పార్కులకు, షికార్లకు వెళ్లడం కోసమో ఫ్రెండ్స్ ని మొహమాటం లేకుండా అడుగుతాం కదా లేదా పండగలకో, ముఖ్య దినాలకో లేదా గుడ్డు మార్నింగ్ అనో, నైట్ అనో ఎన్నో మెసేజ్ లు వాట్సాప్ లో పోస్ట్ చేస్తాం; అలాగే జలుబు చేసిందనో, *తోక ఎత్తిన కాకి, తోక దించిన కాకి అనో సోషల్ మీడియా లో ఎన్నో అప్డేట్స్, పోస్ట్స్ పెడుతూ ఉంటాము కదా...*

*మరి మన వారికి సాయం చెయ్యమని అడగడానికి ఎందుకు సిగ్గు?* ఇస్తారా, ఇవ్వరా, ఇవ్వడానికి వారికి ఆశక్తి ఉందా, అర్హత ఉందా అనేది తరువాత విషయం.. అసలు పొరపాటున కూడా ఎందుకు మనం ప్రయత్నం చేయడం లేదు? ఎవరికి వారు పదే పదే ప్రశ్నించుకోవాలి...

*పోనీ ఎదో విధంగా మన వల్లనో, NGO ఫ్రెండ్స్ వల్లనో, ఎవరో తెలియని వ్యక్తి వచ్చి రక్త దానం చేయడం వలన, మనం అవసరం నుంచి గట్టెక్కామ్. మరి తరువాత మనం రక్త దాతగా మారి కనీస కృతజ్ఞత తెలియ చేస్తున్నామా? లేక నాకు ఆఫీస్ ఉందనో, రక్త ఇవ్వాల్సిన హాస్పిటల్ దూరంగా ఉందనో, ముందుగానే ఫిక్స్ చేసుకున్న ప్రోగ్రాం క్యాన్సల్ చేసుకోవడం ఇష్టం లేకో వంద కారణాలు చెప్పి తప్పించుకుంటాం. లేదంటే ప్రాణ భయం... మన రక్తం తీసి, మనల్ని చంపి ఇంకొకర్ని బ్రతికించరు మహా ప్రభో. ప్రతి 3 నెలలకు ఒక సారి ఈ రక్త కణాలు ఎలాగూ నిరుపయోగంగా చనిపోతాయి. రక్తం ఇవ్వడం వలన నీ ఆరోగ్యం ఏమి పాడైపోదు, నీ ఆస్తి మొత్తం ఏమి కట్ట కట్టుకొని పోదు. ఇంకా నీకు హార్ట్ ఎటాక్ రాకుండా ఉండడం, ఆరోగ్యంగా ఉండడం లాంటి ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి. మిడి మిడి జ్ఞానంతో ఆలోచించక, పూర్తిగా రక్త దానం గురించి తెలుసుకోండి, రక్త దాతలుగా మారండి. ప్రపంచంలో దేవుని తరువాత, మళ్ళీ ప్రాణం పోసి బ్రతికించగలిగే అర్హత, అవకాశం డాక్టర్ కి, రక్త దాత కి మాత్రమే ఉంటుంది.*

ఏం మీకోసం బ్లడ్ ఇచ్చిన వారికి ఇవన్నీ ఉండవా? వారు మనలాగా మనుషులే కదా? *నిజమే..లే... వారు మానవత్వమున్న మహానుభావులు. మరి మనం? మనిషి ముసుకు కప్పుకొని, బాధ్యత మరిచి, తీసుకోవడమే కానీ, ఇచ్చే అలవాటు లేని మహా "మనీ"షిలం*

రక్త దాతలారా ఇలాంటి స్వార్థ పూరిత సమాజంలో కూడా *నిస్వార్థంగా మీరు ఎంతో మంది ప్రాణాలు కాపాడుతున్నారు. ఒక్క సారి మాత్రమే కాదు, ప్రతి 3 నెలలకు తప్పని సరిగా రక్త ఇచ్చే వారు ఎంతో మంది నాకు వ్యక్తిగతంగా తెలుసు. వారు సుదూర ప్రాంతాలకు ఆఫీస్ లకి సెలవు పెట్టి మరీ వెళ్లి రక్త దానం చేసి ప్రాణాలు కాపాడుతున్నారు.* మీరు దైవ సమానులు..కాదు కాదు.. దైవ స్వరూపులు.

*మీరు లేదా మనం ఈ పని చేస్తే సరిపోదు, ప్రతి ఒక్కరిలో ఆలోచన రేకెత్తించాలి, మనల్ని రక్తం అడిగిన వారికి రక్తం ఇచ్చి వచ్చేయక, వారి చుట్టూ ఉండేవారినుండి వారు కూడా తప్పక రక్త దానం చేస్తామని మాట తీసుకోవాలి. వారి పరిధిలో వారు రక్తం కోసం ప్రయత్నించారా లేదా అని ప్రశ్నించాలి, అలా వారు చెయ్యకపోతే తప్పు చేస్తున్నామనే భావన వారికి కలగాలి.*

ఆలోచించండి.... ఆచరించండి.... ప్రచారం చేయండి... ప్రతి ఒక్కరు రక్త దాతగా మారే విధంగా అవగాహన కలిగించండి, కృషి చెయ్యండి.


నా అనంతరంగం...మీ అమ్మ శ్రీనివాస్  2018/10/07 10:30

శుభం భూయాత్..... నా రాతలు, మరిన్ని... http://ammasrinivas4u.blogspot.com/search/label/1.%20నా%20రాతలు%20%2F%20My%20Writtings?m=0