*Scene-1:*
*నెలకు ఒక గంట సమయం* ఇవ్వమంటే చెయ్యవలసిన పనులు మనకి వంద గుర్తొస్తాయి. జీవితంలో నెలకు 1 గంట సమయం తోటి వారికోసం ఇవ్వడం అసంభవం, అసాధ్యం అనిపిస్తుంది మనలాంటి వారికి ఎందరికో....
కానీ ఇతను ప్రతి సోమవారం ప్రభుత్వ పాఠశాల పిల్లలతో నేరుగా *3 గంటలు* గడుపుతారు, ఇక ఇంటి నుంచి స్కూల్ కి రాను పోను *1.5 గంటకు పై మాటే,* పిల్లలకి ఏమి చెప్పాలో, ఎవరెవరు వస్తున్నారు, రావటం లేదు ఇలాంటి వాటికి కనీసం *1.5 గంట పట్టదా?* దీనికి తోడు సెషన్ అవగానే ఏమి చెప్పారు, ఎవరెవరు వచ్చారు మొదలగు వివరాలు వెంటనే మాకు తెలుపుతూ, డాక్యుమెంట్ చేసుకోవడానికి *1 గంట...* మొత్తం *7 గంటలు ఒక వారానికి అతను ఇచ్చే సమయం... అంటే సరాసరి రోజుకు గంట*
*దీనికే మనలాంటి చాలా మందిలో సూపర్ అహే నువ్వు అనే ఫీలింగు, సమాజం కోసం జీవితాన్నే త్యాగం చేస్తున్న భావన కలుగుతాయి.... కానీ ఇతనికి ఆయన ప్రాజెక్ట్ కాకుండా....* అశ్వ లో రక్త దానాలు, అన్న దానాలు, ఆశ్రమ సందర్శనలు, నెల వారీ సమావేశాలు అన్నింటిలోను ముందుంటాడు...
అలా అని ఆఫీస్ కి డుమ్మానా అంటే మీరు కాలు కుండీలో వేసినట్టే.... *అవసరనప్పుడు ఆదివారాలు, ఓవర్ టైం లు కూడా చేస్తాడు..*
పోనీ తాడు బొంగరం లేని బ్యాచిలరా అంటే.... అది కూడా కాదు... తల్లిదండ్రులు, అర్ధాంగి అంత ఒకటే చోట, ఉమ్మడి కుటుంబం....
*Scene-2:*
గత 6 సంవత్సరాలుగా (ప్రతి వారం చెయ్యడం ఎంత కష్టమో సేవా రంగంలో ఉన్న వారికే తెలుస్తుంది) పట్టువదలని విక్రమార్కుడిలా, వాలంటీర్లు వచ్చినా, రాకపోయినా, సహాయ సహకారాలు అందించినా, అందించకపోయినా, గుర్తింపు వచ్చినా, రాకపోయినా ఆ వ్యక్తికి ఏమి పట్టవు. *బాధ్యత తీసుకుంటే ఎలా ప్రాణం పెట్టి, ఇష్టంగా చెయ్యాలో అతనిని చూసే నేను నేర్చుకుంటున్నా అనడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు... అతను బాద్యతకు నిలువెత్తు నిదర్శనంలాగా కనిపిస్తాడు...*
*Scene-3:*
ప్రతి సంస్థ ఎదుర్కోనే సమస్య వాలంటీర్స్ చాలా మంది ఎందుకొస్తారో, ఎంత కాలం పని చేస్తారో, ఎందుకు వెళ్లిపోతారో తెలీదు... పోనీ వెళ్లిన కారణం తెలిస్తే, దీనికి కూడా సేవ చెయ్యడం మానేసి వెళ్లిపోయే వారుంటారా అనిపిస్తుంది. *ఎందుకంటే 90 నుంచి 95% ఎంత వేగంగా వస్తారో, అంతే వేగంగా వెళ్ళిపోతారు.. ఎందుకా అని ఆరా తీస్తే ... దుర్యోధనున్నీ చూసి పాంచాలి నవ్విందనో, ఇంగ్లాండ్లో ఇండియా టెస్ట్ లు గెలవలేదనో, అర్జున్ రెడ్డి సినిమా 100 రోజులు ఆడిందనో, ఎవరో ఉచిత సలహా ఇచ్చారనో, లేక ఇవ్వలేదనో, తన సలహా సంస్థ స్వీకరించలేదనో, తనకి పట్టం కట్టి పల్లకీలో ఊరేగించలేదనో, పని వత్తిడో, కుటుంబానికి సమయం ఇవ్వలేకపోతున్నామనో.....* ఇలా చాలానే ఉంటాయిలేండి..... *సంస్థకి కాదు, సేవకు బాయి బాయి చెప్పేస్తారు....* ఏమి చేద్దాం పాపం సేవ అంటే ఏమిటో పూర్తి అవగాహన లేదు or అర్ధం చేసుకునే మానసిక పరిపక్వత లేదు... ఇంకేం చేద్దాం అడ్జెస్ట్ అవుదాం అనే పాటలాగా.. మరో సారి ప్రయత్నించి ఊరుకోవడం తప్ప...
*కానీ మన సినిమాలో హీరో మటుకు ప్రేమించిన పనిని, తన తృప్తి కోసం ఎలా చేసుకోవాలో చేసి చూపిస్తున్న మొదటి వ్యక్తి (ఆస్వా లో)* అనడంలో ఆవగింజంత కూడా అనుమానం లేదు, నేను ఎక్కువ కూడా చెప్పడం లేదు...
*Scene-4:*
మనోడు ప్రైమరీ స్కూల్ ప్రాజెక్ట్ లీడర్... *కానీ వేరే ప్రోజెక్ట్ లో పాల్గొన్నప్పుడు, ఇప్పుడే కార్యక్రమాలకు మొదటి సారి వచ్చిన వాడిలా బ్యానర్ లు కడుతూనో లేదా ఎవరు ఊహించని పని ఏదో చెస్తూనో కనపడుతూ ఉంటాడు...* ఏ పని అప్పగిస్తే ఆ పని చేస్తాడు, ఎవరితోను దురుసుగా మాట్లాడడు.. ఒక నవ్వు నవ్వుతాడు.. ఏముంది డ్యూడ్ మహా అయితే తిరిగిస్తారు కదా అన్న రీతిలో.....
ఇంకా చాలానే ఉన్నాయి ఈ ఒకటో నంబరు కుర్రాడి దగ్గర నేర్చుకోవాల్సినవి, స్ఫూర్తి పొందాల్సినవి.. ముఖ్యంగా ఎందుకు, ఏమిటి, ఎలా తెలుసుకోకుండా... పోనీ కార్యకర్త అయిన తరువాత తెలుసుకోవాలనే ఆలోచన కూడా లేని ఎందరో వాలంటీర్స్ కి *సేవ ఎలా, ఎందుకు చేయాలో చెప్పే నిలువెత్తు ఉదాహరణ ఇతను...*
*ఇంతకీ ఇతని పేరు చెప్పలేదు కదా... దనేశ్ కుమార్.ఖక్కర్....పిల్లలకి పాటలు చెప్పడం కోసం తెలుగు నేర్చుకుంటున్న కార్పొరేట్ కుర్రాడు.... సేవా రంగంలో ఇతనేమి ఉద్యోగం చెయ్యడం లేదు జస్ట్ వాలంటీర్... కాకపోతే ఉద్యోగి కూడా చెయ్యలేనిది చేస్తున్నాడు కదా.... ప్రేమగా, బాధ్యతగా, పద్దతిగా*
(అశ్వ లో) సేవ చేస్తున్న అందరూ గొప్ప వారే, కానీ ఇతను కొంచెం ఎక్కువ గొప్పవాడు. మనకి ప్రేరణ, స్ఫూర్తి ఎక్కడో ఉండదు... మనం చూడగలిగితే మన ముందే ఉంటుంది, మన చుట్టూ ఉంటుంది....6 సంవత్సరాలకు పైగా అలాంటి ప్రేరణను, స్పూర్తిని నాకు ఇస్తున్న ఈ వ్యక్తికి అశ్వ ఎమిచ్చిన రుణం తీరదు.
*ఇలాంటి వ్యక్తుల నిస్వార్థ సేవల వల్లనే అశ్వ లాంటి ఎన్నో సంస్థలు ప్రజల సేవలో మమేకమై వర్ధిల్లుతున్నాయి.....* మంచి సంస్థలుగా సేవలందిస్తూ, వేనోళ్ళ కొనియాడబడుతున్నాయి... దనేశ్ నీ సేవలు ఇలాగే ఇంకా ఎంతో మందికి చేరాలని, నువ్వు నాలాంటి ఎంతో మందికి స్ఫూర్తిగా, ప్రేరణగా,ఆదర్శంగా నిలవాలని కోరుకుంటూ... మీ అమ్మ శ్రీనివాస్ 2018/09/11 00:26
మనసులో అనుభూతులను నలుగురితో పంచుకోవాలి అన్న ఆకాంక్షకు రూపం ఈ నా ప్రయత్నం.నాకు మన దేశం గురించి,మన సంప్రదాయాలు,అలవాట్లు, ఆచారాలూ,పద్దతులు మరియు మనం ప్రపంచం మొత్తానికి ఇచ్చిన ఆధ్యాత్మిక జ్ఞానం అన్న,దాని గురించి తెలుసుకోవడం అన్న,చెప్పడం అన్న చాలా ఇష్టం.అందుకే నా అంతరంగాన్ని,భావాలను,నాకు తెలిసిన,నేను సేకరించిన సమాచారాన్ని ఒక దగ్గర చేర్చాలనే ఈ బ్లాగ్ స్టార్ట్ చెయ్యడం జరిగింది.నేను ఎక్కడైనా చదివిన,చూసిన,నాకు తెలిసిన మంచి సమాచారాన్ని ఇందులోపొందుపరచి అందరికి ఒక బ్లాగ్ లో ఇవ్వాలని ఆసిస్తూ మీ శ్రేయోభిలాషి
8, అక్టోబర్ 2018, సోమవారం
An inspiration
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి