*పోయాక, పాడెక్కాక.... చాలా మంచివారని, వారిలోని గొప్ప గుణాలు వెలికితీసి కొనియాడుతావు...*
*కానీ ప్యాణంతో మన పక్కనేనో, పంచనో బతికున్నప్పుడు మాత్రం, ఎప్పుడూ వారిలో తప్పులను వెతుకుతూ, బంధాలను, సంబంధాలను బతుకు జీవుడా అని కొనసాగిస్తూ...* ఎవరికి వారే యమునా తీరే అనే తీరులో, దగ్గరగా ఉంటూనే మధ్య గోడలు కట్టుకు బతికేస్తావు...
అట్ట కాక, *ఎటువంటి పరిస్తితులలోనైనా, ఎలాంటి వ్యక్తులు, వ్యక్తిత్వాల మధ్య వున్నా, నువ్వు(నేను,మనం) మనుషుల మధ్య విభేదాలు పెంచక, ఒక మంచి వాతావరణాన్ని సృష్టించగలిగితే.....* ఇంకేముంది మనం ధన్యజీవులమైనట్టే, మనకి పరిపక్వత వచ్చినట్టే, అలాగే మనతోనపాటు ఇతరుల సుఖ సంతోషాలకోసం ప్రయత్నిస్తున్నట్టే....
అటుల కాక విభేదాలను సృష్టిస్తూ, రెచ్చగొడుతూ, అగ్నికి ఆజ్యం పోస్తుంటే మాత్రం.... *చివరికి బాధపడేది నువ్వు, నేను, మనమే సుమీ.... ఎందుకు బతికినంత కాలం ఈ మనస్సాంతి లేని అంతర్యుద్ధాలు... బతుకు అర్ధం సమజ్ గాలేదనే మనకి. అయ్యా, సమజ్ గాలేదని మనం ఒప్పుకుంటామా ఏంది.* మనల్ని మనం మోసం చేసుకుంటూనే ఉంటాం.
కాబట్టి *కామ్రేడ్స్ మనం బ్రతికి ఉన్నప్పుడే పక్క మనిషిలో మంచిని, మానవత్వాన్ని మాత్రమే చూస్తూ, ఆనందంగా బతికితే పోలా...అదిరిపోలా....*
*అప్పుడప్పుడు నా అనంతరంగం యొక్క ఆవిష్కరణ జరుగుతూ ఉంటుంది, అవన్నీ ఈ బ్లాగ్లో ఆవిష్కరించటం జరిగింది.*
http://ammasrinivas4u.blogspot.com/search/label/1.%20నా%20రాతలు%20%2F%20My%20Writtings?m=0
*శుభం భూయాత్.....*
మీ అమ్మ శ్రీనివాస్
2018/12/28 11:56
మనసులో అనుభూతులను నలుగురితో పంచుకోవాలి అన్న ఆకాంక్షకు రూపం ఈ నా ప్రయత్నం.నాకు మన దేశం గురించి,మన సంప్రదాయాలు,అలవాట్లు, ఆచారాలూ,పద్దతులు మరియు మనం ప్రపంచం మొత్తానికి ఇచ్చిన ఆధ్యాత్మిక జ్ఞానం అన్న,దాని గురించి తెలుసుకోవడం అన్న,చెప్పడం అన్న చాలా ఇష్టం.అందుకే నా అంతరంగాన్ని,భావాలను,నాకు తెలిసిన,నేను సేకరించిన సమాచారాన్ని ఒక దగ్గర చేర్చాలనే ఈ బ్లాగ్ స్టార్ట్ చెయ్యడం జరిగింది.నేను ఎక్కడైనా చదివిన,చూసిన,నాకు తెలిసిన మంచి సమాచారాన్ని ఇందులోపొందుపరచి అందరికి ఒక బ్లాగ్ లో ఇవ్వాలని ఆసిస్తూ మీ శ్రేయోభిలాషి
28, డిసెంబర్ 2018, శుక్రవారం
పోయాక, పాడెక్కాక.... చాలా మంచివారని, వారిలోని గొప్ప గుణాలు వెలికితీసి కొనియాడుతావు...
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి