నా జీవితంలో నా అభివృద్ధి కోసం 10 రోజులు కేటాయించుకోవడం చాలా ఆనందాన్ని ఇచ్చింది. అలాగే వర్కుషాప్ పూర్తి అయిన తరువాత మన అభివృద్ధి కి కావాల్సిన, చెయ్యవలసిన, చెయ్యగలిగిన వాటి గురించి తెలిపే విషయ పరిజ్ఞానం మన చేతుల్లోనే ఉంది అని తెలుసుకొని... జీవితాన్ని మరింత ఆనందంగా గడపగలమనే ఆనందంతో, నా గురించి నేను మరింత లోతుగా అధ్యయనం చేసుకున్న అనుభవాలతో కాన్పూర్ నుంచి తిరుగు ప్రయాణం.
ఇది తెలుసుకోలేక, చెప్పినా వినే తీరిక, ఓపిక లేని స్థితిలో, సమాజంతో పాటు ఎటో కొట్టుకొనిపోతున్నాము. మన నిజమైన అవసరాలు ఏమిటో గుర్తించక, డబ్బే సర్వస్వం అనుకొని, సంతోషాలను, బంధాలను తాకట్టు పెట్టి... 1 గంట కూడా మన అభివృద్ధి కోసం కేటాయించుకోలేని సమాజంలో... నాకు ఇలాంటి అవకాశం దొరకడం, నేను దానిని ఉపయోగించుకోవడం నిజంగా నా అదృష్టమే కదా...
మీ అమ్మ శ్రీనివాస్...
2020/01/25 18:47
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి