1.వస్తా వట్టిది... పోతా వట్టిది! ఆశ ఎందుకంటా? చేసిన ధర్మము చెడని పదార్థము... చేరును నీవెంట..2.నువ్వు తినే ప్రతి ఒక మెతుకు ఈ సంఘం పండించింది గర్వించే ఈ నీ బ్రతుకు సమాజమే మలిచింది ఋణం తీర్చు తరుణం వస్తే తప్పించుకు పోతున్నావా తెప్ప తగలపెట్టేస్తావా ఏరు దాటగానే...

5, జూన్ 2020, శుక్రవారం

మా చిట్టితల్లితో పుస్తక ప్రదర్శనకు

వారం రోజుల నుండి ఒకటే ప్రయాణాలు... త్రోట్ ఇన్ఫెక్షన్, దగ్గు ఒక పక్క అద్భుతమైన షిరిడీ, నాసిక్, త్రయంబకం, ఘృష్ణేశ్వరం, ఎల్లోరా దర్శనాలు మరో పక్క... ఈ రోజే హైదరాబాద్ చేరుకున్నాం. నేరుగా షాద్ నగర్ వెళ్లే ఆలోచన కొద్దిగా వాయిదా వేసి మా చిట్టితల్లిని పుస్తక ప్రదర్శనకు తీసుకెళ్లాలనే ఆలోచన... మాకు వెళ్లాలనే ఎందుకంటే ఎప్పుడూ వెళ్ళలేదు కాబట్టి.

ఎట్టకేలకు 12.30 కి NTR స్టేడియం చేరుకొని ఒక గంటలో అన్నీ చుట్టేసి వెళ్లిపోవాలని అద్భుతమైన ప్లాన్ వేసా, కానీ ఏమీ లాభం.

లోపలికెళ్లి ఒక్క స్టాల్ దగ్గరే దాదాపు 2 గంటలు గడిచిపోయాయి. నేను, నా కూతురు, మా ఆవిడ అందరం ఎవరికి తోచిన పుస్తకాలు వారు తీసుకోని, చదువుకొని, తిరిగేసే పనిలో పడిపోయాం. ఈ లోపు తమ్ముడు Naresh Padmaraju మాతో కలిసాడు.

మాలో, మా పాప లో పుస్తక పఠనం పట్ల ఆశక్తిని కాపాడుకోవడానికి ఇలాంటివి తరచు చాలా ఉపయోగపడతాయి సుమీ. కాకపోతే ఇంకా 300 కి పైగా ఉన్న షాప్ లు ఎప్పుడు చూడాలో ఏమో అనుకుంటూ... సమయం అయిపోతు ఉండడంతో నిరాశతో, మళ్ళీ ఒక రోజు రావాలనే ఆశతో వెనుదిరిగాం.

మా చిట్టిది పుస్తకాలు చూసేస్తూ, బుల్లి చేతులతో తాకుతూ, అటు ఇటు తిప్పుతూ, వాటిని చదివి (చూసి) అది ఉంది, ఇది లేదు అనుకుంటూ లీనమై పోయి బాగా ఎంజాయ్ చేసింది. దాన్ని చూస్తే చాలా సంతోషం అనిపించింది. పిల్లలకి మనం బుక్స్ కొనడం వేరు. వారి ఆలోచనలకు తగ్గట్టు వారు చూసి, కావలసినవి ఎన్నుకొనడం వేరు.

ఇక మా టీచర్ అమ్మ Haritha Vemulapalli సంగతి తెలిసిందే కదా, పిల్లలకి ఏవి సరిపోతాయో, ఏవి సరిపోవు... అలాగే తనకోసం కొన్ని అని తెగ వెతుకులాట......

మీకు, మీ పిల్లలకు మీరిచ్చే అద్భుత గిఫ్ట్ ఇదే సుమీ... కొనడం, కోనకపోవడం, అనవసరంగా కొనడం తరువాత సంగతి... ముందు వెళ్ళండి..

అమ్మ శ్రీనివాస్
www.aswa4u.org

December, 2019

కామెంట్‌లు లేవు: