@Padmini Bhavaraju Advisor
లక్ష్మీ సౌభాగ్యవతి అయిన పద్మిని అక్క గారికి మీ తమ్ముడు అమ్మ శ్రీనివాస్ నమస్కరించి వ్రాయునది ఏమనగా... ఇచ్చట అంతా క్షేమం, అచట అందరూ క్షేమమని తలుస్తాను. కరోనా రక్కసి నుంచి కాపాడుకోవడానికి జాగ్రత్తగా ఇంట్లోనే వుంటున్నారు అని ఆశిస్తున్నాను (ముఖ్యంగా బావ గారు)..
ఇక విషయానికొస్తే, మీరు మమ్ములను ఆశీర్వదించి పంపిన తిరుప్పావై పుస్తకములు, నాన్న గారి వంటల పుస్తకములు ఇప్పుడే అందినవి. శుక్రవారం నాడు రావడం మా మహద్భాగ్యంగా భావిస్తున్నాము. మాసంతో సంబంధం లేకుండా ఈ రోజు నుంచి రోజు ఒక పాశురాం / పద్యం చదువుదామని అనుకుంటున్నాను.
ఇక పోతే, మా అమ్మగారు శుక్రవారం ప్రసాదం కోసం ఏమి చెయ్యాలా అని ఆలోచిస్తున్న తరుణంలో, క్రికెట్ ప్రేమికుడుకి బ్యాట్ దొరికనట్టు మీ నాన్నగారి వంటల పుస్తకం దొరికింది. నువ్వుల పులిహారా, అటుకుల దద్దోజనం అని చేసినా, చర్యకపోయినా పుస్తకాన్ని తెగ తిరిగేస్తూ, నాకు నోరూరిస్తూ ఉంది. ఈ రోజు వంట హార్డ్ కాపీ ఉందా లేదా సాఫ్ట్ కాపీ నో ఇంకా తెలియరాలేదు.
మీ మరదలు, కోడలు ఇంకా ఉరిలోనే ఉన్నారు, నేను మా అమ్మ కాలక్షేపం కోసం పేకాట, చెస్, క్యారం బోర్డ్ లాంటి స్కిల్స్ గేమ్స్ ఆడుకుంటూ, కాసేపు మొబైల్ చూసుకుంటూ, కాసేపు కార్యకర్తల ప్రాణాలు తింటూ ఇలా గడిపేస్తున్నాము. మొన్ననే చంటబ్బాయి సినిమా చూసాము. మనసు విశ్వనాద్ గారి మీద మళ్లింది స్వాతి కిరణం, శృతి లయలు, సాగర సంగమం, సప్త పది సినిమాలు చూసే ఆలోచనలో వున్నాను.
ఇంతే సంగతులు, మీ ఉత్తరం కోసం ఎదురుచూస్తూ మీ అమ్మ, తమ్ముడు. ఇంతకు రాం గోపాల వర్మది ఎదో గొడవ జరుగుతున్నట్టు ఉంది, దాని గురించి మీ అభిప్రాయం ఏమిటో అని తెలుసుకోవాలని ఉంది. సర్లే అక్క ఇంగలాండ్ కవర్ ఖాళీ లేకుండా నింపేసాను. కొడళ్లని అడిగానని చెప్పు.
నమస్సులతో
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి