1.వస్తా వట్టిది... పోతా వట్టిది! ఆశ ఎందుకంటా? చేసిన ధర్మము చెడని పదార్థము... చేరును నీవెంట..2.నువ్వు తినే ప్రతి ఒక మెతుకు ఈ సంఘం పండించింది గర్వించే ఈ నీ బ్రతుకు సమాజమే మలిచింది ఋణం తీర్చు తరుణం వస్తే తప్పించుకు పోతున్నావా తెప్ప తగలపెట్టేస్తావా ఏరు దాటగానే...

13, ఆగస్టు 2020, గురువారం

స్పెషల్ డేస్ ని కరోనా లో ఎలా సెలబ్రేట్ చేసుకోవాలి --- విరాళాలు - మంచి పనులకు మాత్రమే కాదు.. చెడ్డ పనులకు కూడా ప్రోత్సాహకాలే... -

*1. స్పెషల్ డేస్ ని కరోనా లో ఎలా సెలబ్రేట్ చేసుకోవాలి*

ప్రస్తుత పరిస్థితులలో ఏవరైనా *వారి స్పెషల్ డేస్ లో* ఎక్కడో ఆశ్రమాలకు సాయం/దానం చెయ్యడం కన్నా... *కరోనా లో ఇబ్బంది పడుతున్న ఫామిలీస్ కి* అదే మొత్తాన్ని సాయం చెయ్యడం మేలు... కాకపోతే అలా చేసేట్టు దాతలను కన్విన్స్ చెయ్యడానికే NGO/కార్యకర్తలు కొంత శ్రమ పడాల్సిందే. కానీ తప్పదు...

ప్రస్తుతం చాలా ఆశ్రమాలలో పిల్లలు కూడా లేరు మరియు మిగతా విషయాలు మీకు తెలిసిందే. ఏవో వేళ్ళ మీద లెక్కపెట్టే స్థితిలో తప్ప జెన్యూన్ గా హోమ్స్ లేవు...

కాబట్టి కరోనా గడ్డు కాలంలో మీ పక్కింటిలో, మీ వీధిలో, మీ కాలనీలో, మీ ఊర్లో సాయం కోసం చూసే కుటుంబాలు ఎన్నో వున్నాయి, ఆలోచించండి, కనిపెట్టండి (మీరు నేరుగా కనుగొన లేకపోతే, NGO, మీడియా లో చూడండి) మీకున్న సమాచారం, జ్ఞానంతో సరిపోల్చుకోండి.. నిజమే అనిపిస్తే.. సాయం చెయ్యండి. దీని వల్ల మీ దగ్గరలో వారే కాబట్టి, వారితో మీ సంబంధం కూడా బలపడుతుంది. మీ విరాళం ఎంత చిన్నదైనా పర్లేదు.


*2. విరాళాలు - మంచి పనులకు మాత్రమే కాదు.. చెడ్డ పనులకు కూడా ప్రోత్సాహకాలే...*

*మనం చేసే ప్రతి రూపాయి మీ కష్టార్జితమే కదా.... సో ఎక్కడ ఇచ్చినా... ప్రతీదీ బాగా లోతుగా పరిశీలించండి... తరువాతనే దానం చెయ్యండి.* ఎదో ఒకటి ఇచ్చేసి చేతులు దులుపుకుంటే సరిపోదు. ముఖ్యంగా మనం ఎమోషనల్ గా ఫీల్ అయ్యే అవకాశం వుండే ఆశ్రమాలకి దానం చేయడం లాంటి వాటి మీద ఎక్కువ మంది ఆశక్తి చూపిస్తూ వుంటారు, అది కూడా మంచిదే, కానీ ఆన్లైన్ లో ట్రాన్స్ఫర్ చేసేస్తే సరిపోదు, ఇచ్చేముందు వెరిఫై చెయ్యండి. నచ్చితే ఇప్పుడే కాదు తరచు వెళ్ళండి, ఇవ్వండి.

*వెరిఫై చేయాలంటే ఖచ్చితంగా కొన్ని సార్లైనా తరచు విసిట్ చేయాల్సిందే, పిల్లలతో కనెక్ట్ అయితే అన్ని వారే చెప్తారు, కొన్ని దగ్గర్ల చెప్పకుండా కూడా ట్రైనింగ్ ఇస్తారు, అలాంటప్పుడు మీ పరిశీలన ద్వారా తెలుసుకోవచ్చు.* మనమేమో మనం వెళ్ళినప్పుడు మనల్ని రిసీవ్ చేసుకొనే పద్దతిని పట్టి, పెట్టిన భోజనాన్ని బట్టి, అక్కడ ఉన్న వసతులను (పై పై మెరుగులను) బట్టి నిర్ణయానికి వచ్చేస్తాం. మరొకటి ఏమిటంటే ఈరోజు బానే ఉన్న, రేపటికి మారిపోయే ఆశ్రమాలు, సంస్థలు ఎన్నో.... *కాబట్టి ఎప్పటికప్పుడు చెక్ చేసుకుంటూ ఉండడం మన భాద్యత.*

*సరైన వారికి ఇవ్వడంలో కూడా మనం బాగా శ్రద్ధ తీసుకోవాలి. అలా అని ఎక్కడా, ఏది ఇవ్వకుండా వుండకండి. మీరిచ్చే ప్రతి పైసా లేదా విరాళాలను మీరిచ్చే వారు ఎలా, ఎందుకు ఖర్చు పెడుతున్నారో మొహమాటం లేకుండా చూడండి, అడిగి తెలుసుకోండి.* అలా తెలుసుకోకుండా, శ్రద్ధ తీసుకోకుండా ఇచ్చే విరాళాల వలన మంచి కంటే, చెడే ఎక్కువ జరిగే అవకాశముంది. ఎందుకంటే కలి కాలంలో ప్రతిదీ వ్యాపారమే.

*అంత ఓపిక లేదని మీరిచ్చే సంస్థలకు, ఆశ్రమాలకు విరాళాలు ఇవ్వడం మానకండి. ఓపిక తెచ్చుకోండి, పరిశీలించి దానం చెయ్యండి*

ఇది నా అనంతరంగం ఘోష.. మీకు నచ్చితే మంచిది... నచ్చకపోతే వదిలెయ్యండి...

అమ్మ శ్రీనివాస్
13.08.2020
http://ammasrinivas4u.blogspot.com/

కామెంట్‌లు లేవు: