1.వస్తా వట్టిది... పోతా వట్టిది! ఆశ ఎందుకంటా? చేసిన ధర్మము చెడని పదార్థము... చేరును నీవెంట..2.నువ్వు తినే ప్రతి ఒక మెతుకు ఈ సంఘం పండించింది గర్వించే ఈ నీ బ్రతుకు సమాజమే మలిచింది ఋణం తీర్చు తరుణం వస్తే తప్పించుకు పోతున్నావా తెప్ప తగలపెట్టేస్తావా ఏరు దాటగానే...

13, ఆగస్టు 2020, గురువారం

47 వ సారి రక్తదానం - ఈరోజు (04.08.2020)


దాదాపు 4 నెలల తరువాత, విజయవాడ కి వెళ్లి హరిత, చరితను తీసుకునేవచ్చే పనిలో భాగంగా ఈ రోజు ఉదయం హైద్రాబాద్ వచ్చా...

వచ్చినప్పటి నుంచి అశ్వ కి ఫ్రీ ఆఫీస్ రూమ్ (దగ్గరలో) వెతికే పనిలో ఒకటే ఫోన్ లలో గడుపుతున్న... ఎందుకో అలా.. అలా.. ఫేస్ బుక్ ఓపెన్ చెయ్యగానే మా ఆక్టివ్ వాలంటీర్ దుర్గ ప్రసాద్ గారు (Durgaprasad Chintapally) ఈ రోజే 20 వ సారి రక్త దానం గురించిన పోస్ట్ చూసా...

కానీ పై పోస్ట్ చూడగానే, వెంటనే నాలో నుంచి అమ్మ శ్రీనివాస్ బయటకొచ్చి, సర్వరాజు శ్రీనివాస ప్రసాద్ రావు తో ఇలా అన్నాడు (పాత సినిమాలో సీన్ లాగా)... *ఏమయ్యా ప్రతి 3 నెలలకు బ్లడ్ డొనేట్ చేస్తావు కదా... ఈ సారి 7 నెలలు అయ్యింది* (అంటే మళ్ళీ ఇవ్వడానికి ఎలిజిబిలిటీ వచ్చి 4 నెలలు అయింది) కానీ ఎందుకు చేయలేదు అని ప్రశ్నించాడు (ఇదేమి మొదటి సారి కాదనుకోండి, ఇచ్చిన 3 నెలల నుంచి ఇలా నాకు ఇచ్చేదాకా గుర్తు చేస్తూనే ఉంటాడు)..

మార్చ్ లో బ్లడ్ కాంప్ అనుకున్నాం కానీ అదే రోజు జనతా కర్ఫ్యూ పెట్టారు. ఆనాటి నుండి ఈ నాటి దాకా కరోనా మహోమ్మరి వలన ఎక్కడికి రాలేదు... స్టే హోమ్ - స్టే సేఫ్. కానీ 4 నెలల నుంచి బ్లడ్ ఇవ్వలేకపోయినందుకు ఒక గిల్టీ ఫీలింగ్, ఈ రోజుతో తీరిపోయింది అన్నాడు అమ్మ శ్రీనివాస్...

*నేను రక్త దానం చెయ్యగలిగే ఆరోగ్యాన్ని, ప్రతి 3 నెలలకు చెయ్యాలనే తపనను ఇచ్చిన దేవునికి, నిరంతరం ప్రేరణ ఇస్తున్న తోటి, సాటి రక్తదాతలకు పాదాభివందనాలతో.....*

ఇక్కడ (Institute of Preventive Medicine, Narayanguda Rd, near YMCA, Lingampally, Kachiguda, Hyderabad, Telangana
https://g.co/kgs/RDoR1W) *రక్తం అవసరం చాలా ఉంది, అవకాశం ఉన్న వారు వెళ్లి దానం చెయ్యండి. దీని గురించి వివరంగా మరో పోస్ట్ పెడతా*






మీ అమ్మ శ్రీనివాస్
04.08.2020
www.aswa4u.org

కామెంట్‌లు లేవు: