1.వస్తా వట్టిది... పోతా వట్టిది! ఆశ ఎందుకంటా? చేసిన ధర్మము చెడని పదార్థము... చేరును నీవెంట..2.నువ్వు తినే ప్రతి ఒక మెతుకు ఈ సంఘం పండించింది గర్వించే ఈ నీ బ్రతుకు సమాజమే మలిచింది ఋణం తీర్చు తరుణం వస్తే తప్పించుకు పోతున్నావా తెప్ప తగలపెట్టేస్తావా ఏరు దాటగానే...

30, సెప్టెంబర్ 2017, శనివారం

*ఈ రోజు సమాజంలో అతి పెద్ద రోగం, ఎవరి శక్తి సామర్ద్యాల మీద వారికి నమ్మకం లేకపోవడం

రోజూ పడుకోబోయే ముందు మనం ఇతరులకు ఏమి సహాయం చేసాం లేదా ఏమి మంచి పని చేసాం అని ఆలోచించాలి. ఇది చాలా మంచి విషయం.

*కానీ దీనికంటే ముందు మనం మనలోని సామర్ధ్యాలను పెంచుకువడానికి, మనలోని మంచిని పెంచుకోవడానికి, మనలోని చెడును తగ్గించుకొని, లోపాలను సరిదిద్దుకివడానికి మనం ఏమి చేసాం అని ఆలోచించడం* ఇంకా ముఖ్యమైన విషయం అని నాకనిపిస్తుంది.

*అంటే నిన్ను నువ్వు మంచి వ్యక్తిత్వం గల వ్యక్తిగా మార్చుకోవడానికి, నీ కోసం, నీ అభివృద్ధి కోసం  ఈ రోజు నువ్వు చేసిన పని ఏమిటి.....*

ఎవరూ... ఎవరికీ.. ఏమి చేయకపోయినా... ఎవరికి వారు మంచిగా మారితే చాలుగా... సమాజంలోని కుళ్లును కడగాలి అనుకునే ముందు, *మనలోని కుళ్లును మనమే శుభ్రం చేసుకొంటె సరిపోద్దిగా....*

*ఈ రోజు సమాజంలో అతి పెద్ద రోగం, ఎవరి శక్తి సామర్ద్యాల మీద వారికి నమ్మకం లేకపోవడంతో పాటు ఎవరి తప్పులను వారు సరిదిద్దుకోలేకపోవడమే* అని నా అభిప్రాయం...

అందరికి విజయ దశమి శుభాకాంక్షలు.....

నా అనంతరంగం .. అమ్మ శ్రీనివాస్.. 2017/09/29 23:15

చదువుకొనే వయస్సులో పండగ అంటే ఎంతో హడావిడి

చదువుకొనే వయస్సులో పండగ అంటే ఎంతో హడావిడి చేసే వాళ్ళం. అన్ని పనులు మనమే చేసే ఉత్సాహం ఉండేది.

కానీ ఉద్యోగాలలో పడ్డ తరువాత....  పండగకి ఊరికి వెళ్లడం ఒక ఎత్తయితే.. వెళ్లిన తరువాత ఒకప్పటిలాగా పాల్గొనడం తగ్గిపోగా, వెళ్ళగానే నిద్రపోవడానికి, ఇంట్లోనే కూర్చుని టీవీ చూస్తూ సమయం గడపడానికి ప్రాధాన్యత ఇస్తాం.....

ఇది నిజమేనా..... నాకు తెలిసిన వారిలో దేనికి కొందరు ఎక్సేప్షన్....

నా అనంతరంగం.. అమ్మ శ్రీనివాస్  2017/09/30 12:52

http://ammasrinivas4u.blogspot.in/search/label/1.%20నా%20రాతలు%20%2F%20My%20Writtings?m=0

చదువుకొనే వయస్సులో పండగ

21, సెప్టెంబర్ 2017, గురువారం

అత్యవసరమా లేక అతి అవసరమా ????

నాలుగు ఊచల్లోంచి బయటకి చూస్తున్నాను...
చల్లని గాలి, పచ్చని చెట్లు  అలా అలా వెళ్లిపోతున్నాయి, రైలుతో పాటు మాత్రమే కాదు, కాలంతో పాటు,కాలగర్భంలోకి కూడా....

ఏసుదాసు గారు అద్భుతంగా ఆలపించిన "ప్రకృతి...ప్రకృతి... ఎంతటి భాగ్యశీలివమ్మా...." అనే పాట లాంటి ఎన్నో ప్రకృతి పాటలు మనసారా వినడానికి ధైర్మ్యం కూడా చాలడంలేదు....

నిజమే మరి.. నాగరికుడు నరికి నరికి నాగరికత లేని చోటుకు పయనించే క్రమంలో.... మూలాలను మరచి, మూన్నాళ్ళ ముచ్చటల కోసం..

మనిషికి కించిత్ స్వార్ధం అవసరమే మరి, కానీ ప్రకృతికి ఇంచి కూడా మిగల్చనంత స్వార్థం అత్యవసరమా లేక అతి అవసరమా ????

నా అనంతరంగం అమ్మ శ్రీనివాస్
2017/09/20 23:12