*ఏమిటో నా అనంతరంగంలో ప్రతి క్షణం ఇవే ఆలోచనలు. ఏమి చెయ్యాలి చెప్మా.. అందుకే రాసి నాకు హితులు, స్నేహితులు అయిన మీ మీద వదులుతూ వుంటా, పాపం మీకు తప్పదుగా, చదువుకోండి...మీ అమ్మ శ్రీనివాస్*
సినిమాలలో హీరోలలాగానో (లేదా) నిజ జీవితంలో వ్యాపారవేత్తల లాగానో ఒక్క గంట లో సమాజాన్ని మార్చెయ్యడం, (లేదా) బాగా సంపాదించేసి భారీ ఎత్తున (ప్రపంచం అంతా గుర్తించేట్టు, అవాక్కయేట్టు) సాటి వారికి సాయం చెయ్యాలి *అనే ఆలోచన సమాజంలో చాలా బలంగా నాటుకుపోయిన మాన్యత.*
*చెయ్యాల్సిన, చెయ్యగలిగిన పనులు మానేసి ఎప్పుడో ప్రపంచాన్ని ఉద్దరించాలి అనే వాయిదా వేసుకొనే ఆలోచనలు ఎందుకు మాష్టారు.* ఈ ఆలోచన విధానమే తప్పు మహాప్రభో. *తెలిసిన, తెలియకపోయినా, నచ్చిన, నచ్చకపోయినా ప్రతి క్షణం మనకు అవసరమైన సాయం, సాటి వారిని నుంచి అప్పనంగా తీసుకోవడం / పొందడం ఎలా అయితే మన నరనరాల్లో జీర్ణించుకుపోయిందో, అలాగే.... మనకున్న దాంట్లో ప్రతి క్షణం సాయం చెయ్యడం (ఎందుకంటే తీసుకున్నది తిరిగి ఇవ్వడం) మన కనీస భాద్యతగా అలవాటుచేసుకోవాలి.* ఇది మన కల్చర్ లో నుంచి, మన DNA లో నుంచి క్రమేపి కనుమరుగైపోతోంది. రాబోయే రోజుల్లో సాటి వారికి సాయం చేసే భాద్యత గల వారిని ప్రత్యేకంగా రీసెర్చ్ చేసి పుట్టించాల్సిన రోజులు దగ్గరపడ్డాయి. *ఇదెలా ఉంటుందంటే నిర్లక్ష్యం వలన తీర్చడం మానేసి పెరిగి పెద్దదైన (రోజు రోజు కి పెరిగిపోతున్న వడ్డీతో) అప్పుని తీర్చడం చేతకాక అప్పుడు, ఇప్పుడు అని వాయిదా వెయ్యడంలాగా. దీవాల తీయడం తప్ప, తిరిగి ఇవ్వడం వుండదు.* అసంతృప్తితో చనిపోతూ, ఈ మొత్తం అప్పుని కట్ట కట్టుకొని తీసుకుపోతావు. అప్పుని మాత్రమే కాదు సుమీ, దానిని సకాలంలో తీర్చకపోవడం వలన వచ్చే పరిణామాలను, ఫలితాలను కూడా.
*"ఎన్ని జరిగిన, జరుగుతున్నా, ఇప్పటికీ మనం వెతికేది షార్ట్ కట్ కోసమే. అది సంపాదన అయినా, సంతోషం అయినా".* మనం ఏమి చెయ్యనక్కరలేదు, చెయ్యగలిగిన చిన్న చిన్న పనులను (ఎదో సమాజాన్ని మనం ఉద్దరిస్తున్నామనే భావనతో కాకుండా) *నా ఋణాన్ని నేను ఖచ్చితంగా తీర్చుకోవాలి, తీర్చుకుంటున్నాను అనే కృతజ్ఞతా భావానికి ప్రాధాన్యత ఇస్తూ... నిబద్దతతో, భాద్యతతో,8 ప్రేమతో, సంతృప్తితో చెయ్యాలి, అది చాలు.*
*చేయగలిగిన చిన్న చిన్న పనులను, తిరిగి ఇవ్వగలిగిన చిన్న చిన్న అవకాశాలను వెంటనే అందిపుచ్చుకోకుండా..చూసి చూడనట్టు, పట్టీ పట్టనట్టు, నిర్లక్ష్యంగా,(కొన్ని సంవత్సరాల తరువాత/ జీవితంలో బాగా స్థిరపడిన తరువాత/పెళ్ళైన తరువాత/వుద్యోగం రాగానే/చదువు అవగానే/ రిటైర్మెంట్ అవగానే/బాగా సంపాదించగానే ఎదో ఉద్దరిస్తాను లాంటి) వాయిదా వేసే ధోరణితో వ్యవహరించే (మన)అందరిలోనూ ఈ మార్పు రానంత కాలం..మారవ్.. మారవ్..రోజులు ఎప్పటికి మారవ్...* మీ తిట్లు, కామెంట్లు ఏమైనా ఉంటే కింద లింక్ లొనే రాసుకోండి...
మీకు ఇంకా తనివి తీరకపోతే, నా మరిన్ని రాతల కోసం సందర్శించండి http://ammasrinivas4u.blogspot.com/ *(కాకపోతే నా ఆశ, శ్వాస ఒకటే. కాబట్టి ఆలోచనలు, రాతలు కూడా వాటి మీదే)*
మనసులో అనుభూతులను నలుగురితో పంచుకోవాలి అన్న ఆకాంక్షకు రూపం ఈ నా ప్రయత్నం.నాకు మన దేశం గురించి,మన సంప్రదాయాలు,అలవాట్లు, ఆచారాలూ,పద్దతులు మరియు మనం ప్రపంచం మొత్తానికి ఇచ్చిన ఆధ్యాత్మిక జ్ఞానం అన్న,దాని గురించి తెలుసుకోవడం అన్న,చెప్పడం అన్న చాలా ఇష్టం.అందుకే నా అంతరంగాన్ని,భావాలను,నాకు తెలిసిన,నేను సేకరించిన సమాచారాన్ని ఒక దగ్గర చేర్చాలనే ఈ బ్లాగ్ స్టార్ట్ చెయ్యడం జరిగింది.నేను ఎక్కడైనా చదివిన,చూసిన,నాకు తెలిసిన మంచి సమాచారాన్ని ఇందులోపొందుపరచి అందరికి ఒక బ్లాగ్ లో ఇవ్వాలని ఆసిస్తూ మీ శ్రేయోభిలాషి
21, మే 2019, మంగళవారం
మనం వెతికేది షార్ట్ కట్ కోసమే
19, ఏప్రిల్ 2019, శుక్రవారం
మానవ లక్ష్యం సంతోషమేనా.... సందేహమే మరి.
ఏంది నాయనా... దేశంలో లేదా ప్రపంచంలో ఎటు చూసినా, ఎవ్వరిని కదిలించినా దుఃఖం, అశాంతి, అసంతృప్తి, ఆరాటం, వ్యతిరేక భావం, యుద్ధం..... మనిషి జీవిత పరమార్థమైన లేదా లక్ష్యమైన *"ఆనందంగా/సంతోషంగా ఉండడం, ప్రేమను పంచడం"* అనే విషయాన్ని తాకట్టు పెట్టైనా సరే, ప్రపంచాన్ని జయించాలని లేదా తరతరాలకు తరిగిపోని సంపదను కూడగట్టుకోవాలనే ఆశతో, వ్యామోహంతో... తనలోనే దాగి ఉన్న సంపదను మర్చిపోయి... న్యాయం, ధర్మం, సత్యం మొదలగునవి గాలికి వదిలి... తన ప్రియం, లాభం కోసం ఏవేవో చేస్తూ... బంధాలను, అనుబంధాలను గుర్తించక, ఏవో ఉన్న కొన్నింటిని తెంచుకుంటూ... డబ్బు సంపాదన, ఇతరులతో పోలిక మొదలగు వాటి మోజులో పడి, నిరాశ నిస్పృహలతో, తీవ్రమైన ఒత్తిడితో, వంటరిగా జీవితాన్ని బలవంతంగా సాగదీస్తున్నారు (భూమిపై జరిగే అన్ని అనర్ధాలకు, అమానుషాలకు ఇదే కారణం). ఇంకా చెప్పాలంటే ఎక్కువ శాతం ఆనందానికి దూరంగా బతుకుజీవుడా అంటూ లైఫ్ ని సాగదీస్తున్నాడు.
*పోనీ.. మనిషి ఆనందంగా, సంతోషంగా బ్రతకడానికి కావలసిన అవసరాలను తీర్చుకోవడానికి లేదా సదుపాయాలను సమకూర్చుకోవడానికి ఇవన్నీ చేస్తున్నాడులే అనుకొందామా అంటే, అదీ లేదు.* ఎందుకంటే మన చూపు, గురి ఎప్పుడో మన లక్ష్యం (*"ఆనందంగా/సంతోషంగా ఉండడం, ప్రేమను పంచడం"*) నుంచి విడి వడి, వడివడిగా ప్రాసెస్ మీద ఫోకస్ తో, ప్రోసెస్ లొనే ఇరుక్కుపోయి గజిబిజిగా, గందరగోళంలో నా పేరు బికారి, నా దారి ఎడారి అన్నట్టుగా భ్రమలో... ఎటో...కొట్టుకొని...పో...తా....వున్నాము.
జగమెరిగిన జంగమోడికి శంఖమెందుకు అన్నట్టు, ఇదంతా తెలిసిందేగా మళ్ళీ చెప్పడం ఎందుకు చెప్మా అంటే.....అక్కడికే వస్తున్నా....
పోనీ...మానవ లక్ష్యమైన *"నిరంతర సంతోషం"* దిశగా మనల్ని నడిపించే జ్ఞానం భారత దేశంలో అందుబాటులో లేదా అనుకుంటే అదీ పొరపాటే. అద్భుతమైన ప్యాకేజీ రూపంలో ఉంది. మళ్ళీ ఇక్కడ ఇంకో సమస్య, అదేమిటంటే సగం తెలిసిన వారు దానిని వారికి ఇష్టం వచ్చినట్టు ప్రచారం చేస్తూ ఉండడం, జనాలు ఏది నిజమో, ఏది అబద్దమో, దేనిని నమ్మలో, దేనిని నమ్మకూడదో తేల్చుకోలేని గందరగోళ స్థాయికి వచ్చేశారు. కాబట్టి ఎవరు ఏది నేర్చుకునే ప్రయత్నం చెయ్యరు.
*"సినిమాలు, షికార్లు, ఉద్యోగాలు, వ్యాపారాలు, టూర్లు, ఆటలు, పనికొచ్చేవి, పనికిరానివి ఇలా ఎన్నింటికో సమయం వెచ్చిస్తాం, ఫలితం వచ్చినా, రాకపోయినా ట్రైల్స్ వేస్తాం."* కానీ మనిషి నిరంతరం ఆనందంగా జీవించడానికి కావలసిన అతి ముఖ్యమైన జ్ఞానాన్ని సంపాదించడానికి మాత్రం సమయం మన దగ్గర ఉండదు. మీనమేషాలు లెక్క పెడుతూ కూర్చుంటాం.
*ఏమప్ప సిద్ధప్ప, ఎప్పుడూ హ్యాపీగా లేనప్పుడు, హ్యాపీగా ఎలా ఉండాలో తెలియనప్పుడు మనం ఎన్ని చేసినా ఏమి ఉపయోగం. సమయం లేక కాదు. ఖాళీగా, వృధాగా ఎంతో సమయం మనలో ప్రతి ఒక్కరి దగ్గర ఉంది. దీని తీక్షణత గుర్తించిన వారు ఎలాగైనా సమయం తీస్తారు. ఎందుకంటే జీవితంలో సర్వప్రధమం మనం ప్రాధాన్యత ఇచ్చి నేర్చుకోవాల్సిన జ్ఞానం ఇదే కాబట్టి.*
దుఃఖాన్ని చంకలో ఎట్టుకొని ధునియా మొత్తం తిరుగుతాను అంటావ్ గానీ, సంతోషం పొందే మార్గం మటుకు వద్దంటావ్. అవునులే మనం అభివృద్ధి ముసుగులో, కెరీరే (డబ్బు, పేరు, ప్రతిష్ట సంపాదనే) జీవితంగా బ్రతుకుతున్న మనుషులం కదా....
ఏమిటో నా అనంతరంగం ఒకటే లొల్లి ఏదైనా రాయమని దీనిగురించి. మీ అమ్మ శ్రీనివాస్
23, జనవరి 2019, బుధవారం
వెళ్ళింది అరపూటే, *అందులో నాకు బాగా నచ్చిన వాక్యాలు
నా సంతోషం కోసం, నా అభివృద్ధి కోసం దేవుడు నాకు పరిచయం చేసిన కోర్సు "Universal Human Values -జీవన విద్య". *ఎన్ని సార్లు విన్నా నేర్చుకోవాల్సింది, తెలుసుకోవాల్సింది చాలా ఉంది. ఇక ఆచరించాల్సింది అంటారా? అది కొండంత.*
అవకాశం దొరికింది కదా, మొన్న 1 రోజు ఇంట్రడక్టరీ వర్క్ షాప్ కి వెళ్ళాను. వెళ్ళింది అరపూటే, *అందులో నాకు బాగా నచ్చిన వాక్యాలు* (ఒకొక్క వాక్యం గురించి, ఒక్కొక్క పుస్తకమే రాయొచ్చు), నేను రోజు మననం చేసుకివాల్సినవి....
*Patience is the test of our understanding.*
Our unhappiness is always because of our own short comings, not because of other / outside things.
*Anything you do with understanding will leads to happiness.*
A person with lack of understanding will suffer in any environment, where as the person with understanding create an environment.
*Ability to communicate, itself is a competence.*
We search a gap and try to justify our mistakes.
ఇంట్లో బోర్డ్ మీద రాసుకుంటూ, మీతో కూడా పంచుకోవాలనిపించింది. మీకు తెలుసుగా, నా దగ్గర ఉన్నది పంచుకోవడం నా అలవాటు....మీ అమ్మ శ్రీనివాస్ 2019/01/22 23:52
31, డిసెంబర్ 2018, సోమవారం
Life is a Celebration
*Life is a Celebration.... జీవితంలో ప్రతీ క్షణాన్ని మనం ఆస్వాదించే పరిపక్వత, సమర్ధత మనకు లేదు కాబట్టి, ఏదో ఒక పేరు చెప్పి Celebrate చేసుకోవడంలో తప్పు లేదు.* ఇందులో Celebration అనే పదానికి ఎవరి అర్ధం వారికుంది,అది వారి వారి పరిపక్వతని బట్టి ఆధారపడివుంటుందనుకోండి, అది వేరే విషయం.
*ఇంతకీ...యావన్మంది ప్రజానీకానికీ నేను సెప్పొచ్చేది యేటంటే...* ఈ 364 రోజులు ఏదో పొడిసేసామ్, రక్కేసామ్, దున్నేసాం అనుకోని చివరి రోజంతా వృధా చెయ్యడం (దీన్నే Celebration అంటారోయ్ అని మీరంటే, నేను ఏమి సెప్పను సెప్మా) ఒక ఎత్తు.... మరో 365 కత్తి, కేక, తురుము రోజులు వస్తాయి అనుకొని ఊహల్లో విహరిస్తూ, మరో రోజు వృథాగా ఖర్చు చెయ్యడం మరో ఎత్తు.
*మన జీవితాన్ని , అలాగే మనకు తెలిసిన వారి జీవితాలను Happy & Prosperous గా ఉంచడానికి* అసలు మనకి జీవితం గురించి సరైన అవగాహన ఉందా యూవరానర్?.. పోనీ అలా ఉండడానికి ఏమి చేస్తున్నాం అని మనల్ని మనం ప్రశ్నించుకుంటే, మనకు కనపడేది పెద్ద ????
కాబట్టి సోదర సోదరీమనులందరు కనీసం ఇప్పుడు మన స్థితి ఏమిటి, మన జీవిత లక్ష్యం ఏమిటి *(మానవులందరి జీవిత లక్ష్యం సంతోషం, సమృద్ధి అని మనం తెలుసుకోవడానికే, ఇక దానిని అర్ధం చేసుకోని, దానికోసం ప్రయత్నించడానికి మరో జీవితం కావాలేమో-అతిశయోక్తా???),* దీని కొరకు ఈ సంవత్సరం మన లక్ష్యం ఏమిటి, దాని సాధన కొరకు *ఏమి చెయ్యాలి, ఎలా చెయ్యాలి, ఎందుకు చేయాలి అనే ప్రణాళిక వేసుకొని, పని ప్రారంభిస్తే బావుంటుందని నా అవుడియా...ఆలోచన...అభిప్రాయము....*
ఓ..సో..సి.. ఇదా నువ్వు సెప్పొచ్చేది, ఇలాంటి వాగ్దానాలు, లక్ష్యాలు (రాజకీయ నాయకులలాగా) మేము ఎన్ని పెట్టుకోలేదు, ఎన్ని తుంగలో తొక్కలేదు అంటే.. ఏమి సేతురా లింగ, నేను ఏ.....మీ..... సేతురా...
ఆలోచించండి, అడుగేయ్యండి, ఆచరించండి.... *మీ అందరికి ఆంగ్ల సంవత్సర శుభాకాంక్షలు. మీకు సెప్పింది నాకూ.... వర్తిస్తుంది కదా, కావున నేను ఆ పనిలో ఉండేద జహ..పనా.....*
*అందరూ బాగుండాలి, అందులో నువ్వు, నేను, మనమందరం ఉండాలి*
నా అనంతరంగం...మీ అమ్మ శ్రీనివాస్ 2018/12/31 22:25
http://ammasrinivas4u.blogspot.com/search/label/1.%20నా%20రాతలు%20%2F%20My%20Writtings?m=0