1.వస్తా వట్టిది... పోతా వట్టిది! ఆశ ఎందుకంటా? చేసిన ధర్మము చెడని పదార్థము... చేరును నీవెంట..2.నువ్వు తినే ప్రతి ఒక మెతుకు ఈ సంఘం పండించింది గర్వించే ఈ నీ బ్రతుకు సమాజమే మలిచింది ఋణం తీర్చు తరుణం వస్తే తప్పించుకు పోతున్నావా తెప్ప తగలపెట్టేస్తావా ఏరు దాటగానే...

25, ఫిబ్రవరి 2010, గురువారం

భారత జాతీయ జంతువు


పులి  ఫెలిడే అనే జంతు కుటుంబానికి చెందిన మాంసాహారి అయిన క్షీరదము. పిల్లి జాతికి చెందిన మృగాలలో పులి అన్నింటి కన్నా పెద్దది. తూర్పు మరియు దక్షిణ ఆసియా ప్రాంతములో సంచరిస్తుంది. పూర్తిగా ఎదిగిన పులి నాలుగు మీటర్ల వరకు పొడవు, మూడు వందల కెలోల వరకు బరువు ఉంటుంది.

తెలుగులో 'పెద్దపులి' లేదా 'బెబ్బులి' అని పిలువబడుతుంది. ఎరుపు, గోధుమ మరియు నారింజ వర్ణాలు కలిసిన శరీరమ్మీద నలుపు చారలతో పెద్దపులి మిగతా పులులకు భిన్నంగా, ఠీవిగా, హుందాగా, అందంగా ఉంటుంది. తనకు నాలుగు రెట్లు బరువుండే జంతువులను అవలీలగా వేటాడగలిగే పులి నేడు మనుషుల వేట, తగ్గుతున్న అడవుల కారణంగా అంతరించిపోయే స్థితిలో ఉంది.

భారతదేశపు జాతీయ జంతువైన పులి నేడు కేవలం కొన్ని వేల సంఖ్యలో మనుగడను సాగిస్తుంది. అందమైన చర్మాలు, ఇతర శరీర భాగాల కోసం పులులను అక్రమంగా వేటాడుతూనే ఉన్నారు. మనుషులను కూడా వేటాడే క్రూరమృగంగా పేరున్నా నెజానికి పెద్దపులి చాలా హుందాయైన జంతువని ఎందరో (జిమ్ కార్బెట్, కెన్నెత్ ఏండర్సన్ వంటి జంతు సంరక్షకులుగా మారిన వేటగాళ్ళు) అభిప్రాయపడ్డారు.

సాధారణంగా మనుషులకు దూరంగా సంచరించే పులి, అరుదుగా, వయసు మీదపడ్డప్పుడు, గాయపడి సాధారణంగా వేటాడే జంతువులను వేటాడలేనప్పుడు మాత్రమే మనుషులను వేటాడుతుంది. దీనిని "అందమైన అడవి ప్రాణి" గా అభివర్ణిస్తారు. ఇది భారత జాతీయ జంతువు. ఇది బెంగాల్ పులి అని కూడా పిలువబడుతుంది.

ఉపజాతులు
పులులలో ఎనిమిది ఉపజాతులు ఉన్నాయి. వానిలో రెండు ఉపజాతుల పులులు అంతరించిపోయాయి. ఇవి బంగ్లాదేశ్, సైబీరియా, ఇరాన్, ఆఫ్ఘనిస్థాన్, భారతదేశం, చైనా, మరియు ఆసియాలోని ఇండోనేషియా ద్వాపాలలో విస్తరించాయి. ప్రస్తుతం జీవించియున్న పులులలో అవరోహణ క్రమంలో ఇలావున్నాయి:

బెంగాల్ పులి
బెంగాల్ పులి లేదా రోయల్ బెంగాల్ పులి: ఇవి భారతదేశం, బంగ్లాదేశ్, నేపాల్, భూటాన్, మరియు బర్మా దేశాలలో కనిపిస్తాయి. ఇవి గడ్డి మైదానాలు, సమశీతోష్ణ అడవులు, ఆకురాల్చే అడవులు మొదలైన ప్రాంతాలలో నివసిస్తాయి. మగ జంతువులు వేటాడుతాయి; సుమారు 205 నుండి 227 కి.గ్రా.లు (450–500 పౌండ్లు) బరువుంటే, ఆడ జంతువులు సుమారు 141 కి.గ్రా.లు బరువుంటాయి.

అయితే ఉత్తర భారతదేశపు మరియు నేపాల్ పులులు కొంచెం భారీగా ఉంటాయి. జంతు సంరక్షకుల అంచనాల ప్రకారం వీటి జనాభా 2,000 కంటే తక్కువని భావించగా, భారత ప్రభుత్వ అంచనాల ప్రకారం ఇవి అడవులలో 1,411 మాత్రమే ఉన్నవి. దీని ద్వారా గత దశాబ్ద కాలంలో 60% పులులు తగ్గినట్లు తెలుస్తుంది. 1972 నుండి తీసుకుంటున్న పులుల పరిరక్షణ  చేపట్టింది.

1 కామెంట్‌:

అజ్ఞాత చెప్పారు...

naku idi ento vupayogapadindi.thanq very much.