1.వస్తా వట్టిది... పోతా వట్టిది! ఆశ ఎందుకంటా? చేసిన ధర్మము చెడని పదార్థము... చేరును నీవెంట..2.నువ్వు తినే ప్రతి ఒక మెతుకు ఈ సంఘం పండించింది గర్వించే ఈ నీ బ్రతుకు సమాజమే మలిచింది ఋణం తీర్చు తరుణం వస్తే తప్పించుకు పోతున్నావా తెప్ప తగలపెట్టేస్తావా ఏరు దాటగానే...

17, ఏప్రిల్ 2010, శనివారం

అదేమిటో నాకే తెలీదు…ఎందుకో తెలీదు

అదేమిటో నాకే తెలీదుఎందుకో తెలీదుఒక వ్యక్తి పరుల సేవ గురించి ఆలోచిస్తున్నప్పుడు, సేవలో నిమగ్నమైనప్పుడువారి మీద ఎక్కువ ప్రేమ, అనురాగం, ఆప్యాయత

వాళ్ళతో ఎక్కువ మాట్లాడాలనివారితోనే ఉండాలని అనిపిస్తుందివారి నుంచి స్ఫూర్తి పొందడం వల్లనో.. లేక మన త్రోవలోకి మరొకరు వచ్చారన్న ఆనందమో

వారు మరల వెనుకంజ వేయకుండా ఉంచాలనే సంకల్పమో …..

ఇంకా ఎన్నో మంచి కార్యాలు చేసేలా ప్రేరేపించాలనే స్వార్ధమో

వారి గమనం ఇంతటితో ఆగిపోకుండా, జీవితంలోని ఎలాంటి విపత్కర పరిస్థితులలోనైనా పరుల సేవలో గడిపేల,ఆలోచించేలా వాళ్ళని తీర్చిదిద్దాలనే ఆకాంక్షో


ఇలాంటి మనసున్న మనుషుల మద్య ఉంటూ ఇంకా మహోన్నతమైన ఆలోచనల, ఆశయాల సాధన దిశగా నడవాలనే ఆకాంక్ష

ఎక్కడ వీరు నన్ను వదిల వేల్లిపోతరేమో అన్న  ఆదుర్దాఆందోళన ..ఆలోచన

నన్ను నన్నుగా అర్ధంచేస్కున్న   మనసుల  సమూహంలో

నా లక్ష్యాల దిశగా  ఎప్పుడు  నడుస్తూ  ఉండాలనే  స్వార్ధం


చిన్న నీటి చుక్కల మొదలైన భావాల, భావనల అలజడిలో  కొట్టుకుపోకుండా..అందరిలకాకుండా వుండాలని ఒక పక్క ….

ఇలాంటి తోడు దొరికితే జీవితంలో ఇంకా చాల చేయ్యోచు అని మరో పక్కఎటు పోతున్నామో తెలియని వయసు… ….ఎలా ఆపాలో తెలియని, చేతకాని చిత్రమైన మనసు  ….


 అది వారి మీద ప్రేమో, అభిమానమో, ఆప్యాయతో లేక పరుల సేవలో గడపాలనే నా గమ్యమోఇవన్ని  కాక  నా పూర్వ జన్మ  సుక్రుతమో, తల్లి తండ్రుల పుణ్య  ఫలమోతెలీదు

శ్రుతి మించిన ఆలోచనలు మతి  మించి  పోతుంటేఏమి చెయ్యాలో తోచకఎలా చెయ్యాలో  తెలీకపిచ్చి రాతలు  రాస్తూతుచ్చమైన మనసు పడే  వేదన  నా  తియ్యని  రోదన

కామెంట్‌లు లేవు: