1.వస్తా వట్టిది... పోతా వట్టిది! ఆశ ఎందుకంటా? చేసిన ధర్మము చెడని పదార్థము... చేరును నీవెంట..2.నువ్వు తినే ప్రతి ఒక మెతుకు ఈ సంఘం పండించింది గర్వించే ఈ నీ బ్రతుకు సమాజమే మలిచింది ఋణం తీర్చు తరుణం వస్తే తప్పించుకు పోతున్నావా తెప్ప తగలపెట్టేస్తావా ఏరు దాటగానే...

30, మే 2010, ఆదివారం

Life, by any means, is one of the most valuable gifts of god

Life, by any means, is one of the most valuable gifts of god. 

If it is smooth and soft then it's a waste, but if it is with ups and downs then only you can touch and enjoy all the corners of life….

Your character becomes harder and tougher....

You will become an ordinary person with extraordinary qualities, who has the ability to face/solve any problem (because u have already experiences those)...

So you can save/tune as many life's as you can.....So it is not a difficulty rather than an opportunity….of course, it may be bit easier to tell any thing.

Whether you are prepared for it or not, it is good or bad, positive or negative, happy or sad we need to face the future (the fate)..

 So whatever happens will happen, if it is good no problem at all. If you think it is bad then you will overlook good/ Positive things too and feel they all are also negative....

Try to watch it in a different corner and change the perspective towards life. If you know/imagine it is bad then there is no problem...we are free that we know that the future is always bad...then plan the things accordingly....go for the alternates....check the each and every possibility to change it as positively...

AMMA Srinvas

8, మే 2010, శనివారం

మనుగడకు మూలాధారం ప్రకృతి

మన/మనిషి జీవితానికి, మనుగడకు మూలాధారం ప్రకృతి..... మన మనుగడకు అవసరమైన ప్రతి దానిని కాపాడుకోవడం/రక్షించుకోవడం  అనేది మన భాద్యతహక్కుకాని మనం ఈ రోజు కూర్చున్న కొమ్మనే నరుకొంటున్న విధంగా,మనం బ్రతకడానికి ఆధారభూతమైన పంచభూతాలను (ఆకాశం, భూమి, అగ్ని, వాయు, నీరుకలిగి ఉన్న ప్రకృతిని మనమే చేతులారా, తెలిసి తెలియని అవివేకంతో, అజ్ఞానంతో నాశనం చేసుకుంటూ పోతు....మన వినాశనానికి మనమే కారణం అవుతున్నాము.....

పర్యావరణం అంటే మనం.పర్యావరణ పరిరక్షణ అంటే మనం మనల్నీ,మనపరిసరాలనూ,చెట్టూ,పుట్టా,గాలీ,నీరు,కొండాకోనా,వాగూవంకా,పిట్టాపిచికా, అన్నిటినీ ముఖ్యంగా మనరేపును,మనభవిష్యత్తును,సం రక్షించుకునేందుకూ నిరంతరం చేయాల్సిన ఒక వ్రతం.దానికి ఏవ్రతకల్పాలూ,వ్రతఫలాలూ ప్రత్యేకంగా ఉండవు.మన జీవన శైలీ,వినిమయవిధానాలూ,అందరూ పచ్చగా ఉండాలని కోరుకునే చల్లని,మంచిమనసు చాలు

మాట కల్తి మనసు కల్తి
నీరు కల్తి బీరు కల్తి
మానవ ప్రాణంబు నిలిపె
మందులలో మరీ కల్తి

బియ్యంలో రాళ్ళాయె
పాలల్లో నీళ్ళాయె
అన్నంలో సున్నమాయె
అన్నిట అనుకరణలాయె

నీడనిచ్చె చెట్టుగొట్టి
గోడకు దిగ్గొట్టినావు
అడవంతా నరికివేసి
కాలుష్యం బెంచినావు

జనాలుండె ఇళ్ళల్లో
రసాయనాల పొగలాయె
భూగర్భ జలమందున
మందుల వ్వర్ధంబులాయె

భూమాత గుండెల్లో
బోరులెన్నొ గుచ్చి గుచ్చి
జలమంతా లాగినావు
భూకంపం దెచ్చినావు

లెక్కలేని వాహనాలు
ఒక్కసారి రోడ్డునెక్కి
గుప్పు గుప్పుమను పొగలతొ
కాలుష్యం చిమ్ముచుండె

ఉత్తచేతులు ఊపుకుంటు
సరుకులకై సంతకెల్లి
పలు ప్లాస్టిక్ సంచులతో
పరుగులెత్తి ఇంటికొచ్చి
పర్యావరణం పాడుజేసి
పాపం మూటగట్టినావు


కాబట్టి మిత్రులారా,పెద్దలారా మనకోసం మనభవిష్యత్తు కోసం ఒక్క చిన్న అడుగు వేద్దాం.రండి

·        అనవసర విద్యుత్ ఆదా చేపట్టు  - ఆహ్లాదకర జీవితానికి ఇదే తొలి మెట్టు
·        యూనిట్ విద్యుత్ ఉత్పత్తికన్న- యూనిట్ విద్యుత్ ఆదా మిన్న
 ·        నేటి పచ్చదనమే - భావితరాల భవితవ్యం

అలసిన మనసుకు ఓదార్పు అమ్మ-నీ మనసు అలికిడిల తొలిపిలుపు -అమ్మ

ఈ సృష్టి రహస్యం అమ్మ-నీ సృష్టి కర్త  అమ్మ,
ప్రేమకు ప్రతి రూపం అమ్మ-సృష్టిలో తియ్యని పదం అమ్మ,
నిస్వార్ధ సేవకు పర్యాయపదం అమ్మ-  నిన్ను తీర్చి దిద్దే మొదటి గురువు అమ్మ

అలసిన మనసుకు ఓదార్పు  అమ్మ-నీ మనసు అలికిడిల తొలిపిలుపు అమ్మ
నీ మనసు అలజడుల తొలి వినికిడి అమ్మ -  నీ మనసు అలజడుల తొలి పిలుపు అమ్మ
నీ ప్రాణానికి ప్రాణం అమ్మ - అమృతం అమ్మ

నీ ఆప్యాయతల తొలి చిట్టా అమ్మ-నీ అనుభూతుల ఆలంబన అమ్మ
నీ చిలిపి పనుల డైరీ అమ్మ-నీ చిరునవ్వుల చిరునామా అమ్మ
నీ కేరింతల తుళ్ళింత అమ్మ-నీ సావాసపు యద సడి అమ్మ

నీ గమ్యాల గమనం అమ్మ - నీ ఆశయాల అమ్ములపొది అమ్మ

ఇంటికి దీపం అమ్మ - నీ విజ్ఞాన జ్యోతులకు బీజం అమ్మ
కుటుంబ గవురవం అమ్మ-నిరాడంబరపు జీవితం అమ్మ
కుటుంబమనే నావకు చుక్కాని అమ్మ

ప్రేగుల పలకరింపు అమ్మ- అనుబందాల ఇందనం అమ్మ
త్యాగం అమ్మ-స్వచ్చతకు రూపం అమ్మ

నీ విలువైన సంపద అమ్మ - వెలకట్టలేని వజ్రం అమ్మ
నిను వీడని నేస్తం అమ్మ - నీ సరదాల సంబరాలు అమ్మ
సున్నితపు మందలింపు అమ్మ - శ్రుతి మెత్తని -నీ ఆయువు వాయువు అమ్మ

నీలి మేఘం అమ్మ-నిండు చంద్రుడు అమ్మ
పండు వెన్నల అమ్మ-పుడమి సహనం అమ్మ
చల్లగాలి అమ్మ - నును వెచ్చని గ్రీష్మం అమ్మ

ప్రకృతి ప్రతీక అమ్మ - పరమ పావని అమ్మ
కనిపించే దైవం అమ్మ-నడిపించే నమ్మకం అమ్మ
ఉమ్మపాల ఊపిరి అమ్మ - ఉగ్గుపాల లాలన అమ్మ

నీ తొలి పిలుపు అమ్మ- నీ తొలి పలుకు అమ్మ
నీ తొలి ప్రేమ అమ్మ-నీ తొలి అలక అమ్మ
నీ ఓదార్పు అమ్మ - నీ నిట్టూర్పు అమ్మ

నీ ఆనందం అమ్మ - నీ అనురాగం అమ్మ
నీ ఆహ్లాదం అమ్మ - నీ ఆప్యాయత అమ్మ
నీ ఉత్సాహం అమ్మ - నీకు ఊతం అమ్మ

నీ తప్పటడుగుల సర్దుబాటు అమ్మ-నీ తప్పుటడుగుల దిద్దుబాటు అమ్మ
అపాయాల ఉపాయం అమ్మ-నీ ధైర్యం అమ్మ-నీ స్థైర్యం అమ్మ
నీ పునాది అమ్మ-నీ భాధలకు బరోసా అమ్మ

నీ ఆకలి అమ్మ-నీ ఏడుపు అమ్మ
నీ ఆలోచనల అంతరంగం అమ్మ - నీ సర్వస్వం అమ్మ


అమ్మ అనురాగపు తొందర్ల వడిలో తేలియాడని మనిషి ఉండడేమో అంటే అతిశయోక్తి కాదేమో...నీ వ్యక్త పరచలేని భావాలను సైతం కనుగొనే తొలి శక్తి...నీ కోసం నీ కంటే ఎక్కువ ఆలోచించే, తపించే....ప్రేమించే వ్యక్తి..నీ పుట్టుక కోసం తన జీవితాన్నిఫణంగా పెట్టి, ఆనాటి నుండి తన తుది శ్వాస వరకు నిన్ను కంటికి రెప్పల చూసుకొనే "అమ్మ" అనే ఒక కనిపించే దైవాన్ని, నడిపించే నమ్మకానికి మనం ఏమి చేస్తున్నామో, ఎలా చూస్తున్నామో మనల్ని మనం ఒక్కసారి ప్రశ్నించుకుందాం....వారికీ తగిన గౌరవం ఇస్తున్నామా? ఆమె నిస్వార్ధ సేవకు మనం ఈనాడు, ఏనాడూ  ఏమి ఇచ్చినా  ఋణం తీర్చుకోలేం, ఆ ప్రేమని తిరిగి ఆమెకు పంచలేము.. అలాంటప్పుడు మన కనీస భాద్యతగా ఆమె సంతోషం ఉండేటట్టు చూసుకోవాలని కోరుకుంటూ.....  వారి నిస్వార్ధ సేవకు పాదాభి వందనం చేస్తూ "మీ అమ్మ శ్రీనివాస్ (నా అనంతరంగం)"

వెలియాలి ఎటు చుసిన హరిత వనాలు- నాటాలి ప్రతి ఒక్కరు పచ్చని చెట్లు - ఇవే ఇవే మన ప్రగతి కి మెట్లు

వాన కాలంలో మితిమీరిన ఎండలు
ఎండాకాలంలో ఎడతెరిపిలేని (అకాల) వర్షాలు
బీళ్ళు బారుతున్న పంటపొలాలు
తిండి లేక జనాల హా హా కారాలు

ఎటు చూసిన ఆకలి కేకలు
రైతుల ఆత్మహత్యలు
వీధిన పడుతున్న పచ్చటి కుటుంబాలు
అతి వృష్టి లేక అనావృస్టి వికృత చేష్టలు

ఏమిటీ వినాసపు పోకడలు
తెలియవా నీకు  కారణాలు ...
తెలుసుకోలేవా వినాశాకాలు..
అవే అవే....

చెట్లు/అడవుల నరికివేతలు
అనవసరపు విద్యుత్ కాంతుల జిలుగు వెలుగులు
ఆదా చేయలేకపోతున్న భూగర్భ జలాలు
ఇవే ఇవే కారణాలు..

మితి మీరుతున్న ఆధునిక పోకడలు
హద్దు మీరుతున్న విలాసాలు
మరుస్తున్న ప్రకృతి పరిరక్షణ భావాలూ
నిద్రిస్తున్న నేటి తరాలు
ఏమవుతాయో తెలియని భావితరాలు.....

మన వినాశనానికి మనమే ముఖ్య కారకాలు
మార్చుకో చిన్న చిన్న జీవన విధానాలు,
జీవితపు అలవాట్లు
సరిదిద్దుకో పొరపాట్లు

ఇవే ఇవే ప్రకృతి పరిరక్షణకు ఉత్ప్రేరకాలు
మనకు జీవితానికి మూలాధారాలు
వెలియాలి ఎటు చుసిన హరిత వనాలు- నాటాలి ప్రతి ఒక్కరు పచ్చని చెట్లు - ఇవే ఇవే మన ప్రగతి కి మెట్లు
 నా అనంతరంగం "అమ్మ" శ్రీనివాస్

3, మే 2010, సోమవారం

నీ సమస్యకు - నీవే పరిష్కారం



నీకు నచ్చిన వ్యక్తి/వ్యక్తులతో నీకు వచ్చిన ఒక సమస్యను పంచుకోవడం ద్వారా నీకు ఎంతోకొంత ఉపసమనం కలుగుతుంది. నీవు చెప్పినది విన్న వ్యక్తి దాని పరిష్కారానికి తగిన సూచనలు, సలహాలు  కూడా చేస్తాడు.అవి ఉపయోగించి నీ సమస్యను నువ్వు పరిష్కరించుకోవచ్చు. అది ఒక సులభమైన మార్గం,,,,, 

కాని ఒక్కసారి  ఆలోచించు....    

నీవు పరిష్కరించుకోలేని, నీకు పరిష్కారం, సమాధానం  దొరకని ప్రశ్నలను మాత్రమే  మనం సమస్య అంటాము. కాని ఈ మానవ జీవితంలో, ఈ విశాల విశ్వంలో పరిష్కరించుకోలేనిది ఏది లేదు. ప్రతి సంఘటనకు, ప్రశ్నకు, ఎవరో ఒకరు, ఎపుడోకపుడు, ఎలాగో ఒకలాగా సమాధానం, పరిష్కారం కనుగొన్నారు, కనుగొంటూ ఉన్నారు. కాబట్టి ఇక్కడ 'సమస్య '    అనే సమస్యే లేదు. అన్నిటికి పరిష్కారం ఉంది...

నీవు సమస్య అనుకొనే ప్రశ్నకు పరిష్కారం వేరే వారు సూచించడం ఏమిటి? 
వారు  అనుభవించని ఒక సమస్యకు నీవు చెప్పిన దానిని విని, ఆకళింపు చేసుకొని వారు   ఒక పరిష్కారం చూపిన్చకలిగినపుదు, నీ ప్రశ్నకు సమాధానం చెప్పగలిగినపుడు..అ సంఘటనను అనుభవించి, వాస్తవంగా దాని పూర్వాపరాలు, లోతుపాతులు పూర్తిగా తెలిసిన, అవగాహనా కలిగిన, దానిని అనుభవిస్తూ ఉన్న,  నీవు   అ సమస్యకు పరిష్కారమార్గం కనుగోనలేవా? 

ఆలోచించు, ఆధారపడు... నీ సామర్ధ్యం మీద, నీ బలాబలాల మీద,  నీ ఆత్మ విశ్వాసం మీద , నీ ఆలోచన పద్దతుల మీద,  నీ దృక్పదం మీద,  నీ మనస్సాక్షి మీద,  నీ మానసిక పరిపక్వత మీద,  నీ ధైర్యం మీద, , నీ మీద నమ్మకం ఉంచు.........ఇప్పుడు ఆ సంఘటన/సమస్య/ప్రశ్న గురించి పూర్తిగా ఆలోచించు, అవకాసాలను పరిశీలించు, ఆలోచనలకూ పదునుపెట్టు, తప్పు, ఒప్పులను బేరీజు వేసుకో.....నీకు నువ్వే....సరైన, మంచి, సులభమైన పరిష్కారం కనుగోనగలవు, కనుగోంటావు.

ఎందుకంటే నీ సమస్య గురించి, నీ గురించి, సమస్య సృష్టించిన వ్యక్తి లేదా పరిస్థితుల గురించి నీ కన్నా తెలిసిన వారు ఎవ్వరు లేరు, వుండరు....వుండబోరు కూడా......

సమస్య నీది....పరిష్కారం కూడా నీదే/నువ్వే కావాలి...      అవతలి వ్యక్తుల మీద, వారి అనుభవాల మీద కచ్చితంగా ఆధారపడు... వారి సలహాలు, సూచనలు పాటించు కాదనను....కాని నువ్వు నిజంగా ఆలోచించగలిగితే ....వారిచ్చిన సలహాలు, సూచించిన పరిష్కారాలు నీకు ముందే తెలిసినవే...లేక నువ్వు తెలుసుకోవడానికి ప్రయత్నించలేకపోయినవే.....

లే...నిన్ను నువ్వు నమ్ముకో ....నీ సమస్యలకు నీవే పరిష్కారం కనుక్కో....అసలు నీకు తెలియని పరిష్కారం లేనే లేదు....

కాకపోతే అనుకోని సంఘటనల వల్ల, అనవసరపు ఆలోచనల వలన, పరిస్థితుల వలన, మనుషులు వారి మనస్తత్వాల వలన, నీలోను, నీ మనసులోనూ, నీ గుండె లోతుల్లోను కలిగిన అనవసరపు ఆందోళనల అలజడులనే అశాంతి నీకు మాత్రమే ఉండే అతీంద్ర, అతి సామాన్యమైన, అ సామాన్య శక్తులను చిన్నాభిన్నం చేసింది, విచ్చిన్నం చేసింది..........ఆ అలజడుల సవ్వడులకు బయపడి ఆగిపోకు, నీరసించి నిరాశ, నిష్ప్రుహలకు లోనయి..నీ శక్తిని తక్కువ చేసుకొంటూ....నిన్ను నువ్వు క్రుంగదీసుకోకు ....

లే...నీలో ఉన్న,నీకు మాత్రమే ఉండే అతీంద్ర, అతి సామాన్యమైన, అ సామాన్య శక్తులను  (ఒక్కటిగ చెయ్యి) ఏకీకృతం చెయ్యి, నీ మనసును కేంద్రీకృతం చెయ్యి .....నీకు మామూలు పరిస్థితులలో ఉండే విచక్షణ జ్ఞానాన్ని, ఆలోచన శక్తిని, మొక్కవోని ధైర్యాన్ని,కష్టాలను కడతేర్చుకొనే యుక్తిని...ఇలాంటి విపత్కర పరిస్తితులలోను కూడ తీసుకో కలిగితే....చాలు...నీకు ఇనేకేమి అవసరం లేదు....ఏ/ఎవ్వరి సహాయం అక్కరలేదు........అవసరములేదు.....సమస్య చిన్నదైన, పెద్దదైన, పాతదైన, కొత్తదైన,నీకు సంభంధం ఉన్న లేకపోయినా, నీ ప్రమేయం ఉన్న లేకపోయినా...అది ఏదైనా..ఎలాగైనా....నీ తప్పు లేనప్పుడు ....నిర్భయంగా పరిష్కార మార్గాలను ఆచరించు.....మంచి, ప్రేమ, దయ, జాలి  అనే మాటల ముసుగులో ఎప్పుడు చెడును (చెడు సమస్యలను)  ప్రోత్సహించకు   , సహించకు, పెంచి పోషించకు...... ఏ సమస్య గురించి ఎక్కువ ఆలోచిస్తూ సమయం వృధా చేసుకోకు.....ఆనందాన్ని దూరం చేసుకోకు.......నిన్ను నువ్వు క్రుంగ దీసుకోకు....

నీకు నువ్వే ఎన్నో రకాలైన పరిష్కారాలు కనుగోనగలవు...      
ఎలాంటి సమస్యనైన పరిష్కరించుకోగాలవు......
ఎలాంటి సందర్భానైనా ఎదుర్కోగలవు... 
ఎవ్వరినైన ధైర్యంగా  ఎదిరించగలవు..

కావాల్సిందల్ల...సమస్యపై లోతైన పరిశీలన..........
చేయవలసిందల్లా.....తర్వాత నీ శక్తులన్నింటి ఏకీకరణ....
తర్వాత చెడు పై నీ పరిష్కారాల ఆచరణ.... 

నీ కంటే బలమైన ఏ శక్తి ఈ ప్రపంచంలో లేదు......నువ్వే అత్యంత బలమైన శక్తివి, యుక్తివి.....నీ సమస్యకు - నీవే పరిష్కారం  ఆలోచించగల వ్యక్తివి...

అమ్మ శ్రీనివాస్ "అనంతరంగం....Straight from the Heart"  03 .05 .2010 3.05AM 

Love all - Serve all
"Amma" Srinivas