1.వస్తా వట్టిది... పోతా వట్టిది! ఆశ ఎందుకంటా? చేసిన ధర్మము చెడని పదార్థము... చేరును నీవెంట..2.నువ్వు తినే ప్రతి ఒక మెతుకు ఈ సంఘం పండించింది గర్వించే ఈ నీ బ్రతుకు సమాజమే మలిచింది ఋణం తీర్చు తరుణం వస్తే తప్పించుకు పోతున్నావా తెప్ప తగలపెట్టేస్తావా ఏరు దాటగానే...

24, ఆగస్టు 2010, మంగళవారం

"B & G" కవితకు అనువాదం


కూడలిలో అడుగుపెట్టగానే "B & G" లో ఉన్న కవిత నా మనసు దోచి ఇలా అనువదించేలా చేసింది...

అక్కడ ఉన్న ఆంగ్ల కవిత ఇది...

The spring in your steps
And the spring in nature
Playing a match
That let me have a catch
Of a bit of happiness
In all my loneliness

In all my loneliness
This weather makes me
Light as a feather
Dreaming us together


ఇది నా అనువాదం .........


నీ రాకతో వసంతాన్ని
ఒంటరితనంలో ఆనందాన్ని
ఆనందంలో ఒక బంధాన్ని
తోడిచ్చిన ప్రకృతి
ఈ ఏకాంతపు సాయంత్రం
"మనం" మాత్రమే ఉన్న కలలని
చేసింది నా సొంతం....


అనువాదం బాగుందా ?
కవితకు "అనువాదం" అంటే true translation కాదు...మూల కవిత లోని భావం వ్యక్తమైతే చాలన్నది నా అభిప్రాయం.(Translation course చేసేప్పుడు నాకు గురువులు నేర్పిన సూత్రం కూడా అదే.)

కామెంట్‌లు లేవు: