1.వస్తా వట్టిది... పోతా వట్టిది! ఆశ ఎందుకంటా? చేసిన ధర్మము చెడని పదార్థము... చేరును నీవెంట..2.నువ్వు తినే ప్రతి ఒక మెతుకు ఈ సంఘం పండించింది గర్వించే ఈ నీ బ్రతుకు సమాజమే మలిచింది ఋణం తీర్చు తరుణం వస్తే తప్పించుకు పోతున్నావా తెప్ప తగలపెట్టేస్తావా ఏరు దాటగానే...

27, సెప్టెంబర్ 2012, గురువారం

వేలి ముద్రలు


చేతివ్రేళ్ళ గుఱించి క్రింది వివరములు గమనించుము.
1. బొటనవ్రేలు - అంగుష్ఠము అగ్నితత్త్వము
2. చూపుడువ్రేలు - తర్జని వాయుతత్త్వము
3. మధ్యమవ్రేలు - మధ్యమ ఆకాశతత్త్వము
4. ఉంగరపువ్రేలు - అనామిక పృధ్వీ తత్త్వము
5. చిటికెన వ్రేలు - కనిష్ఠక జలతత్త్వము.
ముద్రలు రెండు చేతులతో చేయాలి. ముద్రలు వేయునప్పుడు, కరన్యాసములు చేయునప్పుడు వ్రేళ్ళకు ఎదురుగా చూపిన పేర్లతో సంబో ధింతురు. ఇప్పుడు ముద్రలను గుఱించి వివరముగా తెలుసుకొందాము.
1. చిన్ముద్ర:- బొటన వ్రేలికి మధ్యలో చూపుడు వ్రేలును తాకించి (ఆనించి) మిగిలిన మూడు వ్రేళ్ళను చాపియుంచుట చిన్ముద్రయనబడును. చిన్ముద్రలో అఱచేతులు పైకి కనిపించునట్లుగా వెూకాళ్ళపై మణికట్టులు ఉండునట్లు రెంఉడ చేతులు పెట్టుకొని కూర్చుండవలెను. ధ్యాన,జపాదుల యందు ఆసనమున కూర్చుండినప్పుడు ఎక్కువ మంది ముద్ర వేయు దురు. ముద్ర ఎంతసమయమైనను చేయవచ్చును. దీనిని జ్ఞానము ద్రయని కూడ అందురు.
2. శాంభవీ ముద్ర:- ధ్యానములో కొందఱు బాసికపట్టు వేసికొని కూర్చుండి వెల్లికల నున్న ఎడమ అఱచేతిపై వెల్లికలనున్న కుడి అఱచేతిని వేసి ఒడదిలో నుంచి ధ్యానము చేయుదురు. దీనిని ధ్యానముద్రయందురు. తల, మెడ, వెన్నెముక నిటారుగా ఉంచి, కళ్ళు,పెదవులు మూసి ఉంచవలెను.
రాజయోగమున సాంఖ్యము, తారకము, అమనస్కము అను మూడు రకముల యోగములు కలవు. వానిలో తారకయోగమున ఖేచరి, భూచరి, మధ్యమ, షణ్ముఖి, శాంభవీ అను ఐదు ముద్రలు గలవు. వానిని గూర్చి తెలిసికొందాము.
1. ఖేచరీ ముద్ర:- కనులు (తెరచియైన) మూసి భ్రూమధ్యమున దృష్టిని నిలిపిన తేజస్సు కన బడును. దీనిని ఖేచరీ ముద్ర అంటారు.
2. భూచరీ ముద్ర:- రెండు కన్నుల చూపు గలిపిన మనస్సాగి పోవును. కనుక నాసి కాగ్రమున దృష్టిని ని లిపి మనస్సును ఆపు టను భూచరీ ముద్ర యందురు.
3. మధ్యమాముద్ర:- నాసికా మధ్యమున దృష్టిని నిలిపియుం చుటయే మధ్యమా ముద్ర యందురు.
4. షణ్ముఖీ ముద్ర:- రెండు చేతుల బొటన వ్రేళ్ళతో రెండు చెవుల రంధ్రములను, రెండు చూపుడు మఱియు నడిమివ్రేళ్ళతో రెండు కన్నులను, రెండు అనామిక వ్రేళ్ళతో నాసా పుటముల (ముక్కులు)ను మూసికొని భ్రూమధ్యమున అంతర్‌ దృష్టిని మనస్సున జేర్చి ప్రణవనాదమును, బిందువును, చిత్కళలను బరికించుటయే ''షణ్ముఖీ ముద్ర'' అందురు.
5. శాంభవీ ముద్ర:- కన్నులను మూసుకొని, అఱగన్నులతో మూర్ధమున అనగా సహస్రారమున దృష్టి నిలిపి చూచిన దానిని శాంభవీ ముద్ర అందురు.
పై ముద్రలనే కాక. యింకను ఎన్నియో రకముల ముద్రలను వారి, వారి పద్ధతుల ప్రకారము జప-ధ్యానాదుల యందు నేర్పుచున్నారు. వాటిని కూడా తెలుసుకొనవచ్చును.

కామెంట్‌లు లేవు: