రోజు నిద్రపోయే ముందు అశ్వ కోసం / సమాజం కోసం నేను ఏమి చేశాను అని ఆలోచిస్తాను. ఏదో ఒక చిన్న పని చెయ్యడం వలన నాకు అస్సలు తృప్తి కలగదు.
*అందుకని సంస్థకి ముఖ్యులైనవారితో ఎవరితోనైనా నా అనుభవాలను పంచుకోవడం,వారు మంచి నాయకులు కావడానికి తోడ్పాటు ఇవ్వడం లేదా కొత్త వారికి మన కార్యక్రమాలను తెలపడం ద్వారా వారిలో ప్రేరణ నింపడం లేదా అశ్వతో కలసి ప్రయాణిస్తున్న దాతలు, సలహాలు ఇస్తున్న వారితో మాట్లాడం ఇలా ఎదో ఒక విలువగల పని చెయ్యనిదే నా మనసుకు తృప్తి, కంటికి నిద్ర రాదు*. అలా అశ్వ నా జీవితంలో విడదీయలేని భాగస్వామి అయ్యింది.
*కార్యక్రమాలు చెయ్యడంతో పాటు భావజాలాన్ని వ్యాప్తి చెయ్యడం, కార్యకర్తలుగా మారడం, మరికొంత మంది కార్యకర్తలను తయారుచేయడం ముఖ్యం.*
ఇది మొదట నా తృప్తి కోసం, నేను నివసిస్తున్న నా సమాజం కోసం నేను చేస్తున్న పని.
*నా ఇల్లు (అనే సమాజం) శుభ్రంగా, ఇంటిలో వారందరు ఆనందంగా ఉంటేనే కదా, అదే ఇంటిలో నివసిస్తున్న నేను కూడా ఆనందంగా జీవించగలను...*
ఈ రోజు నాకెందుకులే, ఎవరో ఎదో చేస్తారులే అని పట్టించుకోక వదిలేస్తే *స్వైన్ ఫ్లూ లాగా అంటుకొని మనం వదిలేసిన దగ్గర నుండే ప్రబలి మన దాకా చేరుకొని, మనము అందులో బలి అయ్యే స్థితికి వస్తుంది. కానీ అప్పుడు శ్రద్ధతో పట్టించుకున్న ఉపయోగం ఏముంటుంది*
కాబట్టి మనం అందరం ఒక్కటై ఈ సమాజ పునర్నిర్మాణంలో మన వంతు సాయం చేద్దాం, పాటు పడుదాం....
*తీరిక సమయం, ఆర్ధిక స్తోమత ఇవి రెండూ మనం గుంతలోకి పొయ్యే దాకా మనకు దొరకవు, కాబట్టి మనమే సమాజ సేవ కోసం తీరిక చేసుకోవాలి*
మీ అమ్మ శ్రీనివాస్
9948885111
FB : ammaswa
www.aswa.co.in
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి