1.వస్తా వట్టిది... పోతా వట్టిది! ఆశ ఎందుకంటా? చేసిన ధర్మము చెడని పదార్థము... చేరును నీవెంట..2.నువ్వు తినే ప్రతి ఒక మెతుకు ఈ సంఘం పండించింది గర్వించే ఈ నీ బ్రతుకు సమాజమే మలిచింది ఋణం తీర్చు తరుణం వస్తే తప్పించుకు పోతున్నావా తెప్ప తగలపెట్టేస్తావా ఏరు దాటగానే...

10, ఏప్రిల్ 2017, సోమవారం

మన సహాయం సముద్రంలో నీటి చుక్కే, కానీ అదిలేకపోయినా సముద్రం నిండదుగ

సమాజ హితం కోసం మీరు, మనం చేస్తున్న కార్యక్రమాలు (చిన్నదైనా, పెద్దదైనా) మీ ఆలోచనా సరళిని, దేశం మీద మీకున్న ప్రేమని తెలియజేస్తాయి. మీలాంటి ఉన్నత ఆశయాలు కలవారితో కలసి పని చేయడం నిజంగా మా (అశ్వ) అదృష్టం.

*మనం చేసే చిన్న చిన్న మంచి పనులు మనకు తెలియకుండానే ప్రత్యక్షంగాను, పరోక్షంగాను ఎంతో మంది జీవితాలలో, వారి కుటుంబాలలో ఆనందాన్ని, వారికి అవసరమైన మానసిక, ఆర్ధిక స్తైర్యాన్ని ఇస్తున్నాయి.*

*మనం పనులు చేస్తూ ఉంటాము గాని, దాని వలన జరిగిన, జరిగుతున్న మార్పును అంచనా వెయ్యము*. అలాగే మనలాంటి వారికి ఈ భావజాలన్ని వ్యాపింప చెయ్యడం కూడా అంతర్గతంగా జరుగుతూ ఉన్నదే.

మన దగ్గర ఎన్నో ప్రత్యక్ష ఉదాహరణలు వున్నాయి

*మనం చదివించే విద్యార్థులు ఎక్కువ మంది ఈ రోజు ఉద్యోగాలు చేసుకొంటూ వారి కాళ్ళ మీద వారు నిలబడి, వారి కుటుంబాలను ఆనందంగా చూసుకోవడమే కాకుండా, మంచి విలువలతో తిరిగి సమాజానికి సేవ చెయ్యాలనే భావనతో, మనతో చేతులు కలిపి ఈ గొప్ప ఆలోచనకు చేయూత ఇస్తున్నారు. అంటే సమాజంలో మంచి వ్యక్తిత్వాలను కూడా పెంచుతున్నాము.*

ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకుంటున్న విద్యార్థులు అనవసరమైన అలవాట్లకు బానిసలవుతూ, మంచి విషయాలను పక్కకు పెడుతున్నారు, వారి జీవితాలను చేజేతులారా నాశనం చేసుకుంటున్నారు. చాలా మందికి ఇంట్లో శ్రద్ద తీసుకొని చెప్పే వారు లేరు. కానీ మన కార్యకర్తలు రకరకాల కార్యక్రమాల ద్వారా వారికి తప్పు వొప్పులు చెప్తున్నారు. తద్వారా కొంత మంది ఇప్పుడే మారుతున్నారు, మరికొంత మంది భవిష్యత్తులో మారే అవకాశం వుంది.

రక్త దానం ద్వారా వ్యక్తిని తద్వారా వారి  కుటుంబాన్ని, హెల్త్ సపోర్ట్ ద్వారా ఆరోగ్యాన్ని తద్వారా వారి  కుటుంబాన్ని ఇలా మన అన్ని ప్రాజెక్ట్ లలో వారు, వారు కుటుంబీకులు ఇలా ఎంతో మందిని మనం స్పృశిస్తున్నాము...

*కాబట్టి మనం అందరం దీనిని గుర్తించి, మరిన్ని మంచి కార్యక్రమాల దిశగా అడుగులు వెయ్యాలి....*

*మన సహాయం సముద్రంలో నీటి చుక్కే, కానీ అదిలేకపోయినా సముద్రం నిండదుగా...*

మీ
అమ్మ శ్రీనివాస్
9948885111
www.aswa.co.in

కామెంట్‌లు లేవు: