నేను హైదరాబాద్ లో వున్నప్పుడు, ఇప్పుడు నాకున్నవి 24 గంటలే అందులో ఎటువంటి సందేహం లేదు ☺
కానీ అక్కడ వున్నప్పుడు కార్యక్రమాల ద్వారా ఏదో విధంగా మిమ్మల్ని తరచూ కలిసేవాడిని, నేను కాకపోయినా హరిత, అమ్మ ఎవరో ఒకరు కలవడం వలన దగ్గరి తనం ఉండేది. వీటితో పాటు తరచూ ఫోన్ర్ చెయ్యడం.
కానీ ఇప్పుడు నేను కడప రావడం వలన, కొత్తగా మరో సంస్థ కార్యక్రమాలు మొదలెట్టడం వలన నాకు సమయం సరిపోవడం లేదు.
*అయినా ఇంటికి రాగానే / సమయం దొరకగానే మొదట అశ్వ కార్యకర్తలకే ఫోన్ చేస్తాను (పాపం హరితకి, చరితకి కూడా ఇచ్చే అవకాశం ఉండదు, కానీ తను అర్ధం చేసుకుని సహకరిస్తుంది).*
నేను హైదరాబాద్ వచ్చినా, సమయం దొరికినా *మొదట ప్రణాళిక మిమ్మల్ని ఎలా కలవాలనే వుంటుంది. మా బంధువులు, నా సొంత పనులు కూడా ఆ లిస్ట్ లో వుండవు*.
*కాబట్టి మీకు సమయం ఇవ్వలేకపోతున్నందుకు అన్యధా భావించక నన్ను, నాకున్న సమయాన్ని అర్ధంచేసుకుంటూ, నాకు సహకరిస్తూ, మంచి కార్యక్రమాలకు మీరు అందిస్తున్న సహకారం, వాటిని దిగ్విజయంగా నడపడంలో మీరు తీసుకున్న అదనపు బాధ్యత, మీరు చేస్తున్న కృషి మరువలేనిది. అందుకు నా హృదయ పూర్వక నమస్సులు.*
My every action, interaction is for the BEST INTEREST OF THE ORGANIZATION
మీ అమ్మ శ్రీనివాస్
*నా గురించి రెండు విషయాలు*
1. నేను మంచిగా సహనంతో కల్మషం లేకుండా ఉండాలి. అందుకే ఎవరైనా మరోలా ప్రవర్తించినా వారిని దూరం చేసుకోడానికి కాకుండా, వారు మనల్ని అర్ధం చేసుకోడానికి ఏమి చెయ్యగలనా అని ప్రయత్నిస్తాను.
2. నేను ఎప్పుడు 100% కల్మషం లేకుండా వుంటా, వారు నన్ను ఇబ్బంది పెట్టినా వారు బాగుండాలనే కోరుకుంటా. వారు చెడు చేసినా, నేను వారు అది చేసారని మంచి చెయ్యడం మానుకొను ఎందుకంటే నేను నా లాగా వుంటా, అవతల వారిలా కాదు వారికి maturity లేకపోతే నేను ఏమి చేయగలను నాకున్న సమయంలో నేను బంధువుల కంటే కూడా నా ఆత్మ బంధువులైన మీకే సమయం కేటాయిస్తా
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి